Thursday 27 October 2011

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు
డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టారు 2001లో నారాయణ హృదయాలయ స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నారు

1. సాధారణమైన వ్యక్తులు తమ గుండెను పదలంగా ఉంచుకోవడానికి ఏమి చేయాలి?
ఆహారం... పిండి పదార్థాలు తక్కువగా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి చమురు పదార్థాలు తక్కువగా తీసుకోవాలి
 .వ్యాయామం.. కనీసం వారానికి ఐదు రోజులపాటు అరగంట నడక. లిఫ్ట్ వాడకండి ఎక్కువ సేపు కదలకుండా ఒకే చోట కూర్చోవద్దు
 పొగ త్రాగవద్దు
బరువును అదుపులో ఉంచుకోండి
బీపీ షుగర్ వ్యాధులను నియంత్రించండి
2. ఆరోగ్యంగా ఉండే వారిలో హఠాత్తుగా గుండె ఆగిపోవడం అలాంటి వార్తలను విన్నప్పుడు షాకింగ్ గా ఉంటుంది ఎందుకలా
దీనినే సైలెంట్ ఎటాక్ కార్డియాక్ అరెస్ట్ అంటారు అందుకే మేము 30 ఏళ్లకు పైబడిన వ్యక్తులు ఆరోగ్య పరీక్షలు రెగ్యులర్గా అలవాటుగా చేయించుకోమని చెబుతాము
3 .గుండె ఒత్తిడి తొలగింపునకు మీ సూచనలు ఏమిటి
జీవితం పట్ల మీ దృక్పథన్ని మార్చుకోండి ప్రతిదీ అత్యంత ఉత్తమంగా ఉండాలని చూడకండి
4. ఆరోగ్యవంతమైన గుండె కోసం జాగింగ్ కన్నా నడకే మంచిదా లేదా ఇంకేదైనా ఉత్తమమైన వ్యాయామం తీవ్రమైనది ఉందా
జాగింగ్ వల్ల అలసట తొందరగా కలుగుతుంది అది కీళ్ళను దెబ్బతీయవచ్చు కాబట్టి జాగింగ్ కంటే నడకే మేలు
5 . మాంసాహారం చేపలు గుండెకు మంచిదా
జవాబు ..కాదు
6 .గుండె జబ్బులు వంశపారంపర్యమా
అవును
7 .రక్తపోటు తక్కువగా ఉండే వారిలో గుండె జబ్బులు వస్తాయా
చాలా తక్కువగా వస్తాయి
8.చిన్న వయసు నుంచే కొలెస్ట్రాల్ కూడా పడుతుందా లేక 30 ఏళ్ల తర్వాత కూడడం మొదలవుతుందా
చిన్నతనం నుండి కొలెస్ట్రాల్ కూడడం మొదలవుతుంది
9.ఓ పద్ధతి లేని ఆహారపు అలవాట్లు గుండెపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి
ఆహారపు అలవాట్లు నియమబద్ధంగా లేకుండా జంక్ ఫుడ్ తినడం ఆరోగ్యానికి హానికరం అలాంటప్పుడు శరీరంలో క్రమానుగతంగా విడుదల అయ్యే జీర్ణ రసాలు పనితీరు సంశయాత్మకంగా మారుతుంది
10 .మందులు వాడకుండా కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచగలమా
ఆహార నియంత్రణను పాటించండి రోజు నడక సాగించండి అక్రూట్ వాల్నట్ తినండి
11 .యోగా గుండె జబ్బులను నిలువరించగలరా
యోగా ఉపయోగపడుతుంది
12 .పప్పు నూనె పొద్దుతిరుగుడు నూనె ఆలీవ్ నూనె ఏ నూనె వాడితే మంచిదంటారు
అన్ని నూనెలు చెడ్డవే..
13 .గుండెకు ఏది మేలైన ఆహారం
పళ్ళు కూరగాయలు చాలా మేలు చేస్తాయి నూనె చెడు చేస్తుంది
14 .మామూలుగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఏమిటి? ఏవైనా ప్రత్యేక పరీక్షలు ఉన్నాయా
షుగర్ కొలెస్ట్రాల్ సరిగా ఉన్నాయా లేదో తెలుసుకోవడానికి రక్త పరీక్ష చేయించుకుంటు ఉండాలి. బీపీ చూయించుకుంటూ ఉండాలి 2d ఎకో తర్వాత ట్రెడ్మిల్ పరీక్షలు చేయించుకోవాలి
15 .గుండెపోటు హార్ట్ ఎటాక్ రాగానే చేయవలసిన ప్రథమ చికిత్స ఏమిటి
ఆ మనిషిని పడుకోబెట్టాలి ఆస్ప్రిన్
 మాత్రతోపాటు దొరికితే సార్బిట్రేట్ మాత్రతో కలిపి నాలుక కింద పెట్టాలి గుండెపోటు వచ్చిన మొదటి గంట ప్రాణాంతకం అవుతుంది కాబట్టి వెంటనే గుండె దవాఖానకు తరలించాలి
16 .నొప్పి గుండెనొప్పెన లేక గ్యాస్ట్రిక్ నొప్పి నా అనేది ఎలా తెలుసుకోగలం
ఈసీజీ లేకుండా చెప్పలేము
17. సాధారణ రక్తపోటు 120/80 కంటే ఎక్కువ ఉన్నవారు పూర్తి ఆరోగ్యంగా ఉండవచ్చా
ఉండవచ్చు 
18 చాలామందికి దినచర్య నియమబద్ధంగా ఉండడం లేదు రాత్రి పొద్దు పోయేదాకా ఆఫీసులో పనిచేయవలసి వస్తుంది ఇది గుండె మీద ప్రభావం చూపుతుందా ఇలాంటివారికి ఎలాంటి ముందు జాగ్రత్తలు సూచిస్తారు
వయసులో ఉన్నప్పుడు సహజసిద్ధంగా శరీరమే వీటిని తట్టుకుంటుంది మీరు మీ జీవన గడియారాన్ని అనుసరించడం చాలా అవసరం
19 .గుండె ఆపరేషన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
ఆహారా నియంత్రణ వ్యాయామం వేళ్ళకు మందులు కొలెస్ట్రాల్ బిపి బరువులను అదుపులో ఉంచుకోవడం అవసరం
20 మీరు పేదలు అవసరంలో ఉన్న వారి కోసం ఎంతో సేవ చేస్తున్నారు మీకు ప్రేరణ ఎవరు
నేను వైద్యం చేసిన మదర్ థెరిస్సా నాకు ఈ విషయంలో ప్రేరణగా నిలిచారు.
నారాయణ హృదయాలయ మల్లారెడ్డి హాస్పిటల్ సూరారం క్రాస్ రోడ్ జీడిమెట్ల హైదరాబాద్ ఫోన్ 04 0 2 3 7 8 3 0 0 0, 9 6 7 6 9 0 2 1 1 1, ఈమెయిల్ nh.hyd @hrudayalaya.com


No comments:

Post a Comment