Saturday, 29 December 2018

డిప్రెషన్ లో 8 కోట్ల మంది భారతీయులు .

డిప్రెషన్ - చిన్న చిన్న పిల్ల నుంచే వేధిస్తున్న సమస్య ఇది.అల్ల డిప్రెషన్ బారిన పడిన దేశాల్లో మొదటి స్థానంలో మన భారతదేశమే ఉండడం ఇప్పుడు కలవరపరుస్తున్న అంశం.ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం తేటతెల్లమైంది.భారత్ తర్వాత చైనా,అమెరికాలున్నాయి.మారుతున్న జీవన విధానాలు కావచ్చు,ఉద్యోగ కుటుంబ బాధ్యతలు కావచ్చు,మనిషి మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని తన నివేదికలో తెలిపింది.మానసిక సమస్యలకు చికిత్స చేసే వైద్యులు తక్కువగా ఉండడమూ పరిస్థితి తీవ్రమవడానికి కారణమౌతోందని హెచ్చరించింది.

సగం మంది కార్పొరేట్ ఉద్యోగులు డిప్రెషన్ బాధితులు - కాలంతో పాటు జీవితం ఉరుకులు పరుగులు పెడుతోంది.డబ్బు సంపాదించాలి,పేరు తెచ్చుకోవాలి,గుర్తింపు పొందాలి,ఎక్కువ మందిలో ఇదే తపన.ఐతే ఇప్పుడు కార్పొరేట్ ఉద్యోగంలో సమయం లేకుండా వారిలో 42.5 శాతం మందికి డిప్రెషన్ ఉంది.గత సంవత్సరం అసోచాం చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే వారిపైనే డిప్రెషన్ ఎక్కువగా దాడి చేస్తోందని తేలింది.తక్కువ జీతంతో ఎక్కువ సేపు పని చేయించుకోవడం వల్ల ,ఉద్యోగుల్లో అలసట చాయలు కనిపిస్తున్నాయని అధ్యయనం స్పష్టం చేస్తోంది.అదే ఒత్తిడి,ఫ్రస్ట్రేషన్ వరకు వెళుతున్నాయని ,చివరకు డిప్రెషన్ బారిన పడుతున్నారని స్పష్టమైంది.బ్రిటన్ ( 33 గంటలు ),అమెరికా ( 40 గంటలు ) తో పోలిస్తే భారత్ లో సగటు వేతన జీవి ఎక్కువగా పని చేస్తున్నాడు.వారానికి 48 నుంచి 50 గంటలు పని చేయాల్సివస్తోంది.జీతం విషయంలో మాత్రం ఆ దేశాలకన్నా చాలా తక్కువలోనే ఉంది భారత్.లివింగ్ కాస్ట్,ఇండెక్ష్ ప్రైసింగ్ లను తీసేసిన తర్వాత కూడా 6 రెట్లు ఎక్కువగా ఆ దేశాలు జీతాలిస్తున్నాయి.భారత్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది.ఫలితంగా మానసిక వత్తిడి పెరిగి పోతోంది.పని ఒత్తిడి ఎక్కువవడంతో నిద్ర కూడా సరిగ్గా పోలేని స్థితి ఉంది.

టీనేజ్ నుంచే ఒత్తిడి - 14 యేళ్ళ ప్రాయం వయసంటే ఆడుతూ పాడుతూ గెంతే వయసు.చదువులు,ఫ్రెండ్స్ తో సరదాలు ఇలా ఉంటూ ఉంటాయి.కానీ ,బలవంతంగా రుద్దుతున్న చదువులు ఒత్తిడిని పెంచేస్తున్నాయి.పెరిగిన టెక్నాలజీ వారి అలవాట్లను మార్చేస్తోంది.సెల్ ఫోన్ కు బానిసై పోవడం,అశ్లీల కంటెంట్ వైపు మొగ్గు చూపడం వంటివి పెరుగుతున్నాయి.మందు కొట్టడం,సిగరెట్లు తాగడం,డ్రగ్స్ వాడడం వంటి వాటితో డిప్రెషన్ తాలూకు చాయలు పెరిగిపోతున్నాయి.మానసికంగా సతమతం చేస్తున్నాయి.తల్లి దండ్రులు నిఘా పెట్టకపోవడమూ పరిస్థితిని తీవ్రతరం చేస్తోంది.

డిప్రెషన్ లో టాప్ లో ఉన్న దేశాలు -

1. భారత్ - మన జనాభాలో 6.5 శాతం డిప్రెషన్ తో బాధ పడుతున్నారు.గ్రామాలు,పట్టణాలు,నగరాలు అన్న తేడా లేకుండా అందరినీ అది వేధిస్తోంది.దానిని నయం చేసేందుకు ప్రభావ వంతమైన పద్ధతులు ,చికితసలున్నా ,చేసేవారే కరువయ్యారని సంస్థ పేర్కొంది.సైకాలజిస్టులు,సైకియాట్రిస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపింది.లక్షకు ఒకరు మాత్రమే ఉన్నారని పేర్కొంది.మానసిక సంస్యలతో సగటున ప్రతి లక్షమందిలో 11 మంది ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు.

2. చైనా - డిప్రెషన్ తో బాధపడేవారిలో 91.8 శాతం మంది దాకా చికిత్సలు చేయించుకోవడం లేదు.చైనాలోనూ భారత్ లాంటి పరిస్థితే ఉంది.మానసిక ఆరోగ్యం పై వాళ్లు బడ్జెట్ లో కెటాయిస్తోంది కేవలం 2.35 శాతం మాత్రమే.

3. అమెరికా - ప్రతి 5 మందిలో ఒకరు మానసిక రోగాల బారిన పడుతున్నారు.అందులో కేవలం 41 శాతం మంది చికిత్స తీసుకుంటున్నారు.అంత అభివృద్ధి చెందిన అమేరికాలోనూ మానసిక ఆరోగ్య నిపుణులు చాలా తక్కువే.చికిత్స లేకుండానే దాని నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ దేశ ప్రజలు చెప్పడం విశేషం.

4. బ్రెజిల్ - లాటిన్ అమెరికాలో డిప్రెషన్ తో బాధపడేవాళ్లు ఎక్కువున్న దేశం బ్రెజిలే.హింస ,వలసలు,నిలువ నీడ లేకపోవడం వంటి కారణాలు డిప్రెషన్ లోకి తోసేస్తున్నాయి.

5. ఇండొనేషియా - జనాభాలో 90 లక్షల మంది ( 3.7 % ) డిప్రెషన్ బారిన పడ్డారు.యాంగ్జైటీ / మానసిక ఆందోళన కలుపుకుంటే మరింత పెరుగుతుంది.6% మంది మానసిక రోగాలతో బాధపడుతున్నారు.

6. రష్యా - ఆ దేశ జనాభాలో 5.5% మంది డిప్రెషన్ తో బాధ పడుతున్నారు.2012 ప్రకారం చూస్తే ప్రపంచ సగటు కన్నా మూడింతలు ఎక్కువగా టీనేజర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

No comments:

Post a Comment