31, ఆగస్టు 2026, సోమవారం

ఫిట్స్, చెవి దగ్గర కాయ, మూత్రంలో మంట.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 1. ఫిట్స్ సమస్య .. ఆయుర్వేద పరిష్కారాలు 


నల్ల నువ్వులు దోరగా వేయించి దంచి జల్లించి చేసిన పొడి 100 గ్రాములు , వెల్లుల్లి దంచి తీసిన రసం 100 గ్రాములు .. ఈ రెండింటిని కలిపి మెత్తగా మాత్ర కట్టుకు వచ్చే వరకు నూరి బఠాణీ గింజంత గోళీలు కట్టి నీడలో గాలి తగిలే చోట ఆరబెట్టి పూర్తిగా నీరు ఇంకిపోయిన తర్వాత ఆ గోళీలను ఒక సీసాలో నిలువ చేసుకోవాలి. రోజూ సమస్య తీవ్రతను బట్టి రెండు లేక మూడు పూటలా ఒక మాత్ర మంచి నీటితో సేవిస్తుంటే క్రమంగా ఈ సమస్య పరిష్కారమవుతుంది. ఐతే ఫిట్స్ వచ్చిన వెంటనే సీతా ఫలం ఆకు మెత్తగా నలగ్గొట్టి వాసన చూపిస్తే క్షణ మాత్రంలోనే తెలివి వస్తుంది. ఈ విధంగా ప్రయత్నం చేస్తుంటే ఫిట్స్ సమస్య నుండి బయట పడవచ్చు. 

2 . చెవి కుట్టిన చోట కాయ పెరిగిన సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..

ఇంట్లో కొట్టుకున్న మంచి పసుపు ఒక చెంచా తీసుకొని సగం ముద్ద వేడి అన్నం పసుపుతో కలిపి మెత్తగా పిసికి ఆ కాయ మీద పెట్టి ఊడిపోకుండా దాని పైన దూది పెట్టి ప్లాస్టర్ అంటించాలి. ఇలా రోజూ రాత్రి పూట పెట్టి ఉదయం తీసివేస్తుండాలి. కొద్ది రోజులకు కాయ పెరగడం ఆగి నిదానంగా తగ్గడం మొదలవుతుంది.

3 . మూత్రంలో మంట సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు

మూలికలు అమ్మే దుకాణంలో నేల వేము, నేల ఉసిరి , సుగంధ పాల వేళ్ళు, గుంట గలగర , తిప్ప తీగ ఒక్కొక్కటి 200 గ్రాముల చొప్పున తెచ్చుకోవాలి.వీటిని విడి విడిగా పొడి చేసి కలిపి ఉంచుకోవాలి. రోజూ రెండు గ్లాసుల నీటిలో రెండు చెంచాల పొడి వేసి రెండు కప్పుల కషాయానికి మరిగించి వడపోసి పూటకు ఒక కప్పు కషాయం గోరు వెచ్చగా మాత్రమే ఒక చెంచా తేనె కలిపి తాగుతుండాలి. దీని వల్ల మూత్రంలో మంట,చురుకు మొదలైన సమస్యలు తగ్గిపోయి మూత్రం పూర్తిగా శుద్ధి చెందుతుంది. దాంతో పాటు రక్తం కూడా శుద్ధి చెందుతుంది.

శరీరానికి మంచి కాంతి, వర్చస్సు సిద్ధిస్తుంది.

 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...