AN EXCELLENT COLLECTION OF AYURVEDIC RECIPES OF EMINENT INDIAN AYURVEDIC PRACTITIONERS LIKE BABA RAMDEV , ELCHURI , CHIRUMAMILLA MURALIMANOHAR ,PEDDI RAMADEVI ETC FOR VARIOUS HEALTH PROBLEMS.EXPLAINED IN TELUGU .
30, జూన్ 2013, ఆదివారం
29, జూన్ 2013, శనివారం
తెల్లగా ,లావుగా కావడానికి ఆయుర్వేద సూత్రాలు / TELLAGAA LAVUGA KAVADANIKI AYURVEDA SOOTRALU.
మనిషి మనిషి8కీ రక్త గ్రూపుల్లో ఎలా తేడాలుంటాయో ప్రకృతుల్లో కూడా తేడాలుంటాయి.అంటే జీన్స్ ఆధారంగా నిర్ధారితమయ్యే అంశాలు చాలా ఉంటాయి.
ఆయుర్వేద పరిభాషలో ఇవి ప్రకృతి,సార,సత్వ అనే సూత్రాలలోకి వస్తాయి.వీటినే ఎవరి స్వభావం వారిది,ఎవరి తత్వం వారిది అని అంటుంటాము.మనిషి చర్మం రంగు , పళ్ళ రంగు ,తల మీద జుట్టు , పొట్టి ,పొడవులు ,ప్రమాణం ,స్వభావం ,లావుగా లేదా సన్నగా ఉండటం ,మానసిక శక్తి , రోగ నిరోధక శక్తి ,ఆలోచనా సరళి మొదలైనవి దీనికి సాధారణ ఉదాహరణలు.ఐతే ప్రాకృత ధర్మాలను పరిరక్షించుకోవడం మన చేతుల్లోనే ఉంది.ప్రధానంగా మన ఆహార విహారాలు ,జీవన శైలి ద్వారా కొంత వరకు నియంత్రించుకోవచ్చు.
1. ముఖ చర్మపు ఆరోగ్యం - కలుషిత వాతావరణం ,ముఖ్యంగా మోటారు వాహనాల నుంచి వచ్చే పొగ ,దుమ్ము,ధూళి,విపరీతమైన ఎండ,మనం వాడే సబ్బులు ,క్రీములు,పౌడర్లు ,మొదలైనవి చర్మం పై ప్రభావం చూపుతాయి.ముఖకాంతిని కాపాడుకోవాలంటే శనగ పిండిలో నిమ్మ రసం,పాల మీగడ,తేనెలను కలిపి ప్రతి రోజూ ఉదయం ముఖానికి రాసుకుని ఒక అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.ఆహారంలో తాజా ఫలాలు,ఆకు కూరలు,మొలకెత్తే పప్పు ధాన్యాలు తినండి.నీళ్ళు ఎక్కువగా తాగండి.ప్రతి రోజూ మేలిమి రకం కుంకుమ పువ్వు 200 మి.గ్రా. పాలు , చక్కెరతో కలిపి వాడండి.
ఔషధాలు -
1.కుంకువాది లేపం. - రాత్రి పడుకునే ముందు,ముఖంపై,మొటిమలు,మచ్చలపై పూసుకోండి.
2. మహా మంజిష్టాధి క్వాధ - ద్రావకం మూడు చెంచాలు,ఆరు చెంచాల నీళ్ళు కలుపుకొని ఉదయం , సాయంత్రం ఖాళీ కడుపున తాగండి.
3. ఆరోగ్య వర్ధిని మాత్రలు - ఉదయం 1 , రాత్రి 1 నీళ్ళతో తీసుకోండి.
బరువు పెరగడానికి - బలవర్ధకమైన ఆహారం తింటూ ,తగినంత వ్యాయామం చేయండి.ఉదయం అల్పాహారం,రెండు పూటలా భోజనం,నియమిత వేళల్లో అలవాటు చేసుకోండి.బొప్పాయి పండ్లు,అరటి పండ్లు(సహజంగా పండినవి ) బాగా తినండి.మీ పొడవుకు తగిన బరువు దాటిపోకుండా చూసుకోండి.రెండు పూటలా అశ్వగంధ లేహ్యాన్ని ఒక చెంచా తిని పాలు తాగాలి.
28, జూన్ 2013, శుక్రవారం
27, జూన్ 2013, గురువారం
అశ్వగంధ ( పెన్నేరు గడ్డ ) - ఆయుర్వేదం
అనాది నుండి ఆయుర్వేద వైద్యంలో అశ్వగంధ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అశ్వగంధ అన్నది ఒక సంస్కృత పదం. అశ్వశాల లో వెలువడే వాసన వలె ఈ అశ్వగంధ వాసన ఉండడం వలన దీనికి ఆ పేరు వచ్చింది. ఈ అశ్వగంధ కు పెన్నేరు గడ్డ అనే పేరు కూడా ఉంది .ఇది తెలుగు పేరు. పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డలే మందు అని డాక్టర్ ఆచంట లక్ష్మీపతి గారు చెప్పడంతో ఒక నానుడి కూడా ఏర్పడిందంటే అశ్వగంధ కు ఉన్న శక్తి అమోఘమని తెలుస్తోంది. అశ్వగంధ మొక్క భారతదేశం లోని అన్ని ప్రాంతాలలోనూ లభిస్తుంది. ఈ మొక్క సుమారు ఒకటిన్నర మీటర్ ఎత్తు వరకు పెరుగుతుంది. దీని పువ్వులు పసుపు కలిసిన ఆకు పచ్చ రంగు లో ఉంటాయి. దీని పండ్లు ఎరుపు వర్ణంలో ఉంటాయి. దీని వేరు తెలుపు మరియు బూడిద మిశ్రమ వర్ణంలో ఉంటుంది.
ఈ మొక్కలోని వేరు భాగం మాత్రం ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. అశ్వగంధ శరీరానికి బలాన్ని ఇస్తుంది. కాబట్టి దీనికి బల్యం అని ఇంకో పేరు. ఇది వాజీకరం కనుక దీనికి వాజీ అని వాజీ గంధ అని వాజికారి
అని అంటారు.
ఈ వేరులో కటు, తిక్త, కషాయ మొదలైన మూడు రసాలు,స్నిగ్ధ,లఘు గుణాలు , కటు వీర్యం,ఉష్ణ విపాకం ఉంటుంది. అశ్వగంధ తో అశ్వగంధ చూర్ణం, అశ్వగంధ లేహ్యం, అశ్వగంధరిష్ట అని మూడు విధాలుగా తయారు చేస్తారు. అశ్వగంధను రసాయనం అని అంటారు. అశ్వగంధ ను ఎవరైనా వాడవచ్చు. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. రోగనరోధక శక్తిని పెంచి నరాలకు, కండరాలకు బలాన్నిస్తుంది. వాత, కఫ లోపాలను సమస్థితికి తీసుకొస్తుంది. శరీరంలో రకరకాల కణాల అభివృద్ధికి సహాయపడుతుంది. అశ్వగంధ లో ఉన్న వ్యాధి నిరోధక శక్తి కారణంగా, నూతన కణజాల నిర్మాణ శక్తి కారణంగానూ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు దీని వైపు ఆకర్షితులయ్యారు. దానితో దీని మీద అనేక పరిశోధనలు జరిగాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి.
అశ్వగంధ ని ఎండబెట్టి బాగా చూర్ణం చేసి వస్త్ర గాలితము చేసి ఉంచుకోండి .12 సంవత్సరాల లోపు పిల్లలకైతే మూడు గ్రాములు, పెద్దలకైతే 6 గ్రాములు ప్రతిరోజూ వాడవవచ్చు .
ఉబ్బసానికి అశ్వగంధ...
అశ్వగంధను బూడిదగా చేసి నెయ్యి, తేనెతో ఉదయం పరగడుపున సేవిస్తే ఆస్తమా మొదలైన ఉబ్బస వ్యాధులు తగ్గుముఖం పడతాయి.
కీళ్ల నొప్పులు తగ్గడానికి..
అశ్వగంధను ముక్కలు చేసి నీళ్లు ,పాలతో కలిపి సగం అయ్యే వరకు మరిగించి ఆ కషాయాన్ని నెయ్యితో కలిపి వాడితే వాత సంబంధమైన కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
మంచి నిద్రకు..
రాత్రులందు నిద్ర పట్టని వారు అశ్వగంధ చూర్ణాన్ని నెయ్యి, చక్కెర ,పాలలో కలిపి రాత్రి పడుకునే ముందు స్వీకరిస్తే మంచి నిద్ర పడుతుంది
గాయాలకు అశ్వగంధ ..
శరీరంలో ఏర్పడే చిన్న చిన్న గాయాలకు అశ్వగంధ చూర్ణాన్ని పాలతో కలిపి ముద్దగా చేసి గాయమైన చోట పూస్తే గాయాలు త్వరగా మానిపోతాయి.
గుండె జబ్బులకు
బీపీని కంట్రోల్ చేసి హార్ట్ బీట్ ను క్రమబద్ధీకరణ చేసే గుణం ఉంది కనుక అశ్వగంధ చూర్ణాన్ని పాలలో కలిపి సేవిస్తే గుండెకు బలాన్ని కలిగిస్తుంది. కనుక గుండె జబ్బు ఉన్న వాళ్ళు వాడటం మంచిది.
నపుంసకత్వం పోవడానికి ..
అశ్వగంధ చూర్ణాన్ని పాలలో కలిపి సేవించడం ద్వారా కండ పుష్టి కలిగించి నపుంసకత్వాన్ని పోగొట్టి ,వీర్య వృద్ధిని పెంపొందించి అశ్వానికి ఉన్న శక్తి వంటి శక్తిని కలిగించి సంభోగ శక్తిని పెంచుతుంది.
చర్మ సౌందర్యానికి ..
అశ్వగంధ చూర్ణాన్ని పాలతో కలిపి పేస్ట్ లాగా చేసి ముఖానికి పట్టించి, కొంత వ్యవధి అనంతరం నీటితో కడిగితే ముఖవర్చస్సు పెరుగుతుంది. అలాగే అశ్వగంధ చూర్ణాన్ని బాదం నూనె ,రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టిస్తే ముఖం కళకళలాడుతుంది. స్నానానికి వాడే సున్నిపిండి హెర్బల్ బాత్ పౌడర్లలో అశ్వగంధ చూర్ణాన్ని కలిపి శరీరానికి వాడితే శరీరంలో ముడతలు పోయి శరీరం నిగనిగలాడుతుంది.
బలానికి
పెద్దలకైతే పాలతో ప్రతిరోజు తీసుకోవాలి. పిల్లలకైతే ఆవు నెయ్యి ,అశ్వగంధ చూర్ణం, పాలతో కలిపి తీసుకోవాలి.
శక్తికి
అశ్వగంధ చూర్ణం, పిప్పలి, ద్రాక్ష, తేనెతో కలిపి తీసుకోవాలి.
యవ్వనానికి
యవ్వనంగా ఉండేందుకు ఆవు నెయ్యి, తేనె, అశ్వగంధ చూర్ణం పాలలో కలిపి తీసుకోవాలి.
మానసిక ఒత్తిడి తగ్గడానికి ..
మానసిక ఒత్తిడికి, మనోవ్యాకులతో ఉన్నవారు అశ్వగంధ చూర్ణాన్ని పాలలో కలిపి రెండు పూటలా తీసుకుంటే మంచిది.
జ్ఞాపక శక్తి పెరగడానికి
అశ్వగంధ చూర్ణాన్ని శంఖపుష్పి, శతావరితో కలిపి పిల్లలకి ఇస్తే మెదడుకు పోషణ కలిగించి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
ఇతర ఉపయోగాలు
స్త్రీలకు గర్భస్రావం అయిన తర్వాత గర్భసంచిని శుభ్రం చేసేందుకు అశ్వగంధ ఎంతో ఉపయోగపడుతుంది. రక్తంలోని తెల్ల కణాలను పెంచే గుణం అశ్వగంధ కు ఉంది. కాబట్టి ఇన్ఫెక్షన్ ,అలర్జీలను అరికడుతుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా ఎక్కువగా ఉన్న చక్కెర ను ,యూరియా, క్రియాటినిన్ మొదలైన పదార్థాలను సమస్థితిలోకి తీసుకురావడానికి అశ్వతంగా సహాయపడుతుంది అని కొన్ని పరిశోధనలు తెలియ చేశాయి.
క్యాన్సర్ ,జలుబు , దగ్గు ,విరేచనాలు, జ్వరం ,ఎక్కిళ్ళు, స్త్రీల వ్యాధులు , మొలలు , గజ్జి ,తామర, క్షయ, టైఫాయిడ్ సిఫిలిస్, ట్యూమర్లు వచ్చినప్పుడు వాటికి వాడే మందులతో పాటు అశ్వగంధ ను కూడా వాడితే శరీ శరీరానికి బలాన్ని, రోగనిరోధక శక్తి పెంచి రోగాలు త్వరగా తగ్గేందుకు సహాయపడును.
ప్రతిరోజు వేడి వేడి పాలలో ఒక చెంచాడు అశ్వగంధ చూర్ణం కలిపి కాఫీ ,టీ లకి బదులుగా తాగుతూ ఉండడం ఎంతో ఆరోగ్యకరము. ఇక బి కాంప్లెక్స్ లతో అవసరమే ఉండదు .ఎంతకాలం వాడినా ఎటువంటి విపరీత ఫలితాలు ఉండవని పరిశోధనలు తేల్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఏ రోగం లేని స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ప్రతిరోజు పాలతో అశ్వగంధ చూర్ణం కలిపి తీసుకుంటే వారిలో రోగ నిరోధక శక్తి పెరిగి అకాలంగా వచ్చే ముసలితనం రాకుండా చేసి, యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండేలాచేస్తుంది. చక్కెర వ్యాధి ఉన్నవారు చక్కెర లేని పాలు వాడాలి.
26, జూన్ 2013, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
Featured post
NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )
రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...
-
అనాది నుండి ఆయుర్వేద వైద్యంలో అశ్వగంధ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అశ్వగంధ అన్నది ఒక సంస్కృత పదం. అశ్వశాల లో వెలువడే వాసన వలె ఈ అశ్వగంధ ...
-
తెలుగు - తుమ్మ చెట్టు english - indian gum arabic tree హిందీ - బాబుల్ సంస్కృతం లో- బార్బరా మిత్రులారా తుమ్మ చెట్టుతో తయారుచేసిన నాగళ్...
