Sunday 19 June 2016

లడ్డూలు - ఆయుర్వేద ఆరోగ్య ప్రయోజనాలుLADDOOLU AYURVEDA AROGYA PRAYOJANALU.


లడ్డూ అంటే తెలుగువారికెంతో భక్తి ,పవిత్రం , శుభం.ఇవి మన సంస్కృతిలో ఒక భాగం.సుఖ సంతోషాలకు లడ్డూ పర్యాయపదం.లడ్డూ చేసుకోవడం అంటే తెలుగు వారికి పండగ చేసుకోవడమే.పెళ్ళిళ్ళలో తొలి వడ్డన లడ్డు.తిరుపతి లడ్డు లాగా బందరు లడ్డు / తొక్కుడు లడ్డు కూడా ఎంతో ప్రసిద్ధికెక్కింది.

లడ్డూలను శనగపిండితోనే చేయాలని నియమం ఏమీ లేదు.సున్ని ఉండలు , కొబ్బరి ఉండలు ,నువ్వుండలు ఇవన్నీ లడ్డూలే.మహారాష్ట్ర , బెంగాళీల ప్రభావంతో స్వాతంత్రోద్యమ కాలంలో శనగ పిండి వంటకాలు మనకు ఎక్కువ అలవాటయ్యాయి.అంతకు పూర్వం మినప,జొన్న,సజ్జ,వరి ,గోధుమ,ధాన్యం వంటి చిరుతిళ్లన్నీ వండుకునే వాళ్లు.ఇటీవలి కాలంలో శనగ పిండి వాడకం వేలం వెర్రి అయింది.లడూకి ఆ రుచినిస్తుంది శనగ పిండి మాత్రమే కాదు అందులో చేర్చిన నెయ్యి , పటిక బెల్లం,పచ్చ కర్పూరం,జీడి పప్పు , కిస్మిస్ , యాలకులూ వగైరా.ఇవి సమృద్ధిగా ఉంటే ఏ పిండితో చేసినా రుచిగానే ఉంటాయి.

" ద " అనే అక్షరంలో ఉండే చిర్రి శనగలు లేదా దేశవాళీ శనగలతో చేసినదైతే శనగ పిండి మంచిదే.శనగ పప్పుని మర పట్టించిన శనగ పిండిని వాడుకోవడం మంచిది.బలకరం,కానీ కష్టంగా అరుగుతుంది.జీర్ణశక్తి బలకరంగా లేనివారికి అపకారం చేస్తుంది.పర్వతాలు ఫలహారం చేయగలవారికి శనగ పిండి మేలు చేస్తుంది.శనగ పిండి తిని తట్టుకోగలగాలి.అంతేకాని శనగ పిండి మంచిది కాదు అని ముద్ర వేయడం సరికాదు.

బొంబాయి రవ్వతో ఆయుర్వేద , ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి ? BOMBAYI RAVVATO AYURVEDA AROGYA PRAYOJANALU EMITI?


బొంబాయి రవ్వను గోధుమల్లోంచే తయారు చేస్తారు.మెత్తగా పిండి చేస్తే అదే మైదా పిండి అవుతుంది.రవ్వగా పట్టిస్తే అది బొంబాయి రవ్వ అవుతుంది.గోధుమ రవ్వను రవ్వ గోధుమల నుండి తీస్తారు.రెండూ వేర్వేరు గోధుమలు.గోధుమ రవ్వలో కేలొరీలు తక్కువ , పోషకాలు ఎక్కువగా ఉంటాయి.బొంబాయి రవ్వకన్నా గోధుమ రవ్వ మేలైనది.చక్కెర వ్యాధిలో కూడా తినదగినదిగా ఉంటుంది.బొంబాయి రవ్వ ఆకలిని , జీర్ణ శక్తిని చంపుతుంది.కడుపులో ఆంలాన్ని పెంచుతుంది.వేడి చేస్తుంది.కాబట్టి పరిమితంగా వాడుకోవాలి.

మనకు గోధుమ పిండి , గోధుమ రవ్వ తెలిసినంతగా బొంబాయి రవ్వ తెలియదు.కొందరు దీనిని ఉప్మా రవ్వ అని కూడా అంటారు.జొన్న రవ్వ , గోధుమ రవ్వ , బియ్యపు రవ్వలతో చేసే వంటకాలన్నీ బొంబాయి రవ్వ వంటకాలుగా మారిపోయాయి.ఉప్పుడు రవ్వ స్థానం లో బొంబాయి రవ్వ ఇడ్లీ వచ్చింది.గోధుమ పిండితో చేసే హల్వా స్థానంలో కేసరి వచ్చింది.బియ్యపు రవ్వ ఉప్మా స్థానే బొంబాయి రవ్వ ఉప్మా ,జొన్న రవ్వ లేదా గోధుమ రవ్వతో చేసే కిచిడీ స్థానే బొంబాయి రవ్వ కిచిడి ఇలా వంటకాలు బొంబాయి రవ్వ పార్టీలోకి వెళ్ళిపోయాయి.సజ్జ అప్పాలను సజ్జ రవ్వతో చేసే వాళ్ళు ఇప్పుడు బొంబాయి రవ్వతో చేస్తున్నారు.బొంబాయి రవ్వ పూర్ణాలు ,బొంబాయి రవ్వ ఉప్మా బోండాలు , రవ్వ దోశెలు ,రవ్వ లడ్డూలు ఇలా ఒకటేమిటి వంట గదిలో బొంబాయి రవ్వ ఉంటే ఇంకేమి అక్కర్లేదన్నంతగా పరిస్థితి మారిపఒయింది.ఉపయోగం తక్కువ , అపకారం ఎక్కువ ఉండేదే బొంబాయి రవ్వ.

అట్టు,చపాతి,పుల్కా,పూరి ,వీటిలో ఏది మంచిది? /ATTU ,CHAPATHI , PULKA ,POORI MANCHIDHA?POORI ,VEETILO EDI MANCHIDHI?

మంచి చెడు అనేవి అట్టులోనో ,పూరీలోనో ఉండవు.ఏ ఆహర పదార్థమైనా దాని తయారీలో కలిపిన ద్రవ్యాలు ,వాటిని వండే తీరును బట్టి ఉంటాయి.చపాతీని గోధుమ పిండితో చేసి ,కుర్మాతో తినాలని,పూరిని ఆలుగడ్డ కూరతోనే తినాలనీ, పుల్కాలను పాలక్ పనీర్ , మిక్ష్ డ్ వెజిటబుల్ కర్రీ లంటి వాతితో తినాలని నియమాలు పెట్టుకున్నది మనమే.ఇడ్లీ ,అట్టు ,పూరీల్లాంటివి విందు భోజనాల్లో వడ్డించేందుకే గాని , ఇలా ఉదయం పూట పెరుగన్నానికి బదులుగాను,రాత్రి పూట ఉపాహరంగాను తినటానికి  ఉద్దేశించినవి కాదు.ఉత్తరాది వారు రోటీలు తింటారు.మనం రోటీలు , అన్నం రెండూ తింటాం,అదీ తేడా.
అట్టు లేదా దోసెలను మినప పప్పు,బియ్యం రుబ్బి తయారు చేస్తారు.రెండూ ఎక్కువ కెలొరీలను పెంచేవే.చపాతీలను ,రాగులు,జొన్న,సజ్జలతో కూడా చేసుకోవచ్చు.ఆరోగ్యానికి మంచివి.నంజుకునేందుకు అన్నంలోకి తయారు చేసుకున్న కూర ,పప్పు లాంటివి మంచివి.
వొంటి పొర మీద వత్తితే పుల్కా, రెండు పొరల మీద వత్తితే దౌపాతి ,మూడు పొరల మీద వత్తితే త్రిపాతి, నాలుగు పొరల మీద వత్తితే చపాతి అంటారని పరిశోధకులు భావిస్తున్నారు.పొరల మధ్య నూనె ఎక్కించి చపాతీలు తయారు చేస్తారు.నూనె లేకుండా నాలుగు మడతలు వేసి వత్తినందువల్ల అది మందపాటి రొట్టె అవుతుంది అంతే.కావున పూరీలు ,చపాతీలు నూనెకు నిలయాలుగా ఉంటాయి.వాటిని సరదాగా అప్పుడప్పుడు మాత్రమే తినటం మంచిది.చక్కగా విశ్లేషిస్తే పుల్కానే మంచిది అని చెప్పవచ్చు.

Saturday 18 June 2016

మొలకెత్తిన పెసర్లతో ఆయుర్వేద ఆరోగ్య ప్రయోజనాలు. / MOLAKETTHINA PESARLATHO AYURVEDA AAROGYA PRAYOJANAALU.....


పోషకాలు అందించే ముఖ్యమైన ఆహార పదార్థాలలో పెసర్లు ముఖ్యమైనవి.పప్పు ధాన్యాల జాతికి చెందిన పెసర్లలో విటమినులు , ప్రొటీనులు ,ఖనిజ లవణాలు,ఎక్కువగా ఉంటాయి.ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.మొలకెత్తిన పెసర్లతో చాలా ప్రయోజనాలు ఉంటాయి.

1 . వీటిలో ఉండే డైటరీ ఫైబర్ బరువు తగ్గించేందుకు , కొవ్వు కరిగించేందుకు చెడు కొలెస్టరాల్ ను నిర్మూలించేందుకు దోహదపడుతుంది.

2 .వీటిని తక్కువ మోతాదులో తీసుకున్నా ఎక్కువగా తిన్న భావన కలుగుతుంది.అందువల్ల మాటిమాటికి ఆకలి వేయదు.క్రమంగా ఒక మంచి డైట్ విధానం అలవడుతుంది.

3 .పెసర్లను మొలకెత్తిన గింజల రూపంలో తీసుకోవడం వల్ల మలబద్ధకం తొలగిపోతుంది.

4 .విటమిన్ ఏ,బి,సి,డి,ఇ,కె,థయమిన్,రిబోఫ్లావిన్,ఫోలిక్ ఆసిడ్స్,మొలకెత్తిన పెసర్లలో ఎక్కువగా ఉంటాయి.ఇవి శరీర పెరుగుదలకు, కణజాలాల నిర్మాణానికి ఉపయోగపడతాయి.

5 . దృష్టి సంబంధ సమస్యలు కూడా నయమౌతాయి.గుండె జబ్బులు రాకుండా నిరోధించబడతాయి.

6 . రక్తహీనత సమస్య తొలగిపోయి జీర్ణక్రియ మెరుగుపడుతుంది.రక్తంలఒని చక్కెర స్థాయులను తగ్గించే గుణం వీటిలో ఉంటుంది.

7 .యాంటి ఏజింగ్ గుణాలు కూడా వీటిలో ఉన్నాయి.ఇవి వృద్ధాప్యం కారణంగా వచ్చే ముడతలను తగ్గిస్తాయి.

8 . శరీరంలో ఏర్పడే ఇన్ ఫెక్షన్ లను తొలగించే యాంటి ఆక్సిడెంట్ గుణాలు పెసర్లలో ఎక్కువగా ఉంటాయి.ఇవి కణజాల నాశనాన్ని అడ్డుకుంటాయి .

Friday 17 June 2016

అంజూర ఆకులతో గ్రీన్ టీ



అంజూర ఆకులతో గ్రీన్ టీ!

ఆరోగ్యదాయకమైన గ్రీన్ టీని
తయారు చేసుకోవడానికి కుండీల్లో
పెంచుకునే వివిధ మొక్కల ఆకుల
పొడి శ్రేష్టమని నిపుణులు చెబుతు
న్నారు. తులసి, మునగ, స్టీవియా
ఆకుల పొడితో టీ తయారు చేసుకో
వడం తెలిసిందే. అదే జాబితాలో
అంజూర కూడా చేరింది. అంజూర ఆకుల టీ తాగితే మధుమేహం,
రక్తపోటు నియంత్రణలో ఉంటున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది.
పెద్ద ఆకులను కోసి నీటితో కడిగి నీడలో ఆరబెట్టాలి. ఎండిన ఆకు
లను నలిపి పొడి చేసి పెట్టుకోవాలి. లీటరు నీటిలో రెండు చెంచాల
పొడిని వేసి 15 నిమిషాలు.. నీరు సగం ఆవిరయ్యే వరకు మరగబెట్టి..
వడకడితే టీ సిద్ధమైనట్లే. ఇలా తయారు చేసుకున్న టీని ఫ్రిజ్ లో నిల్వ
ఉంచుకొని కూడా వాడుకోవచ్చు.