ప్రతి ఆహార ద్రవ్యంలోనూ దేని పోషకాలు దానికిఉంటాయి కదా? కొన్నింటి గురించే ఎక్కువమందివైద్యులుచెప్తున్నారు. ఆహారం ఎందుకు, ఎలాతీసుకోవాలో అర్థం కావట్లేదు. ఆహార లక్ష్యాలు వివరిస్తారా?
ఆహారాన్ని దేశ, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఒకపథకంప్రకారంతీసుకోవటంవిజ్ఞత.శరీరఆరోగ్యాన్నినిలకడగా ఉంచటం, శరీర బరువుసమస్థితిలో ఉండేలా చూడటం, పోషకాలన్నీ తగుపాళ్లలో ఉండేలా జాగ్రత్త తీసుకోవటం పోషక లోపాలవలన కలిగే వ్యాధులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తపడటం, ఆహారంవల్ల కలిగే వ్యాధులు దీర్ఘ వ్యాధులుగా మారకుండా జాగ్రత్త పడటం, ముంచుకొచ్చేవృద్ధాప్యాన్ని నివారించిHతగినంత బరువు, ఎదుగుదల
ఉండేలా చూడటం ఇవీ ఆహార లక్ష్యాలు. శరీర
తత్వాన్ని తెలుసుకుని తగినట్టుగా ఆహార పదార్థాలను
ఎంపిక చేసుకోవాలి. ఏవి తింటే శరీరానికి సౌక
ర్యంగా ఉంటుందో అవి తినాలి. వేటివలన అసౌ
కర్యం, అనారోగ్యం అనిపిస్తుందో వాటిని తగ్గిం
చటం, మానేయటం కూడా అవసరం.
మన ఆహారంలో తగినంత పోషకాలున్నాయాసామాన్యుడు వాటిని కొనగలడా? వైద్యశాస్త్రం ఆహారాన్ని పోషకాలపేరుతో మరింత ఖరీదు చేస్తోందంటారా?
* పోషకాలు రోజువారీ మనం తినే ఆహారంలోనేఉన్నాయి. బజార్లో అమ్మే పదార్థాల మీద విటమిన్లు
అవీ వగైరా ఎంతెంత ఉంటాయో రాసి ఉంటుంది. కాబట్టిఅవే పోషకాలని, ఇంట్లో వండుకునేవి బలకరమైనవి
కావనే అపోహ చాలా మందిలో ఉంది. పోషకాలనే
పేరుతోవ్యాపారపరంగాఅమ్మేపాలపిండిడబ్బాలప్రకటనల్ని, వాటిఖరీదుల్నిచూసి,పోషకాలుసామాన్యుడుకిఅందుబాటులో లేవంటున్నారు. ఆ డబ్బాల్లోనిజంగా పోషకాలు ఎంత ఉన్నాయో దేవుడికెరుక.పోషకాల కోసం మార్కెట్లో వెదకద్దు. వంటింట్లోనేవెదకండిరాగి,జొన్న,సజ్జ,గోధుమల్లాంటిధాన్యాలు,కందిపప్పు,వేరుశనగ,నువ్వులు,ఆవాల్లాంటినూనెగింజలు,పంచదార,బెల్లంఇవన్నీపోషకాలే..మనఆహారంలోపోషక విలువలు లేని పదార్ధామే లేదు.నిజానికి ఆకుపచ్చని ఆకుకూరలు బాగానే దొరుకుతున్నాయి. కానీ, వాటిని ఫథ్యం కూరలని వాదించే వాళ్ళు ఎక్కువ. విందుభోజనాల్లో సాధారనంగా ఆకుకూరలు వడ్డించకపోవడానికి ఎక్కువ మంది తినరనే అభిప్రాయమే కారణం.బాగా మసాలాలు దట్టించి, నూనె పోసి వండితేనే అది వంటకంఅనే వాళ్ళు ఎక్కువ.వీళ్ళవలనతక్కినవాళ్ళక్కూడాపోషకాలుఅందకుండా పోతున్నాయి. ఆకుకూరలు పెడితే నీళ్ళ విరేచనాలు అవుతాయని కొందరు ఆకుకూరల్ని వండరు. ఆకు కూరల్లో ఉండేపీచుపదార్థాలు(డైటరీఫైబర్స్)విరేచనంఫ్రీగాకావడానికి
-కారణం అవుతాయి. ఈ ఫైబరు తగినంత మోతాదులో పేగులకు అందితేనే జీర్ణకోశ వ్యవస్థ బలసంపన్నంగా ఉంటుంది. దీనివలన కొందరు పిల్లలకు కొంచెం ఎక్కువ విరేచనాలు కావచ్చు. కొద్దికొద్దిగాతినిపిస్తూ అలవాటు చేయటమే మంచిదికాని,మాన్పించటం సరికాదు.పిల్లలకు పసినాటినుండేరకరకాలకూరగాయలు,ఆకుకూరలు,పోషకాలుపప్పు ధాన్యాలను కొద్దికొద్దిగా తినిపిస్తూ శరీరానికి అలవాటుచేయాలి. అందువలన జీర్ణాశయ వ్యవ
స్థకూ, కూరలకూ,పండ్లకూ మధ్యస్నేహం కలుస్తుంది.
జీర్ణశక్తి బలపడుతుంది.వైద్యశాస్త్రంవంటింట్లో దొరికే
పోషకాలను చక్కగాఉపయోగించుకోవాలనే చెప్తోంది. మనమేవాటిని బజార్లో వెదుక్కునే ప్రయత్నంచేస్తున్నాం. డబ్బు తగలేసి ఆరోగ్యానికి బదులుగా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం.
-
