Friday 25 January 2019

ప్రాణాంతక వ్యాధులు - ఆయుర్వేద చికిత్స


టి.బి.,ఎయిడ్స్,కండరాలను శుష్కింప జేసే వ్యాధుల్లోనూ రోగి రోజురోజుకు క్షీణించి పోవడం జరుగుతుంది.దీనిని నివారించి ,వ్యాధి నిరోధక శక్తిని పెంచే చికిత్సలు ఆయుర్వేదంలో కొన్ని ఉన్నాయి.

1.గోధుమలు,ఉలవలు,నెయ్యిలో వేయించిన శొంఠి,దానిమ్మ, గింజలు తీసిన ఉసిరి కాయలు,పిప్పళ్ళు ఈ ఆరింటిని కలిపి మేక మాంసం ఈ మిశ్రమానికి రెట్టింపు తీసుకుని ,మొత్తానికి 8 రెట్లు నీళ్ళు కలిపి పొయ్యి మీద ఉడికించాలి.దీనిలో నాలుగవ భాగం నీళ్ళు మిగిలేలా మరిగించాలి.పొయ్యి మీద నుంచి దించి చల్లార్చిన తర్వాత్ ఒక పలుచని గుడ్డలో దీన్ని పోసి బాగా పిండాలి.ఈ రసంలో శొంఠి పొడిని ,దానిమ్మ రసాన్ని ,ఉసిరిక పొడిని కొంచెం కలుపుకుని ,సైంధవ లవణాన్ని కొంచెం కలిపి రోజూ ఒకసారి తాగుతుంటే క్షీణిస్తున్న మనిషి కోలుకోవడం జరుగుతుంది.దీనివల్ల దగ్గు,ఆయాసం,గుండెల్లో నొప్పి,గొంతు మంట కూడా నివారిస్తాయి.

2 .  మేక పాలు,మేక మాంసం,  ఎక్కువగా తింటున్నచో రోగి బలాన్ని పుంజుకుంటాడు.



* కొంచెం పెరుగులో బెల్లం కలుపుకుని తింటే వేసవిలో కలిగే అతిదాహం తీరుతుంది.వాతాన్ని కూడా తగ్గిస్తుంది *

Tuesday 22 January 2019

బోదకాలు / ఫైలేరియా తగ్గడానికి అయుర్వేద చికిత్స

కొన్ని రకముల దోమకాటు వలన ఎక్కువగా ఈ వ్యాధి వస్తుంది.ప్రారంభ దశలో జ్వరం వస్తుంది.తర్వాత కాలి యొక్క వాపు పెరుగుతుంది.ప్రారంభదశలోనే వ్యాధి తెలుసుకోవాలి.

1. మహా సుదర్శన చూర్ణం,నిత్యానంద రసం,శీతాన్శురసం,శ్లీపదారి లోహం ,పునర్నవ మండూరము,లోహాసవము
 వంటి మందులు బోదవ్యాధిని అరికడతాయి.

2. జిల్లేడు మొక్క వేళ్ళు కాని ,పత్తి చెట్టు వేళ్ళను కానీ శుభ్రం చేసి ,గంజితో కలిపి మెత్తంగా నూరి బోద వచ్చిన చోట లేపనం చేస్తుంటే వాపు తగ్గిపోతుంది.

3. బొప్పాయి ఆకులను నూరి ,రసాన్ని పల్చగా బోద వచ్చిన చోట పులిమి ,అరగంట తర్వాత కడిగేసుకుంటే వాపు తగ్గుతుంది.

4. మునగ చెట్టు బెరడు ,ఆవాలు ,శొంఠి సమపాళ్ళలో నూరి వాపు మీద రాస్తుంటే తగ్గుముఖం పడుతుంది.

5 .కాలి వాపునకు ప్రతి రోజూ వేడినీటి కాపడం పెడుతూ ,ప్రతిపూటా అల్లపు రసం తాగుతుండాలి.

6. వసకొమ్మును సారాయితో గంధం లాగా అరగ దీసి పైన పట్టు వేస్తుంటే బోద వాపులు హరించి పోతాయి.

7.బోదకాలు - సమస్య

! నా వయస్సు 25 సం||, నాకు బోదకాలు సమస్య
ఉంది. దీనివల్ల మా స్నేహితులంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు. దయచేసి ఈ సమస్య నుండి
బయటపడే మంచి మార్గం చెప్పండి.

1) ఈ వ్యాధిసోకిన సంవత్సరంలో పే యుద్ధ
| ప్రాతిపదిక పైన చర్య తీసుకోవాలి. ఏడాది దాటితే సమస్య పరిష్కారమవటం జఠిల
మౌతుంది. రోజూ ఉదయం పరగడపున దేశవాళి గోమూత్రం అరకప్పు మోతాదుగా
తీసుకొని ఏడుసార్లు బట్టలో వడపోసి అందులో పావుచెంచా ఇంట్లో కొట్టుకున్న
| పసుపు, పాతబెల్లం 20 గ్రా. పావుకప్పు మంచినీళ్ళు, కలిపి ప్రతిరోజు వ్యాధి
తగ్గేవరకు సేవిస్తూండాలి. 2) రాత్రి నిద్రించే ముందు వేపాకు, గోంగూర సమంగా
| కలిపి కచ్చాపచ్చాగా నలగొట్టి బట్టలో వేసి కాలికి కట్టుకొని పడుకొని ఉదయం
తీసివేస్తుండాలి. ఇలా చేస్తుంటే క్రమంగా సమస్య పరిష్కారమౌతుంది. శుభం.

వేపాకు, తేనె నూరి పూస్తుంటే
ప్రణాలు మాడిపోతయ్



Thursday 10 January 2019

కంటి చూపు తగ్గుట - ఆయుర్వేద పరిష్కారాలు


కొన్ని కంటి వ్యాధుల వలన కంటిచూపు సన్నగిల్లుట జరుగుతుంది.

* ఉల్లి రసమును కంటిలో అతిస్వల్పముగా రోజుకోసారి వేస్తుండాలి.

* ముల్లంగి వెన్నను ,నిమ్మ రసమును నిత్యము వాడుతుండాలి.

* భృంగామలక తైలమును రోజుకోసారి తలకు మర్దన చేయాలి.బాలారిష్టమును గాని ,శిలాజిత్తుగాని ఏదో ఒకటి వాడాలి.

 * శయనం వల్ల పిత్త రోగము నశించును.మర్ధనం వల్ల వాతరోగం తగ్గును.వాంతుల వల్ల కఫదోషం శమించును.లంఖన్మ్ వల్ల జ్వరం తగ్గును.*

Monday 7 January 2019

ఆపిల్ పండ్లతో వైద్యపరమైన ఉపయోగాలు. / APPLE / SEPU - AYURVEDIC USES

ఆపిల్ పండ్లు సాధారణంగా అన్ని కాలాలలో విరివిగా దొరుకుతాయి.దీనిలో మంచి విటమినులు ఉన్నాయి.ఒక ఆపిల్ లో 1 మి.గ్రా ఇనుము ,14 మి.గ్రా ఫాస్ఫరస్ ,10 మి.గ్రా కాల్షియం ,ఏ విటమినులున్నాయి.రోజుకొక ఆపిల్నైనా తింటే ఆరోగ్యంగా ఉంటారు.

1. ఆపిల్ మలబద్ధకాన్ని నివారిస్తుంది.సాఫీగా విరేచనం అవుతుంది,కడుపులో మలాన్ని కరిగిస్తుంది.శరీరానికి బలాన్నిస్తుంది.మలబద్ధకంలోనూ , విరేచనాలలోనూ రెంటిలో ఉపయోగపడతాయి.దోరగా ఉన్న ఆపిల్స్ మలబద్ధకంలోనూ,ఉడికించిన ఆపిల్స్ , బేక్ చేసిన ఆపిల్స్ విరేచనాలలోనూ ఉపయోగపడతాయి.రోజుకు కనీసం 2 ఆపిల్స్ తీసుకుంటే గాని మలబద్ధకంలో ఫలితం కనిపించదు.ఉడికించడం వల్ల ఆపిల్స్ లో ఉండే చెల్యులోజ్ మెత్తబడి మలం హెచ్చు మొత్తాల్లో తయారవుతుంది.

2 . ఇది రక్త క్షీణతను నివారిస్తుంది.రక్తక్షీణత గలవారు కనీసం రోజుకు 3 ఆపిల్స్ అన్నా తింటే మంచిది.దీని జ్యూస్ను తీసిన వెంటనే తాగాలి.ఆపిల్స్ లో ఇనుము ,ఫాస్ఫరస్ ,ఆర్సెనిక్ ఎక్కువగా ఉంటాయి.కావున రక్త హీనతలో బాగా పని చేస్తుంది.తాజా జ్యూస్ వాడితే ఫలితాలు బాగా ఉంటాయి.రోజుకు కిలో చొప్పున తీసుకోగలిగితే మంచిది.ఆహారానికి అరగంట ముందు గాని ,నిద్రకు ఉపక్రమించబోయేముందు గాని తీసుకుంటే పూర్తిస్థాయిలో ఉపయోగం కలుగుతుంది.


3.చంటి పిల్లలకు విరేచనాలవుతున్నప్పుడు ఒక చెంచా ఆపిల్ జ్యూస్ తాగిస్తే విరేచనాలు అరికడతాయి.

4 . ఆపిల్ జ్యూస్ లో యాలకులు ,తేనె కూదా కలుపుకుని తీసుకుంటుంటే కడుపులో మంట ,పేగుల్లో పూత ,అజీర్తి,గ్యాస్ ట్రబుల్ ,పుల్లని తేనుపులు ,గుండెల్లో మంట నివారిస్తాయి.

5. రక్త ,బంక విరేచనాలు అవుతున్నవారు ఆపిల్ జ్యూస్ తీసుకుంటుంటే అందులో ఉండే పిండి పదార్థాలు విరేచనాలలోని నీటి శాతాన్ని తగ్గించడం వల్ల విరేచనాలు తగ్గుతాయి.ఆపిల్ ముక్కలను ఉడికించి తీసుకుంటే ఇంకా మంచిది.

6 . తరచూ ఆపిల్స్ తింటూ ఉంటే తరచూ వచ్చే జ్వరాలు అరికడతాయి.

7 . రోజూ ఆపిల్ జ్యూస్ తాగడం వలన కడుపులో మంట,మూత్రంలో మంట ఉండదు.

8 . ఆపిల్ లో క్యాల్షియం ,పొటాషియం ఎక్కువగా ఉండటం వలన బీపీ తో పాటు అన్ని హృదయ వ్యాధులను ,మూత్రపిండాల వ్యాధులను అరికడుతుంది.

9 . పక్షవాతం,నాడీ సంబంధ వ్యాధులు ,మెదడు వ్యాధులు కలవారికి ఆపిల్ చాలా మేలు చేస్తుంది.నరాలలో గల కణజాలాలమధ్య సంబంధాలను కలుగచేసే యాక్టిల్ చోలిన్ ఉత్పత్తి పెంపుదలకు ఈ పండు దోహదం చేస్తుందని తద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని,అల్జీమర్స్/మతిమరుపు అవకాశాలు తగ్గుతాయని అధ్యయనవేత్తలు తెలియజేస్తున్నారు.

10 . కామెర్ల వ్యాధిలో వీలైనంత ఆపిల్ రసాన్ని తాగుతుంటే కాలేయాన్ని సం రక్షిస్తుంది.

11 . ఆపిల్ కు కఫాన్ని తగ్గించే గుణం కూడా ఉంది.జలుబు,దగ్గు,ఆయాసం వీటిని నివారిస్తుంది.

12 . ఎలాంటి అనారోగ్యాలలోనైనా ఆపిల్ జ్యూస్ తాగవచ్చు.షుగర్ పేషంట్స్ మాత్రం ఈ పండ్లను తినకూడదు.

13 . ఆపిల్ జ్యూస్ లైంగిక శక్తిని పెంచుతుంది.అలసటను , నీరసాన్ని తగ్గిస్తుంది.

14 . ఆపిల్ ను ముక్కలుగా కోసి ,ఉడికించి రోజూ తింటుంటే శరీరం మీద బొల్లి మచ్చలు నివారణవుతాయి.శరీరం కాంతివంతంగా ఉంటుంది.

15 . ఆపిల్ చెట్టు వేళ్ళ రసాన్ని తాగుతుంటే కడుపులో ఏలిక పాములు నశిస్తాయి.

కొలెస్టరాల్ ఆధిక్యత తగ్గుదల -

ఆపిల్స్ ను తింటుంటే దానిలో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ పదార్థం కొవ్వు పదార్థల గ్రహింపును అడ్డుకుంటుంది.పెక్టిన్ ఒక జెల్ మాదిరి పదార్థంగా తయారై ఆంలాశయం గోడల మీద ,చిన్న పేగు గోడల మీద పేరుకుపోయి కొవ్వు విలీనాన్ని అడ్డుకుంటుంది.

క్యాన్సర్లు తగ్గుటకు -

 రోజూ ఆపిల్స్ వాడే వారిలో పెద్ద ప్రేగు క్యాన్సర్ల ఉనికి తక్కువగా ఉంటుంది.దీనిలోని పెక్టిన్ జీవక్రియకు లోనైనప్పుడు బ్యుటైరేట్ అనె పదార్థం విడుదలవుతుంది.ఇది మలాశయం గోడల మీద రక్షణగా పనిచేసి క్యాన్సర్లబారినుండి శరీరాన్ని కాపాడుతుంది.


తలనొప్పులలో  -

 అన్ని రకాల తలనొప్పులలో ఆపిల్స్ చక్కగా ఉపయోగపడతాయి.బాగా పండిన ఆపిల్ను పైనా కిందా చెక్కు తొలగించి ,మధ్యలోని గట్టి పదార్థాన్ని కూడా తొలగించి కొద్దిగా ఉప్పు కలిపి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తహీనత వంటి కారణాలతో ఏర్పడిన తలనొప్పులు తగ్గుతాయి.ఆశించిన ఫలితం కనిపించాలంటే దీనిని కనీసం 2,3 వారాలు తీసుకోవాలి.

ఉదర సంబంధ సంస్యలు తగ్గటానికి -

అల్పమైన జీర్ణక్రియా సంబంధ సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆపిల్ ఆహార ఔషధంగా ఉపయోగపడుతుంది.ఆపిల్ ను మెత్తగా తరిగి ముక్కలను మెత్తని గుజ్జుగా చేసి ,దాల్చిన చెక్క పొడిని ,తేనెను చేర్చి తీసుకోవాలి.గింజలు , తొడిమ తప్ప ఆపిల్ ను మొత్తంగా ఉపయోగించవచ్చు.తినబోయేముందు బాగా నమలాలి.ఆహార సమయాలకు మధ్యలో దీనిని తీసుకోవాలి.ఆపిల్ లోని పెక్టిన్ ఆంలాశయపు గోడల మీద సం రక్షణ పొరగా ఏర్పడి మృదుత్వాన్ని కలిగిస్తుంది.ముక్కలుగా తరిగిన ఆపిల్ కు పెద్ద చెంచాడు తేనెను చేర్చి ,కొద్దిగా నువ్వుల పొడిని చిలకరించి తీసుకుంటే జీర్ణావయవాలకు శక్తినిచ్చే టానిక్ గా పని చేస్తుంది.ఆకలిని పెంచుతుంది.ఆహారానికి ముందు దీనిని తీసుకోవాలి.దీని వల్ల జీర్ణ రసాలు ఎక్కువగా తయారవుతాయి.

గుండె జబ్బులలో -

గుండె సమస్యలున్నవారు ఆపిల్ తీసుకోవడం మంచిది.పొటాషియం , ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి.సోడియం తక్కువగా ఉంటుంది కాబట్టి రక్తపోటు పెరగదు.ఆపిల్ ను తేనెతో తీసుకుంటే ఫలితాలు చాలా బాగుంటాయి.ఆపిల్ లోని పొటాషియం వల్ల గుండెకండరాలు సమర్థవంతంగా పని చేస్తాయి.గుండె పోటు అవకాశాలు తగ్గుతాయి.

అధిక రక్తపోటు తగ్గడానికి -

రక్తపోటు ఎక్కువగా ఉన్నవారికి ఇది చక్కని ఆహార ఔషధంగా పని చేస్తుంది.పొటాషియం అధిక మొత్తాల్లో ఉండటం వల్ల మూత్రం హెచ్చు మొత్తాల్లో తయారై వెలుపలకు విసర్జితమౌతుంది.అలాగే సోడియం నిల్వలను తగ్గించి రక్తపోటు తగ్గడానికి కారణమౌతుంది.

వాపులతో కూడిన కీళ్ళనొప్పులు తగ్గడానికి -

గౌట్,రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ వంటి వాపులతో కూడిన కీళ్ళనొప్పుల్లో ఆపిల్ మంచి ఆహార ఔషధంగా పని చేస్తుంది.దీనిలోని మేలిక్ యాసిడ్ గౌట్ వ్యాధిలో పెరిగే యూరిక్ యాసిడ్ ను తటస్థపరచి నొప్పులను దూరం చేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.ఆపిల్స్ ను ఉడికించి ,జెల్లీలాగా చేసి పైన పూసి కొద్దిగా రుద్దితే నొప్పులను లాగేసి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

పొడి దగ్గు తగ్గటానికి -

ఇది తగ్గటానికి తియ్యటి ఆపిల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి.రోజుకు పావుకిలో చొప్పున తీసుకుంటే బలహీనత మూలంగా వచ్చే పొడి దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది.

మూత్రపిండాల్లో రాళ్ళ సమస్యకు -

కిడ్నీలో రాళ్లు ఏర్పడినపుడు ఆపిల్స్ తీసుకుంటే ఉపయోగం కనిపిస్తుంది.కొన్ని దేశాల్లో మనం చింతపండు వాడినంత విరివిగా అసలైన ఆపిల్ సిడార్ వెనిగార్ వాడుతుంటారు.వీరిని శాస్త్రకారులు గమనించినపుడు కిడ్నీళ్ళో రాళ్లు దాదాపు కనిపించలేదు.బాగా పండిన తాజా ఆపిల్ పండ్లలో ఈ గుణం ఎక్కువగా ఉంటుంది.

కంటి సమస్యలలో -

కళ్ల కలకలూ , కంటి ఎరుపులూ ఉన్నప్పుడు ఆపిల్ ను లోపలకూ , బయటకూ వాడవచ్చు.పానీయంగా వాడటానికి కొంత తయారీ అవసరం.ముందుగా ఆపిల్ చెక్కులను ఒక పాత్రలో ఉంచి నీల్లు పోసి నీళ్లు మరిగేటంతవరకూ ఉంచి , దానంతట అదే చల్లబడేలా చేయాలి.తర్వాత వడపోసి ,తేనె కలిపి తీసుకోవాలి.బాగా మిగలపండిన ఆపిల్స్ నుకళ్ళ మీద పట్టు వేయటానికి వాడవచ్చు.కంటి మంటలలో ఇది అద్భుతంగా పని చేస్తుంది.కళ్లను మూసుకుని ఆపిల్ గుజ్జును పైకి పట్టు వేసి కదలకుండా బ్యాండేజీ గుడ్డను చుట్టుకొని ఒకటి రెండు గంటలుంచుకోవాలి.

దంత సమస్యల నివారణకు -

ఆపిల్స్ లో దంతాలు పుచ్చిపోకుండా నిరోధించే జీవరసాయనాలున్నాయి.ఆపిల్స్ ను అనునిత్యం తీసుకునేవారిలో దంతాలు ఆరోగ్యంగా తయారవుతాయి.ఆహారం తీసుకున్న తర్వాత ఆపిల్స్ ను కొరికి తింటే బ్రష్ చేసుకున్నంత ఫలితం ఉంటుంది.పైగా ఆపిల్స్ లో ఉందే ఆసిడ్స్ వల్ల లాలాజలం స్రవించి సహజమైన రీతిలో కీటాణువులను నిర్వీర్యపరుస్తుంది.ఏ ఇతర పండులోనూ లేని అద్భుత గుణమిది.

యవ్వన శక్తి పొందుటకు -

అకారణంగా నీరసంగా అనిపించేటప్పుడు ,బడలికగా ఉన్నప్పుడూ ,నిస్త్రాణగా తోచినప్పుడూ ఆపిల్ మంచి ఆరోగ్యకరమైన ఆహారంగా ఉపయోగపడుతుంది.ఇది అనేకరకాల ఆహారలోపాలను సవరించి శరీరాన్ని పరిపుష్టం చేస్తుంది.ఆపిల్ లో అధిక మొత్తాల్లో ఇనుము , ఫాస్ఫరస్ లు ఉంటాయి.ఇతర పండ్లలో ఇంత మొత్తాల్లో ఈ పదార్థాలు ఉండవు.ఆపిల్ ను అనునిత్యం పాలతో కలిపి తీసుకుంటే చర్మం యవ్వన కాంతిని సంతరించుకుంటుంది.చర్మానికి బిగువు,నిగారింపు వంటివి ఏర్పడతాయి.దీనివల్ల అమితమైన రిలాక్సేషన్ లభిస్తుంది.

జిగట విరేచనాలు తగ్గుటకు -

పిల్లలలో తరచుగా జిగట విరేచనాలు అవుతుంటాయి.ఇలాంటి సందర్భాల్లో ఆపిల్స్ బాగా ఉపయోగపడతాయి.బాగా మిగలపండి,తియ్యటి రుచి కలిగిన ఆపిల్స్ ను మెత్తగా చిదిమి వయసును బట్టి ఒకటి నుంచి నాలుగు పెద్ద చెంచాలు తినిపిస్తే జిగట విరేచనాలు తగ్గుతాయి.

ఆపిల్స్ లో ఫైబర్ ఎక్కువగా,కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ,సోడియం తక్కువగా,పొటాషియం ఎక్కువగా ఉంటాయి.విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది.

శ్వాస సమస్యల నివారణకు -

రోజుకు ఒక ఆపిల్ చొప్పున వారంలో ఐదారు తిన్నట్లైతే ఊపిరితిత్తుల పనివిధానం మెరుగ్గా ఉంటుంది.ఆపిల్ తొక్కలోని క్యురెక్టిన్ అనే యాంటీ ఆక్సిడెంట్  ఊపిరితిత్తుల పనివిధానాన్ని మెరుగుపరుస్తుంది.టొమేటోలూ,ఉల్లిపాయలలోనూ ఇలాంటి ఆంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి.క్రమం తప్పకుండా ఆపిల్స్ తింటూ ఉంటే శ్వాసకోశ పనివిధానం బాగుంటుంది.పుష్కలంగా ఆపిల్స్ తినే మహిళల్లో ఆస్థ్మా ఉండే అవకాశాలు లేని పిల్లలు జన్మిస్తారని కొన్ని అధ్యయనాలు తెలిపాయి.





ఫిట్స్ / మూర్చ వ్యాధి గురించిన అపోహలు - వాస్తవాలు.


మూర్చ రోగంగా ప్రచారంలో ఉన్న ఈ వ్యాధిని వైద్య పరిభాషలో ఎపిలెప్సి ,కన్వల్షన్స్,సీజర్స్,ఫిట్స్ అని అంటారు.పూర్వ కాలంలో ఈ వ్యాధిపై ప్రజల్లో చాలా అపోహలు ఉండేవి.శక్తి పూనింది,ఆత్మ ఆవహించింది,దెయ్యం పట్టిందని ప్రజలు నమ్మేవాళ్లు.క్రీ.పూ. 470 లో హిపోక్రెట్స్ అనే వ్యక్తి దీనిని జబ్బుగా గుర్తించడంతో కొద్దిగా భయం తగ్గింది.యూరప్ దేశాల్లో 17,18 వ శతాబ్దంలో ఈ వ్యాధి ఎక్కువ మందికి రావడంతో ఆ దేశ ప్రజలు చాలా ఆందోఅళనకు లోనయ్యారు.ఇండియా ఈ వ్యాధిని ఆత్మ ఆవాహన / ఈవిలి స్పిరిట్ గా భావించి అశాస్త్రీయ పద్ధతుల్లో నివారణకు ప్రయత్నించేవారు.

  మొదటి సారి జాన్ హల్గిన్స్ జాన్సన్ 1835-1911 ఈ వ్యాధిపై ఎన్నో పరిశోధనలు చేసి ,ఎందరో రోగులను పరిశీలించి జబ్బు లక్షణాలు కనుగొన్నారు.ఆయన చేసిన విశేష కృషికి గాను ఆయనను ఫాదర్ ఆఫ్ న్యూరాలజీ అంటారు.1857 లో మొదటి మందు పొటాషియం బ్రోమైడ్ ను సర్ చార్లెస్ కనుగొన్నారు.

ఫిట్స్ వచ్చేవారిలో 95 శాతం మందికి ఒకటి,రెండు నిమిషాలలో ఫిట్స్ వచ్చి తగ్గిపోతాయి.5 శాతం మందిలో మాత్రమే ఎక్కువసేపు ఉంటాయి.

ఫిట్స్ వచ్చిన వెంటనే తలపై నీళ్లు పోయడం ,చేతిలో ఇనుప వస్తువులు ఉంచడం ,నోట్లో స్పూన్ లేదా కర్చీఫ్ పెట్టడం ,ముక్కు దగ్గర ఉల్లిపాయ ఉంచడం వంటి పద్ధతులు మంచివి కావు.ఈ చిట్కాలలో రోగికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది.ఫిట్స్ వచ్చినప్పుడు ఒకవైపునకు తిప్పి పడుకోబెట్టాలి.శ్వాస సరిగ్గా తీసుకునేలా మెడను కొద్దిగా వెనక్కి వంచాలి.రోగికి గాలి తగిలేలా కిటికీలు ,తలుపులు తెరిచి ,ఫాన్ వేయాలి.

ఫిట్స్ తగ్గిన అరగంట వరకు ఎలాంటి ఆహారం ఇవ్వవద్దు.అరగంట తర్వాత రోగి పూర్తిగా స్పృహలోకి వచ్చిన తర్వాత మొదట మంచినీళ్లు ఇవ్వాలి.ఫిట్స్ వచ్చిన సమయంలో నాలుక కట్ అయి ఉంటే వెంటనే దాక్టర్ వద్దకు తీసుకువెళ్ళాలి.

మూర్చ రోగ నిర్ధారణకు చేయాల్సిన పరీక్షలు ఇ ఇ జి ,సిటి స్కాన్ బ్రెయిన్,ఎం ఆర్ ఐ బ్రెయిన్ పరీక్షలు చేసి జబ్బును నిర్ధారించుకున్న తర్వాత చికిత్స ప్రారంభించాలి.

90 శాతం మందికి 3 సంవత్సరాలు క్రమంగా మందుల వాడకంతో ఫిట్స్ పూర్తిగా తగ్గిపోతాయి.10 శాతం రోగులకు మాత్రమే పదే పదే వస్తుంది.తగిన పరీక్షలు చేసి సరైన మందులతో తగ్గించవచ్చు.1000 మందిలో ఒకరిద్దరికి మాత్రం ఎన్ని మందులు వాడినా ఫిత్స్ వస్తూనే ఉంటాయి.ఇలాంటి రోగులకు ఎపిలెప్సీ సర్జరీ చేయడంతో వ్యాధిని తగ్గించవచ్చు.100 మంది రోగులలో 90 శాతం మందికి ఒక్క టాబ్లెట్ తోనే పూర్తిగా కంట్రోల్ అవుతుంది.మరో 9 శాతం రోగుల్లో మరో టాబ్లెట్ ( రెండు రకాల మందులతో ) ఇవ్వడంతో తగ్గుతుంది.1 శాతం రోగుల్లో మాత్రమే రెండు కన్నా ఎక్కువ రకాల మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది.

కారణాలు.-  ఎన్నో కారణాలు ఉన్నా ముఖ్యంగా 60 శాతం మందికి ఏ కారణం లేకుండానే వస్తుంది.దీనిని ఇడియోపథిక్ ఎపిలెప్సీ అంటారు.40 శాతం మందిలో రకరకాల కారణాలతో టిభి,వాంస్ కారక ట్యూమర్ వల్ల,మెదడులో ఏర్పడే మచ్చల వల్ల ,రక్తనాళాలలో దోషాలతో ,తలకు దెబ్బ తగలడంతో ,శరీరంలో కొన్ని అవాంచిత మార్పుల కారణంగా ( సోడియం తగ్గినా ,కిడ్నీ,లివర్ ఫెయిల్ అయినా ,కాల్షియం మోతాదు పెరిగినాతగ్గినా,గ్లూకోజ్ తగ్గినా,పెరిగినా ) ఫిట్స్ వస్తాయి.

ఐతే నూటికి 99 శాతం ఫిట్స్ పూర్తిగా నయం అవుతున్నాయి కాబట్టి వీటి గురించి ఆందోళన అవసరం లేదు.ఫిట్స్ కారణంగా ప్రాణహాని,శరీర ఇతర భాగాలపై చెడు ప్రభావం లేదు కాబట్టి దీనిని ప్రమాదకరమైన జబ్బుగా పరిగణించాల్సిన అవసరం లేదు.

ఒక్కసారి వస్తే జీవితాంతం ఉండి ,శరీర భాగాలపై దుష్ప్రభావం చూపే మధుమేహం తో పోలిస్తే ఈ జబ్బు చాలా చిన్నది.

జాగ్రత్తలు -
              ఈ వ్యాధి నివారణకు మందులతో పాటు జీవనశైలిలో మార్పు చాలా అవసరం.

సమయానుకూలంగా భోజనం,నిద్ర చాలా ముఖ్యం .ఉపవాసాలు చేయవద్దు.

ఈ వ్యాధి వచ్చిన వారు ఆల్కహాల్ తీసుకోవద్దు.కాఫీ,టీ,స్మోకింగ్ చాలా వరకు తగ్గించాలి.

ఎక్కువగా టెన్షన్ ,మానసిక ఒత్తిడికి గురికావద్దు.డ్రైవింగ్,స్విమ్మింగ్ చేయవద్దు.

మరీ దగ్గరగా టివి ని చూడవద్దు.టివి బ్రైట్నెస్స్ ,కలర్,షార్ప్నెస్స్ ,కాంట్రాస్ట్ చాలా వరకు తగ్గించి చూడాలి.

" నిరక్షరాస్యత కన్నా మూర్చ రోగం పెద్ద జబ్బు కాదు " .

ఆయుర్వేద చికిత్స

1.సర్ప గంధి వేర్ల కషాయము ప్రతిరోజూ తీసుకోవాలి.మూర్చ రాగానే ఉల్లిపాయ రసం కానీ ,కుంకుడు కాయను అరగదీసిన గంధమును కానీ రెండు చుక్కలు ముక్కులో వేస్తే వెంటనే స్పృహలోకొస్తారు.

2.ఒక చెంచా తేనెను ఒక కప్పు నీటిలో కలుపుకొని పూటకొకసారి తాగుతుంటే కొంత కాలమునకు పూర్తిగా వ్యాధి నయమౌతుంది.

3.వసను పొడిగా చేసి సీసాలో భద్రం చేసుకుని ,రోజూ అరచెంచా పొడిని తేనెతో కలిపి తీసుకుంటుంటే మూర్చ,ఫిట్స్,నరాలకు సంబంధించిన వ్యాధులు నయమౌతాయి.దీన్ని తీసుకుంటున్నవారు మసాలాలు,పులుపు,కారం లేకుండా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.

Saturday 5 January 2019

పచ్చి మిర్చి మంచిదా లేక పండు మిర్చి మంచిదా ?

పచ్చి మిర్చి మంచిదా ,పండు మిర్చి మంచిదా అంటే రెండూ మంచివే.ఏ కాలంలో దొరికేవి ఆ కాలంలో తినడం మంచిదన్నది తెలిసిందే.ఆకుపచ్చని మిర్చి,పసుపు రంగు మిర్చిలతో పోలిస్తే పండు మిర్చిలో విటమిన్ సి,బీటా కెరోటిన్ ల శాతం ఎక్కువ,ఎ,బి,సి విటమినులతో పాటు ఖనిజాలు కూడా ఇందులో పుష్కలంగా ఉండడంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.క్యాన్సర్ తోనూ పోరాడగలడు.ముఖ్యంగా ప్రొస్టేట్ క్యాన్సర్ నివారణకు ఇది సాయపడుతుందట.పొట్టలో హానికర బ్యాక్టీరియాని నివారిస్తుంది.

  పండు మిర్చి రంగు చూస్తేనే నోరూరుతుంది.అంటే ఆకలిని పెంచినట్లే కదా..అలాగే ఇది రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేయడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది.ముఖ్యంగా రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వుని సైతం కరిగించే గుణాలు ఇందులో ఉంటాయి.

    జలుబూ,జ్వరాలు గట్రా రాకుండా నిరోధించే గుణాలూ ఇందులో ఎక్కువే.నొప్పులకి కారణమయ్యే ఇంఫ్లమ్మేషన్ ని తగ్గిస్తుంది.దాని ఫలితంగానే ఆర్థ్రైటిస్,సొరియాసిస్,డయాబెటిక్ న్యూరోపతి...వంటి వాటి కారణంగా తలెత్తే నొప్పుల్ని తగ్గించే గుణం పండు మిర్చిలో ఎక్కువ.దీన్ని తరచూ ఆహారంలో భాగంగా చేసుకుంటే జీర్ణశక్తినీ,జీవక్రియనీ పెంచడంతో పాటు బరువు పెరగకుండానూ చేస్తుంది.ఇది తిన్నాక పుట్టే వేడి కారణంగా వ్యాయామంలో మాదిరిగా కెలొరీలు కరుగుతాయి.

   ఆస్తమా,సైనస్,జలుబులతో బాధ పడేవాళ్లు వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఊపిరితిత్తులు,గొంతు,ముక్కుల్లో శ్లేష్మం,మ్యూకస్ పేరుకోకుండా ఉంటుంది.పండు మిర్చి వాసన తలనొప్పుల్నీ తగ్గిస్తుంది.

* బచ్చలి ఆకుకూరను తరచుగా తింటుంటే పంటి చిగుళ్ళ నొప్పులు తగ్గిపోయి ,చిగుళ్ళను గట్టి పరుస్తుంది. *