Tuesday 16 December 2014

శీతాకాలపు వ్యాధులు - ఆయుర్వేద పరిష్కారాలు / SHEETHAAKAALAPU VYAADHULU - AYURVEDA PARISHKARALU / WINTER DISEASES - AYURVEDIC SOLUTIONS.

ఆరోగ్యాన్ని దెబ్బ తీసే వాటిలో నాలుగు ముఖ్యమైన అంశాలను పరిగణించాలని ఆయుర్వేదం చెబుతోంది. 1. వాతావరణపు గాలి . 2.త్రాగే నీరు. 3.నివసించే ప్రదేశం. 4.కాలం ( ఋతువు, వయస్సు ).రోగాలను కలిగించే విషయంలో ఇవి ఒకదానికంటే ఒకటి బలమైనవిగా ఉంటాయి.ఒకదానికంటే మరొకటి తప్పించుకోలేని విధంగా దాడి చేస్తాయి.కాలం అనేది ఎవరి మీదైనా దాడి చేయగలదు,ఏమైనా చేయగలదు.ముఖ్యంగా శీతాకాలం .ఈ కాలంలో మనమందరమూ , జలుబు , దగ్గు , ముక్కు దిబ్బడలాంటి సమస్యలు ఎదొర్కొంటూ ఉంటాము.మనలో చాలా మంది ఈ సమస్యల నుండి తప్పించుకోలేరు.ఎలాంటి వ్యాయామాలు కాని, జీవన శైలిలో మార్పులు కాని ఈ సమస్యల నుండి మనల్ని రక్షించలేవు.ఎందుకంటే ఈ వ్యాధికారక క్రిములు ఒకసారి గాలిలో చేరితే ఎవరైనా వాటికి గురికావాల్సిందే.కావున అన్ని సమయాల్లోనూ ముందు జాగ్రత్తలు తీసుకోవడం ,శుభ్రత పాటించడం చాలా ముఖ్యం.ఈ చిన్న సమస్యలకు వెంటనే చికిత్స తీసుకోకపోతే అవి ప్రాణాంతక సమస్యలుగా మారే అవకాశం ఉంది.ఈ కాలంలో ఆస్త్మా వంటి వ్యాధులు కూడా తీవ్రమౌతాయి.

జలుబు - శ్వాస మార్గాలకు చెందిన వైరస్ ఇన్ ఫెక్షన్ వల్ల జలుబు వస్తుంది. మొదటి మూడు రోజుల్లో ఇది ఇతరులకు వ్యాపించే గుణం కలిగి ఉంటుంది.దీనిని అశ్రద్ధ చేస్తే చెవి నొప్పి రావచ్చు.పిల్లి కూతలు రావచ్చు.సైనసైటిస్ రావచ్చు.ఊపిరితిత్తులు రోగగ్రస్తమై న్యుమోనియాలోకి దారితీయవచ్చు.

జలుబు రావడానికి కారణాలు - ప్రధాన కారణం వైరస్ .దగ్గటం,తుమ్మటం,మాట్లాడటం ద్వారా నీటి తుంపరలు విడుదలౌతాయి.వీటి ద్వారా ఇన్ ఫెక్షన్ వ్యాపిస్తుంది.ఒకరు వాడిన వస్తువులు మరొకరు వాడటం, కరచాలనం ద్వారా కూడా వ్యాపిస్తుంది.
వ్యాధి లక్షణాలు - ముక్కు కారడం,ముక్కు బిగేయడం,దగ్గు , గొంతులో నస ,గొంతులో కఫం చేరడం,తుమ్ములు , ఒళ్ళు నొప్పులు ,తల నొప్పి , కళ్ళ నుండి నీరు కారడం , జ్వరం , అలసట ,చెవి నొప్పి.

నివారణ పద్ధతులు - జలుబుకు కారణమయ్యే క్రిములు ప్రతి చోటా ఉంటాయి.బొమ్మల నుండి గాలి వరకు ఇవి విస్తరించి ఉంటాయి.జలుబును నివారించాలంటే కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
తరచుగా కళ్ళను ,ముక్కును తాకకండి.చేతులను తరచుగా కడుక్కోవడం ద్వారా సమస్యను చాలా వరకు నివారించవచ్చు.ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం,ఇంట్లో ఎవరికైనా జలుబు ఉంటే జాగ్రత్తగా ఉండడం అవసరం.

జలుబుకు ఆయుర్వేద చికిత్సలు - 

1. శొంఠి చూర్ణం పావు టీ స్పూన్ ,పిప్పళ్ళ చూర్ణం పావు టీ స్పూన్ ,మిరియాల చూర్ణం పావు టీ స్పూన్ , అరకప్పు వేడి నీళ్ళు .
పై అన్నింటిని కలిపి తాగండి.జలుబు సమస్య తగ్గుతుంది. జలుబు తీవ్రతను బట్టి రోజుకు రెండు పూటలు లేదా మూడు పూటలు వరుసగా నాలుగైదు రోజులు వాడండి.
2. గుప్పెడు తులసి ఆకులు ,ఒక టీ స్పూన్ మిరియాలు ,ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు , రెండు కప్పుల నీళ్ళు. 
పై అన్నింటినీ కలిపి స్టవ్ మీద పెట్టి ఒక కప్పు కషాయం మిగిలే వరకు మరిగించండి.తర్వాత వడపోసుకొని సగం కప్పు కషాయం ఉదయం ,సగం కప్పు కషాయం రాత్రి గోరు వెచ్చగా తాగండి.సమస్య తీవ్రతను బట్టి నాలుగైదు రోజులు వాడండి జలుబు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.

COMPUTER CAUSED DISEASE / CARPAL TUNNEL SYNDROME - AYURVEDIC SOLUTIONS

మీరు కంప్యూటర్ని వాడుతుంటారా హస్తంలోనూ వేళ్లలోనూ నొప్పితో కంప్యూటర్ వాడలేని పరిస్థితి వస్తుందా అయితే మీ సమస్య కార్పెల్ టర్నల్ సిండ్రోమ్ కావచ్చు దీనికి ఆయుర్వేదంలో చక్కని చికిత్సలు ఉన్నాయి అలాగే నివారణ పద్ధతులు కూడా ఉన్నాయి వీటిని వివరంగా తెలుసుకుందాం

కంప్యూటర్ వలన వచ్చే వ్యాధి కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ కు ఆయుర్వేద పరిష్కారాలు

మనికట్టు లోపలి ప్రదేశాన్ని కార్పెట్ టన్నెల్ అంటారు ఇది కార్పెల్ ఎముకలతోనూ అడ్డంగా అమరిన లిగమెంటులతోనూ నిర్మితమవుతుంది ఒకవేళ ఇది వ్యాధిగ్రస్తమైతే అలాంటి స్థితిని కార్పెంటర్నల్ సిండ్రోమ్ అంటారు దీనిలో ప్రధానంగా మణికట్టులో ఉండే మీడియన్ నరం మీద ఒత్తిడి పడుతుంది. ఈ వ్యాధిలో హస్తంలోనూ చేతి వేళ్లలోనూ బొటనవే
ళ్లలోనూ ఒక్కోసారి బాహువు మొత్తంలోనూ నొప్పి తిమ్మిరి మొద్దు బారడం చేతి కండరాలు బలహీన పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
బహు లేదా ముంజేయి నుంచి మీడియన్ నరం కార్పెంటర్ ద్వారా ప్రయాణించి హస్తంలో అంతమవుతుంది మామూలు వ్యక్తులు లో ఈ నరం బొటనవేలు చూపుడు వేలు మధ్య వేలు ఉంగరం వేలులో కొంత భాగంలో స్పర్శను కదలికలను నియంత్రిస్తుంటుంది సాధారణ పరిస్థితుల్లో కార్పల్ టన్నెల్ ప్రదేశంలో ఉండే నరానికి టెండాన్ లకు తగినంత స్థలం ఉంటుంది ఒకవేళ ఈ నిర్మాణాలు బిగుతుగా తయారై వరుసుకుపోతే మీడియన్ నర మీద ఒత్తిడి పడుతుంది ఇతర దెబ్బలు వ్యాధులతో పోలిస్తే కార్ప ళ్ టన్నెల్ సిండ్రోమ్ వ్యాధి వలన ఎక్కువ పని గంటలకు నష్టం కలుగుతుంది ప్రతి వంద మందిలోనూ కనీసం ముగ్గురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు హస్తంలో సూదులు వచ్చినట్లు కుచ్చినట్లు పోట్లుగా అనిపించడం నొప్పి తిమ్మిర్లు వంటి లక్షణ సమూహంతో బాధపడే వారిలో 20% మందికి కార్పల్ టన్నెల్ సిండ్రోమ
 వ్యాధి ఉంటుంది పురుషులకంటే మహిళల్లో దీని ఉనికి ఎక్కువ
ఈ వ్యాధికి కారణాలు ఏమిటంటే మీడియం నరం మీద ఒత్తిడి కలుగ చేసే పరిస్థితులు రక్త సరఫరాకు ఆటంకం కలిగించే కారణాలు అన్నీ కలిసి కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ను కలగజేస్తాయి అవి హైపోథైరాయిడిజం రుమటాయిడ్ ఆర్థరైటిస్ గర్భధారణ వంటి స్థితులు కార్పల్ టన్నుల్లో కణజాలాన్ని పెంచుతాయి ఫలితంగా లోపల ఒత్తిడి పెరిగి ఈ వ్యాధి ప్రాప్తిస్తుంది మణికట్టుకు దెబ్బలు తగలడం ఎముకల ఉపరితలం మీద బొడిపెల మాదిరిగా బోన్ స్పర్ స్ పెరగటం టెండన్ పొరల్లో వాపు జన్మించడం వంటి కారణాలవల్ల కార్పల్ టన్ను ల్ లో ఖాళీ జాగా తగ్గిపోతుంది ముఖ్యంగా మణికట్టును అసహజమైన రీతిలో వంచుతూ పదేపదే ఏదైనా పని చేసినప్పుడు టెండాన్ పొరలు ఉబ్బి ఈ సమస్యను ఉత్పన్నం చేస్తాయి పదేపదే ఒకే ప్రదేశంలో దెబ్బ తగలడాన్ని వైద్య పరిభాషలో రిపీటెడ్ స్ట్రెయిన్ ఇంజ్యూరీ అంటారు మధుమేహం వంటి స్థితుల్లో సున్నితంగా మారినట్లుగానే చేతి మణికట్టు లోని మీడియన్ నరం కూడా సెన్సిటివ్ గా తయారై ఒత్తిడికి స్పందిస్తుంది ఫలితంగా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి ధూమపానం మద్యపానం రెండు నరాలను రేగేలా చేస్తాయి ఈ క్రమంలో మీడియన్ నరం ప్రభావితమై తత్సంబంధిత లక్షణాలు మొదలయ్యే అవకాశం ఉంది.

ఈ వ్యాధిలో కనిపించే అతి సాధారణ లక్షణాలు తెమ్మిరి మొద్దు బారడం నొప్పి కండరాల బలహీనతలు ఎక్కువగా కనిపిస్తాయి అరుదుగా అరిచేతిలోనూ కనిపించవచ్చు మీడియన్ నరం అధీనంలో ఉన్న ప్రాంతమంతా అంటే బొటనవేలు చూపుడు వేలు మధ్య వేలు ఉంగరం వేలు సగభాగంలో తిమ్మిరి నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తాయి వ్యాధి ప్రారంభంలో రాత్రిపూట లక్షణాలు కనిపించడం  మొదలవుతాయి చెయ్యని విదిలిస్తే అప్పటికి నొప్పి తగ్గుతుంది చిటికెన వేలు లో మాత్రం వ్యాధి లక్షణాలు కనిపించవు ఇలా మిగతా వేళలో లక్షణాలు కనిపిస్తూ చిటికెన వేలులో కనిపించకపోవడం అనేది ఈ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ వ్యాధిని గుర్తించడానికి తోడ్పడే ప్రధానమైన అంశం
 దేనినైనా పట్టుకున్నప్పుడు వ్యాధి లక్షణాలు ఉధృతం అవుతాయి ఉదాహరణకు బ్రష్ తో పళ్ళు తోముకునేటప్పుడు లేదా చెంచాతో ఏదైనా తినేటప్పుడు హఠాత్తుగా చేతి వేళ్లలో నొప్పి మొదలవవచ్చు ఈ వ్యాధి దీర్ఘకాలం పాటు కొనసాగే వారిలో బొటనవేలు కండరాలు సన్నబడి కుంచుకుపోయే అవకాశం ఉంది ఈ వ్యాధిని గుర్తించడానికి మీ సాధారణ ఆరోగ్యానికి సంబంధించిన ఇతివృత్తం తెలుసుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు కీళ్ల నొప్పులు గర్భధారణ థైరాయిడ్ సమస్యలు మధుమేహం వంటి వ్యాధులు లేదా స్థితిగతులు ఈ వ్యాధికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కారణమవుతాయి కాబట్టి వీటి సమాచారం అవసరం అవుతుంటుంది అలాగే మణికట్టు చెయ్యి మొదలైన భాగాలకు ఏమైనా దెబ్బలు తగిలాయేమో చూడాల్సి ఉంటుంది మీరు రోజువారీగా చేసే పనులు వృత్తి పనులు కొత్తగా చేసిన లేదా అలవాటు లేకుండా చేసిన పనుల గురించిన సమాచారం కూడా అవసరమవుతుంది మరీ తీవ్రమైన కేసుల్లో థైరాయిడిజం రుమటిజం వంటి వ్యాధుల ఉనికిని తెలుసుకోవడం కోసం రక్తపరీక్షలు, మీడియన్ నరం స్థితిగతులను తెలుసుకోవడం కోసం నర్వ్ కండక్షన్ టెస్టులు, ఎక్స్రే పరీక్షలు, ఎమ్మారై వంటి పరీక్షలు అవసరమవుతాయి 

చికిత్స వ్యూహం ఏమిటంటే

హస్తంలోని కార్పల్ టన్నుల్లో ఒత్తిడిని లేదా నొప్పిని తగ్గించటం నరాలు మున్ముందు మరింత దెబ్బ తినకుండా నివారించడం కండరాల శక్తి సామర్థ్యాలను పెంచడం అనేది ఆయుర్వేద చికిత్స వల్ల సాధ్యమవుతాయి దీనికి శోధ హర ఔషధాలు, వేదనాస్థాపన ఔషధాలు పంచకర్మ చికిత్స పద్ధతులు అవసరమవుతాయి .వాత హర ఔషధాలు ఈ వ్యాధి చికిత్సలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాతం అనేది నాడీ సంబంధ వ్యాధుల్లో ప్రధానంగా దూషితమవుతుంది ఆయుర్వేద చికిత్సల ద్వారా దీనిని సమస్థితికి తీసుకురావాల్సి ఉంటుంది
చేతులను హస్తాలను సాగదీస్తూ చేసే వ్యాయామాలు 
చేయి కండరాలను బలపరిచే వ్యాయామాలు ఫలితాలనిస్తాయి .ఈ వ్యాధి బారిన పడిన బాధితులు కొంతమంది శస్త్ర చికిత్స గురించి ఆలోచిస్తారు. శస్త్ర చికిత్సలో కార్పెంటర్నల్ పైకప్పులలో ఉండే నరం దెబ్బ తిని ఉంటే శస్త్ర చికిత్స వల్ల ఉపయోగం ఉండదు.

కాబట్టి ప్రారంభంలోనే అప్రమత్తమై తగిన ఔషధ చికిత్సలను నివారణ పద్ధతులను పాటించడం అవసరం

నివారణ ఏమిటంటే 
ప్రాథమికంగా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి. ఎత్తుకు తగిన విధంగా సరైన బరువును కలిగి ఉండాలి. స్మోక్ చేసే అలవాటు ఉంటే మానేయండి .శక్తిని కదలికలను మెరుగుపరిచే వ్యాయామాలు చేయండి. చూపుడు వేలు  బొటనవేలు ను ఉపయోగించడం అంటే పెన్ను వంటి వస్తువులను పట్టుకునే సందర్భాల్లో సాధ్యమైనంత వరకు అన్ని వేళ్లను ఉపయోగించండి .ఏదైనా పని చేసేటప్పుడు మణికట్టును సాధ్యమైనంతవరకు తిన్నగా పంపు లేకుండా ఉంచండి. పదేపదే ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు మధ్య మధ్యలో పని ఆపేసి కొంచెం సేపు చేతులకు విశ్రాంతి ఇవ్వండి. ఆహారంలో ఉప్పును తగ్గించండి. ఉప్పు వల్ల శరీరంలో నీరు చేరుతుంది. మణకట్టు దీనికి మినహాయింపు కాదు.
 ప్రతి గంటకు ఒకసారి చేతులను సాగదీస్తూ స్ట్రిచ్చింగ్ వ్యాయామం చేయండి

ఉపయోగపడే వ్యాయామాలు

  వామప్.

 హస్తాలను మణికట్టు వద్ద ముడుస్తూ పైకి కిందకు పక్కలకు తిప్పాలి చేతివేళ్లను ఒకదానికొకటి దూరంగా చాపి తిరిగి మామూలు స్థితికి తీసుకురావాలి దీనిని నాలుగు సార్లు రిపీట్ చేయాలి బొటనవేలును బాగా వెనకకు వంచి కొంచెం సేపు  నిలకడగా ఉంచాలి. దీనిని కూడా నాలుగు సార్లు చేయాలి.

 నమస్కార భంగిమ 

రెండు అరచేతులను నమస్కారం పెడుతున్నట్లు ఛాతి ముందుకు గడ్డం కిందకు తీసుకురావాలి తర్వాత నెమ్మదిగా రెండు చేతులను అదే భంగిమలో బొడ్డు వరకు కిందకు తీసుకువెళ్లాలి ఇలా చేస్తున్నప్పుడు మీ ముంజేతులు ఒత్తిడిని అనుభవిస్తారు ఈ భంగిమలో 20 సెకండ్లు నిలకడగా ఉండాలి మళ్ళీ యధా స్థానం లోకి వచ్చేయాల
 దీనిని నాలుగు సార్లు రిపీట్ చేయాలి. అదేవిధంగా ఇదే భంగిమను వ్యతిరేక దిశలో చేయాలి అంటే ముందు నడుము వద్ద రెండు చేతులను నమస్కార భంగిమలో ఉంచి నెమ్మదిగా తలవరకు హస్తాలను మాత్రమే ఎత్తాలి దీనిని కూడా నాలుగు సార్లు రిపీట్ చేయాలి అలాగే ఇదే నమస్కార భంగిమ హస్తాలను పైకి కాకుండా నేల వైపుకు తిప్పి చేయాలి 

లక్షణాలను తీవ్రతం చేసే చర్యలు 

కీబోర్డ్ మీద ఎక్కువ సేపు టైప్ చేయడం కంప్యూటర్ మౌస్ ని అదేపనిగా ఉపయోగించడం గిటార్ వంటి సంగీత సాధనాల మీద ఎక్కువగా పని చేయడం స్టీరింగ్ లేదా హ్యాండిల్ ను గట్టిగా బిగించి పట్టుకొన
 వాహనం నడపటం చేతి కర్రలను చక్రాల కుర్చీలను చంక కర్రలను క్రీడల్లో ఉపయోగించే సామాగ్రిని అదే పనిగా చేతులతో పట్టుకోవటం సుత్తి వంటి పనిముట్లను అలవాటు లేకుండా హెచ్చు సమయం పాటు వినియోగించడం

గృహ చికిత్సలు..

 15 గ్రాముల ఉమ్మెత్త గింజల చూర్ణం, 50 మిల్లీ లిటర్ల కొబ్బరినూనె

ఒక కల్వములో 15 గ్రాముల ఉమ్మెత్త గింజలను తీసుకొని మెత్తగా నూరాలి .తర్వాత 50 మిల్లీలీటర్ల కొబ్బరి నూనెను కలిపి తిరిగిమర్దించాలి. తర్వాత దీనిని ఒక వెడల్పాటి సీసాలో తీసుకొని నిలువ చేసుకోవాలి .

వాడాల్సిన విధానం ..

దీనిని కొద్దిగా చేతిలోకి తీసుకొని వేడి పుట్టేలా రాయాలి నొప్పి గల భాగం మీద, మణికట్టు మీద, చేతుల వేళ్ళ మీద రాసుకొని సున్నితంగా మర్దించాలి.
 తర్వాత వేడి ఇసుకతో గాని లేదా ఇటుకపొడి మూటతో గాని లేదా హాట్ వాటర్ బాటిల్ తో గాని కాపడం పెట్టుకోవాలి .చివరగా వేడి నీళ్లతో స్నానం చేయాలి . దీని తో హస్తంలో నొప్పి తగ్గుతుంది.

 ఆయుర్వేద ఔషధాలు

 కార్పెల్ల్ టన్నెల్  సిండ్రోమ్ సమస్యకు ఆయుర్వేదంలో చక్కటి ఔషధాలు ఉన్నాయి. మహాయోగరాజ గుగ్గులు, వాత విధ్వంసిని రస్, ప్రసారిని తైలం, వంటివి కొన్ని అయితే ఇవి పని చేసే విధానం ఒక్కొక్కరులో ఒక్కొక్క రకంగా ఉంటుంది .ఎందుకంటే మనందరం ఒకే విధంగా ఉండము .కుటుంబంలో కూడా అందరూ ఒకే మాదిరిగా ఉండరు .జన్యుపరమైన తేడాలుంటాయి. కాబట్టి ముందు మీనాడిని చూడాలి. మీ తత్వాన్ని విశ్లేషించాలి. మీ ప్రకృతిని తెలుసుకోవాలి. వ్యాధి స్థాయిని మీ శక్తిని పరిగణించాలి. ఇతర వ్యాధుల ప్రభావం ఏ మేరకు ఉందో చూడాలి .ఆ తర్వాత ఈ ఔషధాల్లో మీకు సరిపోయే ఔషధాలు తగిన పత్యాపత్యాలతో, సరైన అనుపానంతో, సహపాణాలతో, సరైన మోతాదుని ,నిర్ణీతమైన కాలవ్యవధిని నిర్ణయించి సూచించాల్సి ఉంటుంది. ఇలా ఈ హస్తం వేళ్లలో నొప్పి సమస్యను ,దానివల్ల వచ్చే ఇక్కట్లను, సంపూర్ణంగా ,సునాయాసంగా, నిశ్శేషంగా ,నిస్సంశయంగా జయించవచ్చు .

రెండవ విధానం 


ఆముదం 100మిల్లీ లీటర్లు ,అల్లం రసం 50 మిల్లీలీటర్లు, తేనే తగినంత.

 తయారు చేసే పద్ధతి.

 వంద మిల్లి లీటర్ల హముదానికి ,50 మిల్లీలీటర్ల అల్లం రసాన్ని కలపండి. బాగా ఉడికించండి. తడి అంతా ఆవిరి అయిపోయి ఆముదం మాత్రమే మిగిలేటట్లు కాచండి. బాగా చల్లారిన తర్వాత సీసాలో పోసి నిల్వ చేసుకోండి. దీనికి ప్రతిరోజు  1  టీ స్పూన్ మోతాదులో తగినంత తేనే కలిపి సేవిస్తుంటే చేతుల వేళ్లలో నొప్పి తగ్గుతుంద.  వాత వ్యాధుల్లో ఇది చాలా మేలు చేస్తుంది. దీనివల్ల విరోచనం సాఫీగా జరగడమే కాకుండా కడుపులో వాతం తగ్గుతుంది. అజీర్తి కూడా తగ్గుతుంది. ఇది సంధి వాతం ,ఆమవాతం రెండింటిలోనూ ఉపయుక్తం.

 మూడవ పద్ధతి

 కావలసిన పదార్థాలు

 సొంటి కొమ్ములు 50 గ్రాములు, ధనియాలు 50 గ్రాములు ,జీలకర్ర 50 గ్రాములు .,ఉప్పు తగినంత ( రుచి కోసం  ), మజ్జిగ తగినంత ( అనుపానం కోసం)

.ఇలా ఈ మూడింటిని తీసుకొని సమతూకంగా తీసుకొని మిక్సీ పట్టండి. తగినంత ఉప్పు కూడా కలిపి నిలువ చేసుకోండి .దీనిని టీ స్పూన్ మోతాదుగా మజ్జిగ కలిపి ప్రతి రోజు రెండు పూటలా వాడుతూ ఉంటే చేతుల వేళ్ళ నొప్పి ,ఎముకల్లో క్యాల్షియం తగ్గటం, కీళ్లు బిగుసుకుపోవడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

Sunday 8 June 2014

SUNAMUKHI / SANNA KA PATTA / INDIAN SENNA - AYURVEDIC USES



SANDRA CHETTU / CHANDRA CHETTU /KHAIR / CATECHU - AYURVEDIC USES



SUGANDHAPALA / ANANTHAMOOL / SARASAPARILLA



VEMPALI CHETTU / SHARAPUNKHA - AYURVEDIC USES



VAYU VIDANGALU / JANTHUGHNA / ROBUSTAL BERRIES - AYURVEDIC USES



VAKUDU CHETTU / KANTAKARI / KATAYI / INDIAN NIGHTSHADE BLUE AND WHITE - AYURVEDIC USES



VISHNU KRANTHA CHETTU / NEELA PUSHPI / KOEL - AYURVEDIC USES


VAYINTA CHETTU / VAMINTA / BARBARY / THILAVAN - AYURVEDIC USES


RELA CHETTU / AMALTHAS / PUDDING PIPE TREE - AYURVEDIC USES



REDDIVARI NANUBALU / PACHA BOTLAKU / DUGDHI / PALAKADA - AYURVEDIC USES



మోదుగ చెట్టు - ఆయుర్వేద ఉపయోగాలు. / MODUGA CHETTU - AYURVEDIC USES.


దీనిని సంస్కృతంలో ఫలాశ , యాజ్ఞిక,కింశుక అనీ, హిందీలో ఫలాశ్ అనీ,తెలుగులో మోదుగ చెట్టు అని , లాటిన్ లో  బ్యూటియా ఫ్రొండోసా అని అంటారు.

రూప గుణ ప్రభావాలు - దీని చెక్క రసం లేదా కషాయం కారం,చేదు , వగరు రుచులతో కూడి ఉంటుంది.క్రిములను,ప్లీహరోగాలను ,మూల రోగాలను,వాత శ్లేష్మాలను ,యోని వ్యాధులను హరించి వేస్తుంది.

1.మోదుగాకు విస్తరిలో భోజనం - మన తెలుగునాట మోదుగ విస్తర్లు ఉపయోగించడం ఎప్పటినుండో వాడుకలో ఉంది.ఈ విస్తరిలో భోజనం చేస్తే వాత రోగాలు,కఫ రోగాలు హరించిపోతాయి.కడుపులో గడ్డలు , రక్తంలో వేడి పైత్యం అణగిపోతాయ్.జఠరాగ్ని పెరిగి సుఖవిరేచనం అవుతుంది.

2. అండ వృద్ధి అణగిపోవుటకు - మోదుగ పూలను బట్టలో వేసి  అవి వృషణాలకు తగిలేటట్లుగా గోచిగుడ్డ కట్టుకుంటుంటే అండవృద్ధి అద్భుతంగా తగ్గిపోతుంది.

3. మృత్యువును జయించాలంటే - తెల్ల మోదుగ చెట్టు ఆకులు , పూలు ,పై బెరడు , వేరు పై బెరడు ,కాయలు వీటిని సమాన భాగాలుగా చూర్ణాలు చేసుకొని కలిపి ఉంచుకోవాలి.ముందుగా ఉదరాన్ని వృద్ధి చేసుకొని ఈ చూర్ణాన్ని ఒక చెంచా మోతాదుగా ఒక చెంచా మంచి తేనెతో కలిపి పరగడుపున సేవిస్తుంటే సర్వ వ్యాధులు సం హారమై మృత్యుంజయత్వం కలుగుతుంది.

4. మంచి సంతానం కొరకు - సంతానం కావలసిన స్త్రీలు బహిష్టు స్నానం చేసిన రోజున లేత మోదుగాకు ఒకటి తెచ్చి దాన్ని మెత్తగా దంచి ఒక కప్పు నాటు ఆవు పాలలో కలుపుకొని పరగడుపున సేవించి ఆ తర్వాత భర్తతో సంభోగం జరుపుతూ ఉంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది.

5. స్త్రీలకు మూత్రం బంధించబడితే -
లోపలకి - మోదుగ పూల పొడి - 3 గ్రా,కండ చక్కెర - 10 గ్రా .కలిపి పావు లీటర్ నీటిలో వేసి పూటకు ఒక మోతాదుగా 3 సార్లు తాగుతుంటే బిగించిన మూత్రం విడివడి ధారాళంగా బయటకు వస్తుంది.

పైకి - మోదుగ పూలను మంచినీటితో మెత్తగా ముద్దలాగా నూరి ఆ ముద్దను బొడ్డు చుట్టూ పొట్టపైన పట్టించాలి.5,6 నిమిషాలలోనే మూత్రం ధారాళంగా బయటకు వస్తుంది.

6 . ముట్టు నొప్పి తగ్గుటకు - మోదుగ గింజలను దంచి జల్లించి  నిలువ ఉంచుకోవాలి.ఈ చూర్ణం 1 గ్రా మాత్రమే తీసుకొని 5 గ్రా బెల్లం తో కలిపి నూరి పరగడుపున తింటూ ఉంటే ముట్టు నొప్పి తగ్గిపోతుంది.

7. వీర్య వృద్ధికి,వీర్య స్థంభనకు - మోదుగ గింజలను నానబెట్టి,పొట్టు తీసి ,ఆరబెట్టి,దంచి పొడిచెయ్యాలి.అదేవిధంగా చింత గింజలను,తుమ్మ గింజలను కూడా నీటిలో నానబెట్టి పై పొట్టు తీసివేయాలి.ఈ మూడు గింజల పప్పులను సమభాగాలుగా ఎండించి,దంచి,పొడి చేసి దానికి సమంగా కండచక్కెర పొడిని కలిపి నిలువచేసుకోవాలి.

రోజూ రెండు పూటలా పూటకు 6 గ్రాముల మోతాదుగా మంచి నీటితో సేవిస్తుంటే అపారమైన వీర్యవృద్ధి,అంతులేని వీర్య స్థంభన కలుగుతాయి.

8. శీఘ్ర స్ఖలన నివారణకు -

మోదుగ చిగుర్లు - 70 గ్రాములు
పాత బెల్లం - 10 గ్రాములు

పై రెండింటిని కలిపి రోటిలో వేసి మెత్తగా దంచి కుంకుడు గింజలంత మాత్రలు చేసి నీడలో బాగా ఎండబెట్టి నిలువ చేసుకోవాలి.

రోజూ రెండు పూటలా ఒక గోళి మంచి నీటితో వేసుకొని ఒక కప్పు పాలు తాగుతుంటే శీఘ్ర స్ఖలనం హరించి,చక్కటి వీర్య స్థంభన కలుగుతుంది.

9. మూల వ్యాధి తగ్గుటకు - గింజలను మంచి నీటితో మెత్తగా నూరి కుంకుడు గింజలంత మాత్రలు చేసి ,నీడలో గాలికి ఆరబెట్టి నిలువచేసుకొని రెండు పూటలా మంచినీటితో ఒక్కొక్క మాత్ర వేసుకొంటే మూల వ్యాధి తగ్గుతుంది.

10. మూర్చ తగ్గుటకు - మోదుగ చెట్టు వేరును సానరాయిపై మంచినీటితో అరగదీసి ఆ గంధాన్ని నాలుగు చుక్కలు ముక్కులో వేస్తుంటే వెంటనే మూర్చ నుండి తేరుకుంటారు.

11. ప్రేగులలో క్రిములకు మోదుగ గింజలు -

మోదుగ గింజలు - 10 గ్రా,
కొడిశపాల చెక్క పొడి - 10 గ్రా,
వాయు విడంగాల పొడి - 20 గ్రా,

పై వాటిని కలిపి నిలువ ఉంచుకోవాలి.

రోజూ రెండు పూటలా పూటకు 5 గ్రా . చొప్పున ఒక కప్పు వేడినీటిలో కలిపి తాగుతుంటే విరేచనం ద్వారా ప్రేగులలోని ఏలిక పాములు ,నులి పురుగులు మొదలైన క్రిములు పడిపోతాయి.

12. గజ్జి తామర తగ్గుటకు - మోదుగ గింజలను , నిమ్మ పండు రసంతో మెత్తగా నూరి పైన పూస్తే ఒక్క రోజులోనే తామర రోగం హరించుకు పోతుంది.

13. గర్భ నిరోధం కొరకు - మోదుగ గింజలను నీటిలో నానబెట్టి పై తోలుతీసేసి ,పప్పును నీటితో మెత్తగా నూరి ,కుంకుడు గింజలంత మాత్రలు చేసి ,గాలికి ఆరబెట్టి నిలువ ఉంచుకోవాలి.

స్త్రీలు బహిష్టు స్నానం చేసిన రోజు నుండి వరుసగా 3 రోజుల పాటు ఉదయం పరగడుపున 2 మాత్రలు మంచినీటితో వేసుకుంటే గర్భ నిరోధం కలుగుతుంది.

14. తేలు విషం దిగుటకు - మోదుగ గింజలను ,జిల్లేడు పాలతో గంధం తీసి తేలు కుట్టిన చోట పైన పట్టు వేస్తే ఆ పట్టు ఆరేటప్పటికి విషం దిగిపోతుంది.

15. చలి జ్వరం తగ్గుటకు - మోదుగ గింజలు,కానుగ గింజల పప్పును సమభాగాలుగా తీసుకుని కొంచెం నీరు కలిపి మెత్తగా నూరి శనగ గింజలంత మాత్రలు చేసి నీడలో గాలికి ఆరబెట్టి ,బాగా ఎండిన తర్వాత నిలువచేసుకోవాలి.చలిజ్వరం వచ్చిన వారు పూటకు రెండు గోళీల చొప్పున గోరువెచ్చని నీటితో రెండు పూటలా సేవిస్తుంటే చలి జ్వరం తగ్గిపోతుంది.

16. నీల్ల విరేచనాలు తగ్గుటకు -

మోదుగ బంక పొడి - 10 గ్రాములు ,
దాల్చిన చెక్క పొడి - 10 గ్రాములు,
 పై వాటిని కలిపి ఈ మిశ్రమాన్ని మూడు భాగాలు చేసి పూటకు ఒక భాగం,ఒక చెంచా ఆవు నేతితో కలిపి మూడు పూటలా సేవిస్తే రెండు ,మూడు రోజులలో నీళ్ల విరేచనాలు కట్టుకుంటాయి.

మేడి చెట్టు - ఆయుర్వేదం / MEDI CHETTU / UDUMBARA / THE GULAR FIG - AYURVEDIC USES

మే డి చెట్టు పేర్లు

సంస్కృత ము - ఉదుంబర, క్షీర వృక్ష,హేమ దుగ్ధ, 
హిందీ - గూలర్ 
తెలుగు - మే డి చెట్టు, అత్తి చెట్టు, బొడ్డ చెట్టు 
ఇంగ్లీష్ - the gular fig
లాటిన్ - ficus racemosa, ficus glomerata

మేడి చెట్టు రూప గుణ ప్రభావం - ఇది ముఖ్యంగా వగరు రుచి కలిగి ఉంటుంది. స్త్రీల యోని రోగాలను, వ్రణా లను, సర్పిని,ఉబ్బు ను, అతిసారాన్ని ,ప్రమే హాన్ని, విరేచనాలను ,రక్త పైత్యాని, అతిమూత్ర సమస్య లను  హరించివేస్తుంది.

పైత్యం రోగాలు తగ్గడానికి 

మేడి చెట్టు లేత ఆకుల పొడి అరచెంచా నుండి ఒక చెంచా మోతాదుగా తేనెతో కలిపి రెండు పూటలా  సేవిస్తుంటే పైత్య రోగాలు  తగ్గిపోతాయి.

కంతులు గవదబిల్లలు తగ్గడానికి

 శరీరం పైన కంతులు ఏర్పడిన ,చెంపల పైన గవదబిళ్లలు బాధిస్తున్నా మే డి చెట్టుకు నమస్కరించి గాటుపెట్టి పాలను తీసి కంతుల పైన బిళ్ళ ల పైన  రుద్ది దూదిని అంటించాలి.

ఇలా చేస్తూ ఉంటే కంతులు కరిగిపోతాయి గవద బిళ్ళలు రెండు మూడుసార్లు కే తగ్గిపోతాయి.

స్త్రీల కుసుమ రోగాలు తగ్గడానికి.

మేడి పండ్లను మెత్తగా రుబ్బి బట్టలో వేసి రసం పిండాలి. ఆ రసం 20 గ్రాములు ,తేనె 10 గ్రాములు కలిపి రెండు పూటలా సేవిస్తూ, పాలు ,పంచదార కలిపిన భోజనం మాత్రమే చేస్తూ ఉంటే వారం రోజుల్లో కుసుమ రోగాలు హరించిపోతాయి.


అతి దాహం తగ్గడానికి 

మేడి పండ్ల రసం గాని,కషాయం గాని కండ చక్కెర కలిపి సేవిస్తూ ఉ0టే
 తీవ్రమైన దాహం కూడా తగ్గిపోతుంది.

నోటి పూత తగ్గడానికి 

మేడి చెక్కను దంచి రసం తీసి వడ పోసి దాన్ని నోట్లో పోసుకుని రెండు  పూటలా పుక్కిట బట్టి పదినిమిషాల తర్వాత ఊ సి వేస్తూ ఉంటే నోటిపూత తగ్గిపోతుంది.

స్త్రీలు సుఖంగా ప్రసవించడానికి

మేడి చెట్టు వేరును నీటిలో అరగదీసి ఆ గంధాన్ని అరికాళ్ళకు పట్టిస్తే ప్రసవించ లేని స్త్రీ సుఖంగా ప్రసవిస్తుంది.


ఔదుంబర -  మణి ధారణ

మేడి చెట్టుకు పూజ చేసి విధి ప్రకారం గా దాని వేరు చిన్న ముక్కను తెచ్చుకొని పసుపు కుంకుమ చల్లి గాలికి ఆరబెట్టి అది ఎండిన తరువాత దాన్ని  వెండి లేక రాగి తాయత్తు లో ఉంచి మెడలో గాని మొలలో గాని ధరించాలి. దీని వలన మానసిక బలహీనత తగ్గిపోయి క్రమంగా ధైర్యం కలుగుతుంది ధన నష్టం కలగడం వలన కలిగిన అశాంతి తగ్గిపోయి మానసిక శాంతి కలిగి తిరిగి ధనాన్ని సంపాదించగలరు . దీని ధారణతో తేజస్సు కూడా కలుగుతుందని మన వేదాలలో చెప్పబడింది.

స్త్రీల అతి రక్తస్రావం తగ్గడానికి

 మేడి పండ్లు ముక్కలుగా కోసి ఆరబెట్టి పొడి చేసి నవి 100 గ్రాములు ,పటిక బెల్లం పొడి 100 గ్రాములు ,తేనె 50 గ్రాములు కలిపి నిలువ ఉంచుకుని పూటకు పది గ్రాముల చొప్పున రెండు లేక మూడు పూటలా అవసరాన్ని బట్టి సేవిస్తూ ఉంటే ఈ సమస్య తగ్గిపోతుంది.

పెట్టుడు మందు కి విరుగుడు 

బ్రహ్మ మేడి చెక్క 30 గ్రాములు నలగ్గొట్టి అరలీటరు నీటిలో వేసి సగం మిగిలే వరకు మరగబెట్టి వడగట్టి గోరువెచ్చగా ఉదయం పరగడుపున తాగితే కొద్దిసేపట్లో వాంతి జరిగి ఆ  వాంతి లోనే పెట్టుడు మందు పడిపోతుంది. .తరువాత గోధుమ నూక తో చేసిన జావ ఆహారంగా ఇవ్వాలి.

స్త్రీల యోని బిగుతు కావడానికి 

మేడి కాయలు ,మోదుగ పువ్వు సమంగా కలిపి కొంచెం నువ్వులనూనెతో అతి మెత్తగా నూరి
 కొంచెం తేనె కలిపి రాత్రిపూట యోనికి లేపనం  చేసుకుంటూ ఉంటే క్రమంగా యోని బిగుతుగా మారి పోతుంది.

పురుషుల వీర్యం బలం సంతరించుకోవడానికి  

మేడి చెట్టు బెరడు పొడి , మర్రిచెట్టు చిగుర్ల పొడి సమంగా పటిక బెల్లం పొడిని కలిపి
 పూటకు పది గ్రాముల మోతాదుగా రెండు పూటలా తిని ఒక కప్పు వేడి పాలు తాగుతూ ఉంటే వీర్య నష్టం హరించి ,వీర్యం గట్టిపడి అంగస్తంభన కూడా చక్కగా కలుగుతుంది.

ముసలితనాని కి విరుగుడు గా

 మేడి పండ్లలోని గింజలు తీసి ఎండబెట్టి మెత్తగా పొడి లాగా చేయాలి. ఆ చూర్ణాన్ని పూటకు మూడు గ్రాముల మోతాదుగా నిమ్మకాయంత సైజులో ఆవు వెన్నలో కలుపుకొని రెండు పూటలా ఆహారానికి రెండు గంటల ముందుగా సేవిస్తుంటే ముసలితనపు లక్షణాలు తొలగిపోయి యవ్వనపు లక్షణాలు పెరుగుతాయి.

పాండు రోగం ఉబ్బు రోగం తగ్గడానికి 

బ్రహ్మ మేడి కాయలు 20 గ్రాములు ,మిరియాలు 10 గ్రాములు నలగగొట్టి అర లీటర్ నీటిలో వేసి పావు లీటర్  మిగిలే వరకు మరిగించి దించి వడపోసి అందులో ఒక స్పూన్ కండ చక్కెర కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే మల మూత్రాలు సాఫీగా జరిగి చెడు నీరంతా విసర్జింప బడి కాలేయానికి ప్లీ హాని కి బలం కలిగి రక్తవృద్ధి జరుగుతుంది.

గర్భస్రావం జరగకుండా ఉండడానికి

50 గ్రాముల మేడి చెక్కను నలగగొట్టి ఒక గ్లాసు నీటిలో వేసి ఒక కప్పు కషాయం మిగిలే వరకూ మరగించి  దించి వడపోసి అందులో ఒక చెంచా బార్లీ గింజల పొడి ఒక చెంచా పటికబెల్లం పొడి కలుపుకుని రెండు పూటలా తింటూ ఉంటే గర్భస్రావం జరగదు.

కుష్టు బొల్లి వ్యాధులు తగ్గడానికి

 బ్రహ్మ మేడి చెట్టు వేరు పై బెరడు 20 గ్రాములు తానికాయ చెట్టు పై బెరడు 20 గ్రాములు అర లీటర్ నీటిలో వేసి పావు లీటర్ మిగిలే వరకు మరగబెట్టాలి. దించి వడపోసి అందులో బా వంచాల పొడి ఐదు గ్రాములు, పాత బెల్లం 20 గ్రాములు కలిపి ఆరు నెలల పాటు రెండుపూటలా సేవిస్తుంటే వ్యాధులు తగ్గిపోతాయి.

MINAPA CHETTU ( MINUMULU ) / BLACK GRAM - AYURVEDIC USES



WOMEN HEALTH - VEGINAL DISEASES - AYURVEDIC SOLUTIONS




Saturday 7 June 2014

MAYOORA SHIKHI / NEMALI JUTTAKU / MAIDEN HAIR - AYURVEDIC USES



POGAKU / TOBACCO - AYURVEDIC USES



PICHI KUSUMA CHETTU / SWARNA KSHEERI - AYURVEDIC USES



PALAKODISHA / KUTAJA / KURCHI - AYURVEDIC USES



PATHRA BEEJAM / HEMA SAGAR - AYURVEDIC USES


PRATTHI CHETTU / COTTON PLANT - AYURVEDIC USES



NELAVEMU / KALMEGH - AYURVEDIC USES

ఆయుర్వేద మిత్రులారా! మన పవిత్ర భారతభూమిపై పుట్టిన అపురూప ఔషధ మొక్కల్లో నేలవేము
మహా గొప్పది. ఇది చూడటానికి చిన్న మొక్కలా కనిపించినా కూడా దీని ఔషధ విలువలు మాత్రం అనంత
మైనవి. దీని అసలుపేరు నేలవేప. ప్రజల వాడుకలో క్రమంగా అది నేలవేముగా మారిపోయింది. దాదాపుగా
వేపచెట్టుకున్న అన్ని గుణాలు దీనిలో వుండటమే గాక, వేపచెట్టులో లేని అదనపు ప్రత్యేక ఔషధగుణాలుకూడా
ఈ నేలవేములో వున్నయ్. ఇది అన్ని మెట్టప్రాంతాలలో విశేషంగా లభిస్తుంది. ఆకు నల్లగా కోలగా వుంటుంది.
ఘాటైన చేదుతో అనేక విషరోగాలను తిరిగి తలెత్తకుండా తొక్కివేయడంలో దీనికి సాటి మరొకటి లేదు. మీ
ప్రాంతంలో పెరిగే ఇంత గొప్ప ఔషధ మొక్క గురించి మీకు తెలియకపోతే మీరెంతో సౌభాగ్యాన్ని కోల్పోయినట్లే.

నేలవేము - పేర్లు
సంస్కృతంలో భూనింబ, కిరాతతిక్త, జ్వరాంతక
అని, హిందీలో చిరాయత, కాలమేఘ అని, తెలుగులో
నేలవేము అని, లాటిన్లో Sucerits Chirats,
Gentiana Cheryta అంటారు.
నేలవేము - రూప గుణ ప్రభావాలు
ఇది భూమిమీద అరమీటరునుండి ఒకమీటరు
ఎత్తువరకు పెరుగుతుంది. ఆకులు మిరపాకులాగా
కోలగా వుంటయ్. తెల్లరంగుపూలు పూస్తయ్.
కాయలు చీలికకలిగి పేలుడుకాయల్లాగా వుంటయ్
లోపలిగింజ బద్దలాగా గట్టిగా వుంటుంది. ఇందులో
దేశవాళినేలవేము, సీమ నేలవేము అనే రెండు రకా
లున్నయ్.
ఇది చౌడునేలల్లో మెట్ట ప్రాంతాల్లో విస్తారంగా
మొలుస్తుంది. మనదేశవాళీ నేలవేము మొక్కంతా కారు
నలుపుగావుంటుంది. ఉపయోగాలు తెలుసుకుందాం.
తల్లిపాల శుద్ధికి - నేలవేము
ఏకారణం వల్లనైనా తల్లిపాలు రోగకారకమైతే
వెంటనే రెండుకప్పుల నీటిలో అయిదుగ్రాములు
నేలవేమువేసి ఒకకప్పుకషాయం మిగిలేవరకు
మరిగించి వడపోసి గోరువెచ్చగా అయిన తరువాత
ఒక చెంచా తేనెకలిపి రెండుపూటలా సేవిస్తుంటే
మాతృక్షీరదోషం హరించి స్తన్యశుద్ధి అవుతుంది.
రక్తంలో పైత్యంచేరితే - నేలవేము
శరీరంలో పైత్యం ప్రకోపించినప్పుడు అది బల
వంతంగా రక్తంలోకి చొచ్చుకుపోయి రక్తాన్ని ఉద్రేక
పరుస్తుంది. అప్పుడు శరీరమంతా మంటలు, కురు
పులు, పుండ్లు, మొదలైన అనేక ఉపద్రవాలు కలుగు
తయ్.
అలాంటివారికి నేలవేము సమూల చూర్ణం మూడు
గ్రాములు, మంచిగంధంచూర్ణు మూడుగ్రాములు ఒక
కప్పు నీటిలో కలిపి రెండుపూటలా తాగిస్తూవుంటే రక్త
పైత్య ఉపద్రవాలు తగ్గిపోతయ్.
అన్నిరకాల ఉబ్బురోగాలకు - నేలవేము
నేలవేము 10గ్రాII, శొంఠి 10గ్రా|| నలగొట్టి పావు
లీటరు మంచినీటిలో వేసి సగానికి మరిగించి వడపోసు
కోవాలి.
అందులో ఒక చెంచా కండచక్కెర కలిపి రెండు
పూటలా సేవిస్తూవుంటే క్రమంగా వాతదోషంవల్లగానీ,
పైత్యదోషంవల్లగానీ కఫదోషంవల్లగానీ శరీరంలో
చెడునీరు చేరిన ఉబ్బురోగం తప్పక హరించిపోతుంది.
విషజ్వరాలకు - నేలవేముమాత్రలు
నేలవేముఆకు తులసి ఆకురసం సమంగా కలిపి
'రోటిలో వేసి రెండు పదార్థాలు బాగా కలిసి ముద్దలాగా
అయ్యేవరకు మెత్తగా నూరి ఆ ముద్దను కందిగింజ
లంత గోలీలుగా తయారుచేసి నీడలో గాలి తగిలేచోట
పూర్తిగా ఎండించి నిలువచేసుకోవాలి.
ఈమాత్రలను రెండు గంటలకు ఒకసారి ఒక
మాత్రను ఒక చెంచా తమలపాకురసంతో రోజుకు
మూడునాలుగుసార్లు సేవిస్తూవుంటే విషజ్వరాలు
హరించిపోతయ్.

ముదిరిన చర్మరోగాలకు - నేలవేము
నేలవేము 10గ్రాII, మానుపసుపు 10గ్రా||, చండ్ర
చెక్క 10 గ్రా||, ఈ మూడింటిని నలగొట్టి పావులీటరు
నీటిలో వేసి సగంకషాయం మిగిలేవరకు చిన్నమంట
పైన మరగబెట్టి దించి వడపోసుకోవాలి.
ఈకషాయాన్ని సగంసగం మోతాదుగా రెండు
పూటలా సేవిస్తూవుంటే రక్తశుద్ధిజరిగి ముదిరిన చర్మ
రోగం హరించిపోతుంది.
నిండుబలానికి - నేలవేము
నేలవేము 20గ్రా|| తీసుకొని అరలీటరు మంచి
నీటిలో వేసి ఆరుగంటలపాటు మూతబెట్టి నానబెట్టాలి
ఆతరువాత వేరేపాత్రలోకి వడపోసి పూటకు 50గ్రా||
చొప్పున మూడుపూటలా ఒకచెంచా తేనె లేక కండ
చక్కెర కలిపి సేవించాలి.
ఇది తాగిన వెంటనే రెండు గ్రాముల దాల్చినచెక్క
నమిలిమింగాలి. ఇలా చేస్తుంటే క్రమంగా శరీరంలో
అజీర్ణం, అరుచి హరించిపోయి దేహానికి నిండుబలం,
దారుఢ్యం సంపూర్ణంగా కలుగుతయ్.
అన్నిరకాల జ్వరాలకు - నేలవేము
నేలవేము, వేపచెట్టుబెరడు, కటుకరోహిణి,
తిప్పతీగ, కరక్కాయలబెరడు, తుంగగడ్డలు,
ధని
యాలు, అడ్డసరపుఆకులు, కానుగబెరడు, వాకుడు
పండ్లు, కర్కాటకశృంగి, శాంతి, ప్పటకం, చేదు
పొట్ల, పిప్పళ్ళు, కచ్చూరాలు, వీటిని సమభాగాలుగా
సేకరించాలి. వీటిలో కరక్కాయలు, ధనియాలు,
శొంఠి, పిప్పళ్ళు వీటిని దోరగా వేయించి పొడిచేసి
మిగతా పొడులలో కలిపి పూటకు 3గ్రా॥ చొప్పున
మంచినీటితో రెండుపూటలా సేవిస్తూవుంటే సకల
జ్వరాలు సమసిపోతయ్. *


పిల్లలజ్వరానికి - నేలవేము
రెండుకప్పుల నీటిలో అయిదు గ్రాముల నేలవేము
అరకప్పు కషాయానికి మరిగించి అది గోరు
వెచ్చగా అయిన తరువాత అరచెంచా తేనె కలిపి బిడ్డల
తాగిస్తూవుంటే బాలజ్వరాలు హరించిపోతయ్.
దారుణ ఉదరశూలకు - నేలవేము పట్టు
నేలవేము, పప్పళ్ళు, కరక్కాయ, కటుకరోహిణి,
కలబంద గుజ్జు వీటిని సమంగా కలిపి తగినన్ని నీటితో
బాగా మెత్తగా నూరి ఆ ముద్దను కొంచెం వేడిచేసి పొట్ట
పైన చిక్కగా పట్టువేస్తే దీని ప్రభావానికి రెండు మూడు
విరేచనాలై దారుణమైన ఉదరశూల మాయమై
పోతుంది.
ప్రాణాంతక సన్నిపాతానికి - నేలవేము
నేలవేముఆకులు ఉలిమిడి చెక్క కొడిశపాల
గింజలు, తుంగగడ్డలు, దేవదారు చెక్క, శొంఠి, గజ
పిప్పళ్ళు, ధనియలు, దశమూలాలు వీటన్నింటిని
సమానభాగాలుగా తీసుకొని దంచి పలుచనిబట్టలో
వస్త్రఘాళితంబట్టి ఆఅతిమెత్తనిచూర్ణాన్ని ఒక గాజు
సీసాలో నిలువవుంచుకోవాలి.
ఈ మార్గాన్ని పూటకుమూడుగ్రాముల మోతాదుగా
రెండు లేదా మూడుపూటలా వేడినీటిలో కలిపి
తాగిస్తుంటే దారుణమైన దగ్గు ఆయాసంతో కూడు
కొనివచ్చే ప్రాణాంతక సన్నిపాత జ్వరం వారం లేక
పదిరోజులలో తగ్గిపోయి ప్రాణాలు కాపాడబడతయ్.



ఆమవాతజ్వరానికి - నేలవేము కషాయం
నేలవేము, తిప్పతీగ, తుంగగడ్డలు, శాంతి ఒక్కో
కృటి పదిగ్రాముల చొప్పున అరలీటరు నీటిలోవేసి
పావులీటరు కషాయం మిగిలేవరకు మరిగించి వడ
పోసి ఉదయం సాయంత్రం సగంసగం కషాయం
సేవిస్తూవుంటే ఆమవాత జ్వరం హరించిపోతుంది.
జ్వర నీరసానికి - నేలవేము
అరలీటరుమంచినీటిలో నేలవేము 20 ||కలిపి
పావులీటరు కషాయం మిగిలేవరకు మరిగించి, వడ
పోసి పూటకు అరకప్పు కషాయం మోతాదుగా మూడు
పూటలా ఒకచెంచా తేనెకలిపి తాగుతూవుంటే జ్వరం
వల్ల వచ్చిన నీరసం బలహీనత అజీర్ణం హరించి
పోతయ్.

NELATHADI CHETTU / MUSLI - AYURVEDIC USES



NELA VUSIRI CHETTU / BHUMYAMLAKI - AYURVEDIC USES