1. ) అపోహ..
గ్రీన్ టీ ప్రతి రోజూ తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు..
వాస్తవం..
ప్రత్యేకంగా గ్రీన్ టీ తీసుకుంటేనే బరువు తగ్గుతారనే దానిలో వాస్తవం లేదు.ఐతే క్రమ పద్ధతిలో ఆహార నియమాలు పాటిస్తూ ,వ్యాయామాలకు ప్రాధాన్యమిస్తూ ఈ టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ లభించే గ్రీన్ టీ శరీరానికి మేలు చేస్తుంది.
2.) అపోహ..
అల్పాహారం మానేస్తే బరువు నియంత్రణలో ఉంటుంది..
వాస్తవం..
ప్రతి రోజూ అల్పాహారం తీసుకోని వారికంటే తీసుకున్నవారే త్వరగా బరువు తగ్గుతారని చాలా అధ్యయనాలు రుజువు చేశాయి.ఎలాగంటే ఉదయాన్నే ఆహారం తీసుకోవడం వల్ల జీవక్రియ చురుగ్గా జరుగుతుంది. పనులు చేసుకోవడానికి శరీరం ఉత్సాహంగా సహకరిస్తుంది.దాంతో త్వరగా కెలోరీలు ఖర్చవుతాయి కూడా .
3.) అపోహ..
ఆలస్యంగా భోజనం చేసినా బరువు పెరగం..
వాస్తవం..
ఎప్పుడైనా ఆలస్యంగా చేసే పనులు ఆరోగ్యానికి అంత మంచిది కాదు.దినచర్య పాటించడం దగ్గర నుంచి రాత్రి పూట నిద్రించే వరకు ప్రతి పనిని క్రమ పద్ధతిలో చేయడం అలవాటు చేసుకోవాలి. రాత్రి నిద్రకు రెండు గంటల ముందే భోజనం చేయడం మంచి అలవాటు.
అందులో భాగంగా నూనె పదార్థాలు , మసాలా తో చేసిన ఘాటైన వంటకాలు లేకుండా తేలిగ్గా జీర్ణమయ్యే వాటిని ఆలస్యంగా కాకుండా ముందుగా తీసుకుంటే మంచిది.లేదంటే బరువు పెరిగే ప్రమాదం లేకపోలేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి