10, సెప్టెంబర్ 2026, గురువారం

కమలా పండ్లు.. గుమ్మడి..

 కమలా పనులను వీలైనంత అధికంగా తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనకరమే కాకుండా అందం కూడా పెరుగుతుంది. చర్మాన్ని కాంతులు ఈనేలా చేస్తాయి వృద్ధాప్య ఛాయాల్ని తగ్గిస్తాయి. 

కమలా పండును యథాతతంగా తిన్న ప్రసంగా రసాన్ని తాగిన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కండరాలు బలోపేతం అవుతాయి ముడతలు మచ్చలు పూర్తిగా తగ్గుతాయి. 

కమల పండు తొక్కలను ఎండబెట్టుకొని పొడి చేసుకుని సౌందర్య సాధనంగా వివిధ రకాలుగా వాడవచ్చు. 

జిడ్డు చర్మం పోవాలంటే..

ముల్తానీ మట్టి, కమలా పండు తొక్కు, గంధం పొడి సమ భాగాలుగా తీసుకుని , ఒక టీ స్పూన్ టమోటా గుజ్జు కలిపి చర్మానికి మర్దనా చేసుకుని కొద్దిసేపయ్యక కడిగేయాలి. 

ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు చేయాలి.

కాంబినేషన్ స్కిన్.. 

రెండు చుక్కల ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకుని ముఖానికి మర్దనా చేయాలి. 

ముఖాన్ని వేడి నీటిలో ముంచిన మెత్తటి టవల్ తో కంప్రెస్ చేయాలి.

ముడతలు..

టేబుల్ స్పూన్ ప్రోటీనెక్స్ , పెరుగు కలిపి పేస్ట్ తయారు చేసుకుని , ఒక టీ స్పూన్ ఆపిల్ తురుము , రెండు చుక్కలు ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ కలిపి ముఖానికి మాస్క్ వేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తుంటే ముడతలు తగ్గుతాయి. 


గుమ్మడి..

ఏ కాలంలో నైనా వ్యాధులను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది గుమ్మడి. కారణం దీనిలో పుష్కలంగా ఉండే కెరోటినాయిడ్ లే. గుమ్మడి తో చేసిన పదార్థాలను తరచూ తీసుకునే వారిలో వ్యాధి నిరోధక శక్తి అధికం. ముఖ్యంగా బీటా కెరోటిన్ ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ . దీనికి చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే శక్తి అధికం. గుండె నాళాల్లో అడ్డంకులు తొలగించి గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. 

మేని నిగనిగలకు..

వయసుతో సంబంధం లేకుండా మేని నిగారింపు కోరుకునే వారు .. గుమ్మడి చక్కని యాంటీ ఏజింగ్ పదార్థమని తెలుసుకోవాలి . దీనిలోని ఆల్ఫా కెరోటిన్ వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది. కంటి శుక్లాలు రాకుండా చూస్తుంది. 

పీచు పుష్కలం..

గుమ్మడిలో పీచు పుష్కలంగా ఉంటుంది.దాంతో మలబద్ధక సమస్య అదుపులో ఉంటుంది. శరీరానికి మేలు చేసే కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, ఫాస్ఫరస్లు అధికంగా లభిస్తాయి. ఒక కప్పు తరిగిన గుమ్మడి నుంచి కాల్షియం 37 mg లభిస్తే , మెగ్నీషియం 22 mg లభిస్తుంది. 

ఆటలాడే అమ్మాయిలకు ప్రత్యేకం..

పొటాషియం స్థాయిలు పుష్కలంగా ఉండే గుమ్మడిని ఏదో ఒక రూపంలో తీసుకునే వారిలో రక్త పోటు అదుపులో ఉంటుంది. కప్పు గుమ్మడి నుంచి 564 mg పొటాషియం లభిస్తుంది . క్రీడా కారిణులకు ఏర్పడే సమస్య పొటాషియం లోపం. తరచూ వ్యాయామాలు చేయడం వల్ల స్వేదం కారణంగా చెమట రూపంలో పొటాషియం కోల్పోతారు క్రీడా కారిణులు. అటువంటి వారు గుమ్మడి తో చేసిన కూరలను, డెజర్ట్ లను స్వీకరించాలి. పైగా ఇది ఎముక బలానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటితో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచే జింక్ కూ కొదవలేదు. 

విటమిన్లు పుష్కలం..

వండిన గుమ్మడిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, మేని అందానికి తోడ్పడే విటమిన్ ఇ , కంటి చూపునకు సహకరించే విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఒక గిన్నెడు గుమ్మడి నుంచి 3 Mg ల విటమిన్ ఇ లభిస్తే, 12 Mg ల విటమిన్ సి లభిస్తుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...