Friday 29 April 2016

VESAVI LO AHARA VIHARALU

వేసవిలో ఆహార విహారాలు

వేసవిలో జాగ్రత్తలు చెప్పండి!

* మన ఆహార విహారాలు వేసవికి బలి చేసేవిగానే
ఉంటాయి. వేసవిలో మిర్చిబజ్జీలు, పునుగులు తినే వారి సంఖ్య
ఎక్కువ. ఏకాలంలో ఏది చెయ్యకూడదో అదే చేస్తాం మనం.
1. వేసవిలో క్రిమికీటకాలు, ఈగలు దోమలు వైరసుల తాకిడి
ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి, అవసరం లేకుండా బయట తిరగటం
మానుకోవాలి. ఇంట్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
2. ఒకప్పుడు తెల్లని బట్టలు కట్టుకుని, గొడుగు వేసుకుని బయ
టకు వెళ్ళేవారు. ఇప్పుడు గొడుగు నామోషీ అయ్యింది. దాని స్థానంలో
నైలాన్ టోపీలు వచ్చాయి. ఇవి ఎండను ఆపుతాయిగానీ, గాలి ఆడనీ
యక విపరీతంగా చెమట పట్టేస్తాయి. పరోక్షంగా వడదెబ్బకు

కారణం అవుతాయి. జుట్టు పాడవుతుంది కూడా!
3. మామిడి పంట వచ్చే కాలం కాబట్టి ఊరగాయల
సీజను ఇది. పూర్వం ఊరుగాయని పెట్టిన తరువాత జాడీ మూతికి వాసెన కట్టి,
మూడు నెలలు కదలకుండా చీకటిగా ఉండేచోట భద్రపరిచేవారు. అలా మాగిన
ఊరుగాయలో తీక్షణత తగ్గి కమ్మదనం వస్తుంది. అది మరచిపోయి, వేసవినంతా
ఊరుగాయలతోనే గడుపుతున్నాం. దీనివలన జీర్ణాశయం, మూత్రపిండాలు, రక్తప్ర
సారవ్యవస్థలు దెబ్బతింటాయి. ఆయా రోగాలకు ఆహ్వానం పలకటమే అవుతుంది.
4. వేసవిలో ఉదయం
పూట ఇడ్లీ అట్టు, పూరీ ఉప్మా
ఐజీ పునుగులకన్నా మజ్జిగ
అన్నం తినటం మంచిది.
రాత్రిపూట అన్నంలో మజ్జిగ
పోసి తెల్లవార్లూ నానిన
అన్నం తింటే చలవ చేస్తుంది,
ఉల్లి టమోటా, కేరట్, బీట్
రూట్, ముల్లంగి, బూడిద
గుమ్మడి, సొరకాయ, కొత్తిమీర ఇలాంటి కూరగాయలను ముక్కలుగా తరిగి
పెరుగు కలిపి తాలింపు పెట్టుకున్న పెరుగు పచ్చడి వేసవి తాపానికి విరుగుడుగా
పని చేస్తుంది.
5. ముల్లంగి, కేరట్, యాపిల్ లేదా జామ లేదా దానిమ్మ లేదా కర్పూజా పండు
ఈ మూడింటిని జ్యూసు తీసుకుని రోజూ తాగితే వడదెబ్బకు శరీరం తట్టుకోగలుగు
తుంది.
6. ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ సమానంగా తీసుకుని దంచి,
తగినంత ఉప్పు కలిపి సీసాలో భద్రపరచుకోండి. గ్లాసు మజ్జిగలో ఒక చెంచా
పొడిని కలిపి తాగితే వడకొట్టదు.
7. జీర్ణశక్తి బలంగా ఉన్న వారికన్నా, అజీర్తితో బాధపడేవారికి త్వరగా వడ
తగుల్తుందని గుర్తించండి. వేసవిలో చింతపండు, అల్లం వెల్లుల్లి తగ్గించి వాడు
కుంటూ, నూనె పదార్థాలు తినకుండా ఉండటం మంచిది.

ఎండాకాలం వస్తోంది
అంటేనే ప్రజలు భయపడి ఎన్నో
ముందు జాగ్రత్తలు చేసుకుంటారు.
ప్రిట్లు, ఏనీలు, కూలర్లు రిపేరు
చేసుకుంటారు. ఎండాకాలంలో
ముసలివారు. పిల్లలు చాలా జాగ్రత్త
వహించాలి. మనల్ని మనం ఎలా వేసవి
బాధల నుండి కాపాడుకోవాలి. ఏం
జాగ్రత్తలు తీసుకుంటే మంచిది లాంటి
విషయాలను ఆయుర్వేదం మనకు
వివరిస్తుంది.
ఎండాకాలంలో భూమి
సూర్యునికి అతి దగ్గరగా ఉంటుంది.
కావున సూర్యుడు మన శరీరంలోని
బలాన్ని, నీటిని లాగేస్తాడు. దీనితో మన
శరీరంలోని లవణాలు తగ్గి, వేడి
పెరుగుతుంది. ఈ లక్షణాలను మనం
పట్టించుకొన్నట్లైతే వడదెబ్బ తగిలే
ప్రమాదం ఏర్పడుతుంది. ఇందులో
జ్వరం, తీవ్ర తలనొప్పి, వాంతులు,
చెమట ఆగిపోవటం, మనసు భ్రాంతి,
ఎగశ్వాన ఏర్పడుతుంది. అప్పుడు
తప్పనిసరిగా ఆసుపత్రిలో చేర్పించాలి.
అంతవరకు రానివ్వకుండా మనం మన
ఆయుర్వేదం చెప్పే ముందు జాగ్రత్తలు
పాటించి మనల్ని మనం కాపాడు
కుందాము.
1 హెూళీ పండుగ నుంచి 30 రోజుల
వరకు రోజు ఒక పిడికెడు వేపపూలను
పడిగడుపున తింటే అసలు ఎండాకాలం
వేడి కూడ తెలియదు.
2) సులభంగా జీర్ణమయ్యే ఆహారం
తినాలి.
3) పలుచని లేత రంగు నూలు వస్త్రాలను
ధరించాలి.
4) గంధము, కలబంద గుజ్జు పైపూతగా
రాసుకుంటే చెమటకాయలు రావు.
5) డీహైడ్రేషన్ (శరీరంలోని నీరు శాతం.
తగ్గుటకు ఇంట్లో లభ్యమయ్యే దినుసు
లతో జ్యూసులు చేసుకొని వాడండి.
ఎ) చింతపండు పులుసులో నీరు కలిపి
పచ్చి పులుసు లేదా చారుచేసి
వాడండి.
బి) పచ్చి మామిడి కాయ ఉడక పెట్టి
పిసికి అందులో ఉప్పు, చక్కెర,
జీలకర పొడి కలిపి చల్లార్చి
1
తాగండి.
సి) బెల్లం పానకం అనగా బెల్లంని
నీళ్ళలో కరిగించి అందులో
యాలక్కాయ (ఇలాచీ) పొడి
నిమ్మరసం కలిపి తాగండి.
6) మూత్రంలో మంట తగ్గించటానికి...
ఎ) ధనియాలు 1 చెంచా, ఒక గ్లాసు
నీళ్లలో కలిపి మరిగించి వడబోసి
అందులో చక్కెర కలిపి తాగండి.
బి) మోదుగ పూలను 10 పూలు 200
మి.లీ. నీళ్ళలో ఉడికించి వడబోసి
అందులో పంచదార కలిపి
తాగండి.
సి) శతావరి చూర్ణం 1 చెంచా నీటితో
1
1:
1
లేదా పాలతో తీసుకొనిన మూత్రం
లో మంట తగ్గును.
7) సామాన్య దౌర్బల్యంలో ఉసిరి జ్యూస్,
క్యాండీ లేదా చూర్ణం రూపంలో
తీసుకోవాలి.
8)వేసవి విరేచనాలు...
ఎ) మారేడు చూర్ణం బెల్లంతో కలిపి
1
తినాలి లేదా మార్కెట్లో మురబ్బా
దొరుకుతుంది. వాడుకోవచ్చు.
బి) వట్టివేర్లను ఒక వస్త్రంలో చుట్టి
నీటికుండలో వేసి రోజు ఆనీటినే
1
తాగితే విరేచనాలు కాకుండా
ఆపవచ్చు కాని అయినప్పుడు అదే
వట్టివేర్లను కషాయం అనగా
1
నీటిలో మరిగించి వడపోసి తాగితే
వెంటనే విరేచనాలు తగ్గుతాయి.
9) ముక్కు నుంచి రక్తస్రావం...
ఎ) ఉల్లిరసం 1-2 చుక్కలు ముక్కులో
వేయాలి.
బి) గరిక రసం 1-2 చుక్కలు ముక్కు
లో వేయాలి.
రేటర్ నీరు తాగకండి, మద్యపానం
10) ఆపుకోలేని దాహంలో...
ఎ) కుండ నీటిని ఒక గ్లానులో
పోసుకుని ఒక దగ్గర కూర్చుని
నోటికి ఆనించి మెల్లగా తాగాలి.
బి) కొబ్బరి నీరు, ఉసిరి జ్యూస్, కోకం
జ్యూన్, సుగంధపాల జ్యూన్
తాగాలి.
సి) అరటిపండుని కొబ్బరి నీటిలో పిసికి
తినాలి.
డి) తాజా బూడిద గుమ్మడికాయ రసం
త్రాగాలి.
11) శరీరంలో వేడిని తగ్గించడానికి ఉల్లి
రసం, గంధం, కలబంద గుజ్జును గాని
ఒంటిపై రాయాలి.
12) చెమట కాయలు లేదా చెమట వలన
వచ్చే చర్మ రోగాలు: ఎండిన లేదా పచ్చి
మామిడాకులు రాత్రి నీటిలో నానబెట్టి
ఉదయం ఆ నీటితో స్నానం చేయండి.
ఇందులో గులాబీ రేకులు, మల్లెపూలు
కూడా వేసుకోవచ్చు.
13) వేయించిన ఆహారం, మసాల ఆహారం,
మాంసాహారం, ఎక్కువగా తినకండి.
14) సిల్కు పాలిస్టర్ వస్త్రములు ధరించ
కండి.
15) ఉ|| 11.00 గం||ల నుండి సాయంత్రం
4.00 గం||ల వరకు వీలైనంత బైటికి
వెళ్ళకండి.
16) సోడాలు, కార్బోనేటెడ్ డ్రింక్స్, రిఫ్రిజ్
చేయకండి.

AYUSSHUNICHE SORAKAYA




ఆయుషునిచ్చే సొర

2. సొరకాయ తింటే జలుబు చేస్తుందా?
* సొరకాయ లేదా ఆనపకాయని కలబాష్, బాటిల్ గోర్డ్, లాంగ్ మెలాన్
పేర్లతో పిలుస్తారు. అడవి కాయల్ని తినే కూరగాయలుగా పెంపుడు చేసుకున్న
తొలి కాయగూరల్లో సొరకాయ ఒకటి.
లేత సొరకాయ, లేత సొర ఆకులు కూడా ఇంచుమించు సమాన గుణాలు కలి
గినవే! తోటకూర లాంటి రుచిని కలిగి ఉంటాయి. తోటకూర మాదిరిగానే అన్ని
వంటకాలూ చేసుకోవచ్చు. ఆ మాటకొస్తే, కాయలో కన్నా సొర ఆకుల్లోనే విట
మిన్లు, ఖనిజాలూ ఎక్కువగా ఉన్నాయి. కామెర్ల వ్యాధిలో సౌరాకులు ఔషధంలా
పనిచేస్తాయి. వేసవి కాలంలో సొరకాయని తరచూ తింటే వడ కొట్టకుండా
ఉంtundi.
100 గ్రాములకు 14 కేలరీలు మాత్రమే ఉన్న సొరని తినటమే ఒక
యోగం. లివరు వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, పేగుపూత,
అమీబియాసిన్, మలబద్ధత లాంటి జీర్ణకోశ వ్యాధుల్లో ఇవి మేలు
చేస్తాయి. చలవనిస్తాయి. సొరకాయలో అధిక శాతం నీరు ఉంది
కాబట్టి జలుబు చేస్తుందనేది ఒక అపోహ! ఇది తియ్య కూర కాబట్టి
దీన్ని వండటానికి ఎక్కువ ఉప్పూకారాల అవసరం ఉండదు. కానీ,
అలా తియ్యగూరగా వండితే పథ్యం కూర అని ఈసడిస్తారు.

చింతపండుతోనో, శనగపిండితోనో వండితే ఎక్కువమంది
ఇష్టంగా తింటారు. వాటి వలన జలుబు చేస్తుంది. తినేదేమో
పులుసునీ, తిట్టేదేమో సొరకాయనీ అవుతుంది. ఎలాంటి అనారోగ్యంలోనయినా
సొరకాయనీ సొర ఆకుల్ని వండుకుని తినవచ్చు. పులుపు కలిపి వండటానికి
ప్రాధాన్యత తగ్గిస్తే సొరకాయ ఆయుర్దాయాన్నిస్తుంది.
గర్భవతులు సొరకాయను తరచూ తింటూ ఉంటే కడుపులో ఎదిగే బిడ్డ నాడీ
వ్యవస్థ బలంగా రూపొందు
తుంది. లేత సొరకాయ జ్యూస్
తీసుకుని అందులో పావు
చెంచా మంచి పసుపు, తగి
నంత నిమ్మరసం, మిరియాల
పొడి కలుపుకుని రోజూ ఉద
యాన్నే ఖాళీ కడుపున ఒక
గ్లాను చొప్పున తాగుతూ ఉంటే
'ని' విటమిన్ సమృద్ధిగా అందు
తుంది. కేన్సర్ పెరుగుదలను
అరికట్టేందుకు ఈ పానీయం తోడ్పడుతుంది. ఇందులో ఆహార సంబంధమైన
పీచుపదార్థం ఎక్కువగా ఉన్నందువలన ఇది షుగరునీ, కొవ్వునీ రక్తంలో ఎక్కు
వగా చేరకుండా నిరోధిస్తుంది. స్థూలకాయం, షుగర్ వ్యాధి, కీళ్ళవాతం, ఇతర
వాతవ్యాధుల్లో సొరకాయ ఆ విధంగా ఔషధంలా మేలు చేస్తుంది. మంచి నిద్రపడు
తుంది. మెదడు సంబంధమైన వ్యాధుల్లోనూ, మూర్చల అబ్బులోనూ సార
పానీయం బాగా మేలు చేస్తుంది. శరీరానికి, మనసుకు ప్రశాంతతనిస్తుంది. విష
దోషాలకు విరుగుడుగా పనిచేస్తుంది. రోజూ ఈ పానీయం తాగితే జుట్టు నల్ల
గానూ, ఏపుగానూ పెరుగుతుందని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. సొరగుజ్జుని,
ఆవనూనెతో కలిపి తలకు పట్టిస్తే జుట్టు మృదువుగా ఉంటుంది.

STHOOLA KAYANIKI AHARA CHIKITHSA


ఉపవాసాలుంటే స్థూలకాయం తగ్గిపోతుందా?
* సహజంగా మనం తీసుకొనే ఆహార పరిమాణాన్ని మన
పెట్టుకోవాలి. ఇప్పటికిప్పుడు అర్జెంటుగా బరువు తగ్గాలన్నట్టు
నిరాహార దీక్షలు మొదలెడితే ప్రమాదం, జీర్ణశక్తిని పెంచుకొంటే ఆకలి
వాటు మీద ఆధారపడిన విషయం. ఆకలి వేరు, జీర్ణం కావటం వేరు.
కడుపు ఖాళీ అవగానే ఆకలి వేస్తుంది. కానీ, తిన్నది సక్రమంగా జీర్ణం
కావాలి కదా! ఎంత తిన్నారన్నది కాదు, ఏం తిన్నారన్నది ముఖ్యం. అది
స్థూలకాయానికి ఆహార చికిత్స

ఆకలిని, జీర్ణశక్తినీ దృష్టిలో పెట్టుకొని ఉపవాస నియమాలు
 అతిగా తినవలసి వస్తుందనేది ఒక భ్రమ! ఆహారాన్ని ఎక్కువ
గానే తక్కువగానే తీసుకోవటం అనేది మొదటి నుంచీ మన అల

అజీర్తిని, తద్వారా కొవ్వును పెంచేదైతే కొద్దిగా తిన్నప్పటికీ
ఎక్కువ హాని చేస్తుంది. తేలికగా అరిగే ఆహార పదార్థాన్ని కడు
పునిండా తిన్నా అపకారం చెయ్యదు. స్థూలకాయం నియంత్ర
ఇలో ఈ సూత్రాన్ని గుర్తుంచుకోవాలి.
కడుపు నిండకుండానే బలవంతంగా అర్ధాకలితో భోజనం ముగిస్తే, ఆకలి
అలాగే ఉండి ధ్యాసంతా తిండి మీదే లగ్నం అవుతుంది. దాంతో చిరుతిళ్లు తినటం
ఎక్కువై, 'అతి భోజనం' చేసే పరిస్థితి వస్తుంది. ఆకలిని చంపుకుంటే అజీర్తి వలన
స్థూలకాయం పెరుగుతుంది.
అన్నం తినడానికి ముందు తప్పనిసరిగా
ఒకటి రెండు గ్లాసుల నీళ్ళు త్రాగండి. భోజ
నానికి ముందు నీళ్ళు త్రాగే అలవాటు వలన
శరీరం సన్నబడుతుంది. స్థూలకాయులు
భోజనానికి ముందు, బక్కచిక్కిన పిల్లలు
భోజనం తరువాత నీళ్ళు తాగాలని ఆయుర్వే
దశాస్త్రం చెప్తోంది. అందువలన తక్కువ ఆహా
రంతో కడుపు నింపుకునే అవకాశం
ఉంటుంది. ఆహారం తీసుకొంటూ మధ్యమ
ధ్యలో నీళ్ళు త్రాగటం వలన వాతమూ వేడి
అదుపులో ఉంటాయి. ఎసిడిటీ పెరగకుండా
ఉంటుంది. అది జీర్ణప్రక్రియ శక్తిమంతం
కావడానికి దోహదపడుతుంది. అజీర్తి వలననే స్థూలకాయం ఏర్పడుతుంది. జీర్ణ
శక్తి బలంగా ఉంటే, స్థూలకాయం అదుపులో ఉంటుంది. ఈ సూత్రానికి తగ్గట్టుగా
మనం మంచినీటిని త్రాగే అలవాటు చేసుకోవాలి.

TYPHOID LO SWACHA AHARAM

టైఫాయిడ్లో స్వచ్ఛ ఆహారం

 టైఫాయిడ్ జ్వరం తిరగబెడ్తోంది. నివారణ ఎలా?
* టైఫాయిడ్ జ్వరం హాని చేసే సూక్ష్మజీవులతో కలిగిన ఆహారం వలన ప్రధా
నంగా వస్తుంది. టైఫాయిడ్, అమీబియాసిస్, కలరా, కామెర్లు, కొన్ని
రకాల విష జ్వరాలు ఇవన్నీ పర్యావరణ అశుభ్రత లోంచి పుట్టే వ్యాధులు.
జనం స్వచ్ఛందంగా రోడ్లు ఊడవటం మాత్రమే స్వచ్ఛభారతం కాదు.
నదుల్నీ, కాలువల్నీ, ఊరి మురుగుతో కలుషితం చేసి, ఆ నీటినే అర
కొరగా శుభ్రం చేసి మంచినీటిగా సరఫరా చేసే ప్రభుత్వ విధానాల్లో
మార్పు స్వచ్ఛ భారతం అనిపించుకుంటుంది. కడగని నీళ్ళ బ్యాంకు
స్వచ్ఛభారతం పరిధిలోని అంశమే! శవాలను నిలవ బెట్టేందుకు ఉప
యోగించే బసు దిమ్మలతోనూ, అపరిశుభ్రమైన నీటితోనూ
నిర్ణచందు చేసే ఐస్ క్రీములు పిల్లల్లో టైఫాయిడ్ తదితర పర్యావరణ
వ్యాధులకు కారణాలౌతున్నాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాట
మాడే ఇలాంటి ఆహార పదార్థాల తయారీ మీద ప్రభుత్వానికి అదుపు ఉండాలి.
ఉడికీ ఉడకని మాంస శాక
పాకాలు, బైట ఆహార పదా
రాలు, కత్తీలు కలిసిన నెయ్యి,
నూనె, రంగులు కలిసిన
పసుపు, కారం, వడియాలు,
స్వీట్లు, హాట్లు, స్నాక్స్, ఆఖ
రికి పాలు, నీళ్ళు కూడా
స్వచ్ఛ ఆహారం మనకు దక్క
కుండా చేస్తున్నవే. మనం
వాటికి దూరంగా ఉండటం టైఫాయిడ్ నివారణకు మొదటి అంశం.
ప్రజ్ఞ చల్లదనం లేని పెరుగు, మజ్జిగ ఎక్కువగా తీసుకుంటే, టైఫాయిడ్
జ్వరంలో పేగులకు రక్షణగా ఉంటాయి. వాముపొడిగానీ, దాల్చిన చెక్కపొడిగానీ,
ధనియాల పొడిగానీ, జీలకర్ర పొడిగాని, ఒక గ్లాసు నీళ్ళలో పావు చెంచా మోతా
దులో కలిపి బాగా మరిగించి మంచినీళ్ళకు బదులుగా తాగించండి. ఈ జీరా
వాటర్ లాంటివి జీర్ణాశయాన్ని బలసంపన్నం చేస్తాయి. పల్చని గోధుమ రొట్టెలు
(పుల్కాలు) ఇంట్లో చేసినవి శ్రేయస్కరం. ఇది వ్యాధిని త్వరగా తగ్గనీయకుండా
చేస్తుంది. పదే పదే టైఫాయిడ్, అమీబియాసిస్ లాంటి వ్యాధులు తిరగబెట్టడానికి
ఆహార పరిశుభ్రత లేకపోవటమే కారణం. టైఫాయిడ్ తగ్గిన తరువాత కూడా
కొన్నాళ్లపాటు తేలికగా అరిగే ఆహార పదార్ధాలిచ్చి, జీర్ణశక్తిని పెంచే జీరావాటర్,
మజ్జిగలాంటివి తాగిస్తూ వుంటే రోగి త్వరగా కోలుకుంటాడు.

Tuesday 12 April 2016

AYURVEDAM CHEERALU / AYURVEDIC SAREES

.• మూలికలు, సుగంధ ద్రవ్యాలతో దారానికి కొత్త వన్నెలు
• సహజ రంగుల వస్త్రాలు ఆరోగ్యానికి నేస్తాలంటున్న వైద్యులు
(ఆంధ్రజ్యోతి-భూదాన్‌పోచంపల్లి)
వస్త్రాల తయారీలో ప్రసిద్ధిగాంచిన నల్లగొండ జిల్లా నేత కార్మికులు కొత్త పంథాలో
ముందుకెళ్తున్నారు. పోచంపల్లి, కొయ్యలగూడెం, పుట్టపాకల్లోని కొందరు చేనేత కళాకా
దులు. ఆయుర్వేదంలో వాడే మూలికలు, సుగంధ ద్రవ్యాల ద్వారా దారాలకు సహజసి
దమైన రంగులద్దుతున్నారు. సహజరంగులు అద్దిన వస్త్రాలను ధరిస్తే అందానికి
అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యం అంటున్నారు. ఆయుర్వేద నిపుణులు. వీటివల్ల
శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందని చాలా
మంది ఈ వస్త్రాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో
గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ వస్త్రాలకు ఆదరణ పెరుగుతోంది.
రంగులన్నీ ప్రకృతి ప్రసాదమే!
ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఇండిగో అనే
నీలిరంగు పట్టిల్లు భారతదేశమే. చెట్టు నుంచి లభించే
రంగు ఇది. భోజనం చేసిన తర్వాత సంప్రదాయంగా
తినే తాంబూలంలో వాడే కాచు' ఉపయోగిస్తే బ్రౌన్
రంగు వస్తుంది. ఎర్రచందనం చెక్క పొడి నుంచి
మిరప పండు రంగు వస్తుంది. ఎండిపోయిన బంతి,
కుసుమ, మోదుగు పూల నుంచి పసుపు రంగు గోరిం
టాకు, గుంటకుంట్ల ఆకు నుంచి ఆకుపచ్చ. వేప,
జామ
ఆకుల నుంచి లేత ఆకుపచ్చ. జాఫ్రా, ఎర్రగుంటాకు
నుంచి కాషాయం.. చెట్టు బెరడు చూర్ణం నుంచి కాఫీ
రంగు తంగేడు పువ్వు. మనం నిత్యం వాడే పసుపు
(కొమ్ము)ల నుంచి పసుపు రంగు. ఆయుర్వేద వైద్యంలో
ఔషధాలుగా ఉపయోగించే దానిమ్మ. కరక్కాయ, మారేడు,
మంజిష్ట, మోదుగుపూలు, తుమ్మ, సండ్ర చెట్ల బెరళ్లు
కూడా ప్రత్యేక రంగుల తయారీకి ఉపయోగపడుతు
న్నాయి. ఇనుప ముక్కలు బెల్లం మిశ్రమాన్ని కొన్ని రోజులు
నిల్వచేస్తే నలుపు వర్ణం తయారవుతుంది.
రోజుల తరబడి..
రసాయనాలతో తయారైన రంగులను దారానికి అద్దడం
చాలా సులువు. రసాయనిక పొడితో నలుపురంగు అద్దకం
గంటలోనే పూర్తయితే అదే రంగును సహజరంగుతో అద్దా
లంటే 21 రోజులు పడుతుంది. ఇందుకు దారాన్ని సిద్ధం
చేయడానికే నాలుగు రోజుల ప్రక్రియ ఉంటుంది.
మొదటిరోజు చల్లని క్షారగుణంలేని నీళ్లలో ఉప్పు
కలిపి దారాన్ని 24 గంటలు నానబెట్టాలి
• రెండోరోజు నాన్ డిజటర్జెంట్ సబ్బు, వంటసోడాను
కలిపి ఆ నూలును నాలుగు గంటల సేపు మరిగే
నీళ్లలో వేసి ఉడకబెట్టాలి. మంట తగ్గించి ఒక రోజంతా
తగినంత వేడినీళ్లలో పొయ్యిపైనే ఉంచాలి.
మూడోరోజు ఈ నూలును తాజా నీళ్లతో శుభ్రం చేసి
నీడలో ఆరవేయాలి. ఇలా శుద్ధి చేసిన 'కర
క్కాయ పొడి కలిపిన నీళ్లలో గంట సేపు నానబెట్టాలి
తర్వాత దారాన్ని 'పటికపొడి' కలిపిన వేడి నీళ్లలో నాన
బెట్టి ఆ తర్వాత నీడలో ఆరబెట్టాలి ఇదే ప్రక్రియ నాలు
గైదు పర్యాయాలు చేసిన తర్వాత ఆ దారానికి సహజ
రంగులు అద్దుతారు. అద్దకం పని పూర్తి కావడానికే
10 నుంచి 15 రోజులు సమయం పడుతుంది.
• ఔషధగుణాలు పోకుండా అద్దకం ప్రక్రియ పూర్తిచేసి
ఇక్కత్ డిజైన్లతో మగ్గాలపై చీరలు, చున్నీలు, డ్రెస్ మెటీరి
యల్ తయారు చేస్తున్నారు.
వ్యయం.. తేడా..
టై అండ్ డై విధానంలో రూపొందించే చేనేత వస్త్రా
లకు పోచంపల్లి ప్రసిద్ధి. ఈ పద్ధతిలో ఒక వార్పు (7)
చీరల తయారీకి నూలు ధరతోపాటు కెమికల్ రంగులు,
ఇతరత్రా మగ్గం కూలీ, చిటికి, ఆసు తదితర పనుల
నిమిత్తం రూ.30 వేలు అవుతుంది. అదటై అండ్ డై
వెరైటీలో ఇక్కత్ డిజైన్లతో సహజ రంగులతో వార్పు (7)
చీరల తయారీకి రూ.50 వేలకు పైగా ఖర్చు అవుతుంది.
సహజ రంగుల ధరలు మామూలు కెమికల్ రంగుల ధర
లకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. 10 గ్రాముల కెమికల్
రంగుకు
సహజరంగుల
రూ.100 దాకా ఖర్చ
అద్దకం
యితే.. 10
10 గ్రాముల
సహజ రంగుకు రూ.300
నుంచి రూ.400 వరకూ ఖర్చవు
తుంది. సమయం కూడా ఎక్కువే పడు
తుంది. దీంతో చాలా మంది తక్కువ సమ
యంలో తక్కువ ఖర్చుతో అధిక ఆదాయ వన
రుగా ఉన్న కెమికల్ రంగుతోనే వస్త్రాల తయారీకి
మక్కువ చూపుతున్నారు. ప్రస్తుతానికి కొందరు
-వ్యాపారులు. దేశ విదేశాలకు చెందిన మార్కెట్లోని ట్రేడర్స్
నుంచి ఆర్డర్ తీసుకున్నాక ఎగుమతి నిమిత్తం మాత్రమే సహజ రంగులతో వస్త్రాలు
తయారు చేస్తున్నారు. క్రమంగా సహజ రంగుల వస్త్రాల పట్ల ప్రజలు మక్కువ చూపు
తుండడంతో ఈ వస్త్రాల తయారీ వైపు చేనేత కార్మికులు దృష్టి సారిస్తున్నారు.

మార్కెట్లోకి ఇప్పుడిప్పుడే..
సింథటిక్ పాలిషర్ క్లాత్ పై కృత్రిమ రంగుల్లో
అందంగా కంటికింపైన డిజైన్లలో వస్త్రాలు వస్తున్న ఈ
రోజుల్లో సహజరంగుల వస్త్రాలు కొనుగోలు చేసే వారి
సంఖ్య చాలా తక్కువే తయారుచేసేవారి సంఖ్యా
అంతకన్నా తక్కువే!! ఈ మధ్యనే పోచంపల్లి ఇక్కత్ డిజై
న్లకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తున్న నేపథ్యంలో
అంతర్జాతీయ మార్కెట్ కనుగుణంగా సహజ రంగులతో
వస్త్రాలు తయారు చేయా
ఆలోచన వారికి
వచ్చింది. మార్కెటింగ్
వసతి కల్పిస్తే దీనివల్ల
తమకు మరింత ఉపాధి
లభిస్తుందని వారు
పేర్కొంటున్నారు
ప్రస్తుతానికైతే కొన్ని దేశాల
వ్యాపారుల నుంచి సహజ
రంగుల వస్త్రాలకు వస్తున్న
వీటిని
తయారుచేస్తున్నామని
చేనేత కళాకారులు
అంటున్నారు.

ప్రభుత్వం ప్రోత్సహించాలి
కొయ్యలగూడెంలోని అయిదుగురు చేనేత కార్మికులకు
చేనేత సేవా కేంద్రం (వీవర్స్ సర్వీస్ సెంటర్ ద్వారా
దస్తకార్ ఆంధ్ర సంస్థ నిపుణులతో సహజరంగుల అద్ద
కంపై 1997లో శిక్షణనిప్పించారు. అందులో శిక్షణ పొందిన
నేను వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి గృహవిజ్ఞాన
కళాశాలలోనూ నెలరోజులు శిక్షణ పొందాను. సహజరంగులతోనే చీరలు, చున్నీలు,
డ్రెస్ మెటీరియల్ తయారు చేస్తున్నాను. ప్రైవేటు సంస్థలు వీటిని తయారు చేయి
స్తున్నాయి. కెనడా నుంచి వచ్చి వారు నాకు వస్త్రాలు తయారుచేయడానికి ఆవ
కాశం ఇచ్చారు. ప్రభుత్వం సహజరంగులతో వస్త్రాలు తయారు చేయడానికి, విదే
శాలకు ఎగుమతులు చేయడానికి ప్రణాళికలు రచించాలి. ప్రైవేటు సంస్థలకు
వస్త్రాలు తయారు చేసి, పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం ప్రోత్సహి
స్తేనే మరికొంతమంది సహజరంగుల అద్దకం పనిచేయడానికి ముందుకొస్తారు.
- దుగ్యాల శంకర్, చేనేత కార్మికుడు, కొయ్యలగూడెం