hindi - కుందురు , కందారి
latin - coccinia indica ,momordica monodelpha , cephalandra indica ,
ఇది కంచెలపైన , పందిర్ల పైన ,తోటలలోను , చెరువు కట్టల పైన ,విరివిగా పుట్టి పక్కనే వున్న పెద్ద చెట్లకు అల్లుకుని పూలు , కాయలు కాస్తుంది.పూలు తెల్లగ వుంటాయి.కాయలు పొడవుగా పైన చారలు కలిగి ,పచ్చిగా వున్నప్పుడు ఆకు పచ్చగాను ,పండిన తర్వాత యెర్రగాను అవుతాయి.వీటిలో చేదు గా వుండే కాయలను చేదు దొండ కాయలు అంటారు.
మొలలు తగ్గడానికి - చేదు దొండ ఆకు రసం 1, 2 చెంచాలు మోతదుగా రెండు పూటలా సేవిస్తుంటే అర్శ మొలలు ,పైత్య రోగం , వుబ్బు రోగం , పాండు రోగం , క్షయ రోగం హరించి పోతాయి.
కామెర్లు / పసిరికల రోగం తగ్గడానికి -
దొండ ఆకు పసరు - 30 గ్రా
మగ దూడల గేదె పెరుగు - 50 గ్రా
పై వాటిని కలిపి పర గడుపున వరుసగా 7 రోజులపాటు సేవించాలి.కారం,వుప్పు,పులుపు లేని చప్పిడి ఆహారాన్ని పథ్యంగా పాటించాలి. ఈ నియమం అనుసరిస్తుంటే పసిరికల రోగం 7 రోజుల్లోనే అదుపులోకి వస్తుంది.
విష జంతువుల కాటు మానకుంటే -
చేదు దొండాకులను మెత్తగ నూరి ఆ ముద్దను పైన వెసి కట్టు కడుతుంతే పాములు , తేళ్ళు ,కుక్క , నక్క,కోతి మొదలైన జంతువుల కాట్లు పడి మానకుండా మొండి పడిన పుండ్లు దీనివల్ల మాడి మానిపోతాయి.
తలలో కురుపులు తగ్గడానికి -
దొండాకును దంచి బట్టలో వేసి పిండి రసం తీయాలి. ఆ రసం లో పసుపు రంగు గవ్వలను 3 రోజులపాటు నాన బెట్టాలి. ఆ తరువాత వాటిని యెండలో పూర్తిగా యెండిపోయే వరకు వుంచాలి.
బాగా యెండిన తర్వాత ఆ గవ్వలను యెర్రని నిప్పులపైన వేసి నల్లగా మాడే వరకు కాల్చాలి.తర్వాత ,వాటిని మెత్తగా నూరి జల్లించి ఆ భస్మంలొ తగినంత ఆవు నెయ్యి కలిపి మర్దించి తలకు పట్టాలి.యే ఇతర మందుల వల్ల తగ్గని తల లోని మొండి కురుపులు ,పుండ్లు దీనితో పూర్తిగా తగ్గిపోతాయి.
సాధారణ దొండ కూర గుణాలు -
రుచి గా వుండి చలువ చేస్తుంది.యెక్కువగా తింటే పొట్టలో బరువుగ వుండి అజీర్ణం పుట్టించి ,బుద్ధిని మందగింప చేస్తుంది.ఐతే అతి వేడిని ,ఆ వేడి వల్ల కలిగే ఇతర సమస్యలను ,రక్త స్రావాలను ,వాపులను ,వాత రోగాన్ని , క్రిమి రోగాన్ని పోగొడుతుంది.ఈ కూరను పరిమితంగా వాడుకోవాలి.
తీపి దొండ కూర గుణాలు -
రుచిగా వుండి శరీరంలోని విష పదర్థాలను బహిష్కరింప చేస్తుంది.ముఖ్యంగా కండ్ల రోగాలకు చాలా హితంగా వుంటుంది.వాత ,పిత్త సంబంధ చర్మ రోగాలను ,వాంతులను పోగొట్టి , జటరాగ్నిని వ్రుద్ధి చేస్తుంది.ముఖ్యంగా ఈ కూర రక్త హీనులకు ,పసిరికల రోగం వచ్చిన వారికి ,నేత్ర రోగులకు చాలా ఇంపుగా వుంటుంది.ఐతే దీనిని కూడా పరిమితంగా వాడుకోవాలి.
.
స్త్రీల యోని శూల తగ్గడానికి -
దొండ ఆకు పసరు - 30 గ్రా
మగ దూడ వున్న గేదె పెరుగు - 50 గ్రా
పై వాటిని కలిపి రెండు పూటలా ఆహారానికి గంట ముందు 3 రోజుల పాటు విడువకుండా తాగుతూ చప్పిడి పథ్యం పాటిస్తుంటే యోని శూల తగ్గి పోతుంది.
లింగ బలహీనతకు లేపనం -
దొండ ఆకులు - 2
తెల్ల గురిగింజల పొడి - 2 గ్రా
పొంగించిన వెలిగారం పొడి - 2 గ్రా
పై వటిని కలిపి కొంచెం నిమ్మ రసం తో నూరి నిద్రించే ముందు లింగానికి లేపనం చేసుకోవాలి.20 రోజుల పాటు చేస్తే లింగం ద్రుఢంగా మారుతుంది.
.బహిష్టు నొప్పి తగ్గడానికి -
దొండ ఆకు
ఆవాలు
వెల్లుల్లిపాయ
పై వాటిని సమాన భాగాలలో తీసుకుని నూరి , పూటకు 10 గ్రా ,రోజు రెండు లేదా మూడు పూటలా నొప్పి తీవ్రతను బట్టి సేవిస్తుంటే ముట్టు నొప్పి తగ్గుతుంది.
ఆదొండ కూర - గుణాలు -
కండ్ల రోగులకు హితంగా ఉంటుంది.వాత రోగాలు , కఫ రోగాలు ,గొంతు రోగాలు కలవారికి కూడా ఇది మేలు చేస్తుంది.ఐతే దీనిలో నెయ్యి గానీ ,పులుపు గానీ , కలిపి వండి తినాలి,లేకుంటే మలబద్ధకం, అగ్ని మాంద్యం కలుగుతాయి.ఇది ఉదర క్రిములను నశింప చేసి గుండెకు మంచి బలం కలిగిస్తుంది.
మధుమేహానికి దొండ పసరు -
దొండాకు రసం 20 gm మోతాదుగా ఉదయం ఆహారానికి అర గంట ముందు పరగడుపున సేవిస్తుంటే 40 నుండి 80 రోజులలో మధుమేహం పూర్తిగా అదుపులోకి వచ్చి ఆరోగ్యం కలుగుతుంది.
అరి కాళ్ల మంటలు తగ్గడానికి -
పచ్చి దొండ ఆకు, పచ్చి చిక్కుడు ఆకు , పచ్చి నల్ల ఉమ్మెత్త ఆకు సమంగా కలిపి దంచి ఆ ముద్దను బట్టలో పిండి రసం తీయాలి. ఆ రసాన్ని రెండు పూటలా అరి కాళ్లకు ఇంకా శరీరం పైన మంటలున్న చోట మర్దన చేస్తుంటే అరి కాళ్ల మంటలు తగ్గిపోతాయి.
తెల్ల గుడ్ల సర్పి తగ్గడానికి -
పచ్చి దొండ ఆకు రసం సాన రాయి పైన వేసి ఎర్ర కాచుతో అరగదీసి గంధం తీయాలి.ఆ గంధాన్ని పైన పట్టిస్తుంటే తెల్ల గుడ్ల సర్పి రోగం తగ్గిపోతుంది.
అరి కాళ్ల మంటలు తగ్గడానికి -
పచ్చి దొండ ఆకు, పచ్చి చిక్కుడు ఆకు , పచ్చి నల్ల ఉమ్మెత్త ఆకు సమంగా కలిపి దంచి ఆ ముద్దను బట్టలో పిండి రసం తీయాలి. ఆ రసాన్ని రెండు పూటలా అరి కాళ్లకు ఇంకా శరీరం పైన మంటలున్న చోట మర్దన చేస్తుంటే అరి కాళ్ల మంటలు తగ్గిపోతాయి.
తెల్ల గుడ్ల సర్పి తగ్గడానికి -
పచ్చి దొండ ఆకు రసం సాన రాయి పైన వేసి ఎర్ర కాచుతో అరగదీసి గంధం తీయాలి.ఆ గంధాన్ని పైన పట్టిస్తుంటే తెల్ల గుడ్ల సర్పి రోగం తగ్గిపోతుంది.