12, సెప్టెంబర్ 2026, శనివారం

ముట్టు నొప్పి, అతి దురద సమస్యలు.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 ముట్టు నొప్పికి.. ఆయుర్వేద పరిష్కారాలు 

మన ప్రాంతంలో దొరికే ముదురు చింత బెరడు తీసుకొచ్చి ముక్కలు చేసి ఎండబెట్టి కాల్చి బూడిద చేసి జల్లించి నిలువ చేసుకోవాలి. మరో రెండు రోజుల లో బహిష్టు రాబోతుందనగా కంది గింజంత చింత బూడిదను ఉదయం పూట చెంచా నిమ్మ రసంలో కలిపి , సాయంత్రం పూట చెంచా తేనె తో కలిపి బహిష్టు వచ్చి ఆగిపోయే వరకు తింటూ ఉంటే నొప్పి తగ్గిపోయి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. 


విపరీతంగా దురద బాధిస్తుంటే.. ఆయుర్వేద పరిష్కారాలు.


వేప చిగుళ్ళు,పసుపు సమ భాగాలుగా తీసుకుని కొంచెం నీటితో మెత్తగా నూరి ఆ గుజ్జును దురదల పైన పట్టించి ఒక గంట ఆగి వేడి నీటితో స్నానం చేయండి. అలాగే మంచి పసుపు 50 గ్రాములు, పాత బెల్లం 100 గ్రాములు కలిపి దంచి నిలువ చేసుకోవాలి. పూటకు 5 గ్రాములు మోతాదుగాను చప్పరించి తిని మజ్జిగ తాగాలి. 

ఆహారంలో వంకాయ ,గోంగూర ,ఆవకాయ , మాంసాహారం, చేపలు , గుడ్లు , వేడి చేసే వస్తువులు మాని వేయండి. దురద సమస్య బాధించదు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...