కనురెప్పల్లో చీము గడ్డల సమస్య..
తలలో అధికమైన అనవసరమైన కఫం చేరడం వల్ల ఈ సమస్య కలుగుతుంది.
1. ) ముందుగా అధికంగా కఫం పెంచే పదార్థాలను ఆహారంలో తీసుకోవద్దు. 2. ) త్రిఫలాల ముక్కలు ఒక్కొక్కటి పది ముక్కల చొప్పున మొత్తం 30 ముక్కలు ఒక గ్లాసు వేడి నీటిలో రాత్రి వేసి ఉదయం వరకు ఉంచి వడపోసుకోవాలి. ఆ నీటిని ఉదయం పూట కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుని మూసిన కన్నులపైన తడపాలి. ఇలా ప్రతి రోజూ ఉదయం పూట చేయాలి. 3. ) ఒక పెద్ద గ్లాసు నీటిలో ఒక చెంచా పసుపు వేసి అర గ్లాసు కషాయానికి మరిగించి వడపోసి నూలు బట్ట నాలుగు మడతలు వేసి ఆ కషాయంలో ముంచి నీళ్ళు కారకుండా కొంచెం పిండి ఆ తడి బట్టను గోరు వెచ్చగా ఉన్నప్పుడు మూసిన కన్నులపైన వేసుకుని పది లేక పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా రోజుకు రెండు సార్లు ఆచరించాలి. 4.) పలుచగా ఉన్న ప్రశస్తమైన వేప నూనె రెండు ముక్కుల్లో రెండు రెండు చుక్కలు రెండు పూటలా ఆహారానికి అరగంట ముందుగా వేస్తుండాలి.
గర్భ సంచి మందంగా మారిన సమస్య..
1.) కలబంద గుజ్జు ఆపకుండా మూడు నెలల వరకు సాయంత్రం పూట సేవించాలి. 2.) అశోక చెట్టు లేదా రావి చెట్టు లేదా మర్రి చెట్టు లేదా మేడి చెట్టు వీటిలో ఏదో ఒక చెట్టుకు పూజ చేసి మాను మీద ఉండే బెరడు 2,3 కేజీలు తీసుకోవాలి. తీసిన చోట మాను మీద దట్టంగా ఆవు పేడ పూసి రావాలి. ఆ బెరడును 50 గ్రాములు తూకం ఉండే విధంగా ముక్కలు కొట్టి కడిగి ఎండబెట్టి నిలువ చేసుకోవాలి. ఒక పెద్ద గ్లాసు నీటిలో ఒక ముక్క వేసి ఒక రోజు నానబెట్టి చిన్న మంట పైన ఒక కప్పు కషాయం మిగిలే వరకు మరగబెట్టి వడపోసి ఆ ముక్కను తీసివేసి , ఆ కషాయంలో ఒక చెంచా కండ చక్కెర పొడి కలిపి గోరు వెచ్చగా పరగడుపున తాగాలి. 3.) వేపాకు పావు కేజీ, మంచి పసుపు 20 గ్రాములు, కలబంద గుజ్జు 100 గ్రాములు , తగినన్ని నీళ్లు పోసి మిక్సీలో వేసి ముద్దలాగా చేసి వెల్లకిలా పడుకుని ఆ ముద్దను పొత్తి కడుపు పైన పట్టులాగా వేసి పలుచని బట్ట పైన వేసి ఆ గాలి తగలకుండా దుప్పటి కప్పుకుని అర గంట వరకు ఉంచి తీసివేయాలి. ఇలాగే రేగడి మట్టితో కూడా రెండవ పూట పట్టు వేసుకోవచ్చు. 4. ) పావు చెంచా మిరియాల పొడి , అర చెంచా ఉసిరి కాయల పొడి , ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో వేసి ఆహారానికి ఒక గంట ముందు కానీ తర్వాత కానీ సేవించాలి. 5.) కపాల భాతి ప్రాణాయామం , పశ్చిమోత్తాసనం, వక్రాసనం, పవన ముక్తాసనం , భుజంగాసనం , శలభాసనం రోజూ రెండు పూటలా పొట్ట ఖాళీగా ఉన్న సమయంలో ఆచరించాలి. ఇలా చేస్తుంటే సర్జరీతో అవసరం లేకుండా గర్భ సంచిలో గడ్డలు కరిగి పోతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి