1. ) పిల్లలకు కడుపులో క్రిముల సమస్య - ఆయుర్వేద పరిష్కారం
పిల్లలకు చాక్లెట్లు, బజారు తిండ్లు అలవాటు చేయడం వల్ల, అకాల భోజనం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. దీని పరిష్కారం కోసం దేవదారు చెక్క, మునగ చెక్క , కరక్కాయ బెరడు, తానికాయ బెరడు, ఉసిరి కాయ బెరడు,పిప్పళ్లు, వాయు విడంగాలు సమాన భాగాలుగా తీసుకుని దంచి పొడి చేసుకుని, అన్నీ కలిపి నిలువ చేసుకోవాలి. రోజూ అరగ్లాసు నీటిలో అరచెంచా పొడి వేసి, పావు గ్లాసు కషాయానికి మరిగించి వడపోసి రెండు పూటలా పూటకు ఒక చెంచా కషాయాన్ని ఆహారానికి ముందుగా తాగిస్తుంటే కడుపులోని పురుగులన్నీ మలం ద్వారా పూర్తిగా బయటకు పడి పోయి , పిల్లలకు చక్కటి ఆరోగ్యం కలుగుతుంది .
2.) బుడ్డ దిగిన సమస్య - ఆయుర్వేద పరిష్కారం
A .) ఇంతకు ముందు చెప్పినట్లుగా దేశవాళీ ఆవు మూత్రం ఏడు సార్లు వడపోసి రోజూ పరగడుపున ఒక కప్పు మోతాదుగా తీసుకుని అందులో పావు టీ స్పూన్ మాను పసుపు పొడి కలిపి తాగించాలి.
B.) కరక్కాయ పొడి, శొంఠి పొడి, గసగసాల పొడి , తెగడ పొడి ఒక్కొక్కటి 50 గ్రాములు చొప్పున తీసుకుని కలిపి ఆ మొత్తాన్ని స్వచ్ఛమైన వంటాముదంతో నూరి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. ఈ లేహ్యాన్ని రోజూ రాత్రి పడుకునే ముందు 5 గ్రాములు మోతాదుగా తినాలి.
C.) కానుగ గింజల పప్పు, ఆముదపు గింజల పప్పు గచ్చ కాయలలోని పప్పు సమాన భాగాలుగా తీసుకుని వంటాముదంతో నూరి నిలువ చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఈ లేపనాన్ని వాచిన వృషణం పైన పట్టు లాగా వేసి పైన దూది అంటించి అది ఊడిపోకుండా గోచి పెట్టుకుని పడుకోవాలి.
ఇలా ఆచరిస్తూ, వాతం చేసే పదార్థాలు,మాంసాహారం తినడం మానివేస్తే అతి త్వరగా సమస్య ఆపరేషన్ తో పని లేకుండా పరిష్కారమవుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి