Friday 28 October 2011

ILL HEALTH - CONSTIPATION ( IN TELUGU )

PCOS ( UTERINE BUBBLES ( GARBHASHAYA NEETI BUDAGALU )(IN TELUGU )

AYURVEDIC FOOD FOR HEALTH ( IN TELUGU )

ఆరోగ్యానికి ఆయుర్వేద ఆహారం

మనం తినే ఆహారం ఎన్ని రకాలు ఆ ఆహారాన్ని ఎలా తీసుకోవాలి
ఆహారం ఆరు విధాలు ఒకటి పేయము అనగా తాగుటకు వీలుగా ఉండునది పాలు..etc..2 చోస్యము పీల్చదగినది చెరకు ములక్కాడ లాంటివి మూడు లేహ్యము నాకి భుజించ దగ్గది పులుసు మజ్జిగ లాంటిది నాలుగు భోజ్యము భుజింపదగినది అన్నం మొదలగునవి ఐదు భక్ష్యము తినదగినవి లడ్డు జిలేబి వంటివి 6 సవ్యమ
 నమలదగినది చెక్కిలంకాడలు వంటివి
మిక్కిలి ఎక్కువ కానీ మరీ తక్కువ కానీ అకాలంలో కానీ ఆహారం తీసుకుంటే విష మాశక మంటారు. కడుపులో మూడు భాగాలు ఆహారం మిగతా భాగం నీరు లాంటి ద్రవ పదార్థాలు కొంచెం ఖాళీ ఉంచి తినడం మంచిది
ఎవరు ఏం తినాలి అంటే.. పెద్దవాళ్లలో కేటపాలిజం ప్రాధాన్యంగా ఉంటుంది కనుక తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.. పాలు తేనె నీళ్లు బార్లీ నీళ్లు మజ్జిగ ఎక్కువగా ఇవ్వాలి గర్భవతులు తేలికైనా బలమైన ఆహారం మాసానుసారం తీసుకోవాలి నవ మాసాలకి తగిన ఆహారం ఆయుర్వేదంలో సూచించబడినది మొదటి మూడు మాసాలలో విటమిన్లు కలిగిన పోషకాహారం ఇవ్వాలి మద్యం మాంసం చేప వంటివి ఇవ్వకూడదు ఆరు నెలల ఎముకలు ఉచారము మేధస్సు పెంచే ఆహారం ఇవ్వాలి సాత్వికాహారం అంటే పూర్తి శాకాహారం రాజసాహారం అంటే మాంసాహారం ఎక్కువ కారం మసాలా ఉన్నది తామసాహారం అంటే నిల్వ ఉన్నది చల్లారినవి వీటిని బట్టి కూడా మన ప్రవర్తన మారుతుంది అన్నిటికీ మించి ఎప్పుడు ముందు తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండా మళ్ళీ ఆహారం తీసుకోకూడదు
లేచినప్పటి నుండి అర్ధరాత్రి దాకా పరిగెత్తే యాంత్రిక జీవనంలో చుట్టూ పోగా తోడి రసాయనాలతో కలుషితమైన వాతావరణం లో సగటు మనిషి నుండి మేధావి దాకా మంచి ఆహారాన్ని గుర్తించడం కష్టమవుతున్నది.. రోడ్డుమీద ఫాస్ట్ ఫుడ్ వంటి వాటి వల్ల పొట్ట పెరగడం మలి వయస్సులోనే షుగర్ వ్యాధి వంటివి రావటం మినహా మంచి జరగడం లేదు ఒక ప్రాంతాన్ని బట్టి ఒక కాలాన్ని బట్టి కాకుండా విశ్వసనీయతతో ప్రకృతిని పురుష తత్వాన్ని ఆకలింపు చేసుకుని ప్రకృతికి సమీపంగా అనుసంధానం చేసుకొని ఆహారాన్ని ఆహార నిర్మాణాన్ని ఆహార నియమాలని ప్రతిపాదించింది ఆయుర్వేద శాస్త్రం.. అందుకే మనిషి ఎక్కడున్నా ముంబైలో ఉన్న బెంగళూరులో ఉన్న న్యూఢిల్లీలో ఉన్న న్యూయార్క్ లో ఉన్న అమ్మమ్మ దగ్గర ఉన్న ఒంటరిగా ఉన్నా మన శరీరం ప్రకృతిలో నుంచి వచ్చిన వండిన సమగ్రమైన సమతుల్య మైనఆహారాన్ని తీసుకోవాలి.

అన్నం ప్రాణమయం ప్రాణమయం అమ్మ చేసిన సున్ని ఉండలో వీర్య బలవం ఉంది. నువ్వుల ఉండలు లో స్త్రీ హార్మోన్లను క్రమపరిచే శక్తి ఉంది. పాయసంలో తృప్తినిచ్చే గుణం ఉంది పాలు తేనె నెయ్యి మధుర పదార్థాలే కాదు నిత్య జీవ రసాయనాలు అంటే సప్త ధాతువులకు శక్తినిచ్చేవి. అందుకే ప్రపంచ సమగ్ర ఆహార చిత్రంలో ఆయుర్వేద ఆహారం ప్రాముఖ్యత సంతరించుకుంది 
అరటిపండు దోసకాయ తప్ప దానిమ్మ చెరకు వంటివి ఆహారం ముందు తినాలి. నేరేడు కొబ్బరి మామిడిపండు పనస ఉదయమే తీసుకోకూడదు తీపి పిండి వంటలు అటుకులతో చేసినవి భోజనానంతరమే తినాలి ఇది పథ్యం అంటే.. ఆరు రుచులు ఉండాలి ఆహారం కూడా మందు లాంటిదే దానికి రసం అంటే రుచి వీర్యం అంటే బలం వంటివి ఉంటాయి ఈ రుచులు ఆరు తీపి కారం చేదు ఉప్పు వగరు పులుపు. మన ఆహారంలో ఈ ఆరు రుచులు ఉండాలి.తీపి పదార్థాలు మనలో ఓజో శక్తి నీ పెంచుతాయి. కారం,పులుపు జీర్ణ శక్తిని చేదు జ్ఞాపకశక్తిని రక్త శోధనని కలుగచేస్తుంది వగరు కఠిన పదార్థాలను ముక్కలు చేస్తుంది ఉప్పు ఆహారానికి రుచిని ఇస్తుంది గట్టిగా ఉండే రొట్టెలు చపాతీలు వంటివి అన్నీ కూరలతో ముందుగా తినాలి అన్నం తర్వాత తినాలి పల్చని మధుర పదార్థాలు అన్నం ముందు తినాలి కారం పులుపు పదార్థాలు మధ్యలో తినాలి వగరు చేదు పదార్థాలు చివరన తిని మజ్జిగ పళ్ళ రసాలు ఆఖరున తినాలి అన్ని కూరలు వేసిన పులుసుని అమెరికాలో రిచ్ వెజిటబుల్ సూప్ అంటారు దీన్ని వారానికి ఒక్కసారైనా తీసుకోవడం మంచిది
మిరియాలు ధనియాలు వేసిన చారుని ప్రతిరోజు తీసుకోవడం హితకరం
అన్ని ఆహార పదార్థాలు కలిపి తీసుకోకూడదు అది హాని చేస్తుంది ఇటువంటి ఆహార పదార్థాన్ని విరుద్ధ ఆహారం అంటారు ఉదాహరణకు పెరుగు నెయ్యి కలిపి తీసుకోకూడదు అరటి పండు పాలు ఒకేసారి తీసుకోకూడదు వేడి కాఫీ టీలలో తేనె కలిపి తీసుకోకూడదు వెన్నతో చేపని వండుకోకూడదు
ఋతువులను అనుసరించి పండే పళ్ళను తీసుకోవడం హితకరం అలా కాకుండా తీసుకుంటే ఆమం తయారవుతుంది ఆమం అంటే జీర్ణం కాక నిలువ ఉండిపోయిన విష పదార్థం అన్నమాట అదే మోకాళ్ళ నొప్పుల వంటి వ్యాధులకు కారణం అవుతుంది
ఉదాహరణకి వేసవికాలంలో జీర్ణశక్తి మనలో తక్కువగా ఉంటుంది అందువల్ల తేలికపాటి ఆహారం రెండు మూడు సార్లు తీసుకోవడం మంచిది. రాత్రి పెరుగు వేసుకోకూడదు ఎందుకంటే అది పూర్తిగా జీర్ణం కాక శ్రోతస్సులను
 మూసేస్తుంది
పిల్లలు ఎదిగే వయస్సు కనుక శరీరం మనసు ఎదిగే ఆహారాన్ని ఇవ్వాలి యవ్వనంలో ఉండే వాళ్ళకి మెటబాలిజం  కెటబాలిజం సమానంగా ఉంటాయి కనుక  శక్తిని ఇచ్చే ప్రోటీన్లు విటమిన్లు ఉన్న ఆహారాన్ని ఇవ్వాల.


Thursday 27 October 2011

VALUE OF HEALTH - CHANAKYA NEETHI SHASTHRAM

ఆరోగ్యము యొక్క విలువ.. చాణక్య నీతి శాస్త్రం

Sarvameva parithyajya సర్వమేవ పరిత్యజ్య shareeramanupalayeth శరీరమను పలయేత్ 
shareerasya pranashtasya sarvameva vinashyathi శరీరస్య ప్రాణస్థస్య సర్వమేవా వినశ్యతి..

...anni panulanoo vadilesi munduga shareeranni kaapadukovali. అన్నిపనులనూ వదిలేసి ముందుగా శరీరాన్ని కాపాడుకోవాలి. chathurvidha purusharthalaina dharmartha kama mokshalu sadhinchalante చతుర్విధ పురుషార్ధాలు అయిన ధర్మ అర్థ కామ మోక్షాలు సాధించాలంటే mundu aarogyam kavali ముందు ఆరోగ్యం కావాలి. shareeram nashisthe daanini ashrayinchi undevi annee nashisthayi.. శరీరం నశిస్తే దానిని ఆశ్రయించి ఉండేవి అన్నీ నశిస్తాయి..

-- CHANAKYA NEETHI SHASTHRAM..-        

MEANING - first Priority   must be given to protect our body and health. . It is the main element  to do all important works successfully in all walks of life

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు
డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టారు 2001లో నారాయణ హృదయాలయ స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నారు

1. సాధారణమైన వ్యక్తులు తమ గుండెను పదలంగా ఉంచుకోవడానికి ఏమి చేయాలి?
ఆహారం... పిండి పదార్థాలు తక్కువగా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి చమురు పదార్థాలు తక్కువగా తీసుకోవాలి
 .వ్యాయామం.. కనీసం వారానికి ఐదు రోజులపాటు అరగంట నడక. లిఫ్ట్ వాడకండి ఎక్కువ సేపు కదలకుండా ఒకే చోట కూర్చోవద్దు
 పొగ త్రాగవద్దు
బరువును అదుపులో ఉంచుకోండి
బీపీ షుగర్ వ్యాధులను నియంత్రించండి
2. ఆరోగ్యంగా ఉండే వారిలో హఠాత్తుగా గుండె ఆగిపోవడం అలాంటి వార్తలను విన్నప్పుడు షాకింగ్ గా ఉంటుంది ఎందుకలా
దీనినే సైలెంట్ ఎటాక్ కార్డియాక్ అరెస్ట్ అంటారు అందుకే మేము 30 ఏళ్లకు పైబడిన వ్యక్తులు ఆరోగ్య పరీక్షలు రెగ్యులర్గా అలవాటుగా చేయించుకోమని చెబుతాము
3 .గుండె ఒత్తిడి తొలగింపునకు మీ సూచనలు ఏమిటి
జీవితం పట్ల మీ దృక్పథన్ని మార్చుకోండి ప్రతిదీ అత్యంత ఉత్తమంగా ఉండాలని చూడకండి
4. ఆరోగ్యవంతమైన గుండె కోసం జాగింగ్ కన్నా నడకే మంచిదా లేదా ఇంకేదైనా ఉత్తమమైన వ్యాయామం తీవ్రమైనది ఉందా
జాగింగ్ వల్ల అలసట తొందరగా కలుగుతుంది అది కీళ్ళను దెబ్బతీయవచ్చు కాబట్టి జాగింగ్ కంటే నడకే మేలు
5 . మాంసాహారం చేపలు గుండెకు మంచిదా
జవాబు ..కాదు
6 .గుండె జబ్బులు వంశపారంపర్యమా
అవును
7 .రక్తపోటు తక్కువగా ఉండే వారిలో గుండె జబ్బులు వస్తాయా
చాలా తక్కువగా వస్తాయి
8.చిన్న వయసు నుంచే కొలెస్ట్రాల్ కూడా పడుతుందా లేక 30 ఏళ్ల తర్వాత కూడడం మొదలవుతుందా
చిన్నతనం నుండి కొలెస్ట్రాల్ కూడడం మొదలవుతుంది
9.ఓ పద్ధతి లేని ఆహారపు అలవాట్లు గుండెపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి
ఆహారపు అలవాట్లు నియమబద్ధంగా లేకుండా జంక్ ఫుడ్ తినడం ఆరోగ్యానికి హానికరం అలాంటప్పుడు శరీరంలో క్రమానుగతంగా విడుదల అయ్యే జీర్ణ రసాలు పనితీరు సంశయాత్మకంగా మారుతుంది
10 .మందులు వాడకుండా కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచగలమా
ఆహార నియంత్రణను పాటించండి రోజు నడక సాగించండి అక్రూట్ వాల్నట్ తినండి
11 .యోగా గుండె జబ్బులను నిలువరించగలరా
యోగా ఉపయోగపడుతుంది
12 .పప్పు నూనె పొద్దుతిరుగుడు నూనె ఆలీవ్ నూనె ఏ నూనె వాడితే మంచిదంటారు
అన్ని నూనెలు చెడ్డవే..
13 .గుండెకు ఏది మేలైన ఆహారం
పళ్ళు కూరగాయలు చాలా మేలు చేస్తాయి నూనె చెడు చేస్తుంది
14 .మామూలుగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఏమిటి? ఏవైనా ప్రత్యేక పరీక్షలు ఉన్నాయా
షుగర్ కొలెస్ట్రాల్ సరిగా ఉన్నాయా లేదో తెలుసుకోవడానికి రక్త పరీక్ష చేయించుకుంటు ఉండాలి. బీపీ చూయించుకుంటూ ఉండాలి 2d ఎకో తర్వాత ట్రెడ్మిల్ పరీక్షలు చేయించుకోవాలి
15 .గుండెపోటు హార్ట్ ఎటాక్ రాగానే చేయవలసిన ప్రథమ చికిత్స ఏమిటి
ఆ మనిషిని పడుకోబెట్టాలి ఆస్ప్రిన్
 మాత్రతోపాటు దొరికితే సార్బిట్రేట్ మాత్రతో కలిపి నాలుక కింద పెట్టాలి గుండెపోటు వచ్చిన మొదటి గంట ప్రాణాంతకం అవుతుంది కాబట్టి వెంటనే గుండె దవాఖానకు తరలించాలి
16 .నొప్పి గుండెనొప్పెన లేక గ్యాస్ట్రిక్ నొప్పి నా అనేది ఎలా తెలుసుకోగలం
ఈసీజీ లేకుండా చెప్పలేము
17. సాధారణ రక్తపోటు 120/80 కంటే ఎక్కువ ఉన్నవారు పూర్తి ఆరోగ్యంగా ఉండవచ్చా
ఉండవచ్చు 
18 చాలామందికి దినచర్య నియమబద్ధంగా ఉండడం లేదు రాత్రి పొద్దు పోయేదాకా ఆఫీసులో పనిచేయవలసి వస్తుంది ఇది గుండె మీద ప్రభావం చూపుతుందా ఇలాంటివారికి ఎలాంటి ముందు జాగ్రత్తలు సూచిస్తారు
వయసులో ఉన్నప్పుడు సహజసిద్ధంగా శరీరమే వీటిని తట్టుకుంటుంది మీరు మీ జీవన గడియారాన్ని అనుసరించడం చాలా అవసరం
19 .గుండె ఆపరేషన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
ఆహారా నియంత్రణ వ్యాయామం వేళ్ళకు మందులు కొలెస్ట్రాల్ బిపి బరువులను అదుపులో ఉంచుకోవడం అవసరం
20 మీరు పేదలు అవసరంలో ఉన్న వారి కోసం ఎంతో సేవ చేస్తున్నారు మీకు ప్రేరణ ఎవరు
నేను వైద్యం చేసిన మదర్ థెరిస్సా నాకు ఈ విషయంలో ప్రేరణగా నిలిచారు.
నారాయణ హృదయాలయ మల్లారెడ్డి హాస్పిటల్ సూరారం క్రాస్ రోడ్ జీడిమెట్ల హైదరాబాద్ ఫోన్ 04 0 2 3 7 8 3 0 0 0, 9 6 7 6 9 0 2 1 1 1, ఈమెయిల్ nh.hyd @hrudayalaya.com


Saturday 1 October 2011

VARIOUS AYURVEDIC WORDS - ILLUSTRATIONS

వివిధ రకాల ఆయుర్వేద పదాలు ..వివరణలు

1 . panchabadaree narayanamulu  పంచ బదరీ నారాయణములు - badari బదరి,aadi badari ఆది బదరి,yoga badari యోగ బదరి - vruddha badari వృద్ధ బదరి ,bhavishyadbadaree narayanamulu భవిష్య బదరి 


2 . pancha balalu or bala pancha moolamulu పంచ బలాలు లేదా బల పంచమూలములు - bala బల ,athibala అతి బల,naga bala నాగ బల,raja bala రాజ బల,maha bala మహా బల

3 . a .) pancha beejamulu పంచబీజములు - pedda dosa పెద్ద దోస,chinna dosa చిన్న దోస,danimma దానిమ్మ , thamara తామర ,doola gondi seeds దూలగొండి విత్తనాలు
     b . ) aavalu ఆవాలు ,aajamodamu ఆజా మోదము,jilakara జీలకర్ర,nuvvulu నువ్వులు, gasagasalu గస గసాలు 

4 . pancha bhadramulu పంచభద్రములు - thippa theega తిప్ప తీగ,parpatakamu పర్పాటకము ,thunga dumpa తుంగ దుంప,nelavemu నేల వేము,shonti శొంఠి 

5 . pancha bhrungamulu పంచభృంగములు- davara dangi దావర దంగి,vavili వావిలి ,jammi జమ్మి,ganjayi గంజాయి, thalispathri తాలిస్ పత్రి..

6 . pancha vatamulu పంచ వటములు - maredu మారేడు,raavi రావి , marri మర్రి, ashokamu అశోకము , medi మేడి..

7 . pancha sarovaramulu పంచ సరోవరములు - bindu బిందు ,pampa పంప ,manasa మానస ,pushkara పుష్కర , narayana sarassulu నారాయణ సరస్సులు..

8 . pancha nasyamulu పంచ నస్యములు - vari dhanyamu వరి ధాన్యము,nuvvulu నువ్వులు, pesalu పెసలు ,yavalu యవలు ,thallapalu తల్లపాలు.

9 . pancharamamulu పంచారామములు - drakshaaramam ద్రాక్షారామం ,bhramararamam  భ్రమరారామం, ,sarparamam సర్పారామం,amararamam అమరారామం ,komararamam కొమరారామం..

10 . manmadha bana panchakam మన్మధ బాణపంచకము - yerra thamara ఎర్ర తామర,ashokamu ఆశోకము,mamidi మామిడి ,nava mallika నవ మల్లిక, nalla kaluva  నల్ల కలువ..