దీర్ఘ కాలికంగా జలుబు, పిల్లి కూతలతో ఆయాసం. . ఆయుర్వేద పరిష్కారాలు.
ఉత్తరేణి చెట్లు, వాకుడు చెట్లు,అడ్డసరం ఆకులు కాడలు సమ భాగాలుగా తెచ్చుకోవాలి . అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా చేసి కడిగి ఆరబెట్టి బాగా ఎండిన తర్వాత ఆ ముక్కలను శుభ్రమైన రాతి మీద పోసి నిప్పు అంటించి బూడిదగా చేయాలి. దానిని జల్లించి దానితో సమానంగా పటిక బెల్లం పొడి కలిపి గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. రోజూ రెండు లేదా మూడు పూటలా ఒక చెంచా పొడిని ఒక చెంచా తేనె తో కలిపి నిదానంగా సేవిస్తుండాలి. ఎంత కాలంనుండి ఉన్న ఆయాసమైనా, ఆస్తమా అయినా , పిల్లి కూతలైనా తప్పకుండా తగ్గిపోతాయి.
దంతాలు కదలడం, ఎర్రగా మారడం వంటి సమస్యలు.. ఆయుర్వేద పరిష్కారాలు..
బాగా ముదిరి ఉన్న ఉత్తరేణి చెట్టును చూసుకుని పూజ చేసి సమస్యను మనసులోనే తెలిపి ఆ చెట్టును పీకి దాని వేళ్ళను ఇంటికి తెచ్చుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి చూపుడు వేలంత ముక్కలుగా తయారు చేసుకొని ఆరబెట్టాలి. రోజూ ఒక ముక్కతో నిదానంగా మృదువుగా దంతాలను అన్ని వైపులా తోముతుండాలి. తోమిన తర్వాత అరగంట ఆగి గోరు వెచ్చని నీటితో పుక్కిలించాలి. ఈ విధంగా చేస్తుంటే క్రమంగా దంతాలు తెల్లబడి , దృఢంగా జీవిత కాలమంతా కళకళలాడుతుంటాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి