3, జనవరి 2012, మంగళవారం

డా ఏల్చూరి.. తుమ్మ చెట్టు తో ఆయుర్వేదం( INDIAN GUM ARABIC TREE )



తెలుగు - తుమ్మ చెట్టు
english - indian gum arabic tree
హిందీ - బాబుల్ 
సంస్కృతం లో- బార్బరా 

మిత్రులారా తుమ్మ చెట్టుతో తయారుచేసిన నాగళ్లతోనే భారతీయ వ్యవసాయ నాగరికత పరిరవిల్లింది. ఒకసారి తయారు చేసిన తుమ్మ నాగలి ఎన్నో ఏళ్లపాటు ఉపయోగపడుతుంది .అరిగిపోకుండా, విరిగిపోకుండా ఉంటుంది. తుమ్మ చెట్టు పంచాంగాలను మనము సద్వినియోగం చేసుకుంటే శతాధిక వత్సరాలు జీవించవచ్చు.

తుమ్మ చెట్టు రూప గుణ ప్రభావాలు..

సాధారణంగా తుమ్మ చెట్టు తెలియని వారు అంటూ ఎవరు ఉండరు ఈ తుమ్మ చెట్లలో నల్లతమ్మ తెల్ల తుమ్మ బుడ్డ తుమ్మ కస్తూరి తుమ్మ మురికి తుమ్మ మొదలైనవి ఎన్నో  రకాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం నల్ల తుమ్మ గురించి తెలుసుకుందాం. ఇది వగరు తీపి కలిగిన రుచులతో ఉంటుంది.

1 . అతిసార విరేచనాలు తగ్గుటకు ( FOR DIARRHOEA )

తుమ్మ జిగురు - 5 gm
నీరు - 1 కప్

 జిగురును నీటిలో నానబెట్టి తాగుతూ ఉండాలి.

uses -  అతిసారము, రక్త అతిసారం తగ్గిపోతాయి.

* అజీర్ణ పదార్థాలు నిషేధం .

2 . విరిగిన ఎముకలు అతుకుటకు ( FOR BROKEN BONES )

తుమ్మ కాయ పొడి - 1 భాగం 
తుమ్మ బంక పొడి - 1 భాగం 
తేనె - 1 స్పూన్

 పై పొడులను కలిపి నిలువ చేసుకోవాలి. ఒక స్పూన్ మిశ్రమ పొడిని ఒక స్పూన్ తేనెతో కలిపి రెండు పూటలా తినాలి.

uses -  విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.

3 . దగ్గు,ఆయాసం తగ్గుటకు ( FOR COUGH AND WEARINESS )

తుమ్మ చెక్క కషాయం
కరక్కాయ బెరడు - 5 gm
తానికాయ బెరడు - 5 gm
మిరియాలు - 5 gm
పిప్పళ్లు - 5 gm
లవంగాలు - 5 gm
తెల్ల కాచు - 2 gm

 పై అన్నింటినీ కలిపి మర్ధించి, మిరియాలంత  పరిమాణంలో గోలీలు చేసి, నీడలో గాలికి ఆరబెట్టి నిలువ చేయాలి. పూటకు ఒక మాత్ర చొప్పున బుగ్గన పెట్టుకొని రసాన్ని మింగుతూ ఉండాలి .

uses - దగ్గు మరియు ఆయాసం తగ్గిపోతాయి

* కఫం పెంచే పదార్థాలు నిషేధం *

2 . అధిక చెమట తగ్గుటకు ( FOR EXCESSIVE SWEATING )

తుమ్మ ఆకు 
కరక్కాయ బెరడు
నీరు

 తుమ్మ ఆకును నీటితో నూరి ఒళ్లంతా రుద్ది కొంచెం ఆరిన తర్వాత దానిపైన నీటితో కలిపిన కరక్కాయ బెరడు పొడిని పట్టిస్తుండాలి.

uses - అధిక చెమట తగ్గిపోతుంది.

3 . కాలిన బొబ్బలు తగ్గుటకు ( FOR FIRE BURNS ,WOUNDS )

నల్ల తుమ్మ బంక పొడి 
కోడి గుడ్డు తెల్ల సొన 

 పై రెండింటిని కలిపి నూరి ఆ మిశ్రమాన్ని బొబ్బలపైన లేపనం చేస్తుండాలి.

uses - పుండ్లు ,బొబ్బలు మాడిపోతాయి.

4 . గుండె దడ ,బలహీనత తగ్గుటకు ( FOR WEAK HEART )

తుమ్మ పువ్వులు - 10 gm
మంచి నీరు- 1 కప్
పటిక బెల్లం పొడి - 1 స్పూన్

 పువ్వులను నీటితో మెత్తగా నూరి, బట్టలో వడ పోసుకుని పటిక బెల్లం పొడిని కలిపి ఉదయం పరగడుపున తాగుతుండాలి.

uses - గుండె సమస్యలు తీరిపోతాయి.

5 . తల నొప్పి తగ్గుటకు ( FOR HEADACHE )

తుమ్మ బంక 
నీరు

 బంకను నీటితో మెత్తగా నూరి నుదురుపైన పట్టువేయాలి.

uses - తల నొప్పి తగ్గిపోతుంది.

6 . శరీర బలం పెరుగుటకు  (  FOR BODY STRENGTH )

 నల్ల తుమ్మ బంక ముక్కలు
ఆవు నెయ్యి 
 పటిక బెల్లం పొడి

బంకను చిన్న చిన్న ముక్కలుగా నలగ కొట్టి కొంచెం ఆవు నెయ్యిలో వేయించి ,దంచి ,జల్లెడ పట్టి ఆ పొడిి తో సమానంగా పటిక బెల్లం పొడి కలిపి నిలువ ఉంచుకోవాలి. రోజు రెండు పూటలా, ఒక చెంచా మోతాదుగా అరచేతిలో వేసుకొని కొద్ది కొద్దిగా చప్పరిస్తూ తింటూ ఉండాలి.

uses  -   స్త్రీ పురుషులలో దేహశక్తి, రతి శక్తి విపరీతంగా పెరుగుతాయి, శరీరాలు గట్టి పడతాయి.

7  . పండ్లు కదలడం, చిగుర్లు వాయడం, నెత్తురు కారడం వంటి దంత వ్యాధులు తగ్గుటకు ( FOR LOOSE TEETH, TEETH GUM SWELLING, BLEEDING FROM TEETH GUMS )

 నల్ల తుమ్మ బొగ్గు పొడి ( thumma coal powder ) లేదా  నల్ల తుమ్మ బెరడు పొడి ( thumma bark powder )  -  10 gm
 పొంగించిన పటిక పొడి (  boil over  alum powder  )  -  10 gm

పై రెండింటినీ కలిపి నిలువ ఉంచుకోవాలి. ఈ చూర్ణంతో రోజూ పండ్లు తోముతుండాలి.

uses  -  పండ్లు కదలడం, నెత్తురు కారడం, చిగుర్లు వాయడం వంటి వ్యాధులు తగ్గిపోతాయి.దంతాలు గట్టి పడతాయి.

* పేస్ట్ వాడకూడదు. 

8  .  చెవి పోటు, చెవి చీము తగ్గుటకు (  FOR EARACHE, PUS IN THE EAR )

ఆవాల నూనె ( mustard oil )  -  100 gm
నల్ల తుమ్మ చెట్టు పూలు( thumma flowers )  - 50 gm

 నూనె ను బాండీలో పోసి మరిగిస్తూ, దానిలో పూలు వేసి కలియతిప్పుతూ పూలు నల్లగా మాడిన తర్వాత దించి చల్లార్చి వడకట్టుకోవాలి.

 ఈ తైలం రెండు పూటలా 5 లేదా 6 చుక్కలు గోరువెచ్చగా చేసి చెవులలో వేస్తుండాలి.

uses  -  చెవి పోటు, చెవిలో చీము పూర్తిగా తగ్గిపోతాయి.

9 . నడుము నొప్పి తగ్గడానికి వీర్యం వృద్ధి కావడానికి..

ఒక పాత్రలో మినుములు పోసి అవి మునిగి రెండు అంగుళాల ఎత్తు వచ్చేటంతవరకు పచ్చి తుమ్మ కాయలు దంచి తీసిన రసం పోసి నాన పెట్టి, ఎండిపోయిన తర్వాత చేతితో నలిపి పైపొట్టు తీసివేసి, పప్పుని ఎండబెట్టి ,కొంచెం నేతిలో వేయించి మెత్తగా దంచుకోవాలి అందులో తగినంత బాదంపప్పు, పిస్తా పప్పు ,పటిక బెల్లం కలిపితే అద్భుతమైన అతి శక్తివంతమైన నల్ల తుమ్మ చూర్ణం తయారవుతుంది. రోజు రెండు పూటలా 20 గ్రాముల మోతాదుగా పాలలో కలిపి తింటూ ఉంటే ఇంద్రియం పల్చబడటం ,శీఘ్ర స్కలనం ,నడుము నొప్పి మాయమై అమిత వీర్య వృద్ది కలుగుతుంది.

10. కాలి పగుళ్లు తగ్గడానికి..

తుమ్మ బంకను నీటితో మెత్తగా నూరి రాత్రి పూట కాలి పగుళ్లపై లేపనం చేస్తూ ఉంటే పగుళ్లు తగ్గిపోతాయి.

 .*వేడి పదార్థాలు నిషేధము.*


11. స్త్రీల సకల కుసుమ రోగాలకు..

లేత నల్ల తుమ్మ కాయలను నలగ గొట్టి ,నీడలో గాలికి ఆరబెట్టి, దంచి పొడి చేసుకుని జల్లెడ పట్టి దానితో సమానంగా పటిక బెల్లం పొడి కలిపి రెండు పూటలా ఒక చెంచా పొడి చప్పరించి తింటూ ఉంటే, చప్పిడి పథ్యం పాటిస్తుంటే అన్ని రకాల యోని స్రావాలు తగ్గిపోతాయి.

12. మూత్రంలో చక్కెర పోతూ ఉంటే..

రోజు రెండు పూటలా 10 గ్రాముల  తుమ్మ బంకను కప్పు నీటిలో వేసి నానబెట్టి వడ పోసుకొని సేవిస్తూ ఉంటే క్రమంగా మూత్రంలో చక్కెర తగ్గిపోతుంది.

13. కామెర్లు / పసిరికలు తగ్గడానికి..

నల్ల తుమ్మ కాయలు 10 గ్రాముల మోతాదుగా అర గ్లాసు నీటిలో నానబెట్టి పిసికి వడబోసి ఆ నీటిలో ఒక చెంచా పటిక బెల్లం కలిపి సేవిస్తూ ఉంటే కామెర్లు అంటే పసరికలు తగ్గిపోతాయి.

14. తీవ్రమైన ఎక్కిళ్లు తగ్గడానికి..

నల్ల తుమ్మ చెట్టు ముండ్లు 20 గ్రాములు నలగగొట్టి అర లీటర్ మంచినీటిలో వేసి సగం కషాయం మిగిలే వరకు మరగబెట్టి దించి వడపోసి ఆ కషాయం గోరువెచ్చగా అయిన తర్వాత అందులో ఒక చెంచా తేనె కలిపి కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటే ఏ ఔషధాలు వాడిన తగ్గని ఎక్కిళ్లు తప్పకుండా తగ్గిపోతాయి.

15. గొంతు నొప్పి ,పుండు తగ్గుటకు ..

తుమ్మ చెక్కతో కాచిన కషాయం గోరువెచ్చగా గొంతులో పోసుకొని గులకరించి ఊసివేస్తూ ఉంటే గొంతు సమస్యలు పరిష్కరించబడతాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...