డిప్రెషన్ - చిన్న చిన్న పిల్ల నుంచే వేధిస్తున్న సమస్య ఇది.అల్ల డిప్రెషన్ బారిన పడిన దేశాల్లో మొదటి స్థానంలో మన భారతదేశమే ఉండడం ఇప్పుడు కలవరపరుస్తున్న అంశం.ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం తేటతెల్లమైంది.భారత్ తర్వాత చైనా,అమెరికాలున్నాయి.మారుతున్న జీవన విధానాలు కావచ్చు,ఉద్యోగ కుటుంబ బాధ్యతలు కావచ్చు,మనిషి మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని తన నివేదికలో తెలిపింది.మానసిక సమస్యలకు చికిత్స చేసే వైద్యులు తక్కువగా ఉండడమూ పరిస్థితి తీవ్రమవడానికి కారణమౌతోందని హెచ్చరించింది.
సగం మంది కార్పొరేట్ ఉద్యోగులు డిప్రెషన్ బాధితులు - కాలంతో పాటు జీవితం ఉరుకులు పరుగులు పెడుతోంది.డబ్బు సంపాదించాలి,పేరు తెచ్చుకోవాలి,గుర్తింపు పొందాలి,ఎక్కువ మందిలో ఇదే తపన.ఐతే ఇప్పుడు కార్పొరేట్ ఉద్యోగంలో సమయం లేకుండా వారిలో 42.5 శాతం మందికి డిప్రెషన్ ఉంది.గత సంవత్సరం అసోచాం చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే వారిపైనే డిప్రెషన్ ఎక్కువగా దాడి చేస్తోందని తేలింది.తక్కువ జీతంతో ఎక్కువ సేపు పని చేయించుకోవడం వల్ల ,ఉద్యోగుల్లో అలసట చాయలు కనిపిస్తున్నాయని అధ్యయనం స్పష్టం చేస్తోంది.అదే ఒత్తిడి,ఫ్రస్ట్రేషన్ వరకు వెళుతున్నాయని ,చివరకు డిప్రెషన్ బారిన పడుతున్నారని స్పష్టమైంది.బ్రిటన్ ( 33 గంటలు ),అమెరికా ( 40 గంటలు ) తో పోలిస్తే భారత్ లో సగటు వేతన జీవి ఎక్కువగా పని చేస్తున్నాడు.వారానికి 48 నుంచి 50 గంటలు పని చేయాల్సివస్తోంది.జీతం విషయంలో మాత్రం ఆ దేశాలకన్నా చాలా తక్కువలోనే ఉంది భారత్.లివింగ్ కాస్ట్,ఇండెక్ష్ ప్రైసింగ్ లను తీసేసిన తర్వాత కూడా 6 రెట్లు ఎక్కువగా ఆ దేశాలు జీతాలిస్తున్నాయి.భారత్‌లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది.ఫలితంగా మానసిక వత్తిడి పెరిగి పోతోంది.పని ఒత్తిడి ఎక్కువవడంతో నిద్ర కూడా సరిగ్గా పోలేని స్థితి ఉంది.
టీనేజ్ నుంచే ఒత్తిడి - 14 యేళ్ళ ప్రాయం వయసంటే ఆడుతూ పాడుతూ గెంతే వయసు.చదువులు,ఫ్రెండ్స్ తో సరదాలు ఇలా ఉంటూ ఉంటాయి.కానీ ,బలవంతంగా రుద్దుతున్న చదువులు ఒత్తిడిని పెంచేస్తున్నాయి.పెరిగిన టెక్నాలజీ వారి అలవాట్లను మార్చేస్తోంది.సెల్ ఫోన్ కు బానిసై పోవడం,అశ్లీల కంటెంట్ వైపు మొగ్గు చూపడం వంటివి పెరుగుతున్నాయి.మందు కొట్టడం,సిగరెట్లు తాగడం,డ్రగ్స్ వాడడం వంటి వాటితో డిప్రెషన్ తాలూకు చాయలు పెరిగిపోతున్నాయి.మానసికంగా సతమతం చేస్తున్నాయి.తల్లి దండ్రులు నిఘా పెట్టకపోవడమూ పరిస్థితిని తీవ్రతరం చేస్తోంది.
డిప్రెషన్ లో టాప్ లో ఉన్న దేశాలు -
1. భారత్ - మన జనాభాలో 6.5 శాతం డిప్రెషన్ తో బాధ పడుతున్నారు.గ్రామాలు,పట్టణాలు,నగరాలు అన్న తేడా లేకుండా అందరినీ అది వేధిస్తోంది.దానిని నయం చేసేందుకు ప్రభావ వంతమైన పద్ధతులు ,చికితసలున్నా ,చేసేవారే కరువయ్యారని సంస్థ పేర్కొంది.సైకాలజిస్టులు,సైకియాట్రిస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపింది.లక్షకు ఒకరు మాత్రమే ఉన్నారని పేర్కొంది.మానసిక సంస్యలతో సగటున ప్రతి లక్షమందిలో 11 మంది ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు.
2. చైనా - డిప్రెషన్ తో బాధపడేవారిలో 91.8 శాతం మంది దాకా చికిత్సలు చేయించుకోవడం లేదు.చైనాలోనూ భారత్ లాంటి పరిస్థితే ఉంది.మానసిక ఆరోగ్యం పై వాళ్లు బడ్జెట్ లో కెటాయిస్తోంది కేవలం 2.35 శాతం మాత్రమే.
3. అమెరికా - ప్రతి 5 మందిలో ఒకరు మానసిక రోగాల బారిన పడుతున్నారు.అందులో కేవలం 41 శాతం మంది చికిత్స తీసుకుంటున్నారు.అంత అభివృద్ధి చెందిన అమేరికాలోనూ మానసిక ఆరోగ్య నిపుణులు చాలా తక్కువే.చికిత్స లేకుండానే దాని నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ దేశ ప్రజలు చెప్పడం విశేషం.
4. బ్రెజిల్ - లాటిన్ అమెరికాలో డిప్రెషన్ తో బాధపడేవాళ్లు ఎక్కువున్న దేశం బ్రెజిలే.హింస ,వలసలు,నిలువ నీడ లేకపోవడం వంటి కారణాలు డిప్రెషన్ లోకి తోసేస్తున్నాయి.
5. ఇండొనేషియా - జనాభాలో 90 లక్షల మంది ( 3.7 % ) డిప్రెషన్ బారిన పడ్డారు.యాంగ్జైటీ / మానసిక ఆందోళన కలుపుకుంటే మరింత పెరుగుతుంది.6% మంది మానసిక రోగాలతో బాధపడుతున్నారు.
6. రష్యా - ఆ దేశ జనాభాలో 5.5% మంది డిప్రెషన్ తో బాధ పడుతున్నారు.2012 ప్రకారం చూస్తే ప్రపంచ సగటు కన్నా మూడింతలు ఎక్కువగా టీనేజర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
AN EXCELLENT COLLECTION OF AYURVEDIC RECIPES OF EMINENT INDIAN AYURVEDIC PRACTITIONERS LIKE BABA RAMDEV , ELCHURI , CHIRUMAMILLA MURALIMANOHAR ,PEDDI RAMADEVI ETC FOR VARIOUS HEALTH PROBLEMS.EXPLAINED IN TELUGU .
జీవన శైలి వ్యాధులు - వైద్య సలహాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జీవన శైలి వ్యాధులు - వైద్య సలహాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
29, డిసెంబర్ 2018, శనివారం
29, జులై 2016, శుక్రవారం
బిపి ఉందని తెలిశాక...
కలరా,ప్లేగు,క్షయ...ఇలాఎన్నెన్నోరకాలవ్యాధులుమనుషులను కబళించివేస్తుండేవి.మానవాళి మనుగడకు ముప్పుగా మారిన ఆ వ్యాధులమీద జరిపిన పరిశోధనలు టీకా మందులతో, నియంత్రణ మార్గాలనో కనుగొనటంతో పలురకాల భయంకర వ్యాధులనుఅంతంచెయ్యగలిగాము.
అయితేవాటినిఅంతంచేసినఅనందంఅట్టేకాలంనిలవటంలేదు. కొత్త వ్యారులు బయటపడుతున్నాయి. మనుషులకు కలవరంకలిగిస్తూనేవున్నాయి.మనుషులనువేధించేఅంటువ్యాధుల విషయంలోతగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ జాగ్రత్తలతో బయటపడగలుగుతున్నారు. కాని మానవుడికి మరోకరినుండి సోకక తన శరీరంలోనే సమస్యలను తెచ్చి
-పెట్టేకొత్తరకం రోగాలు ఇప్పుడు వెంటాడుతున్నాయి.
- వాటిలో అధిక రక్తపోటు ఒకటి. ఇది వారి వారి శరీరా
నికి సంబంధించిన ఇబ్బందులు.తాజా గణాంకాల ప్రకారం వయసులో వున్నవారిలో ప్రతి ఐదుగురిలో ఒకరికి అధిక రక్తపోటుసమస్య వుంటున్నది. 65 ఏళ్ళలోపు మరణించే
అయిదుగురిలో ఒకరి మరణానికి కారణం. ఆయన
రక్తపోటు. ఇంటిలో పెద్దలకు అనారోగ్యం కలిగినప్పుడు
మరో రకంగానో ప్రతి ఒక్కరం ఏదో ఒక సమయంలో
అధిక రక్తపోటు గురించి వినటమో లేక మాట్లాడటమో
చేస్తాము. కాని వాస్తవంలో రక్తపోటు అంటే ఏమిటి
దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటో తెలుసుకునే వారు చాలా తక్కువగా ఉంటున్నారు.
గుండె కొట్టుకుంటుంటే మనిషి బతికి వున్నట్టు
రక్తపోటుసమస్యలుఏర్పడినతర్వాతవైద్యులదగ్గరికిపరిగెట్టేసరికే కొంత సమయం పడుతుంది.ఈలోగా జరగాల్సిన నష్టం జరగవచ్చు. దీర్ఘకాలంమందులు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
ముందుజాగ్రత్త ముఖ్యం..
రక్తపోటు గురించి మనిషి ఆరోగ్యంగా వున్నసమయంలోనే తెలుసుకుని తగిన జాగ్రత్తలు వహించటం మంచిది. రక్తపోటు .. గుండె కొట్టుకుంటుంటే రక్తం
శరీరంలోని రక్తనాళాలగుండా ప్రవహించేటప్పుడు
ఆ రక్తనాళాల గోడల మీద రక్తంవల్ల ఏర్పడే ఒత్తిడిని
రక్తపోటు అంటారు. ఆ రక్తపోటు లేకుంటే రక్తం
నాళాలగుండా ప్రవహించదు. కాబట్టి మనిషి బ్రతకాలంటే రక్తపోటు వుండి తీరాల్సిందే.రక్తపోటు గురించి అర్థంచేసుకునేందుకు గుండెపనితీరును తెలుసుకోవటం అవసరం. శరీరంలోనికీలక అంగం గుండె. నిరంతరం పనిచేస్తుంది.మానవగుండెలో నాలుగు గదులుంటాయి. వీటిలోపైన వున్నవి కుడి, ఎడమ కర్ణికలు, కింద వున్నవి
కుడి,ఎడమలుగావిభజించబడినజటరిక.కర్ణికలు,జఠరికల్లోకి కవాట సహిత రంధ్రాలుద్వారాతెరచుకుంటాయి. కుడి కర్ణిక శరీరంలోనిమలిన రక్తాన్ని అందుకుని కుడి జఠరికలోకి పంపుతుంది. కుడి జఠరికనుండి మలినరక్తం ఊపిరితిత్తు
లలో శుద్ధి చేసేందుకు పంపబడుతుంది.ఊపిరితిత్తులలో ఆక్సిజన్ గ్రహించి ఎర్రబడినరక్తం తిరిగి ఎడమ కర్ణిక, అక్కడినుండి ఎడమ జటరికలకు చేరి, అక్కడి నుండి శుద్ధరక్తం శరీర భాగాలన్నింటికి పంపుతుంది. ఇదంతా గుండె 'లబ్ డబ్అని కొట్టుకునేటప్పుడు జరిగే ప్రక్రియ.
గుండె ఒక పంపింగ్ మిషన్వంటిది. గుండె కండరాలు, గుండెలోని కవాటాలు అన్నీ సక్రమంగా పనిచేస్తున్నప్పుడే గుండె సంపూర్ణ సమర్థతతో పనిచేస్తుంది. సాధారణ ఆరోగ్యవంతుని గుండె నిమిషానికి 60 నుండి 90సార్లు మధ్య కొట్టుకుంటుంది.60 నుండి 90సార్లు కొట్టుకుంటే 3 నుండి 5లీటర్ల రక్తాన్ని నిమిషానికి శరీరానికి సరఫరా చేస్తుంది.శరీరఅవసరాన్నిబట్టిగుండెకొన్నిసందర్భాలలోమరింతవేగంగాకొట్టుకుంటుంది.పరిగెట్టినప్పుడు,భయపడినప్పుడు గుండె దడఅనిపించటం అందరికి అనుభవమే. గుండె నుండి శుద్ధ రక్తం తీసుకువెళ్ళే రక్తనాళాలను ధమ
నులని, శరీరంలో మలినపడిన రక్తాన్ని తిరిగి గుండెకు
చేర్చే నాళాలను శిరలని అంటారు.గుండె పంప్ చేసిన రక్తం నాళాలలో తరంగంలాప్రవహిస్తుంది. దీనివలన ఆరక్త ఒత్తిడికి నాళం గోడపడి లేస్తుంటుంది. అలా రక్తనాళాలకు పెరిగిన ఒత్తిడిసమయం సెస్టోల్'గా తగ్గిన సమయం 'డయాస్టోల్'గాపిలుస్తారు. సిస్టోల్' అంటే ఒత్తిడి అధికం, డయాస్టోల్ అంటే ఒత్తిడి కనిష్ఠం.
రక్తపోటు అంటే...."
సాధారణ సమయంలో సిస్టోలిక్పోటు160మి.మీ.హెచ్.జిగా డయాస్టోలిక్ పోటు 90 మి.మీ. హెచ్.జిగా వుంటుంది. ఎమ్.ఎమ్ హెచ్.జి అని రక్తపోటుకొలతను చెపుతారు. ఇందులో హెచ్.జి అనేది పాదరసం రసాయనిక గుర్తు. మి.మీ. కొలత.రక్తపోటును కొలిచేందుకు వాడేపరికరంలోని
సన్ననినాళంలో పాదరసం ఎంత ఎత్తుకు చేరిందో అది
సూచిస్తుంది. 160/90 కన్నా ఎక్కువవున్నా ఆరో
గ్యంగావున్నవారు లేకపోలేదు. ఐతే 160/90ని సాధా
రణ రక్తపోటుగా పేర్కొంటారు. మానవుని రక్తపోటును
కొలిచే సాధనాన్ని స్పిగ్మోమానో మీటర్' అంటారు.
ఈ రక్తపోటు మనిషిలో స్థిరంగా వుండదు. విశ్రాం
తిగాపడుకున్నా, నిద్రిస్తున్నా రక్తపోటు తక్కువగా
వుంటుంది. నిలబడినప్పుడు, నడిచినప్పుడు, మెట్లు
ఎక్కేటప్పుడు, పరిగెడుతున్నా ఆదుర్దా, ఆనందం,
భయంవేసినా రక్తపోటు పెరుగుతుంది.పనిచెయ్యటం ఆపినా, ఆ భావోద్వేగాలనుండివెనక్కి వచ్చినా తిరిగి రక్తపోటు సాధారణమవుతుంది.గుండె, రక్తనాళాలు సాధారణ ఆరోగ్యస్థితిలో వున్నప్పుడు ఇటువంటి రక్తపోటు హెచ్చుతగ్గుల్ని తట్టుకునినిలబడగలుగుతాయి. అలాకాక అధిక రక్తపోటు- ఎక్కువసేపు నిలిచివుంటే అదిప్రమాదానికి దారితీస్తుంది.
గుర్తించటమెలా!
అధిక రక్తపోటు వుందని చాలామందికి వెంటనేతెలియదు. కీలక అంగాలకు దెబ్బ తగిలేవరకుతాము తీవ్ర రక్తపోటు బాధితులమని తెలుసుకోరు.రక్తపోటు సమస్యనునైపుణ్యం కలిగిన వైద్యుడుమాత్రమే గుర్తించగలడు.కాబట్టి రక్తపోటు విషయంలో అప్పుడప్పుడు పరీక్షలు చేయించుకోవటం అవసరం. కారణాలుస్పష్టంగా తెలియదు కాని కొన్ని వర్గాలలోమాత్రంరక్తపోటుసమస్యవుంది.భారీకాయంగలవారికి,ఆర్థికసమస్యలతోసతమతమయ్యేవారికి,65సంవత్సరాలుపైబడినవారు,వంశంలోఅధికరక్తపోటులక్షణంవున్నవారు రక్తపోటును మధ్యమధ్యలో చెక్చేయించుకోవాలి.
అలాగని ఆ వర్గాలకు చెందనివారికి పరీక్షలుఅక్కరలేదని కాదు. శారీరకంగా, ఆరోగ్యపరంగాకనిపించే కొన్ని లక్షణాలను అధిక రక్తపోటు లక్షణాలుగా భావించి పరీక్ష చేయించుకోవటం అవసరం.
తరచుగా తలనొప్పి, విడవకుండా ఆ తలనొప్పివేధించటం, అర్థంలేని అలసట, తల తిరుగుడు,ఒత్తిడికి గురికావటం వంటివి కనిపిస్తే రక్తపోటుపరీక్ష చేయించుకోవాలి. ఏదైనా పనిచేస్తున్నప్పుడుఊపిరి అందక ఇబ్బందిపడుతుంటే అది రక్తపోటుతీవ్రత లక్షణంగా తెలుసుకోండి.
సైలెంట్ కిల్లర్..
అధిక రక్తపోటుఅనేదిప్రమాదకరమైనది.ఎటువంటిహెచ్చరిక లేకుండా చాటుగా దెబ్బతీస్తుంది.ఒకసారి అధిక రక్తపోటు సమస్యఏర్పడితేదానినినియంత్రించుకుంటూజీవితకాలమంతా భరించటంతప్పించిదానిని పూర్తిగా తగ్గించుకునే మార్గం లేదు.ముందస్తు హెచ్చరికలు చేయకుండా లోపల
కీలక అంగాలైన గుండె, మూత్రపిండం, మెదడులను దెబ్బతీస్తుంది. కాబట్టి హైబీపిని సైలెంట్కిల్లర్ అని అంటారు.రక్తపోటు పెరిగినపుడు రక్తనాళాలలో రక్త ప్రవాహ
నికి అడ్డంకి ఏర్పడుతుంది. అటువంటి సమయంలోరక్తాన్ని నాలాలలోకి సరిగా పంప్ చేసేందుకు గుండెమరింత కష్టపడాల్సి వస్తుంది. సాధారణ స్థాయిని మించిన ఒత్తిడిలో గుండె పనిచేసినందున గుండెకండరాలు అలసిపోయి చివరికి పనిచేయటం మానివేస్తాయి. అప్పుడు గుండెపోటు వస్తుంది.రక్తపోటు తీవ్రత ప్రభావాన రక్తనాళాలలో ఒత్తిడి
అధికమై రక్తనాళ గోడలనుండి సూక్ష్మంగా రక్తస్రావం
జరగవచ్చు లేదా రక్తనాళాలు చిట్లవచ్చు.గుండెకండరాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు దెబ్బతింటే, గుండెకు అవసరమైన శక్తిలభించక గుండెపోటు వస్తుంది.అధిక రక్తపోటు ప్రభావాన మూత్రపిండాల పనితీరుపాడవుతుంది. అసలు పూర్తిగా దెబ్బతినవచ్చు.మెదడులో రక్త ప్రసరణ సమస్యవల్ల పక్షవాతంవస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారికి సాధారణ ఆరోగ్యవంతులకన్నా పక్షవాతం, గుండెపోటుఇబ్బందులు రెండురెట్లు అధికంగా వుంటాయి.
ఎందుకు వస్తుంది.
అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ అనేది రెండురకాలు. వీటిలో ఒకదానిని 'మాలిగ్నెంట్ హైపర్‌టెన్షన్' అని ఇక రెండవ దానిని బినైన్ హైపన్షన్అని అంటారు.మాలిగ్నెంట్ హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుందోసరిగా తెలియదు. కాని ఇది యవ్వనంలో వున్నవారికి వస్తుంది. దీనివలన కంటి చూపు కొంతమేర దెబ్బతింటుంది. మూత్రపిండాల పనితీరు మంద
గించి క్రమంగా పూర్తిగా పనిచెయ్యవు. ఊపిరాడకఇబ్బంది పడతారు. హైపర్టెన్షన్తోగతంలోపలువురుమరణించేవారు. ఇప్పుడు దీనిని నియంత్రించేమందులు మార్కెట్లోకి వచ్చాయి.'బినైన్ అనే ఆంగ్ల పదానికి అర్థం అంతగా ప్రమాదహేతువుకానిదని. కాని వేలాది మంది ప్రాణాలు
బలికొంటున్న దీనిని 'బినైన్ అని ఎలా అనగలం.అయితే గతంలో ఎందుకో ఆ పేరు పెట్టారు.ఇప్పటికీ అదేస్థిరపడింది.
'బినైన్ హైపర్‌టెన్షన్' ఎటువంటి ఇబ్బందులనుప్రారంభంలో చూపించదు. ఏదీ హరాత్తుగా జరగదు. క్రమంగాపెరుగుతూ రక్తనాళాలను, గుండెనుదెబ్బతీసి చివరికి గుండెపోటు తెస్తుంది.'బినైన్ హైపర్ టెన్షన్' వచ్చిన వారిలో 90శాతం
మందిలో ఎటువంటి ఇబ్బందులు కనిపించవు. ఇదివంశపారంపర్యంగా వస్తుంది. అయితే 30 ఏళ్ళు
దాటేవరకు బయటపడదు. తల్లిదండ్రులు ఇరువురు
హైపర్ టెన్షన్' కలిగిన వారైతే సంతానానికి ఆఇబ్బంది వచ్చే అవకాశం అధికం.వంశపారంపర్యంగా హైబిపి' వుండి ఉప్పు అధికంగా తినే అలవాటు వుంటే హైపర్టెన్షన్రావటంఖాయం. తాగే నీటిలో కాల్షియమ్, మెగ్నీషియమ్లేకున్నా, కాడ్మియమ్ కలిగివున్నా హైపర్ టెన్షన్ వస్తుంది. . తీవ్ర భావోద్వేగాలకు గురయ్యేవారు. నిరంతర ఒత్తిడికి గురయ్యేవారికిహైపర్టెన్షన్ వస్తుంది.రక్తనాళాల గోడలు గట్టిపడినా, సాగేగుణం తగ్గినా
రక్తపోటు వెంటనే పెరుగుతుంది.
హైపర్‌టెన్షన్ కి పరీక్ష..
హైపర్ టెన్షన్ కి పరీక్ష చేయించుకున్న తర్వాతవైద్యుడు మూడు ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకుని చర్చిస్తాడు.
• హైపర్ టెన్షన్ స్థాయి ఏ స్థాయిలో వున్నది... దాని
వల్ల ఇప్పటికే జరిగిన నష్టం..హైపర్ టెన్షన్ కు గల కారణాలు ఏమిటి..మీరుఏమిచేయటంవల్ల ఇప్పటికే వున్న
రోగంముదురుతున్నది.వీటికోసం కీలక అంగాలన్నింటిని పరీక్షిస్తారు.కారణం తెలిస్తే తప్పించి చికిత్సను మొదలు పెట్టలేరు. ఎడ్రినల్ గ్రంధిలో కణితి వంటిది కారణమైతే
- శస్త్ర చికిత్స ద్వారా తొలగిస్తే సరిపోతుంది. కిడ్నీలకు
సోకిన ఇన్ఫెక్షన్ కారణమైతే మందులు ఇస్తారు.
కాని 90 శాతం కేసుల్లో హైపర్ టెన్షన్ వాస్తవకారణం స్పష్టంగా తెలియదు కాబట్టి వైద్యుడు ఆకారణం వెతికి పట్టే యత్నం చేస్తారు.భారీకాయం, ఒత్తిడి, డయాబెటిస్, పొగతాగేఅలవాటు, కొలెస్టరాల్ అధికంగా వున్న ఆహారం,
ట్రైగ్లిసరిన్స్... ఇలా ఏవైనా కారణం అయి వుండవచ్చు.
కాబట్టి ముందుగా వాటిని ఒక వైద్యుడిని ఎంచుకున్న
తర్వాత ఆ నిపుణుడు చెప్పిన పద్ధతిలో జీవనవిధానం
మార్చుకోవటం, మందులు వేసుకోవటం చెయ్యాలి.
వైద్యుడి సూచన మేరకు తరచు పరీక్షలు చేయించు
కోవాల్సి ఉంటుంది.చికిత్స అనేది హై బి.పి.ని అదుపులో వుంచేయత్నమే గాని తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చేది
కాదన్న వాస్తవం గుర్తించి దానికితగినట్టుగాజీవితంగడపటం ఎంతైనా అవసరం.ఉప్పు తక్కువ ఆహారం, ఊరగాయలు లేనిభోజనం వంటివి సూచించినపుడు తు.చ. తప్పక
పాటించాలి. ఆహారం, అలవాట్ల విషయంలో వైద్యుడి నియమ నిబంధనల పాటింపు తప్పని సరి.
సమయానికి నిద్ర, తగినమేర వ్యాయామం, ఒత్తిడికి
గురవని జీవన విధానంతోపాటు తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
ఐతే వైద్యులు చెప్పనిది ,ఇప్పుడిప్పుడే సరైన రుజువులతో అంగీకరించబడిన కొత్త ఔషదం "నవ్వు...నవ్వు హైటెన్షన్ని అదుపులో వుంచగలిగినమానసిక,శారీరక అంశం.
నవ్వినప్పుడు ప్రారంభ దశలో మనకు బి.పి.
పెరిగినట్టు అనిపించినా అది ఆ తర్వాత సాధారణ స్థాయికి తెస్తుంది.
నవ్వితే ముఖం, మెడ,గొంతు, ఛాతి, ఉదర కండరాలన్నీ కదలటమే కాదు రిలాక్స్ అవుతాయి.
ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఆదుర్దా కలిగినప్పుడు కార్టిసాల్ ప్రభావాన్నిపెంచుతాయి. విడుదలయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ రక్త నాళాలు కుంచించుకుని రక్తపోటు పెరిగేలా చేస్తే నవ్వినప్పుడుతగ్గించి ప్రశాంతతను తెచ్చి పెడతాయి. దీనితో బి.పిసాధారణమవుతుంది.నవ్వినప్పుడు రక్తప్రసరణ మెరుగవుతుంది.రక్తంలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇది కూడాహైబి.పి. ఇబ్బందినుండి ఉపశమనం కలిగించేదే.అయితే చిరునవ్వులు చిందించి నవ్వుతో లాభంకలగలేదనుకోకండి. మనసారా నవ్వగలిగితేనే ఈలాభం పొందగలరు. మీరు ఎంత బిగ్గరగా నవ్వగలిగితే అంత మంచిది.నవ్వుతో బి.పి.అదుపులో వుంటుందని భారతీయ,జపాన్ పరిశోధకులు ధృవీకరించిన తర్వాతనేడుప్రతిపట్టణంలోలాఫింగ్క్లబ్బులుఏర్పడుతున్నాయి.రోజూ ఉదయం లేదా సాయంత్రం తప్పని సరిగా
నవ్వులలో తేలియాడే సాటి బృందం వుంటే మీ హైపర్
టెన్షన్ సమస్యను హాయిగా మరచిపోగలరు. కనీసం
రోజులో 15 నుండి 20 నిమిషాలు మనసారా నవ్వే
వారికి చక్కని మందు దొరికినట్టే.హై బి.పి. అనగానే భయంతో వణికిపోయిజీవితం అంతటితో సరి అన్న ఆలోచన రానివ్వవద్దు.ఒక వైద్యుడి నుండి మరో వైద్యుడి దగ్గరికి మారినంత మాత్రాన తక్షణం ఈ రోగంతగ్గుతుందన్న
భ్రమవదలటం మంచిది.భిన్నమైన అభిప్రాయాలు వైద్యులు చెప్పినందునగందరగోళం పెరుగుతుందే కాని తగ్గదు. ఇక హైపర్‌టెన్షన్ అదుపుకు ఎక్కువ సమయం పడుతుంది.
సహనం చాలా అవసరం.
శరీరంలో సైలెంట్ కిల్లర్' చేరింది కాబట్టి దాని
మీద సహనమనే ఆయుధమే పనిచేస్తుంది. ఆదుర్దా
పడితే ఆ 'కిల్లర్' సులభంగా దెబ్బతీస్తుంది.
హైపర్ టెన్షన్ ని అదుపులో వుంచుకుని హాయిగా
జీవనం సాగించినవారు వేలల్లో వున్నారు. ఆ అవగా
హనాలేమే అసలు ఇబ్బంది.
పగటి నిద్ర ,రాత్రి డ్యూటీలు చేసేవారికి ఆయుర్వేద , ఆరోగ్య వైద్య సలహాలు.
జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవలి నివేదిక ప్రకారం 5,6 ఏళ్ళ పాటూ రాత్రిళ్ళు మేల్కొని పని చేస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.ప్రకృతికి ఇలా విరుద్ధంగా జీవించటాన్ని సర్కాడియన్ రిథం డిస్రప్షన్ అంటారు .పాతికేళ్ళకు పైగా నైట్ డ్యూటీలు చేస్తున్నవాళ్ళు ఉన్నారు,వాళ్ళలో చాలామందికి పగటి డ్యూటీ వేస్తే చేయలేనంతగా రాత్రి డ్యూటీకి అలవాటు పడిపోయి ఉంటారు.కొన్ని తరాలపాటూ ఇలా జరిగితే అది జన్యుపరమైన మార్పులకు దారితీయవచ్చు కూడా.వీళ్ళు ఒక సామాజిక అవ్యవస్థకు / సోషల్ జెట్ లాగ్ గురవుతుంటారు.స్త్రీలలో ఈస్ట్రోజన్ లాంటి పునరుత్పాదక హార్మోనుల ప్రభావం తోడవడం వల్ల , నడివయస్సు దాటిన వారిలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.మన అవసరాలు గడవడం కోసం , బాహ్య ప్రకృతిని, పర్యావరణాన్నే కాకుండా , మన శరీర ప్రకృతులను కూడా మనం విధ్వంసం చేస్తున్నాము.అతిగా నిద్ర మేల్కోవడం వల్ల బుర్ర పని చేయడం తగ్గిపోతుంది.పనిలో నాణ్యత పడి పోతుంది.మనిషి పక్షవాతానికి, బీపీ,గుండె జబ్బులు,షుగరు,జీర్ణకోశవ్యాధులకు,కీళ్ళవాతానికి లోనవుతాడు.చీకట్లో మెలకువ, పగలు నిద్ర ప్రకృతి విరుద్ధాలే.తప్పనిసరిగా పనిచేసినపుడు శరీరంలో వాతం,వేడి పెరిగిపోతాయి.కావున ఆహారపదార్థాల ద్వారా వాతాన్ని తగ్గించి,చలువ చేసే వాటిని తీసుకోవాలి.రాత్రి జాగరణవల్ల వాతం వికారం చెందుతుందని ఆయుర్వేదం చెబుతుంది.ఇది పక్షవాతానికి కారణంకూడా కావచ్చని తాజా పరిశోధన తెలుపుతోంది.కాబట్టి చలువ చేసే ఆహారపదార్థాలకు ప్రాధాన్యతనివ్వాలి.పులుపులేని కూరగాయలు,ఆకుకూరలు అన్నీ మేలు చేస్తాయి.కానీ వాటిని అతిగా చింతపండుతోనో ,అల్లం వెల్లుల్లితోనో ,శనగపిండితోనో,నూనెతోనో వండినందువల్ల వేడి , వాతం చేసేవిగా మారిపోతాయి.
ఉదయాన్నే ఒక క్యారెట్, ఒక ముల్లంగి,ఒక ఆపిల్ / లెద పులుపు లేని ఒక పండు ఈ మూడింటినీ కలిపి మిక్సీలో వేసి జ్యూస్ తీసి తాగాలి.వాతం , వేడి తగ్గుతాయి.శరీర అనుకూలత సాధించుకోవటానికి , వాతహరంగా, వేడిని రూపు మాపేదిగా ఉండే ఆహార పదార్థాల కోసం ప్రణాళిక వేసుకోవాలి. బూడిద గుమ్మడిని సోరకాయా పద్ధతిలో అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు.ఇది శరీరంలో నిద్రలేమి వల్ల కలిగే అలసటను పోగొడుతుంది.మర్నాడు నిద్రచాలక కలిగే ఇబ్బందులు తగ్గుతాయి.బార్లీ జావ , సగ్గు బియ్యం జావ , స్బజా గింజలు, సుగంధిపాల వేళ్ళ కషాయం, పల్లేరు కాయల కషాయం లాంటివి నైట్యూటీలు చేసేవారికి మేలు చేస్తాయి.అలసటను నివారిస్తాయి.
పెరుగు, మజ్జిగ చలవనిస్తాయి.రకరకాల కూరగాయల ముక్కలు వేసి చేసిన పెరుగు పచ్చడి జీర్ణకోశాన్ని బల సంపన్నం చేస్తుంది.ధనియాలు, జిలకర,శొంఠి లను సమానంగా తీసుకొని దంచిన పొడిని మజ్జిగలో కలుపుకొని , కొద్దిగా ఉప్పు వేసుకొని రోజూ ఒకటి రెండుసార్లు తాగాలి.
పొద్దున్నే నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకొని ఏమీ తినకుండా పడుకొని నిద్రపోవడం మంచిది.రాత్రి 10 గంటల తర్వాత ఎన్ని గంటలు మెలకువగా ఉన్నారో అందులో సగం సమయాన్ని ఇలాగే ఉదయం నిద్రపోతే నిద్రలేమి రాదు అని సుశ్రుతుడు చెప్పడం జరిగింది.పచ్చళ్లు, కారాలు, మసాలాలు మానేయాలి.మద్యం,సిగరెట్లు వాడడం రాత్రి డ్యూటీలు చేసేవారిలో అనారోగ్యాన్ని వేగవంతం చేస్తుందని గ్రహించాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
Featured post
గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు
రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...
-
తెలుగు - తుమ్మ చెట్టు english - indian gum arabic tree హిందీ - బాబుల్ సంస్కృతం లో- బార్బరా మిత్రులారా తుమ్మ చెట్టుతో తయారుచేసిన నాగళ్...
-
telugu - bodatharam,bodasaram latin - spheranthus indicus hindi - mundee ,gorakhmundee sanskrit - mundee ,shravanee 1. NOTI DURGAN...