Wednesday 14 July 2021

పుండు మచ్చలకు తేనె

 గాయాలు , డోకుడు పుళ్ళు,కాలిన పుళ్ళు ఇలాంటివి ఉన్నప్పుడు పుండు మాడిన తర్వాత రోజూ ఆ ప్రాంతం మీద తేనె రాయండి.చర్మం మీద పొరలు త్వరగా వచ్చి చర్మం రంగులో మచ్చలు కలిసిపోతాయి.లేకపోతే తెల్ల మచ్చలు మచలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది.

పేగు పూత - చేమంతి పూల మందు.

 గ్యాస్ ట్రబుల్ ,కడుపులో మంట, కడుపులో నొప్పి ఇలా ప్రారంభమై నెమ్మదిగా పేగు పూత వ్యాధిగా పరిణమించే పెప్టిక్ అల్సర్ జబ్బుకు విమోచనం లేదు .ఎందుకంటే మనం ఈ వ్యాధిని అనునిత్యం ఏదో ఒక విధంగా పెంచి పోషిస్తూ నే ఉంటాం కాబట్టి.  కడుపు మండ ని వారు ,కడుపులో మంట లేనివారు ఈ లోకంలో ఎవరు ఉంటారు చెప్పండి.  అల్సర్ వ్యాధి కి ఇదే కదా కారణం - కడుపుమంట!


చేమంతి పూలను ఎండించి చూర్ణం చేసి మంచి తేనెతో తీసుకుంటే  పేగులకు బలం !అన్నం తినగానే కడుపునొ ప్పి వస్తున్న వారు ,నొప్పి వచ్చినప్పుడు ఏదైనా ఆహారం తీసుకుంటే తగ్గిపోతున్న వారు ఇద్దరికీ ఇది మంచి మందు.కడుపులో పాములు కూడా దీంతో చచ్చి పడిపోతాయి.

తలలో పేలు పోవడానికి సీతాఫలం గింజలు

 సీతాఫలం గింజలను సేకరించుకుని శుభ్రంగా  కడిగి ఎండించి మెత్తగా దంచి ఒక సీసాలో భద్రపరుచుకోండిి. వీలైతే వీలైతే సీతాఫలం సీతాఫలం లేత ఆకులను కూడా ఎండించి దంచి ,ఈ రెండింటి మిశ్రమాన్ని ఒక చెంచా మోతాదులో తీసుకుని ,కాసింత నీరు పోసి తడిపి తలకి పట్టించండి.ఒక అరగంట తర్వాత తలంటు పోసుకొండి.తలలో పేలు పోతాయి.తలలో పుళ్ళు తగ్గు తాయి.శరీరం మీద పుళ్లకు కూడా ఈ పొడిని రాయవచ్చు.

శ్రావ్యమైన స్వరం కోసం - మామిడి చిగురు

 మావి చిగురు తినగానే కోయిల కూసేనా అని పాట ఉంది, మామిడి చిగురు తిన్నంత మాత్రాన కోయిల కూస్తుందా? కోయిలే కాదు మామిడి చెట్టు లేత చిగుళ్ళు తింటే మనం కూడా శ్రావ్యంగా పాడగలుగుతాం.గొంతు శుద్ధి అవుతుంది.

ఈ లేత చిగుళ్ళు మెత్తగా దంచి ,నీళ్లలో కలిపి బాగా మరిగించి ,చిక్కటి కషాయం తీసి వడగట్టి పంచదార కలుపుకొని తాగితే మంచిది.

ఈ కషాయాన్ని పంచదార వేయకుండా ,నోట్లో పోసుకుని పుక్కిలిస్తే గొంతు,నోరు వ్యాధులన్నీ తగ్గి ,గొంతు శుద్ధి అవుతుంది.

Tuesday 13 July 2021

మానసిక వ్యాధులకు గులాబీల మందు

 గులాబీ పువ్వులు  మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి .ఆ పువ్వులను వాసన చూస్తేనే ఒక విధమైన ప్రశాంతత కలుగుతుంది. అందుకే ప్రశాంతత ,మానసిక శాంతి కావాలనుకునే వారికి గులాబీ పూలను ఔషధంగా సేవించడం మంచి మందు .

గులాబీ పువ్వులు ఎండించి మెత్తగా దంచి పంచదార కలుపుకుని రోజూ ఉదయం సాయంత్రం 1-2 చెంచాలు తినండి.

విరేచనం సాఫీగా అయ్యేలా చేసే గుణం కూడా ఉంది. కాబట్టి ఎంత మోతాదులో తీసుకుంటే ఒక్క విరేచనంంసాఫీ గా అవుతుందో అంత మోతాదులో ఈ గులాబీ రేకుల పొడిని తీసుకోండి.మానసిక వ్యాధులు అలజడులు మనోవికారాలున్నవారికి ఇది క్విక్ రెమెడీ గా పనిచేస్తుంది.బీపీ వ్యాధి ఉన్నవారికి కూడా ఇది అద్భుతమైన మందు.

నీరసానికి కిస్మిస్ మందు

 ఎండిన కిస్మిస్ పండ్లు బజార్ లో దొరుకుతాయి.ఈ ద్రాక్ష పండ్లకు సమానంగా పంచదార ,తేనె కలిపి ఒక సీసా లో పోసుకుని రోజూ రెండు చెంచాల మందు ఉదయం,సాయంత్రం తాగండి.కడుపులో వేడి తగ్గుతుంది.అజీర్తి పోతుంది, పైత్యం తగ్గుతుంది. అమీబియాసిస్ వ్యాధి వలన కలిగిన ఉడుకు తగ్గుతుంది.గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గుతుంది.ప్రయత్నించి చూడండి. మీకు షుగర్ వ్యాది లేకపోతేనే ఈ ప్రయోగం చేయాలి సుమా!