24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

ఆనంద ఆహారం ఇదీ..

 మానవ ప్రయాణ  జీవిత అంతిమ లక్ష్యం ఆనందమే. చేసే పనులను బట్టి కాదు తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా  ఆనందం లభిస్తుందని పోషకాహార నిపుణుల మాట. డోపమైన్ సమృద్ధంగా ఉన్న ఆహారంలో ఆనంద రసం పరిపూర్ణంగా లభిస్తుందని అధ్యయనాలు నిరూపించాయి.

డోపమైన్ ఒక న్యూరో ట్రాన్స్మిటర్. దీనినే ఆనంద హార్మోన్ అని అంటారు. డోపమైన్ తో కూడిన ఆహారం శరీరపు బరువును తగ్గించడంలోనూ సహాయ పడుతుంది. పాలు పెరుగు యోగర్ట్ లాంటి పాల ఉత్పత్తులు, శరీరానికి మంచి బాక్టీరియాను అందించే ప్రొబయోటిక్స్ .. ఇవి మన మూడ్ ను ఆహ్లాదపరిచే డోపమైనును చైతన్య పరుస్తాయి. గుడ్లు, అరటి పండ్లు కూడా డోపమైన్ గనులే .వీటిలో ప్రోటీన్లు ఎక్కువ, ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్న ఆహారం అంటేనే అమైనో ఆమ్లాల  ఖజానా అని అర్థం. అమైనో ఆమ్లాల నుండే డోపమైన్ ఉత్పత్తి అవుతుంది.

మిఠాయిలు అంటే నోరూరే వాళ్ళు , డార్క్ చాక్లట్స్ తింటే సరి. వాటిలోని ట్రైకోసిన్ అనే అమైనో ఆమ్లం నుండి డోపమైన్ ఉత్పత్తి అవుతుంది.పైగా మూడ్ ను నియంత్రించే సెరటోనిన్ ,ఎండార్ఫిన్ హార్మోన్ లు కూడా డార్క్ చాక్లెట్ లో ఉంటాయి. ప్రాసెస్డ్ ఫుడ్స్ తో పోలిస్తే , పిండి పదార్థాలను/హోల్ గ్రెయిన్ ఆహారంగా తీసుకునే వారిలో కుంగుబాటు లక్షణాలు తక్కువగా కనిపించాయని అధ్యయనాలు పేర్కొన్నాయి. పొట్టు తీయని గింజలు , కూర గాయలు, పప్పు ధాన్యాలు, తాజా పండ్లు,బీన్స్,మొలకలు ఆహార పళ్ళెంలో ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ఆనందం మన సొంతం అవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.



Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...