23, డిసెంబర్ 2015, బుధవారం

గోరు వెచ్చని నీరు.. ఆరోగ్య ప్రయోజనాలు


గోరువెచ్చని నీళ్లుతాగితే మేలే!


రోజులోఎన్నిగ్లాసుల నీళ్లుతాగితే అంతమంచిది.అయితే ఓ
గ్లాసువేణ్నీళ్లుకూడాప్రతిరోజూతీసుకుంటేమరింతమంచిదంటున్నారు వైద్య నిపుణులు. రోజూ ఇలా చేయడం
వల్ల ఆరోగ్యానికెంతో మేలు జరుగుతుంది.ఉదయం లేవగానే చాలామంది గోరువెచ్చనినీళ్లు తాగుతారు. నిజానికి భోంచేశాక తాగడంవల్లజీర్ణవ్యవస్థశుభ్రపడుతుంది. అరుగుదలలోఇబ్బందులుండవు. శరీరంలో రక్తప్రసరణ బాగుంటుంది. మలబద్దకం సమస్య దూరమవుతుంది.
చిన్నారులకు కూడా వేణ్నీళ్లు తాగే అలవాటుచేయడం మంచిది. చురుగ్గా ఉంటారు.ఆ శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయినప్పుడురకరకాల సమస్యలు బాధిస్తాయి. గోరువెచ్చనినీళ్లు తాగడంతో ఈ వ్యర్థాలను దూరం చేసుకో
వచ్చు. చర్మ సంబంధితసమస్యలు తగ్గుముఖం పడతాయి. రోజూ మనం తీసుకునే ఈగ్లాసు వేణ్నీళ్లలో నాలుగైదు చుక్కల నిమ్మరసంకలపడం వల్ల చర్మానికి కొత్త కళ వస్తుంది.శ్వాస, గొంతు సంబంధిత సమస్యలు బాధ
పెడుతున్నప్పుడు వేణ్నీళ్లు తాగాలి. దానితో హాని
చేసే ఇన్ ఫెక్షన్లు నశిస్తాయి. తెమడ కూడాత్వరగా బయటికొచ్చి ఉపశమనం లభిస్తుంది.నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుం నొప్పిబాధిస్తున్నప్పుడు గోరువెచ్చని నీళ్లు తాగితేసమస్య తగ్గుముఖం పడుతుంది. ఉదయం పూటతాగడం వల్ల జీవక్రియల రేటు వృద్ధి చెందుతుంది. రాత్రి పడుకునే ముందు తాగితే హాయిగానిద్రపడుతుంది.

22, డిసెంబర్ 2015, మంగళవారం

టమోటా వంట.. ఆయుర్వేదం


 టమాటాలను వండ కూడదంటారు. నిజమేనా?

టమాటాల్నే కాదు, సి.విటమిన్ పుష్కలంగా ఉన్న ఏ ఆహార ద్రవ్యాన్ని అధిక ఉష్ణోగ్రత దగ్గర వండకూడదు. 50నుండి 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ల మధ్య వండితే వాటిలో ఉండే సి
విటమిన్ మనకు దక్కుతుంది.ఎక్కువ ఎండలో ఎక్కువసేపుఎండ పెట్టినా సి విటమిన్ మనకుదక్కకుండా పోతుంది. అలాగనిగడ్డకట్టేంత చల్లదనంలో అంటే
డీప్ ఫ్రిజ్ లో పెట్టినా కూడావిటమిన్ దక్కదని పరిశోధకులు చెప్తున్నారు.చారు, పప్పు, కూరలాంటివి వండుకునేప్పుడు టమాటా ముక్కల్ని కుక్కరులోఉంచి ఉడికించటం వలన అందులోని విటమిన్ ఎగిరిపోతుంది. సి విటమిన్లకపోతే
టమోటాలో రుచి కూడా చచ్చిపోతుంది. చారు గానీ, పప్పు గానీ కూరగానీ వండుకోవటమేఅయ్యాకచివరికిదింపేప్పుడు టమాటాకలిపికొద్దిసేపుఉంచిదింపేస్తేటమాటాతిన్నందువలన అసలు ప్రయోజనాలు దక్కుతాయి. అసలైన రుచి కూడా
దక్కుతుంది.టమాటాని ఎక్కువ నీళ్లలో ఉడికించకండి. సన్న సెగన నిదానంగావండండి. ఓవెన్లో అధిక ఉష్ణోగ్రత దగ్గర టమోటాను వండకండి. వండినపదార్థాన్ని తిరిగి వేడి చేయటం (రీ హీటింగ్ గానీ తిరిగి వండటం (ఈ
కుకింగ్ గానీ చేయకండి. టమాటాలను ఎక్కువగా కొని ఫ్రిజ్రుల్లోపెట్టుకోవడం మంచిదికాదు.తాజాగాకొనుక్కోవటమే మంచిది. సి విటమిన్ ను మనం ఎంత దక్కించుకోగలమనే దాని మీద దృష్టి పెట్టిటమాటాలను వండుకోవాలి.

శీతాకాలంలో / చలికాలంలో ఏం తినాలి?


శీతాకాలంలోవాతవ్యాధులుతిరగబెడుతుంటాయి.మిరియాలు,వాము,జీలకర్ర ,దాల్చిన చెక్క లాంటిసుగంధద్రవ్యాలను ఎక్కువగా వాడుకోవడం మంచిది.వీటిలో ఏదైనా ఒక పొడిని ఒక గ్లాసు నీళ్లలో అర స్పూన్ మోతాదులో కలిపి మరిగించి చల్లార్చి వడగట్టి ఆ నీటిని  తాగితే జీర్ణశక్తి పదిలంగా ఉంటుంది.జలుబు , ఉబ్బసం లాంటి ఎలర్జీ వ్యాధులున్నవారికి, కీళ్ళవాతం ఉన్నవారికి ఈ వాంవాటర్ , జీరా వాటర్ , ధనియా వాటర్ లేదా దాల్చిన వాటర్ చాలా మేలు చేసేవిగా ఉంటాయి. ఏ - విటమిన్ కలిగిన ఆహార పదార్థాలు , చలికాలంలో వచ్చే జబ్బులు , నొప్పులను నివారిస్తాయి.ఎక్కువ చలిని ఓర్చుకోవటానికి ఏ - విటమిన్ శరీరానికి బాగా తోడ్పడుతుంది.

ములక్కాడలు , మునగాకు , మామిడి , బొప్పాయి ,ఎర్ర గుమ్మడి పండు ,చిలగడ దుంపలు , కంద,పెండలం , క్యారెట్లు ,ఆకు కూరలు, కోడి గుడ్లు ,బఠానీలు చలి కాలంలో తినదగినవిగా ఉంటాయి.పిల్లలకు మిరియాలు , బెల్లం కలిపిన పాలు తాగిస్తూ ఉండాలి.

అల్లం , ఉప్పు కలిపి నూరిన ముద్దను అన్నంలో మొదటి ముద్దగా తింటే కడుపులో జఠర అగ్ని బలంగా ఉంటుంది.వాతం పెరగకుండా కాపాడుతుంది.ఈ కాలంలో పిల్లలకు అల్లం కానీ, వాము కానీ కలిపి శనగ పిండితో వంటకాలు చేసి పెట్టవచ్చు.సంక్రాంతి వంటకాలలో వాతం చేసే అరిసెల పక్కన నువ్వు పొడి వేసిన కజ్జి కాయల్లాంటి వేడి చేసే వంటకాలను ,చిలకల్లాంటి చలవ చేసే వాటినీ చేర్చేది సమతుల్యత కోసమే.


తవుడు తో స్వీట్.. ఆయుర్వేదం



12 కీళ్లవాతం వ్యాధులు రావడానికి బియ్యంలో చిట్టు తవుడు తీసేయటమే కారణంఅంటున్నారు కదా! చిట్టు, తవుడులతో ఏదైనా వంటకం చేసుకోవచ్చా?

 చేసుకోవచ్చు. అలాంటి ఆలోచన చేయటం తప్పేమీ కాదు. ఇంకొంచెం లోతుగాఆలోచిస్తే గోధుమలు, జొన్నలు, సజ్జలు, ఆరికల్లాంటిప్రత్యామ్నాయధాన్యాల్లోచిట్టు,తవుడుతీసేయకుండాపూర్తిధాన్యాన్నిపిండిలేదారవ్వగాతయారుచేసుకుంటున్నాం. కాబట్టి,రోజువారీ అవసరానికిసరిపడగా ఈప్రత్యా
మ్నాయధాన్యాలనుకూడాతింటూఉంటే,తవుడునికోల్పోయినలోపాన్ని సరిచేసుకోవచ్చు. ఎల్లకాలం ఒకే ధాన్యం మీద ఆధారపడి పోవటం కూడామంచిది కాదు. అన్నంలో రాగి పిండి కలిపి చేసే సంకటిలాంటి ప్రత్యామ్నాయ వంట
కాలను తినటం కూడా అలవాటు చేసుకోవాలి. మొదట మనం తినటం మొదలెడితే,మనల్ని చూసి ఇతరులు కూడా తింటారు. ఇతరులు తినటం చూసి మనంఅనుసరిం
చటంలో గొప్పేమీ ఉండదు.అయినా, చిట్టు, తవుడుతో ఏదైనా వంటకం గురించి అడిగారు. బాగుచేసిన తవు
డుని నేతితో కమ్మగా వేయించి బెల్లం, నెయ్యి, జీడిపప్పు, యాలకులు వగైరా వేసి సున్నిఉండలు కట్టుకోవచ్చు. కావాలంటే కొద్దిగా మినప్పిండి కలుపుకోవచ్చు కూడా!
ఆహారం విషయంలో ఆరోగ్యం కోసం కొత్తగాఆలోచించాలనే మీ తపనకుఅభినందనలు.

18, డిసెంబర్ 2015, శుక్రవారం

అలర్జీకి ఆహార వైద్యం..

దగ్గు జలుబు తుమ్ములు ఆయానంతో బాధవడుతున్హాము. ఎలెర్టీ అన్హారు. నివారణగా ఉండే ఒకటి రెండు ఆహారాలు చెవృండీ. 

 ఎలెర్జీ వ్యాధులతో బాధపడేవారు ఆగాకరకాయలను తరచూ వండుకుని తింటూ ఉంటే శరీరంలో విషదోషాలు పోయి ఎలెర్జీ తీవ్రత తగ్గుతుంది. 

రోజూ ప్రొద్దునే ఒక చెంచా మెంతులు నోట్లో వేసుకుని నీళ్లతో మింగేస్తే కఫం అడ్డుపడటం ఆగి ఉబ్బసం ఉపశమిస్తుంది. పది తులసాకులు రెండు లేక మూడు మిరి యపు గింజలు కలిపి నమిలినాలేదాదంచిఉండలుకట్టుకొని మింగినా ఎలెర్జీలో ఉవ శమనం ఉంటుంది. తులసాకులు, పూలు, వెన్ను గింజలు కూడా దగ్గునీ అయాసాన్నీ తగ్గిస్తాయి. వీటితో టీ కాచుకుని తాగవచ్చు. వసకొమ్మును దంచిన పొడి, మిరియాల పొడి, తులసాకులు పొడి, టీ పొడి నాలుగూ నమభాగాలుగా తీనుకుని టీ కాచుకుని తాగితే దగ్గు, జలుబు తుమ్ములు ఉబ్బసాల మీద బాగా పనిచేస్తుంది . 

అజీర్తి రాకుండా ఆహారం..

అజీర్తి రాకుండా చేసే మంచి ఆహారం చెప్పండి!

 ఇంగువ, సైంధవలవణం, ధనియాలు, బిరియానీ ఆకు,
శొంఠి, పిప్పళ్ళు మిరియాలు..వీటన్నింటినీ సమంగా తీసుకుని మెత్తగా దంచి ఒక చెంచా పొడి తీసుకోండి. చిన్న గ్లాసుడు బియ్యం,అందులోసగం చాయ పెసరపప్పు తీసుకుని జావలాగా ఉడికించండి.ఉడికిన తరువాత, ఈ చెంచాడు పొడిని కలిపి మరికాసేపు ఉడికించి,,దింపండి. దీన్నే అష్టగుణ మండం అంటారు. ఇది అజీర్తి రాకుండా చేసేగొప్ప ఔషధం. రోజూ తీసుకోవచ్చు. భోజనానికి ముందు తాగితేభుక్తాయాసంరాకుండాఉంటుంది.కొత్తిమీరని మిక్సీపట్టి ఓ గ్లాసురసంలో తగినంత ఉప్పు, మిరియాల
పొడి కలిపి, రోజు ప్రొద్దునపూటతాగుతూఉంటేఅజీర్తిరాదు.
ఎసిడిటీ తగ్గుతుంది. గ్యాసు రాదు. ప్రతిరోజూ అల్లం, తగినంతఉప్పుకలిపి దంచి, అన్నంలో మొదటి ముద్దగా కలిపి, నెయ్యివేసుకుని తింటే భోజనంలో ఉండే దోషాలన్నీ పోతాయి. అన్నం తినాలనే కోరిక కలుగుతుంది.అజీర్తి రాకుండా ఉంటుంది.బిర్యాని ఆకుఅజీర్తి ని ,. బియ్యంలో దోషాలు పోగొడుతుంది

కొత్తబియ్యం, దొడ్డు బియ్యంలాంటివి సరిపడని వారికి బిరియానీ ఆకు వేసి అన్నం వండితే ఎలాంటీ ఇబ్బందీ కల 
గకుండా ఉంటుంది. అవకాశంఉన్నవంటకాలలోఆవపిండిని చిటికెడంత కలిపి వండుకుంటూ ఉంటే అజీర్తి కలగకుండా ఉంటుంది. పెరుగన్నంలో దానిమ్మ గింజలు కలుపుకుని తింటే పైత్యం తగ్గి అరుచిపోతుంది. అజీర్తి కలగకుండా ఉంటుంది. 

అమీబియాసిస్ లో పెరుగన్నం

అమీబియాసిస్‌లో పెరుగన్నం ..

‌ అమీబియాసిస్ చాలా యేళ్ళుగా బాధిస్తోంది. ఏవి తిన్నా పడటం లేదు ఆహారపు జాగ్రత్తలు సూచించగలరు. 

* అమీబియాసిస్ వ్యాధి ఉన్నవారు మంచినీళ్ళను బాగా పొంగులొచ్చి మరిగేటంత వరకూ కాచి చల్లార్చి తాగటం శ్రేయస్కరం. ఈ నీళ్ళలో వాముపొడిగానీ,దాళ్చినచెక్కపొడి గానీ ,ధనియాలపొడిగానీ, లేదా జీలకర్ర పొడిగానీ ఏదో ఒకటి తగినంత కలిపి  మరిగేలా కాచి చల్తార్చి తాగితే పొట్టని సౌమ్యపరుస్తుంది. అమీబియాసిస్ వలన కన్నా ఇలా కాచిన నీళ్ళు తాగటం ఉత్తమం


లేత 'కూర అరటికాయ' గుజ్జుతోపెరుగుపచ్చడి చేసుకుని రెండు పూటలాతింటే వ్యాధి ఉపశమిస్తుంది. మారేడు
కాయ లోపలి గుజ్జునీ, వెలగపండులోపలి గుజ్జుని కూడా ఇలా పెరుగు పచ్చడి చేసుకొని తరచూ తినటం మంచిది. రక్తంపాకంపట్టి తీసుకున్నా మంచిదే!

కప్పు పెరుగులో దోరగా వేయించిన మెంతులు ఒక చెంచాడు కలిపి గంటసేపు నాననిచ్చి తగినంత ఉప్పు,  పంచదార చేర్చి నమలకుండా మింగితే విరేచనాలు తగ్గుతాయి. రోజుకు రెండు,మూడుసార్లుగా తీసుకోవచ్చు. కడుపులోమంట, ఎసిడిటీ కడువులోనొప్పి బాధలున్నవారు ప్రతిరోజూ రాగులు (చోళ్ళూ, తవిదెలు) మరపట్టించుకున్న పిండిని చిక్కగా జావకాచుకుని రోజూ పెరుగుతోతీసుకుంటే అమీబియాసిస్ త్వరగా ఉపశమిస్తుంది. కరివేపాకు పళ్ళ గుజ్ఞును తీపి కలిపి తింటే అమీబియాసిస్, పేగులో అల్పర్లు తగ్గుతాయి. కడువులో మంట , ఎసిడిటీ, జిగట విరేచ నాలు ఉన్నప్పుడు బుడందోసకాయ (బుడం కాయ) ముక్కల్ని దొండకాయలాగానే తరిగి కొద్దిగా నెయ్యి వేసి వేయించిన కూర తింటే ఇవన్నీ నెమ్మదిస్తాయి. కంపల మీద పెరుగుతూ ఉండే తీగ ఇది. లేతకాయ చేదుగా ఉంటుంది. ముదురుకాయ పుల్లపుల్లగా ఉంటుంది.రెండూతినదగినవే! రాత్రి వండిన అన్నం ఒక చిన్న గిన్నెలోకి తీనుకుని, అది మునిగే వరకూ పాలు పోని మజ్జిగ చుక్కలు వేస్తే ఉదయాన్నే అ అన్నం కూడా పెరుగులా తోడుకుంటుంది. ఈ తోడన్నంలో కొద్దిగా ధనియాలు, జీలకర్ర, శొంటి పొడి కలిపి నంజుకుంటూ తింటే అమీబియాసిస్ అదుపులోకి వస్తుంది. ఉదయం 7 గంటల లోపుగానే తినేయండి. ఇలా కుదరకపోతే రాత్రి వండిన అన్నంలో మజ్జిగపోసి తెల్లవార్లూ నాన నిచ్చి ఉదయాన్నే తినవచ్చు. అమీబియాసిస్ వ్యాధిని అహారపు జాగ్రత్తలు పాటించకుండా కేవలం మందులతో తగ్గించుకోవచ్చుననుకుంటే అదీ దీర్హవ్యాధిగా మారే అవిషయం కాశం ఉంది. 

స్ట్రోక్ తప్పించే ఆరోగ్యకర జీవన శైలి.



పక్షవాతంమూడోఅతిపెద్దసమస్య, క్యాన్సర్,గుండెపోటు తర్వాత.

జీవితాన్ని ఒత్తిడిలోకి నెట్టుకోవద్దు.పక్షవాతం రాకుండా
ముందు జాగ్రత్త అవసరం.
 
ఆరోగ్యంగా జీవించడం అదృష్టమని ప్రముఖ చలన
చిత్ర నటుడు నందమూరి తారక రామారావు(జూని
యర్ ఎన్టీఆర్) అన్నారు. పనుల్లో పడి జీవితాన్ని ఒత్తి
డిమయం చేసుకోకుండా సంతోషంగా గడపాలన్నారు.
సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో అక్యూట్ స్ట్రోక్ సెంటర్ 
నుఆసుపత్రిఎండీడా.బి.భాస్కరరావుతోకలిసిప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తనకు ప్రమాదం జరిగిన సందర్భంలో కిమ్స్ వైద్యుల అమూల్య చికిత్సతో కోలుకున్నానని గుర్తుచేశారు. అందుకే కిమ్స్ కుటుంబసభ్యుడిగాఈకార్యక్రమంలోపాలుపంచుకుంటున్నానని చెప్పారు. ప్రతికుటుంబంలో ఒక వైద్యుడు ఉండటం ఎంతో మేలన్నారు. వైద్యులు చెబుతున్న ప్రకారం ప్రస్తుతం 
పక్ష వాతం కేసులు పెరుగుతున్నాయని, ఈ సమస్య
రాకుండా ఆరోగ్యపరంగా అంతా ముందే జాగ్రత్తలు
తీసుకోవాలని ఎన్టీఆర్ సూచించారు. అత్యవసర సమ
యాల్లో ప్రతి ఒక్కరూ విధిగా అంబులెన్సులకు దారివ
దలాలని ఆయన పిలుపునిచ్చారు.జీవనశైలి మార్పుతో పక్షవాతం ముప్పు.ప్రస్తుతం మారుతున్న జీవనశైలితో
 పక్షవాతం(స్ట్రోక్) ముప్పు పొంచివుందని నిపుణులు పేర్కొ
న్నారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు  ప్రత్యేకంగా మాట్లాడారు. అసహజ ఆహారాన్ని విచ్చలవిడిగా తీసుకోవటం, వ్యాయామం లేకపోవడం వల్లఊబకాయ సమస్య తలెత్తుతోందన్నారు. ఫలితంగాఅధిక రక్తపోటు, మధుమేహం, కొలస్ట్రాల్ పెరిగి పక్షవాతానికి దారితీస్తోందని వారు చెప్పారు. హైదరాబాద్ లో 20 శాతం మందిలో మధుమేహం, మరో 25-30శాతం మందిలో అధిక రక్తపోటు సమస్య ఉందంటూఆందోళన వెలిబుచ్చారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం తప్పదనిహెచ్చరించారు. ఇంకా వారుఏమన్నారంటే. (స్ట్రోక్) కారణంగాఎక్కువ మంది కన్నుమూస్తున్నారు. వైకల్యానికి ఇది కారణం.
పక్షవాతం వస్తే కాళ్లు చేతులు పనిచేయకపోవడం, మాట పడిపోవడం, చూపు మందగించడంలాంటి సమస్యలు ఎదురవుతాయి. జీవితం దుర్భరమవుతుంది. అందుకే జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకొంటూ అధిక రక్తపోటు, మధుమేహాన్ని అదుపులోఉంచుకోవాలి.
- డా.మోహన్ దాస్, న్యూరాలజీ విభాగాధిపతి, కిమ్స్.

3 గంటలలోపు ఆసుపత్రికి తరలించాలి..

స్ట్రోక్ వచ్చిన 3 గంటలలోపేరోగిని వీలైనంతలో మెరుగైన
ఆసుపత్రికి తరలిస్తే కాపాడేవీలుంది. రక్తనాళాల్లోని అడ్డంకు
లను తొలగించడానికి వీలుంటుంది. ఆహారంలో నూనె పదా
ర్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్లదేహంలో కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాల్లో పూడిక ఏర్పడుతుంది. ఇది రక్త ప్రసరణకు అడ్డుపడితే పక్షవాతానికి దారితీస్తుంది. పొగతాగడం, మితిమీరిన మద్యపానం కూడా స్ట్రోక్ కు హేతువులవుతాయి.
డా.మానస పాణిగ్రహి, న్యూరోసర్జన్.

.బి-12 విటమిన్ తగ్గినా న్యూరో సమస్యలు..
చేతికందే తిండి(జంక్ ఫుడ్)తోసమతుల, పౌష్టికాహారం తీసుకోవడం తగ్గుతోంది. అన్ని రకాలవిటమిన్లు, ఖనిజ లవణాలు శరీరానికి అందడం లేదు. ముఖ్యంగా బి-
12 విటమిన్ లోపం కారణంగానరాల సమస్యలు వస్తాయి. జ్ఞాపకశక్తి కోల్పోవడం, కంటిచూపు మందగించడం, నడకలోఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక్కసారిగా శరీరంలోఒకవైపు కుంగుబాటుకు గురికావడం జరుగుతుంది.అలాంటపుడు తక్షణ చికిత్స అందించాలి.
- డా.ప్రవీణ్ కుమార్, న్యూరాలజిస్టు

మహిళలు.. వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయొద్దుచాలమంది మహిళలు కుటుంబబాధ్యతల్లో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం
చేస్తుంటారు.వ్యాయామానికిదూరంగా ఉంటున్నారు. 
 ఎక్కువ గర్భనిరోధకమాత్రలు వాడటం వల్ల హర్మోన్లలో
తేడా వస్తుంది. రక్తనాళాల్లో పూడికచేరేందుకు ఇది కారణమే. ఈ నేపధ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
తరచూ తలనొప్పి, కాళ్లుచేతులుగుంజడం, నీరసంగా అన్పిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
- డా.సీతా జయలక్ష్మి, కన్సల్టెంట్ న్యూరాలజిస్టు

12, డిసెంబర్ 2015, శనివారం

పచ్చి పాల పెరుగు.. అవగాహన

పచ్చిపాల పెరుగు వద్దు.
 పచ్చిపాలను తోడు పెట్టిన పెరుగు తింటే పేగుపూత తగ్గుతుందనిచెప్పారు. తినవచ్చునా?

పాలను కాయకుండాఏరకమైన పదార్ధాలూ తయా
రుచేయకూడదు. పచ్చిపాలలో హానికర సూక్ష్మజీవు
లుంటాయి. బాగా కాగినపాలను తోడు పెట్టిన పెరుగు
కూడా పైత్యాన్ని, కడుపులోమంటని, పేగుపూతని తగ్గి
స్తుంది. అందుకోసం పచ్చిపాల పెరుగే వాడవలసిన
అవసరం లేదు. పచ్చిపాల పెరుగు కఫాన్ని దగ్గు జలుబు, తుమ్ములూ ఆయాసాల్నీ పెంచుతుంది. స్థూలకాయాన్ని కలిగిస్తుంది.దాని జోలికి పోకపోవటమేమంచిది.

లివర్ వ్యాధుల్లో.. ఆహార నియమాలు.

లివరు వ్యాధులు-ఆహారం...

కామెర్ల వ్యాధి వచ్చింది. లివర్ దెబ్బతింటోందనీ, ఫుడ్ విషయంలోజాగ్రత్తగా వుండాలన్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారా?

 ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియలో లివరు ముఖ్య పాత్ర వహిస్తుంది.అందుకని కాలేయం పైన వత్తిడి పడకుండా తేలికగా అరిగే ఆహారం తీసుకోవాలి. మెతుకు తగలకుండా ఆహారం ఇవ్వాలనే రూలేమీ లేదు.రోగికి ఇచ్చేప్రతి మెతుకూ అరిగేదిగా ఉండాలి. పాత బియ్యాన్ని వేయించి, మెత్తగా వండుకుని తినవచ్చు.బార్లీ, సగ్గుబియ్యం, రాగి, జావలు మంచివి. బాగా చిలికి వెన్నతీసిన మజ్జిగ, ఎక్కువగా తాగాలి. బీర, పొట్ల, సొర, గలిజేరు, గుంటగలగర
ఆకు, కొండపిండి ఆకు, పొన్నగంటి కూర, చిర్రికూర, వీటితో పప్పుగానీ,పొడికూరగానీవండుకునితినవచ్చు.మినప్పప్పు, శనగలు, బటాణీలు, నూనెలు, చింతపండు, పులుసుకూ
రలు, ఆవపిండి కలిసినవి, వేడి చేసేవిమానాలి. చలవచేసే
వితింటే లివరు వ్యాధులనుఅదుపు చేయటం తేలిక.

గ్యాస్ట్రైటిస్ .. ఆహార వైద్యం.


 తరచూ గ్యాస్ట్రయిటిన్ కారణంగా మాటిమాటికీఎక్కువ మందులు వాడవలసి వస్తోంది. ఇలా తిరగపెట్టకుండా ఏదైనా సలహా చెస్తారా?

 గ్యాస్ట్రయిటిస్ వ్యాధి కేవలం నోటి ద్వారా మాత్రమే కడు
పులోకి ప్రవేశిస్తోంది. దొంగ ఏదారిన వస్తున్నాడో ఆ దారిని ముందుమూసేయాలి కదా! కాబట్టి ఆహార పానీయాల విషయంలో తగినజాగ్రత్తలు తీసుకోండి. హోటళ్ళలోనూ అలాగే, రోడ్డు పక్కన బళ్ళమీదవి తినటం పూర్తిగా మానేయండి. ఇంట్లో శుచిగా వండినవిమాత్రమే తినండి. త్రాగు నీరుస్వచ్ఛంగా ఉండాలి. వ్యక్తిగత పరిశుభ్రత అవసరం.పుల్లనివి, పులిసినవి, ఊరబెట్టినవిగ్యాస్ట్రయిటిస్ వ్యాధిని తిరగబెడతాయి. కష్టంగా అరిగే పదార్థాలన్నీ ఈ వ్యాధిని పెంచుతాయి. తేలికగా అరిగేవితినాలి. పాలకు బదులు మజ్జిగఎక్కువగాతీసుకోండి. పెరుగుకన్నా చిలికిన మజ్జిగ మంచిది.ఫ్రిజు చల్లదనం తగ్గాకే మజ్జిగతాగండి. ఇడ్లీ, అట్టు, పూరీ,ఉప్మాలకు బదులు, రాత్రివండిన అన్నంలో పాలుపోసితోడు పెట్టి ఉదయాన్నే పులవకముందే తినటం ఉత్తమం. మజ్జిగలో నానబెట్టి కూడా తినవచ్చు. తాలింపు పెట్టి రుచిగా చేసుకోవచ్చు. రోజూబార్లీ జావగానీ, సగ్గుబియ్యం జావగానీ, మరమరాలు లేదా బొరుగులతో జావగానీ కాచుకుని పెరుగు వేసి చిలికిన చిక్కని మజ్జిగ తాగండి. చలవ చేసే వన్నీఈ వ్యాధిని తగ్గిస్తాయి. వేడి చేసేవి పెంచుతాయి. కందికట్టు లేదా పెసరకట్టు
(చింతపండు వేయని పప్పుచారు) అన్నంలో తినండి. అన్ని కూరలు తినదగినవేపులుపు లేనివి, పులుపు కలపకుండా వండినవీ ఈ వ్యాధిని తగ్గిస్తాయి. పులుపుకోసం దానిమ్మగింజలు, వెలగపండు, ఉసిరికాయ నల్లపచ్చడి పరిమితంగాతీసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి మసాలాలు అతిగా తినటం వలన, వేపుడు కూరలవలన, ఊరగాయల వలన ఈ వ్యాది తిరగబెడ్తోంది.

11, డిసెంబర్ 2015, శుక్రవారం

పరగడుపున ఇవి వద్దు.


క్షణం తీరికలేని జీవనశైలిలో భాగంగాచాలామందిఆరోగ్యం, తీసుకునేఆహారంపట్లదృష్టిపెట్టరు.ఎప్పుడుఏంతీసుకుంటున్నారన్నది పట్టించుకోరు. కానీ పరగడు.పున తీసుకునే ఆహారం,చేసే పనుల మీద శ్రద్ధపెట్టడం మంచిది.ఆలస్యంగా లేచినప్పుడూ, అలవాటులో భాగంగానైనా పరగడుపున సోడా, ఇతర శీతల పానీయాల్ని తాగకూడదు. వాటి వల్ల జీర్ణాశయంలో హాని చేసే ఆమ్లాలు విడుదలవుతాయి. ఇవి చాలా అనారోగ్య సమస్యలకుకారణమవుతాయి. వికారం, వాంతుల వంటివీబాధిస్తాయి. వీటన్నిటి కంటే మంచినీళ్లు తాగడంమొదట గ్లాసు నీళ్లు తాగి.. ఓపదినిమిషాల
తరవాత వీటిని తీసుకోవాలి.పుల్లని పదార్థాల వల్లా ఉదయం పూట జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగాటొమాటోలను పరగడుపున తీసుకోకుడదు.
చాలామంది టొమాటో బాత్ లేదా, టొమాటోరైస్ వంటివి తింటుంటారు. ఇలాంటివి తినేముందు కాసిని పాలు తాగడమో. వేరే పదార్థమేదైనా తినడమో చేయాలి.
కొందరు నిద్రలేవగానే వాకింగ్ లేదా జాగంగ్ కు వెళ్లిపోతారు. అలాకాకుండా ఓ కప్పు గ్రీన్టీ తాగి వెళ్లడం మంచిది. యోగా చేయడానికిముందూ ఇలానే చేయాలి. పొట్టలో ఏమీ
లేకుండా పరగడుపున వ్యాయామం చేయడంవల్ల కొవ్వు త్వరగా కరగదు.పరగడుపున అరటి పండు జోలికి వెళ్లకూ
డదు. అరటి పండులో మెగ్నీషియంఉంటుంది. అది పొద్దున్నే శరీరానికి ఎక్కువమోతాదులో అందడం మంచిది కాదంటారు ఆరోగ్య నిపుణులు.

4, డిసెంబర్ 2015, శుక్రవారం

షుగర్ వ్యాధి.. నల్ల పచ్చడి.. ఆయుర్వేద ఉపయోగాలు

 

షుగర్ వ్యాధి ఉన్న వారికి నల్లపచ్చడి పెట్టవచ్చా?"

 షుగరు వ్యాధి ఉన్నవారికి ఉసిరి అమోఘమైన ఔషధం. ఆమలకి అని పిలిచేఉసిరికాయని తొక్కి గింజ తీసి
ఉప్పు కలిపి తాలింపు పెట్టిననిల్వ పచ్చడి కొద్దిగా నల్లగా
ఉంటుంది. కాబట్టి దాన్ని నల్లపచ్చడి అన్నారు. ఉసిరితొక్కు
పచ్చడి అని కూడా అంటారు.రోజూ కనీసం ఒక చెంచా పచ్చడినైనా తినటం అవసరం. నిల్వపచ్చడి అయినా సాధారణంగాకడుపులో మంటను తీసుకు
రాదు. ఊరగాయ మాదిరి తయారు చేసింది ఇబ్బంది పెడుతుంది. ఈ తేడానిమొదట గమనించాలి. ఉసిరికాయ శరీరంలో విషదోషాలను హరించే యాంటీఆక్సిడెంట్ ఔషధంగా అందరికీ తెలిసిందే! కానీ ఆయుర్వేద శాస్త్రం ఈ ఉసిరికాయపొడిలో ఎత్తుకు ఎత్తు మంచి పసుపును కలిపి షుగరు వ్యాధిలో శక్తి ఉత్పత్తికి,తోడ్పడే ఒక గొప్ప ఔషధం తయారుచేసింది. దాన్ని నిశామలకి చూర్ణం అన్నారు.
రోజూ ఒక చెంచా మోతాదులో ఈ పొడిని ఏదో ఒక విధంగా కడుపులోకి తీసుకుంటే మంచి సహాయకారి. ఉసిరి నల్లపచ్చడిలో కూడా పసుపు కలిపి కొత్తిమీరవేసి తాలింపు పెట్టుకునితింటేషుగరువ్యాధికిమంచిఔషధంవాడుతున్నట్టేననిగమనించాలి.

ఫంగస్ ఇన్ఫెక్షన్.. ఆయుర్వేద పరిష్కారాలు.


ఫంగస్ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే..

 చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడుఅది తగ్గడానికి గోరింటాకును మెత్తగానూరి ఇన్ఫెక్షన్ ఉన్న చోట రోజు రెండుపూటలా రాయాలి. ఇలా నాలుగైదురోజులు చేస్తే ఇన్ఫెక్షన్ తొలగుతుంది. వేపాకులను మెత్తగా నూరి ఇన్ ఫెక్షన్ ఉన్నచోట రాత్రి పూటరాసిఅలాగేదాన్నిఉండనివ్వాలి. మర్నాడు ఉదయంకడిగేయాలి. ఇలా నాలుగైదు రోజులు
చేస్తే ఇన్ ఫెక్షన్ పోతుంది.

 చల్లని పదార్థాలు, పుల్లని ఆహారం.పెరుగు వాడరాదు. ఇన్ ఫెక్షన్ ఉన్న చోటవెచ్చని నీటితో కడిగి శుభ్రంగా తడి
లేకుండా తుడిచి వేయాలి.

శిరీష కషాయం.. కూరగాయలు శుభ్రం

కూరగాయలపై ఉండే పెస్టిసైడ్ అవశేషాలు తొలగించే
శిరీష కషాయం..

కూరగాయలను పండించడంలో రైతులు అనేక రకాల క్రిమి, తెగుళ్ళనివారణ మందులు వాడుతున్నారు. వాటివల్ల కాపు కూడా బాగాఉంటుంది.కాయలుఏపుగాపెరుగుతాయి. కాని వాటిపైరసాయనిక అవశేషాలు ఉండిపోయి, త్వరగా పోవు.వాటిని ఎంతగా కడిగినప్పటికీ, రసాయనిక అవశేషాలు కొన్ని అలాగేఉంటాయి. అలాంటి వాటిని తినడం వల్ల ఆరోగ్యం కూడాదెబ్బతింటుంది. ఇలాంటి తెగుళ్ళ మందులలో ఎక్కువగా ఆర్గనో ఫాస్ఫరస్ (మలాథియాన్) ఉంటుంది.కాయగూరలను ఎంతగా కడిగినప్పటికీ, ఈ కెమికల్ అవశేషాలుపూర్తిగా పోవు. అయితే దీన్ని పూర్తిగా తొలగించే అవకాశం కూడా
ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రాజస్థాన్లోని షెకావటిఆయుర్వేద కాలేజిలో ఒక అధ్యయనం జరిగింది.
అధ్యయనం కోసం అనప కాయలను తెప్పించారు.వాటిలో మలతాన్ అవశేషాలు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకుని 

వాటిని శిరీష క్వాతతో ధావనము (కడగడం) చేసి ఫలితం తెలుసుకోవడం వారిలక్ష్యం. మంచినీటితో ఆనపకాయను కడగడం, శిరీష క్వాతతో ఆనపకాయను కడగడం
వల్ల కనిపించే తేడా ఏమిటి? ఫ్రిజ్ లో ఆనపకాయలను ఉంచినందువల్ల వాటిలోని రసాయనిక అవశేషాలు తొలగుతాయా? లేదా? అనేదానిని పరిశీలించడం ముఖ్య ఉద్దేశ్యం.

పద్ధతి..

పరిశోధకులు అప్పటికప్పుడు కొన్నిఆనపకాయలను (సొరకాయలు) తెప్పించివాటిని రెండుగా విభజించారు. ఒకటికంట్రోల్ గ్రూపు, రెండవది. ప్రయోగాత్మక
గ్రూపు రెందవగ్రూపును మళ్ళీ నాలుగు  గ్రూపులుగా చేశారు. మొదటి గ్రూపులోనికాయలపై మలథాన్ వేశారు. రెండో గ్రూపులోని కాయలనుమంచినీటితోకడిగారు..మూడో గ్రూపులోని కాయలను శిరీష క్వాధతోఉంచారు.దీనితర్వాత అన్ని ఆనపకాయలపైశుభ్రం చేశారు. నాలుగో గ్రూపులోని
కాయలను నాలుగు రోజులపాటు ఫ్రీజ్ లోరసాయనిక పరీక్షలు చేశారు.

ఫలితం..

మంచినీటితో కడిగిన వాటికంటేఫ్రిజ్ లో ఉంచిన వాటికంటే శిరీష క్వాతతోశుభ్రంచేసిన కాయలలోని రసాయనిక
అవశేషాలు చాలావరకు తొలగిపోయాయి..

ముగింపు

ఈ ప్రయోగాన్నిబట్టి కాయగూరలనుమంచినీటితో కాకుండా శిరీష క్వాథతో పరిశుభ్రం చేయడం చాలా మంచిదని రుజువైంది.

పాదాలలో మంటలు.. ఆయుర్వేద పరిష్కారాలు

పాదాలలోమంటలు..

• గోరింటాకు ఆకులను మెత్తగా నూరి కాళ్లకు, పాదాలకు
రోజు పొద్దున్నే పూయాలి. మళ్లీ సాయంత్రం పూయాలి.
ఇలా మంటలు తగ్గే వరకు పూస్తుండాలి.
• వస ఆకులను మెత్తగా నూరి రసాన్ని పిండి, దాన్ని పాదాలకు,మడిమలకు రాయాలి. పాదాలలో మంటలు తగ్గేవరకు ఇలాచేయాలి.
• శతావరి వేర్లను తెచ్చి వాటిని మెత్తగా నూరి రసాన్ని పిండి, దాన్ని రోజు పొద్దున,సాయంత్రం పాదాలకు మడిమలకు రాయాలి. ఇలా పాదాలలో మంటలు తగ్గేవరకుచేయాలి.
• పాదాల్లో మంటలు తగ్గే వరకు నూనె పదార్థాలు, తియ్యటి పదార్థాలు, ఘాటైనపదార్థాలను తినరాదు.

చెవి పోటు.. ఆయుర్వేద పరిష్కారాలు

శరీరంలో చెవి చాలా సున్నితమైనభాగం కావడం వల్ల అనేక సమస్యలువస్తాయి. ఎక్కువగాచెవిలోఇన్ఫెక్షన్వచ్చినప్పుడు చెవిపోటు వస్తుంది.ఇదివచ్చినప్పుడునొప్పిచాలాఎక్కువగా
ఉంటుంది.అయితేసాధారణంగాఇదిచిన్నపిల్లలకువస్తుంటుంది. ఇదివచ్చినప్పుడు జ్వరం కూడా వస్తుంది.కాబట్టి ఈ సమస్య వచ్చినప్పుడు వెంటనేవైద్యం చేయించకపోతే చెవుడు కూడా వచ్చేఅవకాశం ఉంటుంది.ఎక్కువ సేపు నీటిలో నానడం, ఈతకొట్టడం, దాని వల్ల చెవిలోకి నీరు పోవడం,మంచినీటిలో బాక్టీరియా ఉండి ఇన్ ఫెక్షన్ రావడం,జలుబు, ఒత్తిడి, సరైన ఆహారాన్ని తీసుకోక
పోవడం మున్నగు వాటి వల్ల చెవిపోటువస్తుంది.
తులసి రసాన్ని కొద్దిగా వేడిచేసి, ఆరసం రెండు మూడు చుక్కలు చెవిలోవేస్తే నొప్పి తగ్గుతుంది.ఉల్లిగడ్డను వేయించి, దాని రసాన్ని తీసి,ఆ రసం రెండు మూడు చుక్కలనుచేవిలో వేస్తే నొప్పి తగ్గుతుంది.నువ్వుల నూనెలో వెల్లుల్లి రెబ్బలనువేసి, కాచి వడబోసి మూడు నాలుగు
చుక్కలను చెవిలో వేస్తే నొప్పితగ్గుతుంది. లేదా వేపాకుల రసం తీసిరెండు చెక్కలను చెవిలో వేసినానొప్పితగ్గుతుంది.


Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...