Thursday 21 November 2013

AVOID SPECTACLES WITH AYURVEDAM ఆయుర్వేదం సహాయంతో కళ్ళజోడు మానేయండి

కళ్ళజోడు పెట్టుకోకుండా ఉండడానికి ఆయుర్వేదంలో ఔషధం

కళ్ళజోడుకు గుడ్ బై చెప్పండి. ఆయుర్వేదం సహాయంతో.. కళ్ళజోడు అవసరం లేకుండా చేసిన ఆయుర్వేదం..

 సైట్ఒకసారి మనకొస్తే ఇక జీవితాంతం మసకబారిన బతికే.. లైఫ్ లాంగ్ కళ్ళజోడు మీద ఆధారపడాల్సిందే. లేదా కాంటాక్ట్ లెన్స్, సైన్స్ ఏదైనా లెన్స్ లు తప్పవు. కానీ ఇక్కడో చిట్కా ఉంది సైలెన్స్గా సైట్ను పోగొట్టి కంటి చూపుతోనే మసకను చంపేస్తుంది మన ఆయుర్వేదం.

వాడాల్సిన ఔషధ మూలికలు

 జీవంతి మనుబాల 100 గ్రాములు ..కంటిలో శుక్లాలు పోతాయి 
త్రిఫల చూర్ణం 300 గ్రాములు
 లొద్దుగా  చెక్క చూర్ణం 50 గ్రాములు 
పిప్పళ్ళు చూర్ణం 50 గ్రాములు నిమ్మరసంలో నానబెట్టి ఎండించినవి 
మిరియాల చూర్ణం 25 గ్రాములు మజ్జిగలో నానబెట్టి ఎండించిన తర్వాత
 యాలకుల చూర్ణం 25 గ్రాములు
 సైంధవ లవణం 25 గ్రాములు.. బియ్యం గంజిలో రుద్ది ఆరబెట్టి ఎండించిన చూర్ణం
 ఎండు ద్రాక్ష 100 గ్రాములు 
దేశీయ ఆవు నెయ్యి.. ఎనిమిది వందల మిల్లీగ్రాములు సొంటి చూర్ణం 50 గ్రాములు
 అతిమధురం చూర్ణం 50 గ్రాములు 

తయారు చేసే విధానం 

నెయ్యిని వేడి చేసి ఇవన్నీ కలిపితే హల్వా లాగా తయారవుతుంది. దీనిని ఆహారానికి అరగంట లేక గంట ముందు ఒక చప్పరించి తినాలి. ఇలా రోజు రెండు పూటలా ఉదయం సాయంత్రం భోజనానికి రెండు గంటల ముందు తినాలి. టీ, కాఫీ ,మద్యం, మాంసాలు, శనగపిండి వస్తువులు, పెరుగు సేవించరాదు. పెరుగుకు బదులు మజ్జిగ సేవించాలి .

నా పేరు కొంకిమళ్ళ నారాయణ 19 జనవరి 2011 ఈటీవీ జీవనజ్యోతి కార్యక్రమంలో ఎన్ సుబ్రహ్మణ్యం గారు చెప్పిన కళ్ళజోడు పెట్టుకోకుండా ఉండడానికి ఆయుర్వేదంలో ఔషధం. అనే శీర్షికలో చెప్పినట్లు నేను స్వయంగా తయారు చేసుకుని ఆరు నెలలు వాడి అమోఘమైన కంటి చూపును పొందాను .ఇప్పుడు దినపత్రికలో అక్షరాల కన్నా చిన్న అక్షరాలు కూడా కళ్ళజోడు లేకుండా చదువుతున్నాను. ఇది నా అనుభవం.



RUSHI SOOKTHAM - AYURVEDAM