5, ఏప్రిల్ 2012, గురువారం

నిమ్మ పండుతో ఏల్చూరి, కొండపల్లి ఆయుర్వేద పరిష్కారాలు

1 . విష ప్రభావం తగ్గుటకు ( FOR POISONS )

10 నిమ్మ పండ్ల రసం 
చక్కెర - తగినంత


పై రెండింటిని కలిపి తాగాలి.

ఉపయోగాలు  - గంజాయి మత్తు, నల్ల మందు మత్తు, సర్ప విషం విరిగిపోతుంది.

2 . చలి జ్వరం తగ్గడానికి ( FOR MALARIA FEVER )

నిమ్మ కాయ ముక్కలు
మంచి నీరు  - 3/4 litre

 నిమ్మకాయను సన్నని ముక్కలుగా తరిగి ,గింజలను తీసివేసి ,ఆ ముక్కలలో మంచినీరు కలిపి చిన్న మంటపైన అర్థ పావు లీటర్ కషాయం మిగిలే వరకు మరిగించి దించి  ఒక రాత్రి నిలువ ఉంచాలి..ఉదయమే వడకట్టి తాగాలి. ఈ విధంగా 3,4 రోజులు చేస్తే చలి జ్వరం తగ్గిపోతుంది.

3 . జ్వరం లో నోరు ఎండి పోతుంటే ( FOR DRYNESS OF THE MOUTH DURING FEVER )

చిన్న నిమ్మ కాయ ముక్క 

ముక్కను నోటిలో వేసుకొని ఊరిన రసాన్ని మాటి మాటికి ఉమ్మి వేస్తుంటే నోరు ఎండి పోవడం ఆగిపోతుంది.

4 . వాంతులు తగ్గడానికి ( FOR VOMITINGS )

నిమ్మ తొక్కల బూడిద - చిటికెడు
తేనె - 1 స్పూన్

రసం పిండి వేసిన నిమ్మ తొక్కలను ఎండబెట్టి కాల్చి బూడిద చేసి జల్లించి నిలువ ఉంచుకోవాలి.వాంతులు వచ్చినప్పుడు చిటికెడు బూడిద పొడి ని 1 స్పూన్ తేనె తో కలిపి రోజుకు నాలుగైదు సార్లు నాకుతుంటే వాంతులు కట్టుకుంటాయి.

5 . జిగట విరేచనాలు తగ్గుటకు ( FOR MOTIONS )

2 నిమ్మ పండ్ల రసం 
2 చుక్కల వంటాముదం

 పై వాటిని కలిపి ఉదయం పరగడుపున తాగుతుంటే 5,6 రోజులలోనే జిగట విరేచనాలు తగ్గిపోతాయి.
6 . నిద్ర పట్టడానికి ( FOR INSOMNIA )

ప్రతిరోజు ఉదయం ఒక నిమ్మ పండు రసం, సాయంత్రం ఒక నిమ్మ పండు రసం కొద్ది నీళ్లలో కలిపి తాగుతుంటే నిద్ర బాగా పడుతుంది.

7 . ఒళ్ళు నొప్పులు తగ్గడానికి  ( FOR BODY PAINS )

నిమ్మకాయ తొక్కలు
తినే ఉప్పు

 పై వాటిని నీటిలో వేసి మరగబెట్టి ఆ నీళ్లు గోరువెచ్చగా అయిన తర్వాత స్నానం చేస్తుంటే, ఒళ్ళు నొప్పులు, అలసట తగ్గిపోతాయి.

8 . వెంట్రుకల సమస్యలకు ( FOR HAIR PROBLEMS )

5 నిమ్మ పండ్ల రసం 
కొబ్బరి నూనె - 1/2 లీటరు

 పై వాటిని కలిపి చిన్న మంట పైన నూనె మిగిలే వరకు మరిగించి దించి వడపోసి రోజు తలకు రాసుకుంటుంటే ,తల వెంట్రుకల కుదుళ్లు గట్టిపడి తల నెరవకుండా ఉంటుంది. తలలో పేలు,చుండ్రు హరించిపోయి క్రమంగా తెల్ల వెంట్రుకలు కూడా నల్లబడతాయి.

9 . నాలుక రుచి తగ్గిపోతే ( FOR TASTELESSNESS OF TONGUE )

నిమ్మ పండు పై తొక్క ను నాలుక పైన రుద్దుతూ ఉంటే నాలుక శుభ్రపడి రుచి తెలుస్తుంది.

10 . వంటి పైన పైత్య దద్దుర్లు తగ్గుటకు ( FOR ITCHINGS AND URTICARIA )

నిమ్మ పండు రసం 
కొంచెం నీళ్ళు
కొంచెం పటిక బెల్లం పొడి 

పై వాటిని కలిపి రోజు రెండు మూడు సార్లు తాగుతుంటే దురదలు,దద్దుర్లు తగ్గిపోతాయి.
 11 .తీవ్రమైన దగ్గు తగ్గుటకు( FOR SEVERE COUGH )

నిమ్మ రసం  - 10 gm
నీళ్ళు - 10 gm
తేనె - 10 gm
ఉప్పు - 5 gm

 పై వాటిని కలిపి గోరువెచ్చగా వేడి చేసి, రెండు పూటలా సేవిస్తుండాలి.  తీవ్రమైన దగ్గు తగ్గిపోతుంది.

12 . నోటి దుర్గంధం , పెదాల పగుళ్లు తగ్గుటకు ( FOR BAD ODOUR OF MOUTH AND FOR LIP CRACKS )

తాజా నిమ్మ పండు రసం - 10 gm
పన్నీరు - 20 gm

పై వాటిని కలిపి నోటిలో పోసుకొని ఐదు నిమిషాలు పుక్కిలించి ఊసివేయాలి. ఇలా రోజు రెండు పూటలా చేస్తుంటే నోటి దుర్వాసన, పెదిమల పగుళ్లు తగ్గిపోయి నోరు సుగంధంగా పరిమళిస్తుంది.

13 . ఉబ్బస బాధ తగ్గుటకు ( FOR ASTHMA )

గోరు వెచ్చని టీ - 1 cup
1 నిమ్మ పండు రసం

 పై వాటిని  కలిపి తాగితే తక్షణమే ఉబ్బసం శాంతిస్తుంది.

14 . తేలు విషం తగ్గుటకు ( FOR SCORPION BITE )

నిమ్మ రసం 
ఉప్పు

 పై వాటిని కలిపి తేలు కుట్టిన చోట రుద్దుతుండాలి .వెంటనే విషం విరిగిపోతుంది.

15 . తలనొప్పి , నడుం నొప్పి తగ్గుటకు ( FOR HEADACHE AND LUMBAGO )

 నిమ్మ పండు తొక్కలను నొప్పిగల చోట పిండి ఆ రసంతో మరదనా చేస్తుంటే నడుం నొప్పి,  తల నొప్పి, నరాల నొప్పులు తగ్గిపోతాయి.
16 . చెవి పోటు తగ్గడానికి ( FOR EARACHE )

నిమ్మ పండు చెక్క 
ఉప్పు

చెక్క పైన ఉప్పు చల్లి వేడి చేసి రెండు మూడు చుక్కల రసం చెవుల్లో వేస్తే వెంటనే చెవిపోటు తగ్గుతుంది.

17 . ముక్కు నుండి రక్తం కారడం తగ్గుటకు ( FOR NOSE BLEEDING )

నిమ్మ రసం - 3, 4 చుక్కలు

 ముక్కుల్లో రసం వేస్తే రక్తం కారడం ఆగిపోతుంది.

18 . పడిష భారం తగ్గుటకు ( FOR COLD EFFECT )

 నిమ్మకాయను సగానికి కోసి వాసన చూస్తుంటే పడిశం తగ్గిపోతుంది.

19 . ప్లీహ వృద్ధి తగ్గడానికి ( FOR ENLARGEMENT OF SPLEEN )( BALLA ROGAM )

నిమ్మ పండు రసం - 10 gm
ఉల్లి గడ్డ రసం - 10 gm

 రోజు పరగడుపున పై వాటిని కలిపి తాగుతుంటే పొట్టకుండ లాగా పెరిగే ప్లీహరోగం హరించిిపోతుంది.

20 . పిల్లలు పాలు కక్కుతుంటే 

పాలు కక్కే పిల్లలకు పాలు ఇచ్చే ముందు, ఇచ్చిన తర్వాత కొద్దిసేపటికి 4 చుక్కలు నిమ్మ రసం పిల్లల నోటిలో వేస్తే పాలు కక్కడం ఆగిపోతుంది.

21 . పిల్లలకు మూత్రం సరిగా రాకపోతే ( FOR ABSENT URINATION IN THE CHILDREN )

నిమ్మ గింజలు
నీరు

గింజలను నీటితో మెత్తగా నూరి బొడ్డు పైన పోసి కొద్దిిికొద్దిగా చన్నీళ్ళు పోస్తుంటే మూత్రం ధారాళంగా వస్తుంది.

డా.కొండపల్లి గారి ఆయుర్వేద పరిష్కారాలు.. నిమ్మ కాయ తో..

1 ..విరేచనాలు తగ్గుటకు ( FOR MOTIONS )

నిమ్మ రసం - 1 స్పూన్
సాల్ట్ - చిటికెడు
గోరు వెచ్చని నీరు 

పై వాటిని కలిపి తాగించాలి.

2 . శరీర లావు తగ్గుటకు ( FOR OBESITY )

నిమ్మ రసం - 2 స్పూన్స్
తేనె - 2 స్పూన్స్
వేడి నీరు - 2 స్పూన్స్

పై వాటిని కలిపి రోజూ ఉదయం పరగడుపున సేవించాలి.

3 . దురద , చిడుము , గజ్జి తగ్గడానికి ( FOR ITCHINGS ,SCABIES ETC SKIN DISEASES )

నిమ్మ ఆకులు 
సాల్ట్
పసుపు

నిమ్మ ఆకులలో  ఉప్పు , పసుపు వేసి మెత్తగా దంచి పైకి లేపనం చేయాలి.

4 . గోరు చుట్టు తగ్గడానికి

నిమ్మ కాయ 
సాల్ట్
పసుపు

కాయకు రంధ్రం చేసి ,అందులో ఉప్పు , పసుపు వేసి వేలికి తొడగాలీ.

5 . చర్మ వ్యాధులు తగ్గడానికి ( FOR SKIN DISEASES )

నిమ్మ రసం , తులసి రసం సమానంగా కలిపి లేపనం చేయాలి.

6 .కీళ్ల నొప్పులు తగ్గడానికి ( FOR JOINT PAINS )

నిమ్మ రసం - 2 స్పూన్ లు
వెల్లుల్లి రసం  - 1 స్పూన్

పై వాటిని కలిపి రోజూ 2 సార్లు సేవిస్తుండాలి

7 . పాము కాటు ( FOR SNAKE BITE )

నిమ్మ గింజలు
నీరు 

గింజలను నీటిలో నూరి 2 స్పూన్స్ వెంటనే తినిపించాలి

4, ఏప్రిల్ 2012, బుధవారం

పెరుగుతో డాక్టర్ కొండపల్లి ఆయుర్వేద పరిష్కారాలు

1. అర్శ మొలలు తగ్గడానికి ( FOR PILES )

 నిత్యం పెరుగు సేవిస్తుండాలి రక్తం స్రవించడం ఆగిపోతుంది లేదా మజ్జిగ సైంధవ లవణం, వాము చూర్ణం కలిపి త్రాగించాలి.

2 . నీళ్ల విరేచనాలు తగ్గుటకు ( FOR LOOSE MOTIONS )

a . ) పెరుగు 
దానిమ్మ ఇగుర్లు 

 పెరుగులో దానిమ్మ ఇగుర్లు కలిపి సేవించాలి

b. ) తెల్ల జీలకర్ర  -  1 స్పూన్
      మజ్జిగ

పై వాటిని కలిపి సేవించాలి .

3 . జిగట విరేచనాలు తగ్గుటకు

పెరుగు లేదా మజ్జిగ
తేనె

పై వాటిని కలిపి సేవించాలి.

4 . శరీరం పైన మంటలు తగ్గుటకు  (  FOR WHOLE BODY BURNS )

ఆవు మజ్జిగ
బట్ట

బట్టలు మజ్జిగలో తడిపి శరీరమంతటా రుద్దాలి.

5 . దీర్ఘకాలిక మలబద్ధకం తగ్గుటకు (  FOR LONG LASTING CONSTIPATION )

ఆవు మజ్జిగ
వాము
బిడా లవణం ( నల్ల ఉప్పు )

 పై వాటిని కలిపి తాగించాలి.

6 . పార్శ్వ నొప్పి ( అర తల నొప్పి )  తగ్గుటకు (  FOR MAIGRAINE )

మజ్జిగ అన్నం 
కండ చక్కెర

పై వాటిని కలిపి ప్రతి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే భుజించాలి.

7 . మూత్రం సరిగ్గా రావడానికి ( FOR IMPROPER URINATION )

మజ్జిగ
శుద్ధి చేసిన గంధకం - 1/2 స్పూన్

 పైవాటిని కలిపి త్రాగించాలి

8 .  అజీర్ణం తగ్గుటకు ( FOR INDIGESTION )

మజ్జిగ
ఉప్పు

పై వాటిని కలిపి సేవించాలి

9 . బలం కలగడానికి (  FOR STRENGTH )

పెరుగు
బెల్లం

పై వాటిని కలిపి రోజు ఉదయమే సేవిస్తుండాలి. 

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...