30, డిసెంబర్ 2012, ఆదివారం

ORU ROOBAYI ORU UYAR ( ONE RUPEE FOR A LIFE ) - KHAJA MOHIYUDDIN - COIMBATORE


పనస పండు.. ఆయుర్వేద ఉపయోగాలు..

పనస పండు.. రక్త పోటును నియంత్రిస్తుంది, ఆస్తమా ను అదుపు చేస్తుంది, చర్మ వ్యాధులను నివారిస్తుంది,మలబద్ధకాన్ని పోగొడుతుంది.

పండ్లు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసు. అన్నంతో అవసరం లేకుండా ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర తృణధాన్యాలను ఆహారంగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి అని ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానం అని ప్రకృతి వైద్యులు ప్రచారం చేస్తున్నారు.పండ్లు, కూరగాయలు లో ఉండే పోషక విలువలు శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయని శాస్త్ర పరిశోధనలు కూడా ధృవీకరిస్తున్నాయి.

పండ్లలో పనస పండు లో మనకు గరిష్ట స్థాయిలో ఆరోగ్యం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. పనస పండు ను బంగ్లాదేశ్ జాతీయ ఫలంగా ప్రకటించింది. అక్కడి ప్రజలు ఈ ఫలాన్ని ఇష్టంగా ఆరగిస్తారు. ఇది వేలాది సంవత్సరాలుగా అలరారుతూ మానవాళికి ఉపయోగ పడుతోంది. పనస ప్రపంచంలో అత్యంత భారీ ఫలం. పనస చెట్టును సరిగా పోషిస్తే అది దాదాపు వంద సంవత్సరాల పాటు మధుర ఫలాలను ఇస్తుంది. బంగ్లాదేశ్ లో పనస చెట్లు పెరగడానికి అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నందున అక్కడ ఎక్కువగా ఈ తోటలు పెంచుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా అటవీ ప్రాంతంలో కూడా పనస చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి.ఇప్పుడు విరివిగా పనస పండ్లు లభిస్తున్నాయి.పనసలో ఎన్నో పోషక విలువలు ఉండడమే కాదు.దీని పెంపకానికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు.అందువల్ల పంట పొలాల్లో ఒక మూల ఈ చెట్లను పెంచడం అక్కడక్కడా మనకు కనిపిస్తుంది.
పనసలో ఏదీ వృథాగా పారవేసేది ఉండదు. పనస తొనలు, లోపలుండే గింజలు , దళసరిగా ఉండే పై తొక్క ఇలా అన్నీ మనం తిని ఆనందించగలిగినవే.పనసలో ఎక్కువగా శ్యాచరేటెడ్ ఫ్యాట్,కొలెస్ట్రాల్ పదార్థాలు ఉంటాయి.అదే సమయంలో విటమిన్ ఎ, సీ, థయామిన్, రిబోఫ్లావిన్, కాల్షియం,పొటాషియం, ఐరన్, సోడియం,జింక్ , నియాసిన్ తదితర అనేక విటమిన్లు, పోషకాలు ఉండి ఆరోగ్యాన్ని కలుగ చేస్తాయి. అలాగే తక్కువ కేలరీలు ఉన్నందున ఇది ఎంతో ప్రయోజనం కలుగచేస్తుంది. వంద గ్రాముల పనసలో కేవలం 94 కేలరీలు మాత్రమే ఉంటాయి.అందువల్ల శరీర బరువు పెరగకుండా ఉంటుంది. కొందరు వీటి వాసన పడదని భావించే వారు సైతం ఇందులో గల విలువైన పోషకాలను తెలుసుకుని ఇష్టం పెంచుకుంటారు. 

ఇక పనస తొనల్లో ఉండే గింజలు ఎంతో ఉపయోగ కరమైనవి. గింజల్లో విటమిన్ బి 1,బి2 ఎక్కువగా ఉంటాయి. గింజల్లో స్టార్చ్ ఎక్కువగా, ఐరన్, కాల్షియం తక్కువగా ఉంటాయి. పనస పండు లో దాదాపు వంద నుండి 500 వరకు పనస తొనలుంటాయి. సాధారణంగా ఇవి కొంచెం బంకగా ఉంటాయి. కొంతమంది గింజలను ఎండించి దాచుకుని వాడుకుంటారు. వీటిని నూనెలు, సిరప్ లలో కూడా కలపడం జరుగుతుంది.

తొక్క.. 

పనస పండు పైన దళసరిగా ఉండే తొక్క కాస్త ముళ్ళు ముళ్ళుగా కనిపిస్తుంది. పళ్ళు కోసేవారు ముందుగా చేతులకు ,కత్తికి వేరుశనగ నూనె రాసుకుని కోసి పనస పండ్లను బయటకు తీయడం
 మనకు కనిపిస్తుంది .ఫిలిప్పీన్స్ లో చెక్కలపై చిత్రాలు , నగిషీలు చెక్కే వారిలో సృజనాత్మకతకు, ఊహలకు పనస మంచి వనరుగా ప్రసిద్ధి. అక్కడ పనసపండు బొమ్మను చూసి బౌల్స్ తయారు చేస్తారు. బౌల్స్ ను మరింత అందంగా తయారు చేయడానికి పండ్ల పైన ముళ్లగా ఉండే తొక్కపొడిని ఉపయోగిస్తారు.

కండ.. 

పనస పండు లో బాగా రుచికరమైనది. సువాసన వెదజల్లేది. ఇష్టంగా తినేది కండ. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువ గా ఉంటుంది. మల బద్ధకం తో బాధ పడే వారికి ఇది చాలా మేలు చేస్తుంది.గింజలు.. పనస గింజలు సైతం ఎక్కువ ఫైబర్ ను అందిస్తాయి. వీటిని వేయించి తింటే చాలా రుచిగా ఉంటాయి. లేదా ఉడికించి కూడా తినవచ్చు. ఐతే గింజలను పొడి చేసి తిన్నట్లయితే ఫైబర్ శాతం పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియ చేస్తున్నాయి.

పొటాషియం సమృద్ధిగా లభించడం వల్ల అధిక రక్త పోటును తగ్గిస్తుంది. పనస చెట్టు వేరు జ్వరం,డయేరియా రుగ్మతలకు పని చేస్తుందని విశ్వసిస్తారు. దీనిలో ఉండే ఫైటో న్యూట్రియెంట్స్ క్యాన్సర్ నుండి హైపర్ టెన్షన్ లను తగ్గించడంలో ఉపకరిస్తాయి. అలాగే ఉబ్బసం తో బాధ పడే వారికి పనస వేరు ప్రయోజనం కలిగిస్తుంది. వేరును బాగా ఉడికించి దాని నుంచి వచ్చే రసం తీసుకుంటే ఆస్తమా అదుపులో ఉంటుంది. అలాగే పనస వేరు, చర్మ వ్యాధులలో కూడా చక్కగా పనిచేస్తుంది.ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ అల్సర్ గుణాలున్నాయి. పనసలో సి విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. మన శరీరంలో సహజంగా సీ విటమిన్ తయారు కాదు. అందువల్ల మనం తప్పని సరిగా సీ విటమిన్ లభించే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడడంలో యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది.

 కణజాలాన్ని కలిపి ఉంచడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ,దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు బాగా పనిచేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కలిగించగల కణాలు త్వరగా నశించకుండా పనస కాపాడుతుంది. అలాగే ఇందులో వయసు మళ్ళే లక్షణాలను  తగ్గించే గుణాలున్నాయి. ఇన్ని విశేష గుణాలు ఉన్న పనస పండు ను మనం విశేషంగా ఆదరించి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం..

22, డిసెంబర్ 2012, శనివారం

ORTHOPAEDIC PROBLEMS IN WOMEN - AWARENESS


బాదం చెట్టు.. ఆయుర్వేద ఉపయోగాలు..

పల్లెలో బాదం కాయలు కొట్టుకు తినడం ఒక ఆనందం. ఇక్కడే కాదు ప్రపంచమంతా అందరూ తిని ఆనందించేది బాదం పప్పు. ఆధునిక ఆహారంలో సలాడ్ రూపంలో , ఉత్తర భారతంలో బాదం హల్వా రూపంలోనూ ఎడారి దేశాలలో బాదం బిస్కెట్ల రూపంలోనూ , సమ శీతల ప్రాంతాలలో బాదం బ్రెడ్ రూపంలోనూ ధన వంతులు శక్తి సాధనంగా రాత్రి తినే బాదం పలుకుల రూపంలోనూ సర్వదా వాడే చక్కటి శక్తి సాధనం బాదం. ఇంత ప్రాచుర్యం ఎందుకంటే బాదంలో అంతగా పోషక విలువలు ఉన్నాయి కనుక. చూడడానికి చిన్నదైనా,విలువైనది. సంపూర్ణ పోషక విలువలు కలిగిన ఈ బాదం వేడి ప్రాంతాలైన పశ్చిమ ఆసియా లోని పల్లె ప్రాంతాలలో , తూర్పు ఆఫ్రికాలోనూ విరివిగా పండుతుంది.ఇది ప్రునియా అనే వృక్ష జాతికి చెందినది. ఈ బాదం తెల్లటి పుష్పాలతో కూడి తీయని బాదం కాయను కలిగి ఉండేవి ఒక రకమైతే , ఎర్రని పువ్వులతో కొంచెం చేదుని కలిగిన బాదం కాయలను కలిగి ఉండేవి మరో రకం.

పోషక విలువలు.. మొదటి రకం కొంచెం కోలగా ఉండి నూనె పదార్థాన్ని కలిగి ఉంటుంది. చేదు రకం కాయ పెద్దదిగా విశాలంగా ఉండి 50%నూనె కలిగి ఉంటుంది. ఇందులో కొంచెం నీరు, కరిగే గ్లూకోజు ,amygdalin,cyanid, వంటి పదార్థాలను కలిగి ఉంటాయి. తీపి కలిగిన బాదం పలుకులు పై పెచ్చులు ఒలిచి తీస్తారు. ఆ పై పెచ్చు సంప్రదాయం వైద్యంలో చర్మం పై మసాజ్ చేయడానికి వాడతారు. ఈ తీపి బాదం కాయలలో అసలు పిండి పదార్థాలు ఉండవు. కనుక దీన్ని పొడి చేసి కేకులాగానో, బిస్కెట్ లాగానో తయారు చేస్తారు. ఇవి షుగర్ ఉన్నవారికి చాలా ఉపయోగం. వాళ్ళు తినవచ్చు. అలాగే పిండి పదార్థాలు తక్కువ అవసరమున్న వారు కూడా వాడవచ్చు.


మన దేశంలో తరతరాలుగా బాదం చెట్లు మన జీవితాలలో పెనవేసుకొని ఉన్నాయి. బాదం పప్పులను రకరకాలుగా..తినుబండారాలుగా,పై లేపనాలు గా ఉపయోగించుకుని అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ బాదం చెట్లలో తియ్యగా ఉండే తీపి బాదం చెట్లు,, చేదుగా ఉండే చేదు బాదం చెట్లు ఇంకా సీమ బాదం చెట్లు మొదలైన అనేక రకాలైన బాదం చెట్లు వాడుకలో ఉన్నాయి. ప్రస్తుతం మనం తీపి బాదం చెట్టు గురించి చెప్పుకుంటున్నాము. ఈ బాదం ప్రయోగాలను బాగా అర్థం చేసుకుని,ఆచరించి ఇతరులకు కూడా నేర్పవలసిందిగా మనవి.
బాదం చెట్టు పేర్లు.. సంస్కృతంలో బాదామా , నేత్రోపమ అని , హిందీ లో బాదాం అని,తెలుగులో బాదం చెట్టు అని , లాటిన్ లో amygdalus communis & prunus ,emygdalus, ఇంగ్లీషులో almonds sweet అంటారు.


బాదం చెట్టు రూప గుణ ధర్మాలు.. బాదం పప్పు సమ శీతోష్ణ స్వభావంతో ముందుగా వేడి చేసి తర్వాత చలువ చేస్తుంది. శరీర పుష్టిని, వీర్యానికి బలాన్ని కలుగ చేస్తుంది. మేహ, వాత రోగాలను అణచి వేస్తుంది.మూత్రసంచిలో పుట్టే పుండ్లను మాన్పి వేస్తుంది.
అన్ని అవయవాలకు బలమిస్తుంది.

తీపి కలిగిన బాదం పప్పు చక్కటి పోషక విలువలు కలిగి ఉన్నా పైనున్న గోధుమ రంగు పల్చని పొర ఎక్కువగా తినడం వల్ల జీర్ణాశయంలో ఉత్తేజాన్ని కలుగ చేస్తుంది. ఆహారంలో తీసుకునేటప్పుడు మంచి నీటిలో నానబెట్టి పై పొర తీసివేసి తినడం మంచిది. దాని వల్ల లోపలి పోషక విలువలు తగ్గకుండా చూసుకోవాలి. ఈ బాదం పప్పులు బాగున్నాయని, బలమని ఎక్కువగా తినకూడదు. హితమైనా మితంగా తినాలి. ఎక్కువగా తింటే కడుపుబ్బరం కలుగ చేస్తుంది.
కొంత మందికి జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంది కానీ జ్వరం కాదు. అందుకే బాదం పలుకులు తీయగా, హితమైన వైనా మితంగా అది మందులా , బలం గా పని చేస్తుంది. ఇందులో 20 శాతం మాంస కృత్తులు ఉంటాయి. ఇందులో స్టార్చ్ ఉండదు కనుక పొడిచేసి బిస్కెట్ల రూపంగానో, కేకుల రూపంగానో చేసుకుని షుగర్ వారు వాడుకోవచ్చు. దీనివల్ల కాస్త బరువు కూడా పెరుగుతారు. దీనిలో ఉన్న సున్నితమైన నూనె పదార్థం గట్టిగా ఉన్న పదార్థాన్ని పలుచన చేస్తుంది.
Almonds provide double barelled protection against diabetes and cardiovascular disease.

 చలువ చేస్తుంది..

ముఖ్యంగా బిగ బట్టిన ఊపిరితిత్తుల వ్యాధులలో .. ఒక గ్లాసు నీటిలో తొమ్మిది బాదం పలుకులు కాగ పెడితే అవి కరిగి అందులో ఉండే నూనె పదార్థం నీళ్లలో కలిసి పాలుగా మారుతుంది. దీనిని బాదం పాలు అంటారు. ఇది చలువ చేస్తుంది.  హృదయాన్ని ఆహ్లాద పరుస్తుంది. బాగా నీరస పడ్డ వాళ్లకి వెంటనే శక్తి రావడానికి దీనిని ప్రతిపాదిస్తారు వైద్యులు. ఇది చిగుళ్ళ వ్యాధులలో హితకరం .బాదం పలుకులు ఒకటి రెండు నెయ్యిలో నూరి చిగుళ్లపై రాసుకుంటే చిగుళ్ల వాపు తగ్గి ప్రకాశవంతంగా తయారవుతాయి .బాదం పలుకులు కిడ్నీలో రాళ్ళను కరిగించడంలో చాలా ఉపయోగపడతాయి. గుండె మంట ను ఆర్పే మంచి సాధనం బాదంపాలు . బాదం పాలు దొరకకపోతే నాలుగైదు బాదం పలుకులు తింటే చాలు గుండె మంట, గుండె దడ తగ్గుతుంది. ఒక్కొక్క బాదం పలుకులో ప్రోటీన్ విలువలు చాలా ఉంటాయి. ఒక ఔన్స్ బాదం పొడి లో ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. చాలా చక్కగా జీర్ణం అవుతుంది.
 ఇందులో ఆహారానికి అవసరం అయ్యే పీచు పదార్థం కూడా ఉంటుంది. అది కూడా కరిగిపోయే గుణం కలిగిన పీచు పదార్థము.
 ఇది మన శరీరంలో అధిక కొవ్వు పదార్థాలను తగ్గించడంలో సహాయపడుతుంది. బాదంపప్పు కొలెస్ట్రాల్ లేని శక్తి సాధకాలు. అందువల్ల లావుగా ఉండే వాళ్లు కూడా మితంగా తినవచ్చు.
బాదం పప్పులు అత్యవసరమైన సూక్ష్మ పోషకత్వాలను కలిగి ఉంటాయి. బి 6 ,మెగ్నీషియం వంటివి దీని లో నిక్షిప్తమై ఉన్నాయి .విటమిన్ ఇ కూడా దీనిలో ఉంది. అందువల్ల గుండెను కాపాడుతుంది. ఈ మధ్య జరిగిన వివిధ పరిశోధనలలో క్రమం తప్పకుండా రెండు బాదం పలుకులు తింటే LDL కొలెస్ట్రాల్ తగ్గుతుందని తేలింది.

శక్తి ని పెంచుతుంది.. రోజు కనీసం రెండు బాదం పప్పులు తింటే షుగర్ వ్యాధిగ్రస్తులు జీవనస్థితి మారి ఉత్సాహంగా ఉంటారని పరిశోధనలలో తేలింది. బాదం క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది .దీనిలో ఉండే వ్యాధి నిరోధక శక్తి మనలో క్యాన్సర్ లక్షణాలను పెరగకుండా కాపాడుతుంది. 

బాదం లో ఉండే ముఖ్యమైన ప్రోటీన్ ను" ఆనందిన్"  అంటారు. ఇది శరీరంలో ఎలర్జీ ని కలుగ చేయదు,
 సరి కదా శక్తిని పెంచుతుంది . 

చక్కటి టానిక్..

ఒక కప్పు బాదం కాయలు, మూడు కప్పుల నీరు ,ఒక కప్పు తేనె కలిపి నూరి నీళ్లను వడ గట్టండి .అది చక్కటి టానిక్ లా పనిచేస్తుంది. 

బాదం లో కొవ్వు పదార్థం లేదు, క్యాలరీలు 59% , ప్రోటీన్ నాలుగు గ్రాములు ,క్యాల్షియం 46 గ్రాములు, మెగ్నీషియం 50 మిల్లీగ్రాములు, పొటాషియం 120 మిల్లీగ్రాములు ఉంటాయి .వేసవిలో ఎండలో మధ్యాహ్నం బాదం పాలు, సాయంత్రం బాదం పలుకులు తినడం హితకరం

ముఖ కాంతికి బాదం..

బాదం పప్పు పొడి 10 గ్రాములు , పన్నీర్ 40 గ్రాములు కలిపి మెత్తగా నూరి ముఖానికి లేపనం చేసుకుని ఆరిన తర్వాత కడుగుతూ ఉంటే ముఖంపై ఉండే మొటిమలు ,మచ్చలు హరించి పోయి చర్మం మృదువుగా మారుతుంది.

కంటి దృష్టిని పెంచేందుకు బాదం పప్పు..

బాదం పప్పు ఆకారం చూస్తే అచ్చం కన్ను లాగే ఉంటుంది. సృష్టి కర్త ప్రజల కంటిచూపు కోసం కంటి ఆకారంతో దీనిని సృష్టించాడు. బాదం పప్పు లు పావు కేజీ ఒక రాత్రి వేడి నీటిలో నానబెట్టి ఉదయం పై తోలు తీసి నలగ గొట్టి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. అలాగే సోంపు గింజలు పావు కేజీ తెచ్చి దోరగా వేయించి దంచి పొడి చేసుకోవాలి. అదే విధంగా పటిక బెల్లం పొడి పావు కేజీ తీసుకుని, ఈ మూడింటినీ కలిపి నిలువ చేసుకోవాలి. 

పిల్లలకు ఒక చెంచా మోతాదుగా, పెద్దలకు రెండు చెంచాల మోతాదుగా వేడి పాలలో కలిపి ఇస్తూ ఉంటే నేత్ర దృష్టి అనూహ్యంగా పెరుగుతుంది. ఆరు నెలలు వాడితే కళ్లద్దాలతో ఇక పని లేదని చెప్పవచ్చు.
అంతేగాక మెదడుకు అపారమైన శక్తిని ఇచ్చి , జ్ఞాపక శక్తిని రెట్టింపు చేస్తుంది. కృశించిన సర్వాంగాలను పుష్టికరంగా మారుస్తుంది.
దంత ఆరోగ్యానికి.. బాదం పళ్ళ పొడి..

బాదం కాయల పై పెచ్చులు ఎండించి కాల్చి బూడిద చేసి రోజూ పండ్లు తోముతుంటే కదిలే పండ్లు గట్టి పడతాయి. పండ్ల నుండి కారే చీము, నెత్తురు తగ్గి పోతుంది.. పళ్ళు ముత్యాల వలే మెరుస్తాయి.

చర్మ వ్యాధులు తగ్గడానికి..

బాదం పప్పు ను మంచి నీటిలో నానబెట్టి మెత్తగా నూరి పైన లేపనం చేస్తుంటే చర్మం పై పొడలు,మచ్చలు, దురదలు తగ్గి పోతాయి.

మల బద్ధకం తగ్గడానికి..

బాదం పప్పు, అంజీరుతో కలిపి తింటూ ఉంటే సుఖ విరేచనం జరిగి మలబద్ధకం తగ్గి పోతుంది.

అన్ని రకాల రక్త స్రావాలు తగ్గడానికి..

బాదం ఆకులను నీడలో ఎండించి దంచి పొడి చేసుకోవాలి ఈ పొడిని పావు టీ స్పూన్ మోతాదుగా మంచి నీటిలో కలుపుకొని రెండు పూటలా సేవిస్తుంటే ఏ భాగం నుండి రక్తం కారుతున్నా ఆగి పోతుంది.

నెత్తురు బంక విరేచనాలు తగ్గడానికి..

బాదం పప్పు ను నానబెట్టి పై తోలు తీసి మంచి నీటితో మెత్తగా నూరి వడ కట్టిన బాదం పాలను తగు మోతాదుగా రెండు పూటలా సేవిస్తుంటే జిగట విరేచనాలు, నెత్తుటి తో పడే బంక విరేచనాలు , కడుపు నొప్పి తగ్గి పోతాయి.

మూత్ర రోగాలకు.. బాదం పప్పు..

పైన తెలిపినట్లు బాదం పాలు తీసి రెండు లేక మూడు పూటలా అరకప్పు మోతాదుగా సేవిస్తుంటే సెగ రోగం తగ్గి పోయి మూత్ర కోశం లోనూ, మూత్ర నాళం లోనూ ఏర్పడిన పుండు మాడి పోతుంది. అలాగే, అతి మూత్రం కూడా తగ్గిపోతుంది. వీర్య వృద్ధి, రక్త వృద్ధి కూడా కలుగుతాయి.

కుక్క కాటు కు.. బాదం పప్పు..

కుక్క కరవగానే బాదం పప్పు ను మెత్తగా నూరి కాటు పైన వేసి కట్టు కట్టాలి. అలాగే బాదం పప్పు, అంజీరు పండు కలిపి లోపలికి తీసుకోవాలి. ఇలా చేస్తుంటే విషం విరిగి పోతుంది.

మంచి బాదం నూనెకు..పరీక్షలు..

వేడిగా ఉన్న రొట్టె పైన కొద్దిగా బాదం నూనె వేసి చిన్న ముక్క తింటే వెంటనే బాదం రుచి మనకు తెలియాలి. అలాగే కొద్దిగా బాదం నూనె ను అర చేతిలో వేసుకుని బాగా రుద్ది వాసన చూస్తే బాదం వాసన రావాలి. ఇదే పరీక్ష.
కేశ సౌందర్యానికి.. బాదం నూనె..

బాదం పప్పు నుండి తీసిన నూనెను కొద్ది కొద్దిగా వెంట్రుకలకు రాసుకుంటుంటే అది కుదుళ్లలోకి దిగి బల పరచి మెదడుకు చలువ చేసి వెంట్రుకలు రాలనివ్వదు. కళ్ళకు కూడా మేలు చేస్తుంది.

బాదం పొడితో.. బంగారు కాంతి..

బాదం పప్పు పొడి 200 గ్రాములు, మంజిష్ట పొడి 15 గ్రాములు, కస్తూరి పసుపు 15 గ్రాములు , జటా మాంసి 15 గ్రాములు కలిపి నిలువ చేసుకోవాలి. స్నానం చేసే గంట ముందు తగినంత పొడిని పాలలో గానీ, నీటిలో గానీ కలిపి మెత్తగా నూరి శరీరమంతా రుద్దుకొని ఒక గంట ఆగి తర్వాత స్నానం చేస్తుంటే క్రమంగా శరీరం పైన వచ్చే మచ్చలు, గుల్లలు, పుండ్లు,మొటిమలు, ముడతలు, గుంటలు, దుర్వాసన మొదలైన వన్నీ హరించిపోయి శరీరం కాంతి వంతంగా మారుతుంది.
వెంట్రుకలు.. పట్టులా మారాలంటే..

బాదం నూనె ఒక చెంచా, నిమ్మ నూనె పావు చెంచా నిమ్మ ఆకు రసం 4 చెంచాలు కలిపి వెంట్రుకలకు పూస్తూ ఉంటే వెంట్రుకలు పట్టు లాగా మృదువుగా మారతాయి.

వేడి దగ్గులకు.. బాదం పప్పు..

8 బాదం పప్పులు, పటిక బెల్లం 20 గ్రాములు, ఆవు వెన్న 20 గ్రాములు కలిపి తింటూ ఉంటే అతి వేడి వల్ల కలిగిన దగ్గులు తగ్గి పోతాయి.






మానవుల ప్రకృతి.. జీవనము.. ఆహారం..

మీ ప్రకృతి.. జీవనము..ఆహారము..

ప్రవృత్తి అంటే మీ పుట్టుకతో వచ్చే మీ సహజ ప్రవృత్తి.మనుషులంతా ఒకలా ఉండరు. కానీ జన్మతః వచ్చే లక్షణాలను బట్టి వాళ్ళ నడవడి,ఆహారం,జీవన విధానం, ఉద్రేకం, శాంతం,ఓర్పు,నేర్పు వంటివి ఏర్పడతాయి.వాటిని సహజ ప్రవృత్తులు అంటారు.
ఈ సహజ ప్రవృత్తి తల్లి గర్భంలో  ఉన్నప్పుడే తల్లి భావాల వల్ల జీన్స్, తండ్రి భావాల వల్ల, దైవ భావాల వల్ల జనిస్తాయి. ఈ లోకంలో ప్రతి వ్యక్తీ మరో వ్యక్తి మూల ప్రవృత్తితో ఒకేలా ఉండడు.
ఈ ప్రవృత్తులు వాత ప్రవృత్తి, పిత్త ప్రవృత్తి, కఫ ప్రవృత్తి. అవి వాటి సమ్మేళనంలో వివిధ రకాలుగా ఉంటాయి.అత్యున్నతమైన ఆయుష్షును ఆనందంగా ,ఆరోగ్యంగా ఉంచుకోమని చెప్పే ఆయుర్వేదం శాస్త్రం ఈ ప్రవృత్తికి అనుగుణంగా మన జీవన విధానం, ఆహారం మార్చుకుంటే  వ్యాధి బాధ లేని మనోజ్ఞమైన మానవ జీవితాన్ని గడపవచ్చు అని ప్రతిపాదిస్తుంది.
ఆహార, నిద్రా, బ్రహ్మ చర్యలను త్రయో ఉప స్తంభాలు అంటారు. మనిషి తన ప్రవృత్తిని అనుసరించి ఈ మూడింటిని క్రమ పరచుకుంటే దీర్ఘాయుష్షు సాధ్యమవుతుంది.

ప్రవృత్తి అంటే.. మనం అందరం గర్భావ క్రాంతి పేర ఒక విచిత్ర స్థితిలో జనింప చేసుకుని ఏదో సూక్ష్మ విలక్షణంతో జన్మిస్తాము. ఆ జన్మజ కారణమైన ప్రత్యేక ధాతు పరిణామాన్ని ప్రవృత్తి అంటాము. మరో రకంగా చెప్పుకోవాలంటే మనం జనించే క్షణంలో ఏర్పడే ప్రత్యేక తత్వాన్ని ప్రవృత్తి అంటాము. ప్రవృత్తి కి మరో అర్థం సహజమైనది. ఈ తత్వం శారీరకమే కాదు మానసిక ఆత్మజ లక్షణాలకు కూడా వర్తిస్తుంది. ఒకసారి తల్లి గర్భంలో ఏర్పడ్డ ఈ ప్రవృత్తి ఎప్పుడూ ఎటువంటి అవస్థలోనూ మారదు.
ఈ ధాతు పరిణామమే మనలో కోపాన్ని,ప్రశాంతతను ,ఆలోచనలను,ఆదర్శాలను,భయాన్ని, దుఃఖాన్ని, మమతలను,మహిమాంశలను కూడా నిర్ణయిస్తుంది, కాదు కలుగ చేస్తుంది. వాత, పిత్త, కఫ ప్రవృత్తులే కాక వీటిల్లో రెండు కలిసిన ప్రవృత్తులు . వాత పిత్త ప్రవృత్తి, పిత్త కఫ ప్రవృత్తి, వాత కఫ ప్రవృత్తి.. ఇలా రకరకాలుగా ఉండవచ్చు. దీన్ని బట్టే మనకి వ్యాధులు కూడా రావచ్చు.
ఒక్కొక్కళ్ళకి తరచూ జలుబు ,ఆయాసం, ముక్కు ముఖ శిరో వ్యాధులు వస్తుంటాయి. కారణం వారిది కఫ ప్రవృత్తి. కఫ శక్తి వల్ల మెడకి పైనున్న అవయవాలు ఏర్పడతాయి.మరొకరికి తరచూ అజీర్ణం ,కడుపుబ్బరం, లివర్ జబ్బులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వారిది పిత్త ప్రవృత్తి. జీర్ణ పక్వాశయాలు, లవర్, ప్లీహం వంటి వి పిత్త శక్తి వల్ల ఏర్పడతాయి.
వాత ప్రవృత్తి.. చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు , వాత శక్తికి కేంద్రం. ఆ వ్యాధులు తరచూ వస్తూ ఉంటే వారిది వాత ప్రవృత్తి. స్థూలంగా, సన్నగా ఉండి, తొందరగా కోపం వస్తూ చర్మం పొడిగా ఉండి, ధ్వనించే స్వరం తో , ఎక్కువగా మెలకువగా ఉంటూ కీళ్ళు, దవడలు కొంచెం జారి, తొందరగా నడుస్తూ, తొందరగా తింటూ, ఎప్పుడూ పెదిమలు, నాలుక, కాళ్లు కదిలిస్తూ ఎప్పుడూ ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు.
వీళ్ళు ఎక్కువగా కాఫీ, టీ లు తాగకుండా  ఉండటం మంచిది. వీళ్ళు రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలు, పటిక బెల్లం పొడి తో కలిపి తీసుకోవడం మంచిది. రోజూ ఒక క్రమ పద్ధతిలో ఆహారం తీసుకోవడం మంచిది. ఉపవాసాలు చేయ వద్దు.
ఆపిల్, అరటి పండ్లు, జీడి పప్పు,, ఎండు ద్రాక్ష తీసుకోవడం మంచిది. చిన్న చిన్న గా కొంచెం కొంచెం ఆహారం తీసుకోండి. ప్రతి వారం తలకు నువ్వుల నూనెతో మర్దన చేసుకొని తలంటు స్నానం చేయండి.

పిత్త ప్రవృత్తి..

వీళ్లు ఆహారంలో నెయ్యి తీసుకోవడం మంచిది. ఉదయం 11 గంటలకి ఒక చెంచా నెయ్యి తిని అర గ్లాసు వేడి పాలు తాగడం వీళ్ళకి చాలా హితకరం. తీయనైన, కొంచెం వగరు కలిగిన కూరలు తినడం మంచిది. ఆకలిని చంపుకోకుండా సమయానికి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. మినుములు, గోధుమలు, నెయ్యి, పాలు, కొబ్బరి, కాకరకాయ, చిక్కుళ్ళు ,క్యాబేజీ, గుమ్మడికాయ పిత్త ప్రవృత్తి కలవారికి చాలా మేలు చేస్తాయి. చన్నీటి స్నానం వీరికి చాలా హితకరం. ఈత కొట్టడం చాలా హితకరం.

కఫ ప్రవృత్తి..

కఫ ప్రవృత్తి కల వారు చాలా ఎత్తుగా మంచి అంగ సౌష్టవంతో నిండుగా ఉండే విగ్రహం తో ఉంటారు. వీళ్ళ మాటలలో మాధుర్యం ఆలోచనల్లో అవగాహన తత్వం , నడకలో నెమ్మదిగా ఉండటం తెలియని గాంభీర్యం ఉంటాయి. చక్కని అందం, ఆకర్షణ తో కూడిన దేహం వీళ్ళ సొంతం.
వీళ్లలో దట్టమైన జుట్టు , విశాలమైన నుదురు, మంచి ఆకలి, కాళ్ళు, చేతులలో స్థిరత్వం ఉంటాయి. వీళ్ళు తొందరగా లావు అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల రోజూ వ్యాయామం చేయాలి. వెల్లుల్లి, క్యాబేజీ, నువ్వుల నూనె, ములక్కాడ, క్యాలీఫ్లవర్ వంటి కాయ గూరలు తినడం మంచిది.వీరికి పెరుగు కన్నా మజ్జిగ హితకరం. పగటి నిద్ర వీరికి చెడు చేస్తుంది. చన్నీటి స్నానం చేయడం మంచిది. వీళ్ళు రోజుకు రెండు మూడు సార్లు స్నానం చేయడం మంచిది. ఎక్కువగా తిన కూడదు. వీళ్ళు ఓంకారాన్ని జపించడం వల్ల ఉన్నత స్థాయి కి చేరుకుంటారు.

DOCTOR CONSULTATION - SITUATIONS


OILS FOR BEAUTY



REFLEXOLOGY - AWARENESS


ORTHOPEDIC PROBLEMS IN CHILDREN - AWARENESS


RHEUMATOID ARTHRITIS ( KEELLA VAATHAM ) - AWARENESS


18, డిసెంబర్ 2012, మంగళవారం

కలబంద / ALOEVERA - ఆయుర్వేదం / AYURVEDAM


SURGERY TO SPINAL CHORD - YASHODA HOSPITAL


శిరో ధార .. మనశ్శాంతి కి చక్కటి చికిత్స

నేటి యాంత్రిక జీవనంలో అన్ని వయసుల వారు ఏదోరకంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి లోనవుతున్నారు. దానివల్ల జీవితం పై ఒక రకమైన నిర్లిప్తత, జీవనంలో ఒక రకమైన అశాంతి. ఇది ఎక్కువైనప్పుడు విపరీతమైన నిర్ణయాలు. వీటికి తోడు మద్యపానం లాంటి ఏవేవో దురలవాట్లు. ఈ మనసుకి నిద్ర మాత్రలో, మత్తుమందులో కాదు కావాల్సింది.. విశ్రాంతి , నవోన్మేషం కావాలి. అది మన ఆర్య సంస్కృతి చూపించింది. అదే శిరో ధార. మానసిక ప్రశాంతతకు అద్భుత చికిత్స. శిరో అంటే మనస్సుకి కేంద్రమైన తల లేదా మెదడు.' ధార ' అంటే ఆగని ప్రవాహం.
మందులతో కలిసి చేసే ఈ శిరోధారకు శారీరక, మానసిక ప్రశాంతిని,
 సమస్థితిని తీసుకురావడం ..తద్వారా మన ఉద్రేకాలను, నిస్పృహాలను నియంత్రించి ,సమాధాన పరచడం, దానివల్ల మన నిత్య జీవనానికి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడం దాని ప్రయోజనం.
ఒక క్రమ పద్ధతిలో, కొన్ని సహజ మూలికలతో చేసిన తైలాలు, నెయ్యి ,మజ్జిగ, పాలు వంటి వాటిని శిరస్సులో ఒక ప్రత్యేక బిందువు పై, సున్నితంగా జారే జలపాతం లాంటి ధారతో చేసే చికిత్స శిరోధార. అదీ ఒక ప్రత్యేక సమయంలో కొంత సేపు మాత్రమే.

చికిత్స విధానం ..

గోరువెచ్చని ఆ తైలం ధారగా పడుతున్నప్పుడు, ఆ ఎముకల లోని చిన్నచిన్న రంధ్రాల ద్వారా లోపలికి వెళ్లి మెదడును శాంత పరుస్తుంది. శిరోధార మన ఉద్రేకాలను, ఒత్తిడిలను తగ్గించి శాంతి ని, కొంత ప్రశాంతి ని ,మరికొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా ఎక్కువ సంపాదించాలని, ఇంకా ఎక్కువ ఆనందాన్ని, సుఖాన్ని పొందాలని ఆత్రుతతో యువత ,నడివయసు వాళ్ళు తొందరగా శారీరక సామర్థ్యాన్ని, మానసిక సంతోషాన్ని, సంతృప్తిని కోల్పోతున్నారు . పూర్వీకుల్లోని శుక్ర బీజ సామర్థ్యం నేటి తరంలో క్రమంగా తగ్గిపోతుందని సూచించబడింది. దానికి కారణం కూడా ఇదే. 
మన మనసు తనకి మించిన ఒత్తిడికి లోనైతే, అది నరాల బలహీనతకు దారి తీసి, శారీరకంగానూ ,మానసికంగానూ నిర్వీరుడు అవుతున్నాడు. దానివల్ల షుగర్ వ్యాధి , థైరాయిడ్, రక్తపోటు ,లావు ఎక్కడము ,నడుము నొప్పి, సంభోగించే సామర్థ్యం తగ్గడం, తొందరగా వాపు రావడం, ముఖ్యంగా స్త్రీలలో అసంతృప్తి తో కూడిన నిర్లిప్తత వంటివి వస్తున్నాయి. ఆధునిక శాస్త్ర ప్రకారం నిద్రమాత్రలు, మత్తునిచ్చే మందులు తప్ప మరో మార్గం లేదు. నాటి ఆయుర్వేదం శారీరక, మానసిక ,ఆత్మజ ఆహ్లాద స్థితికి మనిషిని తేవడానికి చక్కటి మార్గాలను ప్రతిపాదించింది.

సహజమైన మూలికలే కాదు మనం చూసే నువ్వుల నూనె లాంటి వాటిలో కూడా మనసు ను క్లేద పరిచే ఓషద గుణాలు ఉన్నాయి .మనుషుల జీవ గడియారాల కీలు తిప్పడమే కాదు,
 జీవాన్ని నిలిపే ఓషధ సంపదను కూడా ప్రకృతిలో నిక్షిప్తం చేశాడు ఆయన.

రాత్రి పరుండే ముందు పటిక బెల్లం కలిపిన పాలు తాగి, అరికాళ్ళకు నువ్వుల నూనెతో మర్దన చేసుకుని పడుకుంటే మనసు తేలికపడి చక్కగా నిద్ర పడుతుంది .తీవ్రమైన మానసిక ఒత్తిడికి ఆయుర్వేదం అందించిన మరో చక్కటి వైద్య ప్రక్రియ శిరో ధార.ఈ శిరోధార మనో ఒత్తిడి వల్ల వచ్చే వ్యాధులు అన్నింటికి చక్కటి చికిత్స.
అందుకే పక్ష వాతం,ఎప్పటికీ తగ్గని రక్తపోటు, ముఖ పక్ష వాతం, కంటి నొప్పి, చూపు తగ్గడం, నిద్ర లేకపోవడం, శిరో వాతం, తరచూ వచ్చే తలనొప్పి, వీటి అన్నింటికి శిరో ధార చికిత్స సూచించ బడింది. అలాగే అతి నీరసంగా ఉన్న వాళ్ళకి , బీపీ తక్కువ ఉన్నవారికి , గర్భిణీ కాలంలోనూ, మెడ వ్యాధులలోనూ ,తలలో గడ్డలు/ బ్రెయిన్ ట్యూమర్, తాగుడు అలవాటు బాగా ఎక్కువగా ఉన్నవారు ఈ శిరో ధార చేయించుకోకూడదు.
శిరో ధార చేయించుకోవడం మనో ఒత్తిడి ఉన్న సామాన్యులు నెలకు ఒక సారి , దాని వల్ల వచ్చే వ్యాధులున్నవారు మిగతా చికిత్సలతో పాటు 9,11,21 రోజులు శిరో ధార చేయించుకోవాలి అదీ శాస్త్ర బద్ధంగా.

శిరో ధార పూర్వ కర్మ.. అంటే వ్యక్తిని ఈ చికిత్స కోసం తయారు చేయడం. ప్రధాన కర్మ అంటే ఒక వేగంతో, ఒకే ధార తో తగిన మందులతో కలిపిన తైలమో , మజ్జిగో నియమితమైన నుదుటికి , శిరస్సుకి మధ్య బిందువులో చికిత్స చేయడం.
పాశ్చాత్ కర్మ అంటే శిరో ధార తర్వాత వ్యక్తి సామాన్య స్థితికి వచ్చేటట్లు చేయడం తో కలిపి మూడు భాగాలుగా ఉంటుంది. దీనికి పథ్యం, అపథ్యం కూడా ఉంటాయి. అంటే ఆ కాలంలో ఫాస్ట్ ఫుడ్ వంటివి తిన కూడదు. చల్లటి మంచులోనూ, ఎర్రటి ఎండ లోనూ తిరగ కూడదు. ఆ చికిత్స జరిగిన రోజులో సంభోగం చేయ కూడదు.ఇలాంటివి ఆచరించాలి.. మరి దీని ప్రయోజనాలు ఏమిటి అంటే..

క్రమ పద్ధతిలో చేసుకునే శిరో ధార వల్ల రక్త ప్రసరణ చక్కగా జరిగి మేధో శక్తి, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. జుట్టు ఊడటం తగ్గి చక్కగా పెరుగుతుంది. మంచి నిద్ర పట్టి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శిరో ధార మానసిక ఒత్తిడిని తగ్గించి ,మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది.

తలకి, కళ్ళకి,చెవులకి,ముక్కుకి, మెడకి సంబంధించిన అన్ని రుగ్మతలకు చక్కటి సమాధానం ఇస్తుంది ఈ శిరో ధార. చాలా కాలం నుంచి ఉన్న ఈ నిద్రలేమికి , వణుకుడు వ్యాధికి , ఫిట్స్ వచ్చే వాళ్లకు ఇది చక్కగా ఉపకరిస్తుంది. చక్కటి స్వరం, మంచి వాక్కు కావాలనుకునే వారికి చక్కగా ఉపకరిస్తుంది.

11, నవంబర్ 2012, ఆదివారం

COCONUT TODDY - AYURVEDAM


THRIMADHURA PRASADAM - AYURVEDAM



FOOD FOR MALE FERTILTY


AYURVEDM - LUMBAGO IN THE WOMEN


DIABETES - AYURVEDAM



TIPS TO FOLLOW DURING PREGNANCY



BITTER TASTE - AYURVEDAM


25, అక్టోబర్ 2012, గురువారం

AYURVEDAM - CHILDREN'S THROAT PAIN


AYURVEDAM - WHITE HAIR


AYURVEDAM - ULCER


MARSH MINT LEAVES ( PUDINA )- USES



AYURVEDAM - COCONUT USES


AYURVEDAM - BLOOD PRESSURE


Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...