గొంతులో, కడుపులో, ఛాతీలో మంటలు, నరాల్లో వాపు, ఊపిరితిత్తుల్లో కఫం పెరగడం సమస్యలకు ఆయుర్వేద పరిష్కారాలు..
1 . ) రోజూ ఉదయం పూట లేదా సాయంత్రం పూట గోరు వెచ్చని నువ్వుల నూనె తో శరీరమంతా మర్దనా చేసుకోవాలి.చెవుల్లో, ముక్కులో రెండు రెండు చుక్కలు వేసుకోవాలి. ఒక గంట ఆగి తర్వాత స్నానం చేయాలి. దీని వల్ల నరాల వాపులు తగ్గి రక్త ప్రసరణ పెరిగి శక్తి ఉత్పన్నమవుతుంది.
2 .) దేశవాళీ గోమూత్రం ఉదయం సేకరించి ఏడు సార్లు వడపోసి 50 గ్రాములు మోతాదుగా పరగడుపున రోజూ సేవిస్తుండాలి. దీని వల్ల అధిక కఫం, మంటలు తగ్గి రక్త వృద్ధి, రక్త శుద్ధి కలుగుతుంది.
3. ) గోధుమ పిండి 150 గ్రాములు తీసుకుని అందులో 30 గ్రాములు వంటాముదం కలిపి రొట్టె కాల్చుకుని అందులో కొంచెం నెయ్యి , పంచదార అద్దుకొని తింటూ ఉండాలి.
ఇలా నాలుగైదు రోజులు తింటూ వుంటే అన్ని రకాల ఉదర సంబంధిత రోగాలు తగ్గిపోతాయి.
ముఖం పై దురదతో కూడిన నల్లని మచ్చలు.. ఆయుర్వేద పరిష్కారాలు.
1 .) మంజిష్ట,కరక్కాయ పెచ్చులు , ఉసిరి కాయ పెచ్చులు ,తానికాయ పెచ్చులు , పాత చింతపండు , వస కొమ్ములు, దేవదారు చెక్క, పసుపు, తిప్ప తీగ వీటన్నింటినీ సమ భాగాలుగా తీసుకుని కలిపి మెత్తగా దంచి నిలువ చేసుకోవాలి. రోజూ పావు లీటరు మంచి నీటిలో ఈ పదార్థాన్ని 20 గ్రాములు వేసి సగం కషాయం మిగిలే వరకు మరగబెట్టి వడపోసి రోజూ పరగడుపున తాగుతుంటే శరీరంలో చెడు రక్తమంతా శుద్ధి చెంది దురదలు, కురుపులు, మచ్చలు, గడ్డలు, పుండ్లు మొదలైన అన్ని రకాల చర్మ వికారాలు తగ్గిపోతాయి.
2 . ) జటా మాంసి తెచ్చుకొని పొడి చేసి ఉంచుకొని తగినంత పొడిని నిద్రించే ముందు మంచి నీటితో గుజ్జులా నూరి మచ్చల పైన లేపనం చేసి , ఉదయం గోరు వెచ్చని నీటితో కడిగితే సమస్య పరిష్కారమవుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి