Tuesday 29 March 2016

NAVA DHANYALU

1. గోధుమలు: పలు పాశ్చాత్య దేశాలతో పాటు ఉత్తర భారతీయుల ఆహారంలో ప్రధానమైనవి గోధు
మలే వీటిలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. కొవ్వులు నామమాత్రంగా
ఉంటాయి. బీ కాంప్లెక్స్ట్ బి-12 మినహా మిగిలిన విటమిన్లు, విటమిన్-ఈ, విటమిన్-కేతో పాటు
క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి కీలక ఖనిజాలు ఉంటాయి.
2. వరి: పలు తూర్పు దేశాలతో పాటు దక్షిణ భారతీయులు వరి ధాన్యం నుంచి వేరు చేసిన బియ్యాన్ని
ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తారు. వరిలో రకరకాల వంగడాలు ఉన్నా, వాటిలోని పోషక విలువలు దాదాపు
ఒకే తీరులో ఉంటాయి. బియ్యంలో దాదాపు 80 శాతం పిండి పదార్థాలే ఉంటాయి. స్వల్పంగా ప్రొటీన్లు,
కొవ్వులు, బి1, బి2, బి3, బి5, బి6
విటమిన్లు, క్యాల్షియం, మెగ్నీషియం,
మ్యాంగనీస్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి.
3. కందులు: కందులను దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వినియోగి
స్తారు. ఎక్కువగా పొట్టు తీసేసి పప్పుగా మార్చి వినియోగిస్తారు. కందులలో
పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. బి1,
బి2, బి3, బి5, బి6, బి9 సీ, ఈ, కే విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
4.పెసలు: పెసలను కూడా
అన్ని ప్రాంతాల్లోనూ విరివిగా
వినియోగిస్తారు. పొట్టుతీయని
గింజలను నానబెట్టి మొలకె
త్తిన తర్వాత తినడంతో
పాటు పొట్టు తీసిన
పప్పును వివిధ వంట
కాల్లో వినియోగిస్తారు.
పెసలలో పిండి పదార్థాలు,
సూ4.పెసలు: పెసలను కూడా
అన్ని ప్రాంతాల్లోనూ విరివిగా
వినియోగిస్తారు. పొట్టుతీయని
గింజలను నానబెట్టి మొలకె
త్తిన తర్వాత తినడంతో
పాటు పొట్టు తీసిన
పప్పును వివిధ వంట
కాల్లో వినియోగిస్తారు.
పెసలలో పిండి పదార్థాలు,
ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా
ఉంటాయి
5.శనగలు: పెసల మాదిరిగానే శనగలను కూడా నాన
బెట్టి మొలకెత్తిన తర్వాత నేరుగా తినడంతో పాటు పొట్టుతీసే నుంచే
సినపప్పును వివిధ వంటకాల్లో వినియోగిస్తారు. శనగల్లో
పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు పుష్కలంగాను,
కొవ్వులు నామమాత్రంగాను ఉంటాయి. వీటిలో విటమిన్లు,
ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
తీగా
6. బొబ్బర్లు: కందులు, పెసలు, శనగల మాదిరిగా బొబ్బ
ర్లను అంత విరివిగా వాడకపోయినా, మన దేశంలో వీటిని తర
చుగానే ఉపయోగిస్తారు. బొబ్బర్లను నానబెట్టి ఉడికించి వివిధ
రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. బొబ్బర్లలో పిండి పదార్థాలు,
ప్రొటీన్లు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. కొవ్వులు నామమా
త్రంగా ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి.
7. నువ్వులు: నువ్వులు ప్రధానంగా నూనెగింజల జాతికి చెందుతాయి.nuvvula
లను, నువ్వుల నూనెను కూడా మన దేశంలో విరివిగా
వినియోగిస్తారు. నువ్వుల నూనెను ఊరగాయల
తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
నువ్వులలో
ప్రధానంగా కొవ్వులు, పిండి పదార్థాలు, ప్రొటీన్లు,
పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
8. మినుములు: మినుముల వాడుక మన దేశంలో
పురాతన కాలం నుంచి ఉంది. మినుములను లేదా పొట్టు
తీసిన మినప్పప్పును నానబెట్టి వివిధ రకాల అల్పాహార వంట
కాలకు ఉపయోగిస్తారు. మినప్పుప్పును పిండిగా చేసి అప్పడాలు,
సున్నుండలు వంటివి తయారు చేస్తారు. మినుముల్లో పిండి పదార్థాలు,
ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
2. ఉలవలు: ఉలవల వాడకం మన దేశంలో పురాతన కాలం నుంచే ఉన్నా, మిగిలిన
పప్పుధాన్యాలతో పోలిస్తే వీటి వాడుక చాలా తక్కువ. ఉలవల్లో
పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా
ఉంటాయి. వీటిలో బి1, బి2, బి3, బి5, బి6, బి విటమిన్లతో
పాటు విటమిన్-సీ, విటమిన్ ఈ, విటమిన్-కే వంటి విటమిన్లు,
క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, పొటాషియం,
సోడియం, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఉలవలను నానబెట్టి
నేరుగా తింటే, మధుమేహం అదుపులోకి వస్తుందని ఇండియన్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ పరిశోధనలో తేలింది.


పిల్లల
కోసం
'నవ'
సూచనలు
1 ఐదేళ్ల వయసొచ్చే వరకు తలిదండ్రులు తమ పిల్లలను ఆవురూపంగా
చూడాలి 2 ఐదేళ్లు వచ్చాక వారికి మంచి, చెడు చెప్పే ప్రయత్నం చేయాలి. నయానా భయానా దారికి తెచ్చు
కోవాలి. వారి మంచిలోనూ, చెడులోనూ అన్ని సందర్భాలలోనూ వారికి అండగా ఉన్నామన్న భరోసా కల్పించా
03 వారిని విమర్శించడం, వ్యాఖ్యానించడం, ఇతరులతో పోల్చి చిన్నబుచ్చడం చేయకూడదు 4 పిల్లల శారీర
క, మానసిక స్థితిగతులను బట్టి పెద్దయ్యాక వారు ఏమి కావాలన్న దానిపై ఒక ఆలోచన చేయాలి కానీ ముందు
నుంచే వారిపై ఆశలు పెట్టుకుని, మోయలేనంత భారం మోపకూడదు 5 శారీరకంగా బలంగా అంటే బొద్దుగా, ముద్దుగా ఉన్నారు
కదా అని మురిసిపోకూడదు. మానసికంగా కూడా దృఢంగా ఉండేలా చూడాలి 6 భార్యాభర్తల కీచులాటలు, అత్తాకోడళ్ల తగవులు,
ఇరుగుపొరుగుతో కయ్యాలు వంటివి లేకుండా ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూడాలి. 7 ఎప్పుడూ చదువు....
చదువు.. అని వారిని సాధించకుండా, వారికి నైతికవిలువలను, నీతినిజాయితీలను ప్రబోధించే కథలు చెబుతుండాలి. నిజాయి
తీగా ఉన్నందుకు చిన్న చిన్న బహుమతులిచ్చి ప్రోత్సహించాలి 8 క్రమశిక్షణ పేరుతో వారిని తీవ్రంగా మందలించడం, మీతో
మాట్లాడాలంటేనే భయపడేలా చేయకూడదు. అలాగని అతి చనువు ఇచ్చి నెత్తిన ఎక్కించుకోకూడదు. క్రమశిక్షణకు క్రమశిక్ష
తే, చనువు చనువే అన్నట్లు వ్యవహరించాలి ? చివరగా ఒక్క మాట.. వారితో వీలైనంత ఎక్కువ సమయం గడపడా
నికి ప్రయత్నించండి. వారి అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తం చేసే స్వేచ్ఛను ఇవ్వండి. అవసరమైతే వారి
ఆలోచనలను, అభిప్రాయాలను సరిదిద్దుతూ, సూచనలు, సలహాలు ఇస్తుండండి.

Monday 28 March 2016

GLUTEN LENI AHARAM


గ్లూటెన్ లేని ఆహారం
మనకు సరిపడదని, బలవంతంగా తింటే ఎందుకుపో
తారట గ్లూటెనేని ఆహార పదార్థాలు ఉన్నాయా?
పేగుల్లో అలజడి కలిగించవచ్చు. దాని వలన ఏర్పడే వ్యాధి లక్షణాలను,

గోరుమల్లోనూ ఇంకా చాలా ధాన్యాల్లోనూ గ్లూటెన్
* గ్లూటెన్ అనేది ఒక ప్రొటీన్ పదార్థం. అది మనుషుల్లో కొందరి
సంక్' వ్యాధి అంటారు. అది పేగుల్లో ఏర్పడే వ్యాధి. దానివలన తిన్నది.
వంటబట్టదు. గ్లూటెన్ సరిపడని వారికి మాత్రమే ఇలా జరుగుతుంది.
మంకాయ, గోంగూర లాంటివి కొందరికి సరిపడనట్లే గ్లూటెన్ కలిగిన
ధాన్యం కూడా కొందరికి సరిపడకపోవచ్చు. ఏ ఆహార ద్రవ్యం అయినా
ఎవరికైనా పడకపోవచ్చు. ఏవి పడుతున్నాయో, ఏవి పడవో
గుర్తించి తగిన జాగ్రత్త తీసుకోగలగాలి! అందరూ అన్నీ మానాlsina avasaram Ledu.

గ్లూటిన్ తో సంబంధం లేని ఆహార పదార్థాలు అనేకం
ఉన్నాయి.
. గోధుమ పిండి, మైదా పిండి,
బార్లీలో తప్ప తక్కిన ధాన్యంలో దేనిలోనూ
గ్లూటెన్ ఉండదు. పండ్లు, కాయలు, కూరగాయలు, కోడిగుడ్లు, తాజా మాంసం,
చేపలు, జీడిపప్పు, బాదాం,
పిస్తాల్లోనూ పాలు, పెరుగు
వీటిల్లో గ్లూటెన్ ఉండదు.
గోధుమ, బార్లీ లాంటి
ధాన్యంతో తయారైన బ్రెడ్లు,
బీరు, స్వీట్లు, బిస్కట్లు, కేకులు,
పాష్టాలు, బజార్లో అమ్మే
మాంసాహారాలు, సూపులు
వీటిలో గ్లూటెన్ చేరే అవ
కాశం ఉంది. అవి సరిపడని వారికి సీలిక్ వ్యాధి రావచ్చు. గోధుమలు సరిపడట్లేదని
తేలితే ఈ పదార్థాల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలన్నమాట.
ఏది సరిపడటం లేదో నిర్ధారణ శాస్త్రీయంగా జరగాలి. వ్యాధి లక్షణాలు పూర్తిగా
తగ్గిన తరువాత పడని దాన్ని చాలా స్వల్ప మోతాదులో తీసుకోవటం మొదలు పెట్టి,
క్రమేణా కొద్దికొద్దిగా మోతాదు పెంచుకుంటూ వెడితే పడనివి పడే అవకాశం ఉంది.
దీన్ని హైపో సెన్సిటజేషన్ లేదా 'డీ - సెన్సిటైజేషన్ అంటారు. గ్లూటెన్ అనేది అంత
గొప్పగా అవసరమైన ప్రొటీనేమీ కాదు. అది లేనంత మాత్రాన కలిగే నష్టమేమీ లేదని
అమెరికన్ అకాడెమీ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థ పేర్కొంది.

SUGAR VYADHI LO DONDA

షుగరు వ్యాధిలో దొండ

దొండకాయని బుద్ధిమాంద్యం కూర అంటారు కదండీ?
* దొండకాయ లేతదైతే, ఆకలిని కలిగిస్తుంది. విరేచనం అయ్యేలా చేస్తుంది. లివ
రుని, పాంక్రియాజుని బలంగా ఉంచుతుంది. దీని ఆకుల్లో ఎక్కువ ఔషధ గుణాలు
న్నాయి. ఆకుల రసాన్ని పీలాగా కాచుకుని తాగుతూ ఉంటే రక్తంలో షుగర్ బాగా
తగ్గుతుంది. మూత్రపిండాల
వ్యాధుల్లో కూడా ఈ టీ పని
చేస్తుంది. శరీరం లోపలి అవ
యవాలలో వచ్చే వాపుని తగ్గి
స్తుంది. రక్తదోషాల మీద పని
చేస్తుంది. ఆకుల గుజ్జుని గట్టి
కురుపుల మీద రాస్తే తగ్గు
తుందని ఆధునిక వైద్యులు
కూడా చెప్తున్నారు. నాడీ
వ్యవస్థ మీద దీనికి ఎలాంటి చెడు ప్రభావాన్ని చెప్పలేదు. కాగా, మెదడుకు శక్తినిచ్చి
antianaphylactic అంటే స్పృహ తప్పటం లాంటి మెదడు వ్యాధి లక్షణాల్ని
దొండపండు తగ్గిస్తుందని చెప్తున్నారు. కాబట్టి అన్ని వ్యాధుల్లోనూ, అన్ని వయసుల
వారికీ లేత దొండకాయల్ని వండి పెట్టవచ్చు. దొండకాయని ముదిరింది తింటే
పైత్యం చేస్తుంది. పేగుపూత, ఎసిడిటీలను తగ్గిస్తుంది.

ECZEMA LO AHARAM

ఎగ్జిమాలో ఆహారం

చాలా సంవత్సరాలుగా నాకు కార్ల మీదా ఎగ్జిమా ఉంది. ఏం తినకూ
డదో చెప్పగలరు.

* సరిపడనిది తగిలినప్పుడు ఎగ్జిమా మచ్చల మీద దురద పెరుగుతుంది. గోకటం
వలన పుండు రేగుతుంది. ఆ స్థితిలో దాన్ని 'వీపింగ్ ఎగ్జిమా' అని పిలుస్తుంటారు.
ఇలా మాటిమాటికీ రని కారటం తిరగబెడుతూ చివరికి ఆ భాగం అంతా నల్లగా
మారిపోతుంది. ఎగ్జిమా మందులు వేసి తగ్గించేయగలిగే వ్యాధి కాదు. శరీరానికి సరి
పడని వాటికి దూరంగా ఉంచడమే అసలు చికిత్స.
సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూలు, యాంటీ సెప్టిక్ సొల్యూషన్లు, ఇంటి దుమ్ములో
ఉండే ఫంగస్ తదితర సూక్ష్మ జీవులు, పెంపుడు జంతువులు, చుండ్రు, కొన్ని రకాల
బాక్టీరియా, వైరలు, అమిత వేడి, అతి చల్లని వాతావరణ పరిస్థితులు, పాలు, గుడ్లు,
జీడిపప్పు, బాదాం, సోయా ఉత్పత్తులు, గోధుమలు, హార్మోన్ల స్థాయిలో
మార్పులు ఇవన్నీ ఎగ్జిమాని పెంచేందుకు అవకాశం ఉంది.
చింతపండు, శనగపిండి, మైదా, నూనెలతో వండిన పదార్థాలు కఫ
దోషాల సమస్థితిని దెబ్బతీస్తాయి. వాటిని ఎంత పరిమితంగా వాడితే
ఆరోగ్యం అంత పదిలంగా ఉంటుంది. చేదు, రుచి కలిగిన కాకర, ఆగా
కర, మెంతులు, వేపపూవు తరచూ వాడుకోవటం మంచిది. వేపపూ
లను కొద్దిగా వాము పొడినీ నెయ్యి వేసి దోరగా వేయించి మిక్సీ పట్టు
కుని కారప్పొడిలా రోజూ అన్నంలో తినటం వలన ఈ వ్యాధి తీవ్రత తగ్గు
తుంది. ధనియాలు లేదా జీలకర్ర లేదా దాల్చిన చెక్కలను వేర్వే
ర్ణచందు రుగా మిక్సీ పట్టుకుని సీసాలో భద్రపరచుకోండి. వీటిలో
ఏదైనా ఒకదాని పొడిని గ్లాసు నీళ్లలో అరచెంచా చొప్పున వేసి
మరిగించి వడగట్టుకుని ఈ నీటిని మంచినీటికి బదులుగా రోజూ తాగుతూ ఉంటే శరీ
రంలో విషదోషాలు తగ్గుతాయి.

Wednesday 23 March 2016

SUMMER HEALTH DRINKS-FALUDHA,SAJJAPALU,BARLI NEELLU&SAGGU BIYYAM PAYASAM




MULLANGI AKULATHO KOORA



ముల్లంగి ఆకులతో కూర

 ముల్లంగి ఆకులు తినదగినవేనా? ముల్లంగిని
ఉబ్బనం, శరీరానికి నీరు పట్టటం లాంటి జబ్బుల్లో
తినకూడదంటారు నిజమేనా?

* ముల్లంగి రెండు రకాలుగా దొరుకుతుంది. మనకు దొరికేది
చిన్న రకం తెల్ల ముల్లంగి, ఏనుగుదంతంలాగా బాగా తెల్లగా పెద్దదిగా
ఉండేది మనకు తక్కువ. జపాన్ వాళ్లు దీన్ని దాయికాన్ అంటారు. ఈ
పెద్ద ముల్లంగి దుంపలు (బడీ మూలీ) మన చిన్న ముల్లంగిలా చలవ
చేయవు. వేడి చేస్తాయి. కష్టంగా అరుగుతాయి. అన్ని దోషాలను
పెంచుతాయని భావప్రకాశ వైద్య గ్రంథంలో ఉంది. దాదాపు 20 అంగు
కాల వైశాల్యం కలిగి 45 కిలోల బరువు ఉండే సకురాజిమా
అనే పెద్ద ముల్లంగి జపాన్లో బాగా పెరుగుతుంది. మనకు 14
అంగుళాల వరకూ ఉండే చిన్న ముల్లంగి దుంపలే దొరుకు
తాయి.


చిన్న ముల్లంగిని మూలీ అంటారు. దీనికి కొద్దిగా కారపు రుచి ఉంటుంది. శరీ
రంలో వేడిని పుట్టిస్తూనే చలవని
స్తుంది. తేలికగా అరుగుతుంది.
దీనితో పాటుగా తిన్న ఇతర ఆహార
పదార్థాలు కూడా తేలికగా అరిగేలా
చేస్తుంది. వ్యాధులన్నిటిలోనూ తినద
గినదిగా ఉంటుంది. గొంతును
శ్రావ్యంగా చేస్తుంది. జ్వరం వదల
కుండా వస్తున్నప్పుడు ముల్లంగితో
ఏదైనా ఆహార ద్రవ్యం చేసి ఇస్తే ఔష
ధంలా పనిచేస్తుంది.
ముల్లంగి, క్యారెట్ లేదా బీట్
రూట్ ఒక్కొక్క దుంప, ఒక యాపిల్
లేదా జామపండు ఈ మూడింటి జ్యూసు తీసుకుని కొద్దిగా జీలకర్ర/వాము లేదా
మిరియాల పొడి వేసి ఒక గ్లాసు మోతాదులో తాగితే జ్వరం, దగ్గు, జలుబు,
ఆయాసం తగ్గుతాయి. రోజూ తాగితే రక్తహీనత తగ్గుతుంది. శరీరంలో విష
దోషాలు పోతాయి. క్షీణింప చేసే వ్యాధుల్లో ఇది మేలు చేసే మంచి ఫార్ములా!
మూత్రం ఎక్కువ అయ్యేలా చేస్తుంది. అందువలన నీరు పట్టిన వ్యాధుల్లో (ఎడీమా)
ఇది మేలు చేస్తుంది. ఇందులో పొటాషియం, కాల్షియం లాంటివి ఎక్కువగా
ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించిన వ్యాధులు మాత్రమే ముల్లంగిని వద్దం
బారు మనుషులందరూ ముల్లంగిని తినాలి.

ముల్లంగి ఆకుల్ని రాడిష్ గ్రీన్ అంటారు. వీటితో తోటకూర మాదిరిగా పొడి
కూర వగైరాలన్నీ చేసుకోవచ్చు. ఫ్రెంచి వాళ్లు ఉదయం ఉపాహారంగా తింటారు.
అమెరికన్లు ముల్లంగి దుంపల్ని, ఆకుల్ని కూడా చిన్న ముక్కలుగా తరిగి వేపుడు
కూరగా వండుకుంటారు. పెట్రో, సూపుల్లాంటి వంటకాలను కూడా చేస్తారు. వీటికి
కొద్దిగా చేదు రుచి ఉంటుంది. అందుకని ఇతర ద్రవ్యాలతో కొద్దిగా కలిపి వండుకో
వాలి. లేత ఆకుల్ని మాత్రమే ఎంచుకోవాలి. ముల్లంగి దుంపలను సాధారణంగా
ఆకులతో సహా అమ్ముతారు కాబట్టి వాటిని కూడా సద్వినియోగపరచుకోవచ్చనీ,
ముల్లంగితో సమానంగా మేలు చేస్తాయనీ దీని భావం. భావప్రకాశ వైద్య గ్రంథంలో
ముల్లంగి ఆకులు జీర్ణశక్తిని పెంచుతాయనీ, తేలికగా అరుగుతాయనీ, రుచిగా
ఉంటాయనీ, కొద్దిగా నెయ్యి లేదా మంచినూనె వేసి వేయించితే అన్ని దోషాలనూ
పోగొడతాయనీ ఉంది. అలా వేయించకుండా తినటం వలన పైత్యం చేస్తుందనీ,
కఫాన్ని పెంచుతుందనీ ఆ గ్రంథం చెప్తోంది.

CHIMMILI THINAVACHA?

చిమ్మిలి తినవచ్చా...!?

చిమ్మిలి తింటే బీపీ పెరుగుతుందనీ, బ్లీడింగ్ అవు
తుందనీ, కడుపు యాసిడ్ పెరుగుతుందని అంటున్నారు
నిజమా? అపోహా?

* పొట్టు తీసిన తెల్లనువ్వులు (నువ్వుపప్పు), తగినంత బెల్లం కలిపి
దంచిన 'ముద్ద' లేదా 'ఉండని చిమ్మిలి అంటారు. దీనికి తెల్ల
ర్ణచందు నువ్వులకున్న గుణాలన్నీ ఉంటాయి. ఇది విరేచనం ఫ్రీగా
అయ్యేలా చేస్తుంది. బాగా వేడిచేసే స్వభావం కలిగింది కాబట్టి,
వాతాన్ని, నొప్పుల్ని, వాపుల్ని తగ్గిస్తుంది. కానీ, కఫ దోషాన్నీ, పైత్యాన్ని పెంచు
తుంది. ఎసిడిటీ, పేగుపూత ఉన్న వాళ్లకు ఇది మంచిది కాదు. ఇందులో కొవ్వు ఎక్కు
వగా ఉంటుంది. స్థూలకాయులకు ఇబ్బందే కలిగిస్తుంది. దంతాలకు మేలు చేస్తుంది.
విరేచనాన్ని బంధిస్తుంది. ఎముకలు విరిగినప్పుడు త్వరగా అతుక్కునేలా చేస్తుంది.


రక్తస్రావాన్ని ఆపుతుంది.
కానీ, ఋతురక్తం పెరిగేలా
చేస్తుంది. అందుకని గర్భా
శయం మీద మాత్రం రక్త
స్రావం అయ్యేలా చేసే
గుణం దీనికుంది. వేడి శరీర
తత్వం ఉన్న వాళ్లకు
మాత్రమే అధికంగా బ్లీడింగ్
అయ్యేలా చేస్తుంది. బాలింత
లకు మంచిది. తల్లిపాలు
పెరిగేలా చేస్తుంది. చర్మవ్యాధుల్లో మేలు చేస్తుంది. మెదడు వ్యాధుల్లో నరాల బలానికి
ఉపయోగపడుతుంది. దగ్గు, జలుబు, ఉబ్బసం వ్యాధుల్లో సరిపడుతుందో లేదో
చూసుకుని తినాలి. ఋతుస్రావం సరిగా కాని వాళ్లకు, నెలసరి సక్రమంగా రాని
వాళ్లకూ చిమ్మిలి మేలు చేస్తుంది. అతిగా మూత్రం అవుతున్న మూత్ర వ్యాధుల్లో
చిమ్మిలి మూత్రాన్ని బంధించి బాగా తక్కువగా అయ్యేలా చేస్తుంది. అందుకని
కొందరు రాత్రి పూట పక్క తడిపే పిల్లలకు చిమ్మిలి పెట్టడం మంచిదని చెప్తారు. పిల్ల
లకు బలకరం కూడా! కానీ, శరీర తత్వాలను బట్టి కొద్ది మోతాదుల్లోనే దీన్ని
ఇవ్వాలి. జాగ్రత్తగా తీసుకుంటే చిమ్మిలి మంచిదే!

Monday 7 March 2016

GOOD MORNING FOOD

గుడ్ మార్నింగ్' ఫుడ్

ప్రొద్దున పూట ఏది ఎలా తింటే ఆరోగ్యదాయకమో చెబుతారా?

ప్రొద్దునపూట రెండు మూడు జీడిపప్పులు లేదా బాదంపప్పులు, కూరగాయ
ముక్కలు, తరిగిన ఆకుకూర, కొద్దిగా జొన్న రాగి/సజ్జ వీటిలో ఏదైనా ఒకదాని పిండి
వీటిని కలిపి గట్టి ముద్దలా చేసి పెనం మీద రొట్టిగానీ, చపాతీ/పుల్కా గానీ తయారు
చేసుకుని ఉదయంపూట తింటే ఆరోగ్యవంతులకైనా అనారోగ్యవంతులకైనా గొప్ప
ఉపవాస ఉపసంహారం (బ్రేకింగ్ ద ఫాస్ట్) అవుతుంది. రెండు లేక మూడు రొట్టెలు
అని, ఒక క్యారెట్, ఒక ముల్లంగి, ఒక యాపిల్ జామ పండు వీటి జ్యూస్
తాగితే సమగ్రమైన ఆహారం అవుతుంది. The Academy of
Nutrition and Dietetics అంతర్జాతీయ సంస్థ ప్రమాణాలకు తగ్గ
ట్టుగా భారతీయులు తీసుకోదగిన మంచి breakfast ఇది. మరీ
చిక్కగా లేని కాఫీ/టీ రోజుకు ఒకటి లేక రెండుసార్లు అరకప్పు మోతా
దులో తాగవచ్చు.
ఉపొడి, మిరియాల పొడి, యాలకుల పొడి, అల్లం, తులసాకులు,
పుదీనా ఆకులు మూడు లేదా నాలుగు చొప్పున వేసి పాలు పోయకుండా
కాచిన టీ ఆరోగ్యానికి మేలు చేసేదిగా ఉంటుంది. కావాలను
వార్ణచందు కుంటే కొద్దిగా నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇలా కాచిన దీని
అన్నం తిన్న వెంటనే కూడా తాగవచ్చు. భుక్తాయాసం కలగ
కుండా చూస్తుంది. స్థూలకాయం, షుగర్ వ్యాధి లాంటివి ఉన్న వారు ఆఫీసు నుంచి
లంచి కోసం ఇంటికి రావటం కన్నా క్యారియర్ తీసుకు వెళ్లటం వలన రెండు లాభా
లున్నాయి. మొదటిది పరిమితంగా ఆహారం తీసుకోగలుగుతారు. రెండు భోజనం
చేయగానే పడుకుని నిద్ర
పోయే అలవాటు మానగలు
గుతారు. ప్రొద్దున పూట,
రాత్రిపూట టిఫిన్లను సాధ్యమై
సంతవరకూ మీరేవండుకోవ
డానికి ప్రయత్నించండి.
బయటవి తినటం వలన
ఆహార నియంత్రణ లేకుండా
పోతుంది.
కూరగాయలను, ఆకు
కూరలను ఎక్కువగానూ, వరి అన్నం తక్కువగానూ తినే విధంగా ఆహార పదార్థాల
తయారీ ఉండేలా కొత్త ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కనీసం ప్రొద్దునపూట
ఆహారంలోనైనా కూరగాయలకు, పండ్లకు ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. ఇప్పుడు
మనం తింటున్న ఆహారపదార్థాల్లో ఈ కాలపు జీవన విధానానికి మేలు చేసేవి తక్కు
వగా ఉన్నాయి. సాంప్రదాయకమైన కూర, పప్పు, పచ్చడి, పులుసు వగైరా వంటకా
లలో అతిగా చింతపండు, అంతకంటే అతిగా అల్లం, వెల్లుల్లి. అమితంగా నూనెలు
చేరటం వలన మన సాంప్రదాయ వంటకాలు శక్తిహీనంగా మారాయి. ఆధునికమైన
పిజ్జాలు, బట్టర్ నాన్లూ, మిక్స్ వెజిటబుల్ కర్రీలు మరీ హానికరమైనవిగా ఉన్నాయి.
మార్చవలసింది హోటల్ని కాదు. మారాల్సింది మనం.



SHANAGA PINDIKI PRATHYAMNAYAM

ఈ శనగపిండికి బదులుగా వాడుకోదగినదేమైనా
ఉన్నదా?
• శనగపిండి చాలా మృదువుగా ఉంటుంది. కానీ కడుపు
లోకి వెళ్లాక రూక్షంగా (రఫీగా పనిచేస్తుంది. జీర్ణశక్తిని, పేగుల్ని,
శరీర సమతుల్యతనీ దెబ్బ తీస్తుంది. దీనివలన వాతం పెరుగుతుంది. ఎసి
ఇదీ పెరుగుతుంది. జీరం ఆరోగ్యం చెడుతుంది. పోషక విలువలు,
ప్రొటీన్లు వగైరా ఉన్నాయి కదా అనడగవచ్చు. పోషకాలు మనకు
ఎలాంటి ఇబ్బంది కలిగించనివిగా ఉండాలి కదా! వాత, కఫ పైత్యా
లను పెంచే ద్రవ్యాలు ఎంత పోషకాలు అయినా అందరూ దీన్ని తినండి
అని చెప్పడానికి వీలైనవి కావు. శష్కలీ అంటే శనగపిండి. ఇది మలబద్ధ
తను కలిగిస్తుంది. కంటికి చెడు చేస్తుంది.
గోధుమ పిండి,
జొన్న పిండి, రాగి పిండి, సజ్జపిండి లాంటి
డా.జి.వి.
వాటితో వంటకాలు శనగపిండి, మినప్పిండి, పెసరపిండి కన్నా
మెరుగ్గానూ, రుచికరంగా కూడా ఉంటాయి. శనగపిండితో చేసుకునే వంటకాలన్నిం
ఉనీ వీటితో కూడా చేసుకోవచ్చు. రాగి పిండితో పకోడీలు, జొన్నపిండితో జంతికలు,
సజ్జపిండితో అప్పాలు (సజ్జ
ప్పాలు) ఒకప్పుడు మన
పూర్పులు ఇష్టంగా తిన్నవే! ఆ
రోజుల్లో అంటే 40-50 యేళ్ల
క్రితం వరకూ శనగపిండి
వాడకం బాగా తక్కువ. ఆరో
గ్యానికి అంతగా మంచిది
కాడని ఎప్పుడో ఒకసారి సర
దాగా తినేవారు. బూందీ, కార
ప్పూన, చక్రాలు వగైరా వంట
కాలను గోధుమపిండి, జొన్నపిండి కలిపి తయారు చేసుకునే వాళ్లు, గారెలు, బూరెలు,
అరిశలు, గవ్వలు, చెక్కలు, ఇలాంటి వాటిని ఇప్పటికీ మనం శనగపిండి లేకుండానే
వండుకుంటున్నాం కదా! లడ్డు, మిరాయి, లావు కారప్పూనలాంటివి కూడా గోధుమ
పిండితోనే తయారయ్యేవి.
శనగపిండిలోనే రుచి ఉన్నదనుకోవటం ఒక అపోహ. వేటి రుచి వాటిది. సజ్జ
ప్పాలు సజ్జపిండితో చేస్తేనే రుచి గానీ, మైదా పిండితో చేస్తే అసలు రుచి ఎలా తెలు
స్తుంది...? పకోడీకి ఆ రుచిని ఉల్లిపాయ ఇస్తోంది. అనవసరంగా శనగపిండి జోలికి
వెళ్లకుండా ప్రత్యామ్నాయాలను ప్రయత్నించి చూడండి. తప్పదనుకుంటేనే శనగపిండి
వాడండి. శనగలను మరపట్టుకున్న పిండిని నమ్మినట్టు, బజార్లో దొరికే శనగపిండిని
నమ్మలేం కదా! అది గుండ్రటి శనగల (బరాణీ శనగలు, బొంబాయి శనగలు) పిండి
కావచ్చు. గుండ్రటి శనగలు ఆరోగ్యానికి మరింత హానికరం.