వయసు పై బడిన వారిలో కీళ్ల నొప్పులు సహజం. కానీ ముప్పైల్లోనే ఈ సమస్య కనిపిస్తుందంటే శరీరానికి సరియైన వ్యాయామం అందక , లావుగా ఉండి ఎక్కువ సమయం పని చేయడం వల్ల కావచ్చు. ఊబకాయం తో బాధపడే వారు వైద్యుల సలహాలు తీసుకోకుండా అదే పనిగా వ్యాయామాలు చేస్తుంటారు. దాంతో నరాలు ఒత్తిడికి లోనై నొప్పి అనిపిస్తాయి. ఇవి సాధారణ సమస్యలుగా పరిగణించవచ్చు. కొన్ని సార్లు, రుమాటిక్, గౌట్ సమస్యల వల్ల నొప్పి బాధించే ప్రమాదం ఉంటుంది.హార్మోన్ల అసమతుల్యత, టీబీ వల్ల కూడా సమస్య రావచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి.
వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి.. అరటి, అనాస, ఆకు కూరలు,టమాటా, దంపుడు బియ్యం, ఖర్జూరాలు, బాదం తీసుకోవచ్చు. కటిక ఉపవాసాలు చేయకూడదు. రోజుకి 10 నుంచి 12 గ్లాసుల మంచి నీటిని తాగాలి.
ముద్ద కర్పూరాన్ని పొడి చేసి కొబ్బరి నూనె లో కలిపి కీళ్ళకు రాస్తుంటే ఎముకల మీద ఉన్న నరాలు మెత్తబడి నొప్పి తగ్గి త్వరగా ఉపశమనం కలుగుతుంది. భోజనానంతరం తేనెలో తగినంత శొంఠి పొడి కలిపి తీసుకుంటే నొప్పి నియంత్రణలో ఉంటుంది.
తిప్ప తీగ వేరును నీళ్లలో ఉంచి ఆ నీటిని వడకట్టి వచ్చిన పొడిని ఆరబెట్టి తేనెతో పాటు అరచెంచా చొప్పున రెండు మూడు వారాలు పుచ్చుకుంటే గుణం ఉంటుంది. వ్యాయామం పరిమితంగా చేయాలి.
శరీరంలో యూరిక్ ఆమ్లం మాములు స్థితికి వచ్చే వరకు ఆహారపరంగా జాగ్రత్తలు తప్పనిసరి. చిక్కుడు, పుట్ట గొడుగులు, క్యాలీఫ్లవర్, కాఫీ, టీ, మటన్ వంటి వాటికి దూరంగా ఉండాలి . చింత పండు, నిమ్మ జాతి పండ్లు , పాల ఉత్పత్తులను తగ్గించాలి.
పాలతో చేసిన స్వీట్లు,జున్ను తినకపోవడం మంచిది. పప్పు దినుసులు మితంగా తీసుకోవాలి. పప్పు ఉడికేటప్పుడు వచ్చే తేటను కొన్ని రోజులు తీసుకుంటే యూరిక్ యాసిడ్లు నియంత్రణలో ఉంటాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి