25, అక్టోబర్ 2015, ఆదివారం

పాల విరుగుడు.. లాభ నష్టాలు..

పాలవిరుగుడు తినవచ్చా?

విరిగిన పాలు ఆరోగ్యానికి మంచివేనా? పాలవిరుగుడుతో చేసినస్వీట్లు తినవచ్చా?

 పాలువిరగడంఅంటేపాలలోపాలకుసంబంధించినపదార్థాలను,నీటినీ విడగొట్టటం అని అర్థం.పాలలో ఉండే ప్రొటీన్లు, కాల్షియం,ఫాస్పరస్, కొవ్వు ఇవి గట్టిపడి,ముద్దగా అయి, నీళ్లు వేరవుతాయి.పాలలో విషదోషాల వలనగానీ,
పాలకు వ్యతిరేకమైన ఉప్పు, కారం, పులుపు వంటివి తగలటం వలన గానీ, పాలుకుళ్లటం వలన గానీ విరిగితే అవి మంచివి కానట్టే లెక్క! పాలను ఫ్రిజులో భద్రపరచ
కుండానూ, కాయకుండానూ ఉంచేసినందు వలన విరిగే పాలు పులిసిపోయి విరిగినట్టు లెక్క. అవి చేదుగానూ, వాసనగానూ ఉన్నప్పుడు అవి నిస్సందేహంగా పారబో
యాల్సినవే! విరిగిన పాలంటే మన పెద్దలకు సదభిప్రాయం లేదు. పాల విరుగుడుతోవంటకాలు మనకు లేవు. రసగుల్లాలు, రసమలై లాంటి పాల విరుగుడు స్వీట్లను విదేశీపద్ధతిలో ఆమ్లాలను కలిపి విరగొట్టి తయారు చేస్తారు. పాలను పద్ధతి ప్రకారం విరగకొడితే, అందులో కొవ్వు ఎక్కువ, ప్రొటీన్ తక్కువగా ఉంటుంది. అదే, జున్నుపాలేకొవ్వు తక్కువ, ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ జున్నుని వైద్య పరిభాషలో 'కొలోసమ్' అంటారు. విరిగే పాలని 'సోర్ మిల్క్' అంటారు.

గస గసాలు.. లాభ నష్టాలు

గసగసాలు విషాలే..

మసాలా ద్రవ్యాల్లో గసగసాల వలన లాభనష్టాలు చెప్తారా?

మసాలాలకు అలవాటుపడిపోయి అవిలేకపోతేజీవించలేని పరిస్థితినిగసగసాలుతెస్తాయన్నమాట.ఎన్నిసుగుణాలున్నా మనల్ని బానిసగా మార్చేది విషపదార్ధమే. గసాలురుచిగా ఉంటాయి. చలవ చేస్తాయి.కానీ కఠినంగా అరుగుతాయి. విరేచనాన్ని బంధిస్తాయి. అందుకని నీళ్ళవిరేచనాలు అవుతున్నప్పుడు గసాలను నూరి రసం తాగిస్తారు. కానీ, రోజూతినేవాళ్ళలో మలబద్ధత కలిగిస్తాయి, కఫ రోగాలు, జలుబు, కళ్ళెపడటంలాంటివ్యాధుల్లో కఫాన్ని అదుపుచేస్తాయి. ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తాయి. సుఖ
నిద్ర పట్టిస్తాయి. ఎందుకంటే గసాలలో నల్లమందు ఉంటుంది కాబట్టి,గసాలనేవి పోస్తుకాయల లోపలి గింజలు. ఈ మొక్క కాండం,ఆకులు, కాయల్లోంచి పాలుస్రవిస్తాయి. ఆ పాలను ఆరపెడితే అదే నల్ల
మందు. గసాలలో కూడా కొద్దిశాతం నల్లమందు (ఓపియం) ఉంటుంది.మార్ఫిన్, హిరాయిన్ కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలను ఇందులోంచేతీస్తారు. గసాలను ఎవరుపడితే వాళ్ళు పండించటంపైకార్ణచందు నిషేధం పెట్టిన ప్రభుత్వం వాటి వాడకం మీద దృష్టి పెట్టలేకపోయింది. ప్రజలే చైతన్యవంతులు కావాలి.

అమీబియాసిస్.. ఆయుర్వేద పరిష్కారాలు..


అమీబియాసిస్ కు మందు..

అమీబియాసిస్ తగ్గదా? దానికి నివారణ లేదా? అంటే..

 అమీబియాసిస్ వ్యాధిని చిరంజీవిని చేస్తున్నది ఆ వ్యాధి
వచ్చినవారే! కొద్దికాలం పాటు పేగులు బలం పుంజుకునే వరకూశుద్ధ ఆహారం తీసుకోగలిగితే వ్యాధి తలెత్తకుండా చేయవచ్చు.కుడిచేతి గోళ్లు పెరిగి, వాటి లోపల నల్లని మట్టి పేరుకొని ఉన్న వ్యక్తితప్పనిసరిగా అమీబియాసిస్ రోగి అయి ఉంటాడు. రోడ్డు పక్కన అమ్మే పకోడీలు, బజ్జీలు, పునుగుల బళ్ల దగ్గర, చైనా నూడుల్స్ బళ్ల దగ్గర తారట్లాడే
వాళ్లలోనూ హాస్టళ్లలో, మెస్సుల్లో తింటూ చదువుకునే పిల్లల్లోనూ అమీబియాసిస్ బాధితులు చాలామంది ఉంటారు. నాణ్యమైన మంచినీటి సరఫరా లేని ఊర్లలోనూ, చెరువు నీళ్లు,కాలువనీళ్లనుతాగేఊళ్లలోనూఅమీబియాసిస్ పీడితులు ఎక్కువగా ఉంటారు. ఆహారం తయారీలో గానీ వడ్డన లో గానీ నిర్లక్ష్యం ఈ వ్యాధికి పెట్టుబడి పెట్తోంది. హోటళ్లకు, విందుభోజనాలకు వెళ్లినప్పుడు కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కోవడం అనేది అరుదుగా కనిపించే దృశ్యం అయిపోయింది. చేతుల్లో నీళ్లు పోసుకొని మంత్రజలం చిలకరించినట్టువిస్తట్లో చల్లి, విస్తరినీ చేతుల్నీ ఒకేసారి కడిగి అందులో అన్నం తినేవిచిత్రఅలవాటుఅమీబియాసిస్ ను చిరంజీవిని చేస్తోంది.భోజనం చేయగానే విరేచనా
నికి వెళ్లవలసి రావటం, జిగురు(బంక), రక్తంతో కూడిన విరేచనాలు, కడుపులో అసౌకర్యంగాఉండటం, నీరసం, అరుగుదల లేకపోవటం, గ్యాసు, పొట్ట ఉబ్బరం
లాంటి బాధలు తరచూ కలుగుతుంటే అమీబియాసిస్ హెచ్చరికలు ఇచ్చినట్టేననుకోవాలి. చల్లకవ్వంతో బాగా చిలికిన మజ్జిగ ఈ వ్యాధిలో అసలైన మందు. మజ్జిగలో ఉపయోగకారక సూక్ష్మజీవులుంటాయి. అవి కడుపులో అపకార కారక సూక్ష్మజీవులనుకట్టడి చేస్తాయి. అందుకని పులిసినవీ, ఫ్రీజులో ఉంచినవీ కాకుండా తియ్యని మజ్జిగని
తాగుతూ ఉంటే అమీబియాసిస్వ్యాధిఅదుపులోఉంటుంది. టిఫిన్లకు బదులుగాప్రొద్దున్న పూట తోడు అన్నం గానీ, పెరుగన్నం గానీ, మజ్జిగ అన్నం గానీ తినటంవలన అమీబియాసిస్ వ్యాధి అదుపు సులువవుతుంది. మజ్జిగ మీద తేరుకున్న నీటినిమంచినీళ్లకు బదులుగా తాగటం వలన శక్తివంతమైన మందులు వాడాల్సిన అగత్యం
తప్పుతుంది.

23, అక్టోబర్ 2015, శుక్రవారం

చర్మ వ్యాధులు.. రక్త శుద్ధి.. ఆయుర్వేదం

రక్తశుద్ధిలేక చర్మవ్యాధులొస్తున్న - సమస్య

  నా వయస్సు 48 సం.లు. నాకుతరచుగా శరీరం మీద దురదలు, పుండ్లు, గడ్డలు వస్తున్నయ్. చర్మం అక్కడక్కడ
నల్లబారుతుంది. డాక్టర్లకు చూపిస్తే రక్తశుద్ధి లేదనిమందులు వ్రాసిచ్చారు.అవివాడటంఇష్టంలేకమీసలహాకోసంవ్రాస్తున్నాను. దయతో మార్గం చెప్పండి.

 పరిశుభ్రంగా ఉన్న కుంకుడుకాయలు తీసుకొచ్చి పగలగొట్టి విత్తనాలు తీసివేయండి. పై బెరడును చిన్న ముక్కలుగా కత్తిరించిఎండబెట్టి దంచి జల్లించండి. ఆ పొడితో సమంగా సుగంధపాలవేళ్ళపొడి కలిపి ఆమొత్తం చూర్ణంలో కొద్దిగా తేనె వేసి నూరి బఠాణిగింజంత గోలీలు కట్టి విలవజేసు
కోండి. రోజూ ఉదయంపూట ఒక గోలీని సగం చిలికిన అరకప్పు పెరుగుతోను,రాత్రిఒక గోలీని మంచినీటితోను సేవిస్తుంటే క్రమంగా రక్తశుద్ధి జరిగి చర్మసమస్యలు తగ్గిపోతయ్. వంకాయ, గోంగూర,ఆవకాయ, మాంసం, చేపలు, గుడ్లు, శనగపిండివంటి పడని పదార్థాలు నిషేధించండి. శుభం.

యవ్వనంలో వచ్చిన ముసలితనపు సమస్య/యవ్వన వార్ధక్యం - ఆయుర్వేద పరిష్కారం .

యవ్వనంలో వచ్చిన ముసలితనపు సమస్యకు ఆయుర్వేద పరిష్కారం

ఉసిరిక పండు పై బెరడు రసం లేదా చూర్ణం - 10 గ్రాములు
దేశవాళీ ఆవు నెయ్యి - 10 గ్రాములు,
చక్కెర - 10 గ్రాములు,
తేనె - 20 గ్రాములు,

పై అన్నింటినీ తీసుకుని బాగా కలిపి ,ఉదయం పర గడుపున తిని అనుపానంగా 1 కప్పు గోరు వెచ్చని పాలలో 1 చెంచా పటిక బెల్లం పొడి కలిపి తాగుతూ ఉండాలి.

ఉదయం స్నానానికి గంట ముందు 6 గంటల వేళ శరీరానికి గోరు వెచ్చగా నువ్వుల నూనె మర్దన చేసి అర గంట పాటు సూర్య నమస్కారాలు,పావు గంట ప్రాణాయామం,పావు గంట ధ్యానం చేయాలి.


ఆకు కూరలు,పాత బియ్యం,కాయ గూరలు,ఇంట్లో వండిన తీపి పదార్థాలు తింటుండాలి.

మధ్య వయసులో వచ్చిన ముసలితనం పోయి తిరిగి యవ్వనం ప్రాప్తిస్తుంది.

18, అక్టోబర్ 2015, ఆదివారం

నరాల బలహీనత సమస్య - ఆయుర్వేద పరిష్కారం , ఆహార పరిష్కారం

1  .  శరీరంలో నరాలన్నీ చచ్చుబడినట్లుగా ఉండి,ఏ పని చేయాలన్నా ఉత్సాహం లేకుండా ఉండడం,వంటి బాధలు తొలగాలంటే 

అతిబల వేళ్ళు -250 గ్రాములు,
అశ్వగంధ దుంపలు - 250 గ్రాములు,
నేలతాడి దుంపలు - 250 గ్రాములు,
అతిమధురం వేళ్ళు - 250 గ్రాములు,

పై అన్నింటినీ ముక్కలుగా చేసి శుభ్రమైన మట్టిపాత్రలో అవి మునిగే వరకు దేశవాళీ ఆవుపాలు పోసి చిన్న మంటపైన పాలు ఇగిరే వరకు మరిగించి ఆ ముక్కలను ఎండలో ఆరబోసి రోజంతా ఎండించాలి.మరలా మరుసటి రోజు పాలు పోసి మరిగించి ఎండించాలి.ఈ విధంగా మూడు సార్లు కాని ,ఏడుసార్లుకాని చేసి చివరగా బాగా ఎండించి దంచి జల్లించి దానితో సమానంగా పటిక బెల్లం పొడిని కలిపి నిలువచేసుకోవాలి.

ఈ చూర్ణాన్ని రెండు పూటలా 10 గ్రాముల మొతాదుగా అరగ్లాసు గోరువెచ్చటి ఆవుపాలల్లో వేసి అందులో ఒక చెంచా ఆవు నెయ్యి,రెండు చెంచాల తేనె కలిపి రోజూ సేవిస్తుండాలి.

కసివింద / చెన్నంగి ఆకుల రసం తీసి దానికి సమంగా వెన్న కలిపి ఆ మిశ్రమాన్ని శరీరమంతా మర్దన చేసి గంటాగి స్నానం చేయాలి.కసివింద లభించకపోతే తెల్ల ఆవాల నూనె గోరువెచ్చగా చేసి మర్దన చేయాలి.

తాంబూలంలో 2 గ్రాముల జాపత్రి పెట్టి సేవిస్తుండాలి.

నరాల బలహీనత సమస్య పరిష్కారమౌతుంది.

2  .నరాల బలహీనత కు ఆహార పరిష్కారం.

వరి ప్రధాన ఆహరంగా తీసుకునే వాళ్లు చిట్టూ ,తవుడు కోల్పోతున్నారు .ఐతే దీనికి ప్రత్యామ్నాయం ఉంది.

.చిట్టూ ,తవుడు లేకపోవడం వలన మనం ప్రధానంగా బి1 విటమిన్ / థయమిన్ లోపానికి గురవుతున్నాము.దీని వలన నరాల బలహీనత / బెరి బెరి జబ్బు ఏర్పడుతుంది.కాయగూరలు,మాంసం బాగా తీసుకోగలిగితే వరి అన్నం మీద ఆధారపడకుండానే శరీరానికి కావాల్సిన థయమిన్ పొందవచ్చు.100 గ్రాముల దంపుడు బియ్యంలో  300 మి.గ్రా.థయమిన్ ఉంటుంది.కానీ 100 గ్రాముల గోధుమల్లో 500 మి.గ్రా. థయమిన్ ఉంటుంది.అంటే ఒక పూట వరి అన్నం ,ఒక పూట గోధుమతో రోటీ లాంటి ఏదైనా వంటకం తినటం మంచిదన్నమాట.ఎండిన బఠాణీ ( 800 ),బంగాళా దుంపలు ( 150 ) కూడా ఆ లోటుని భర్తీ చేస్తాయి.నువ్వులు,వేరు శనగ గుళ్ళు ,పొద్దు తిరుగుడు గింజలు,వీటిలోంచి నూనెను తీసేయగా మిగిలిన పిప్పిలో బివిటమిన్ఉంటుంది.దీనినితెలకపిండిఅంటారు.అప్పుడప్పుడుకూరగాచేసుకునితినవచ్చు.గోధుమ,రాగి,జొన్న,సజ్జలు,వీటిలోంచి చిట్టు,తవుడు తీయకుండానే పూర్తి ధాన్యాన్ని మరాడించి వాడుకుంటున్నము కదా .దంపుడు బియ్యానికన్నా అనేక విధాలుగా ఈ ధాన్యాల్లో విటమినులు ఎక్కువగా ఉంటున్నాయి.కాబట్టి థయమిన్ లోపం ఉన్నవాళ్లు దంపుడు బియ్యానికన్నా గోధుమ ,రాగి,జొన్న,సజ్జల మీద ఆధారపడటమే మంచిది.మొలకెత్తిన రాగులు,సజ్జలు,పెసలు,శనగలతో పిండి వంటలు చేసుకుంటే రెట్టింపు థయమిన్ దొరుకుతుంది.అతిగా వేడి మీద వండితే థయమిన్ ఆవిరైపోతుంది.అందుకని బి1 కావాలంటే తేలికగా ఉడికించి వండుకుంటేనే ఫలితం ఉంటుంది.టాబ్లెట్లు మింగటం కన్నా ఆహారం ద్వారా దీనిని పొందటమే మంచిది.

నిత్యం జలుబు పడిశం రొంప దగ్గు .. ద్రాక్ష గుటికలు

నిత్యం జలుబు, పడిశం, రొంప, దగ్గు సమస్యకు - ద్రాక్షగుటికలు

 నా వయస్సు 35 సం.లు, నాకు ఋతువుతో సంబంధం లేకుండాఎల్లప్పుడూ జలుబు పీడిస్తూనే వుంటుంది. దాంతోపాటు దగ్గుకూడా హింసిస్తుంది. ఎప్పుడూ సరిగా ఊపిరాడదు. ఈ సమస్యతో క్షణంక్షణం నరకయాతన పడుతున్నాను. దయతో మంచి మార్గం చెప్పండి.

 1) నీ సమస్యకు చక్కని ఆహారౌషధమార్గం నీ ఇంట్లోనే వుంది. విశ్వాసంతో ఆచరించి విజయం సాధించు, గింజలున్న ఎండుద్రాక్ష 30 గ్రా, దోరగా వేయించిన మిరియాలపొడి 30గ్రా, అతిమధురంపాడి30 గ్రా, పటికబెల్లంపాడి 30గ్రా, తీసుకొని అన్నింటినీ కలిపి మెత్తగా ముద్దలాగా అయ్యేటట్లు దంచి ఆ ముద్దను 10గ్రా,
తూకంగా గోలీలు చేసి నిలవజేసుకో. రోజూ సమస్య తీవ్రతను బట్టి రెండులేక మూడుసార్లు ఒకగోలీని బుగ్గన పెట్టుకొనినిదానంగా చప్పరించి తింటుంటే దగ్గు, రొంప తగ్గిపోతయ్. 2) ఆహారంలో పాలు, పెరుగు, మజ్జిగ, తెల్లబియ్యం, కొత్తబియ్యం, సారకాయ, బీరకాయ,
దోసకాయ, ఆకుకూరలు, ఇంకా చల్లబడిన అన్నంకూరలు, ఫ్రిజ్ లోని పదార్థాలు పూర్తిగానిషేధించు 3) రోజూ సాయంత్రం గోరువెచ్చని ఆవనూనె చెవుల్లో, ముక్కుల్లో మూడుమూడు చుక్కలు వేసుకొని, గొంతుకు
ముఖానికి మెడకు వీపుకు ఛాతీకి పాదాలకు మిగిలిన నూనెను మర్దనచేసి ఒకగంటాగి స్నానంచేస్తుండు. ఈ మార్గాలతోనీ సమస్య పూర్తిగా తగ్గుతుంది. శుభం.

ముఖం నల్లగా ఉన్న సమస్య ..క్షీరహరిద్ర లేపనం

ముఖం నల్లగా ఉన్న సమస్య ..

ఒక కప్పు ఆవుపాలు గానీ గేదె పాలు గానీ తీసుకుని వేడి చేసి దానికి కొద్దిగా నిమ్మరసం కలిపి విరగ్గొట్టి , వడపోసి e r విరుగుడు లో ఒక పావు చెంచా కస్తూరి పసుపు పొడి, పావు చెంచా బార్లీ గింజల పొడి ఒక పావు చెంచా గంధకచ్చూరాలు పొడి కలిపి మెత్తగా నూరి ముఖానికి లేపనం చేసుకోవాలి. అది ఆరడం మొదలుకాగానే గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి అవసరమైతే మోతాదు పెంచుకుని శరీరమంతా కూడా లేపనం చేసుకోవచ్చు దీనివల్ల నలుపుదనం విరిగిపోయి చర్మంరంగుమారుతుంది. మంచి రంగు వస్తుంది.

కడుపులో మంట,పుల్లని త్రేనుపులు,తలపోటు సమస్యలకు - హరీతకి లేహ్యం./ ఆయుర్వేద పరిష్కారం.

కడుపులో మంట,పుల్లని త్రేనుపులు,తలపోటు సమస్యలకు - హరీతకి లేహ్యం.

కరక్కాయ పోడి - 100 గ్రా.
ఎండు ద్రాక్ష పండ్లు - 100 గ్రా.
పటిక బెల్లం పొడి - 100 గ్రా.

పై అన్నింటిని కలిపి ముద్దలాగా దంచుకొని నిలువచేసుకోవాలి.రోజూ రెండు పూటలా 10 గ్రా. ముద్దను బుగ్గన పెట్టుకొని తింటుంటే ఆరోగ్యం కలుగుతుంది.

2. చల్ల బడ్డ అన్నం,కొత్త బియ్యపు అన్నం తినవద్దు.బియ్యాన్ని ఒక రాత్రి నానబెట్టి ,ఒక పగలు ఎండించి దోరగా వేయించి రవ్వ చేసుకొని ,తగినంత రవ్వ నీటిలో వేసి వండుతూ అందులో అల్లం 1 గ్రా.ముక్క,చిటికెడు మిరియాల పొడి ,చిటికెడు జిలకర పొడి,తగినంత సైంధవ లవణం,కొద్ది కొద్దిగా కొత్తి మీర,పుదీనా ,కరివేపాకులు వేసి వండుతూ అందులో వంటాముదం ,నెయ్యి లేదా వెన్నలతో తిరగమాత పెట్టి ఈ ఆహారాన్ని ఆకుకూరలతో కలిపి సేవిస్తుంటే ఆ ఆహారం సులభంగా జీర్ణమౌతుంది.పై సమస్యలన్నీ తగ్గిపోతాయి.

15, అక్టోబర్ 2015, గురువారం

తిమ్మిర్లు, సూరెడి కాయలు.. ఆయుర్వేద పరిష్కారాలు


భరించలేని తిమ్మిర్ల-సమస్య

 నా వయస్సు43 సం.లు. నేను కాళ్ళచేతుల తిమ్మిర్ల సమస్యతో బాధపడుతున్నారు.మాటిమాటికి వేళ్ళు కొంగరులు పోతున్నాయి. కష్టపడి పనిచేయలేను.చిన్నపని కూడా చేయలేక బాధపడుతున్నాను. దయచేసి సమస్య
తగే మంచి మార్గం చెప్పండి..

 మీ ఇంటిచుట్టూ, మీఊరిచుట్టూ మీ సమస్యకు లక్షలాది పరిష్కారాలు ఉన్నాయి. అవితెలుసుకోలేక ఇంతకాలంగా బాధపడుతున్నావు.

 1) వావిలి చెట్టుచిగుర్లు పది తీసుకొని నలగొట్టి ఒక గ్లాసు నీటిలో వేసి ఒకకప్పు కషాయం మిగిలేటట్లు మరగబెట్టి వడపోసి అది గోరువెచ్చగాఅయిన తరువాత ఒకచెంచా తేనె కలిపి పరగడపున తాగుతుండు. 2) ఇదే వావిలాకులు వేసి కాచిన నీటితో రెండుపూటలాస్నానం చేస్తుండండి. 3) సాంరి 50 గ్రా, వేయించి దంచి పొడిచేయి. ఆ పొడిలో 100 గ్రా, బెల్లం కలిపి మెత్తగారంచి నిలువచేసుకో. రోజూ రెండుపూటలా భోజనం కాగానే 10 గ్రా, ముద్ద దవడన పెట్టుకొని చప్పరించి రసం మింగుతూ ఉండు.క్రమంగా నీ వాత సమస్యలన్నీ మాయమైపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది. శుభం.

తలలో పులిపిర్లు వచ్చిన సమస్య..

 అబ్బాయి వయస్సు 11 సం.లు. వాడికి తలలో పులిపిర్లు వస్తున్నాయి.
కొన్ని మందులు వాడినా ఊడిపోయి మళ్ళీ వస్తున్నాయి. దయచేసి ఈ సమస్య తగ్గే మంచి మార్గం చెప్పండి.

 మీ అబ్బాయికి వచ్చినవి పులిపిర్లు కాదు. వాటిని సురెడికాయలు అంటారు. రోజూ వాటిమీద మంచి ప్రశస్తమైన వేపనూనె రాస్తుండు. అలాగే మంచి పసుపు 50 గ్రా, బెల్లం 100 గ్రా, కలిపి దంచి రెండుపూటలా ,మోతాదుగా తినిపించి ఒక గ్లాసు మజ్జిగ తాగించు. ఆ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.

ధనియాల కషాయం మూడుపూటలా
పుక్కిలిస్తుంటే నోటిపుండ్లు మాయమౌతాయి.

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...