22, నవంబర్ 2011, మంగళవారం

సైనసైటిస్ కు..ఆయుర్వేద పరిష్కారాలు..

ముక్కులో పై భాగంలో తెలియని ఒత్తిడి, ఏమీ తోచనివ్వని బాధ ,అక్కా, నుదురు, కళ్ల చివర, ముక్కు పైభాగం బాగా నొప్పిగా ఉంటుంది .తరచూ జలుబు కూడా వస్తోంది ,జ్వరం కొద్దిగా ఉంటుంది, ఇది తరచూ వస్తోంది, పైగా ఈ తలనొప్పి ఒకటి. డాక్టర్ అన్ని పరీక్షలు చేసి ఇది సైనసైటిస్ అన్నారు. ఆపరేషన్ అవసరమేమో అన్నారు ఇది ఈఎన్టీలో సాధారణంగా వచ్చే వ్యాధి ఇది ఏవో మందులకే కొంచెం తగ్గి అస్తమానూ తరచుగా వస్తు బాధపెడుతుంది చివరికి జీవితంలో ఇదొక ఎప్పుడు వచ్చే చుట్టంలా వస్తూ ఉంటుంది. 
 సైనసైటిస్ అంటే  ముక్కులోంచి వచ్చే గట్టి చీమిడి అంటే మ్యూకస్ వెళ్లిపోకుండా లోపల దారుల వద్ద పేరుకుపోవడం. ఇలా పేరుకున్న ఈ పదార్థం చెడు చీముగా మారి నొప్పిని కలుగచేస్తుంది. దాంతోపాటు మాడు చల్లగా ఉండటం ,ముక్కు నుంచి నీళ్లు కారడం, తలనొప్పి, కళ్ళు మంటలుగా ఉండడం జరుగుతుంది. సైనసెస్ అంటే ముఖంలో ఉండే ఎముకల మధ్య ఉండే ఖాళీ ప్రదేశాలు లేదా సందులు వంటివి. ఈ సందుల గుండా గాలి ప్రయాణించి ద్రవ పదార్థాన్ని బయటకు పంపి ,మన శిరస్సును తేలికగా, చక్కగా ఉంచుతాయి. మన స్వరాన్ని చక్కగా ఉంచుతాయి.

ఆపరేషన్ అక్కరలేదు.. 

ఈ సందులు నాలుగు ఉంటాయి..  మ్యాక్సీలరీ ,ఎత్మాయిడ్, ఫ్రాoటల్ మరియు స్పినోయిడ్ అని. నాలుగు సైనస్ రెండేసి ముఖద్వారాలలో ఒక కాలువగా ఏర్పడి ముక్కుకు అనుసంధానపడతాయి. సన్నగా ఉన్న ఇవి కొంచెం వాచినా, దారి సన్నగిల్లి మూతపడతాయి. ఈ సైనస్  లోపలి పొరలే మనం పీల్చే గాలిని
వడపోసి పంపుతాయి. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఒక్కసారైనా ఈ సైనసైటిస్తో బాధపడుతున్నాడు. ఎక్కువమంది తరచుగా బాధపడుతున్నారు. మనుషులలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు ,సామాన్యమైన జలుబు కూడా సైనసైటిస్ కు కారణం అవుతుంది. ఈ స్థితి ఒక్కోసారి భరించలేనంత నొప్పి ,ఒళ్లంతా నొప్పులతో కూడి బాధపెడుతుంది. దీనిని పీనసము అని అంటారు ఆయుర్వేదంలో. 
ఇది ఉద్రిక్తంగా ఉన్నప్పుడు లేదా చాలా కాలం నుంచి ఉన్నప్పుడు కూడా ఆయుర్వేదం దీనికి చక్కటి చికిత్సను ప్రతిపాదిస్తుంది. పసుపును నేతిలో సంబాలించి కానీ నేతితో ముస్త లేదా కరింజ యవక్షారము ఈ సైనసైటిస్ లో చాలా ఉపకరిస్తాయి. 
అలాగే నేతిలో కలిపిన అల్లం రసం, దేవదారు, గరికరసం, తెల్ల గన్నేరు పూలరసం జాగ్రత్తగా లోపలికి వేస్తే ఈ వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది .అయితే అనుభవమున్న ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో ఈ మందులను వాడాలి సైనసైటిస్ ఉన్నవాళ్లు వేడి నీటిలో, పసుపు, వేప నూనె 10 చుక్కలు వేసుకుని ఆవిరి పడితే ముక్కులోని ద్వారాలన్నీ కఫం కరగడం వల్ల శుభ్రపడతాయి. అలాగే ఆపరేషన్ కూడా అక్కరలేదు .శోధన నష్యకర్మ అని ఒక ప్రత్యేక పంచకర్మ చికిత్స ఉంది .ఈ ప్రక్రియ వల్ల మూసుకుపోయిన దారులన్నీ శుభ్రపడి తెరుచుకొని, వాపు తగ్గి సహజ స్థితి వస్తుంది. వచ తైలం, మదనఫల చూర్ణం వంటి వాటితో నష్యకర్మ చేస్తారు .ఇది మంచి  ఫలితాన్ని ఇస్తున్నాయని ఈమధ్య అమెరికాలో మహర్షి ఆయుర్వేద ప్రతిష్టాన్ వారు  నిర్వహించిన పరిశోధనల వల్ల తెలిసింది.

 సైనసైటిస్ రాకుండా జాగ్రత్తలు..

 ముక్కులో మందు చుక్కలు వేయటమే కాకుండా నుదుట ముక్కు పైభాగం చుట్టూ ఉన్న ప్రాంతం చక్కగా మర్దన చేసి కొన్ని మందుల కషాయంతో అక్కడ రాస్తారు. దీనివల్ల సైనసెస్ లో దారి శుభ్రపడి మామూలు స్థితి రావడానికి దోహదపడుతుంది. ప్రతిరోజు అను తైలం ముక్కులో రెండు మూడు చుక్కలు వేసుకుని లోపలికి పీల్చడం చాలా హితకరం .అలాగే పంచేంద్రియ వర్ధిని తైలంతో చేసుకుంటే దాన్ని ప్రతిమార్శ నస్యం అంటారు ఇది చాలా మంచిది. ఆహారంలో చల్లటి పదార్థాలు ,కూల్డ్రింక్స్, వేపుడు పదార్థాలు ,సెంట్లు ,సువాసన ద్రవ్యాలను దూరంగా ఉంచండి .వేడినీళ్లలో రెండు తమలపాకులు, రెండు అల్లం ముక్కలు, కొంచెం పిప్పరమెంటు, కొంచెం తేనె కలిపి తీసుకోండి. చాలా బాగుంటుంది .

రెండు చిటికెలు ఉప్పు,చిటికెడు మెత్తటి ఉప్పు, రెండు చిటికెల సొంటి చూర్ణం ,చిటికెడు మిరియాల చూర్ణం కలిపి మీరు తినే పచ్చికూరలపై కానీ , బ్రెడ్ మీద కానీ వేసుకొని తినండి .సైనసైటిస్ చాలా తగ్గుతుంది. అరటి పళ్ళు, టమాటో ,చల్లటి పెరుగు మానేయండి.  చన్నీటి స్నానం మంచిది కాదు, తలపై చన్నీటి స్నానం కూడా మంచిది కాదు. అర చెంచా వెల్లుల్లి రసం ,ఒక చెంచా తేనెలో కలిపి తీసుకోవడం చాలా మంచిది. నీరుల్లి రసం కూడా తేనెలో కలిపి తీసుకోవడం మంచిది. మిరియాల చూర్ణం వేడి పాలలో కలుపుకొని, కొంచెం బెల్లం కలుపుకొని తాగుతుంటే కఫం కరుగుతుంది.
మహాలక్ష్మి విలాసరసం ,చిత్రక హరితకి వంటి మందులు కూడా చాలా సహాయపడతాయి.



క్యారెట్..ఆరోగ్య ప్రయోజనాలు..

అనంతుడైన భగవంతుడు సమస్త ప్రాణుల ఆరోగ్యం కోసం, హితం కోసం మందులను సీసాలలోనో, క్యాప్సూల్స్ లోనో దాచలేదు .భూదేవి ఒడిలో కంద, కాయ ,ఆకు, పండు, గింజ, విత్తనం రూపాలలో మన ఎదురుగానే ఉంచాడు. పుడమి తల్లి తన ప్రకృతిలో అమూల్య భాండాగారాన్ని, ఔషధ తత్వాన్ని మనకందించింది. అందులో ఒక అద్భుత ఆహారాన్ని తనలోంచి ఇచ్చింది. అది క్యారెట్ దుంప. మంచి ఆరోగ్యం కోసం పచ్చిదైనా ,వండినదైనా సరే తినమన్నది.

 క్యారెట్ ఒక కమ్మని ఆహారం. క్యారెట్.. పోషక విలువలు, ఔషధ తత్వం కలిగిన ఒక దుంప. ఇందులో 87% నీరు కలిగినా బి, సి ,డి ,ఈ విటమిన్లు, ధాతువులు కలిగిన ఒక మంచి ఆహారము. ఉత్తర భారతంలో ప్రాక్ పశ్చిమ దేశాలలో దుంపని కడిగి పచ్చిగానే ఎక్కువగా తింటారు. ఎందుకంటే అందులో విటమిన్ ఏ మరియు సీ లు ఎక్కువగా ఉన్నాయి. అవి కంటిని, చిగుళ్ళని రక్షిస్తాయి.
దానిలో బి6, పోలిక్ యాసిడ్, ధయామిన్ వంటివి ఉండడం వల్ల రక్త క్షీణత కు అంటే ఎనీమియాలో అద్భుతమైన రక్త వర్ధక ఆహారము. వండిన క్యారెట్ లో విటమిన్ ఏ తో పాటు పొటాషియం ,మెగ్నీషియం వంటి మనకి అవసరమైన ధాతువులుంటాయి. అందుకే నడివయసులో ఉన్న వాళ్ళు, పెద్దవాళ్లు క్యారెట్ రసం తాగడం రక్త వృద్ధికి అవసరం. మరో ముఖ్యమైన విషయం క్యారెట్ అతి సూక్ష్మమైన ముఖ్యమైన బీటా కెరోటిన్, ఆల్ఫాకేరోటిన్ వంటివి విశేషంగా కలిగి ఉండడం వల్ల శరీరానికి పోషక ద్రవ్యంగా, రక్షణ ఆహారంగా ముఖ్యంగా చర్మ సౌందర్యానికి ప్రతీకగా ఉపయోగపడుతుంది. దీనిలో క్యాల్షియం రక్తంలోకి సులువుగా గ్రహించబడుతుంది, కనుక ఎముకల బలం లేని వాళ్ళు, ఏ మందులకి తగ్గని కీళ్ల నొప్పులు కలిగిన వాళ్లు ఇది తినడం మంచిది. ముఖ్యంగా ఈ క్యారెట్లు బీటా కెరోటిన్, విటమిన్ ఏ, ఫైటో కెమికల్స్ ముఖ్యంగా ఉన్నాయి. ఈ పదార్థాలు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా ఇది చర్మం, ఊపిరితిత్తులు, జీర్ణాశయాలను క్రమ పద్ధతిలో ఉంచుతాయి. జీవకణాల అభివృద్ధికి ఈ పదార్థాలు అవసరం. అందుకే ప్రపంచంలో అన్ని దేశాలలో ఈ క్యారెట్ అంగీకరించబడిన ఆహారము. పచ్చిముక్కలు సలాడ్ గానో, రసం గానో , కూరగాయ గానో , పచ్చడి గానో వాడుతున్నారు. 

జీర్ణశక్తిని పెంచుతుంది ఈ క్యారెట్..

క్యారెట్ నుంచి లేత పచ్చని ఆల్కహాల్ రూపంగా విటమిన్ ఏ వెలువడుతుంది. ఈ విటమిన్ ఏ చర్మానికి, లోపలి పొరలకి, కంటి చూపుకి, జననేంద్రియాల
 సమర్ధతకు చాలా అవసరం. ఈ విటమిన్ ఏ చిలకడ దుంపలలో కూడా ఎక్కువగా ఉంటుంది.

 క్యారెట్ అంతర్గత శక్తిని పెంచుతుంది. క్యారెట్ ఎండవేడికి/ఫోటో సేన్సిటివిటి , చర్మం పాడైపోకుండా కాపాడుతుంది. మద్యం తీసుకున్నంక వచ్చే చెడు లక్షణాలను అరికడుతుంది. చిన్న చిన్న పుండ్లని మాన్పడంలో సహాయపడుతుంది. హృదయానికి శక్తినిస్తుంది. బీపీని తగ్గిస్తుంది. లివర్ని శుభ్రపరుస్తుంది. ఆయాసం ఉన్నవాళ్ళకి చాలా హితం చేస్తుంది. మాంసం, కండరాలు, చర్మం, వాటి సామర్ధ్యాన్ని పెంచుతుంది. చర్మం పై ముడతలు, మొటిమలు క్యారెట్ రసంతో తగ్గుతాయి. కడుపు కడుపుబ్బరాన్ని, అజీర్ణాన్ని తగ్గిస్తుంది. కంటి చూపును పెంచుతుంది.

క్యారెట్లలో అనేక రకాలు ఉన్నాయి..

ఆరెంజ్ క్యారెట్.. ముఖ్యంగా యూరప్ లోను, తూర్పు దేశాలలోనూ దొరుకుతుంది.
 పచ్చని క్యారెట్ ..కంటికి మంచిది, ఇది కూడా తూర్పు దేశాల్లో దొరుకుతుంది.
 ఎర్రని క్యారెట్ ..హృదయానికి మంచిది. ఇది ఇండియాలోనూ ,చైనాలోనూ దొరుకుతుంది.
 లేత ఎర్రని క్యారెట్ ..శక్తినిచ్చే క్యారెట్, ఇది టర్కీ దేశంలో దొరుకుతుంది .
తెల్లని క్యారెట్ ..చర్మానికి మంచిది, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ దేశాలలో దొరుకుతుంది.
 క్యారెట్ జీర్ణాశయాన్ని పూర్తిగా పాడు చేసే చోన్స్ డిసీజ్ / chohns disease చాలా ఉపయోగపడుతుంది. క్యారెట్ నమ్ముతుంటే నోట్లో లాలాజలం అంటే సలైవా ఊరి జీర్ణశక్తికి తోడ్పడుతుంది .
క్యారెట్ సూప్ వేడివేడిగా పిల్లలకు ఇస్తూ ఉంటే వాళ్లకి టాన్సిల్స్ వ్యాధులు తగ్గుతాయి. పిల్లలకు సుమారుగా రెండు వేల ఇంటర్నేషనల్ యూనిట్స్,
 పెద్దవాళ్లకి 5,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ ఏ అవసరము. అది ముఖ్యంగా క్యారెట్ వల్ల లభిస్తుంది. ఆడవారికి క్యారెట్ తినడం చాలా అవసరం. వాళ్లలో వచ్చేటటువంటి రుతుక్రమ వ్యాధులను తగ్గించడంలో ఇది బాగా ఉపకరిస్తుంది. ముఖ్యంగా నెలసరికి ముందు వచ్చే నడుము నొప్పి వంటి వాటికీ క్యారెట్ తినడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఈ మధ్య జరిపిన పరిశోధనలో క్యారెట్ ఆహారంలో ఎక్కువగా ఉపయోగించే వాళ్ళలో క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు, కీళ్ల నొప్పులు తక్కువ వస్తాయని తేలింది. ప్రతిరోజు క్యారెట్ రసం తాగుతూ ఉంటే కడుపులో క్రిములు బయటకు వెళ్లిపోతాయి. క్యారెట్ శరీరంలో ఉన్న నీటిని బయటకు పంపుతుంది. అందువల్ల మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు క్యారెట్ తినడం మంచిది. క్యారెట్ కమ్మని కూర మాత్రమే కాదు ,కనిపించకుండా సహాయం చేసే మంచి నేస్తం కూడా..

WHAT TO BE OBSERVED ON PACKAGED FOOD ( IN TELUGU )

14, నవంబర్ 2011, సోమవారం

GINGER , WALNUT ,TOMATO ,CARROT ,MUSHROOMS , BROCCOLI - USES FOR HUMAN ORGANS ( IN TELUGU )

STRESS MANAGEMENT ( IN TELUGU )


A GENUINE ,LICENSED THERMOMETER - MANGARI RAJENDER ( IN TELUGU )

BEAUTY AND FITNESS SECRETS OF SHILPA SHETTY ,MALAIKA ARORA KHAN ,DEEPIKA PADUKONE ,KATHRINA KAIF ,KAREENA KAPOOR ,BIPASA BASU



FITNESS AND BEAUTY SECRETS OF AISHWARYA ROY ,SHERLIN CHOPRA , BIPASA BASU ,PARVATHI OMAN KUTTAN , KAREENA KAPOOR , PRIYANKA CHOPRA ,ANGELINA JOLI ,JULIA ROBERTS , CATHERINA JETAJONES , ( IN TELUGU )



6, నవంబర్ 2011, ఆదివారం

ALL ABOUT BITTER FOOD ( IN TELUGU ) - DR . RAMAKRISHNA

ALL ABOUT RESTLESS LEGS SYNDROME ( RLS ) ( IN TELUGU ) - DR . RAMAKRISHNA

ALL ABOUT OSTEOPOROSIS ( IN TELUGU ) - DR . RAMAKRISHNA

ALL ABOUT OEDEMA ( IN TELUGU ) - DR. RAMAKRISHNA

INDIGESTION ( DYSPEPSIA ) AND AYURVEDAM ( IN TELUGU ) - DR . RAMAKRISHNA

AYURVEDAM - AN OVER VIEW ( IN TELUGU ) - DR . RAMAKRISHNA

5, నవంబర్ 2011, శనివారం

USES OF CAMPHOR ( KARPOORAM ) ( IN TELUGU ) - DR . RAMAKRISHNA

ANAEMIA - CAUSES AND REMEDIES ( IN TELUGU ) - DR . RAMAKRISHNA

REMEDIES FOR VULVODYNIA ( VEGINAL PAIN / YONI SHOOLA ) ( IN TELUGU ) - DR . RAMAKRISHNA

ఆయుర్వేదంలో.. సయాటికా కు పరిష్కారాలు

అమ్మాయీ.. నా ఎడం కాలు లాగేస్తోందమ్మా.. తుంటి నుండి అరి కాలి వరకు విపరీతమైన నొప్పి.ఆయన ఇచ్చిన మందులు వేసుకుంటున్నాను కూడా. అయినా బాధ తగ్గడం లేదు.. ఇది ఒక నడి వయసు తల్లి ఆవేదన. తుంటి నుండి వెనుక వైపు, పక్కల విపరీతమైన నొప్పి, తిమ్మిరిగా ఉండటం, రెండు కాళ్ళ కండరాలు బలహీన పడటం,సూదులు పొడిచినట్లుండటం,అశాంతి.. ఇవి సయాటికా నొప్పిని సూచిస్తాయి. అసలు సయాటికా అంటే ఏమిటి..ఇది మన శరీరంలో అతి పెద్ద నరం. ఇది మన నడుం నుండి పిరుదుల వెనుక వరకు ఉంటుంది. ఇది మన వెన్ను పూసలలో చివర ఉన్న నాలుగైదు లంబారు పూసలు మొదటి సెక్రల్ పూసల మధ్య నుండి వెలువడి సేక్రల్ ప్లేగ్జేస్ అనే నరాల కూటమి నుంచి వచ్చి మన నడుం కింద భాగాలను,తొడలు, కాళ్ళు,అరికాళ్ళు,వీటిలో కదలికను,స్పర్శను కలుగ చేస్తుంది.
ఇది మన శరీరంలో అత్యంత బలమైన నరం. దీనికి రెండు ఉప నరాలు అను సంధానంగా ఉంటాయి.. అవి కామన్ పెరోనియల్, టిబియల్ అనేవి. ఇవి మోకాలు కింద కండరాలను, పాదాలు, కాలి వేళ్ల కండరాలకు స్పర్శను,కదలికను కలుగ చేస్తుంది.
ఆధునిక వైద్య శాస్త్రం రీత్యా సయాటికా అంటేనే సయాటికా నరానికి వచ్చిన లోపాల వల్ల వచ్చే నొప్పి అని నిర్వచించ వచ్చు. ఈ నరం చుట్టూ ఉన్న పొరవాయటం వల్ల కాని నరాల మూలం పై ఏదైనా ఒత్తిడి కానీ కారణం కావచ్చు. నిజానికి ఈ నొప్పికి మందులంటూ ఏమీ లేవు. పూర్తి విశ్రాంతి తప్ప సంపూర్ణ చికిత్స అనేది  లేదని తెలుసుకోండి.

సయాటికా నొప్పి లక్షణాలు..
సయాటికాను ఆయుర్వేదంలో " గృధ్ర శీ వాతం" అంటారు. వాతం అంటే మన కదలికలకు కారణమైన నరాల శక్తి.. అది గ్రుధ్ర శీ నరాన్ని దెబ్బ తీస్తే దాని వల్ల వచ్చే నొప్పి కనుక గ్రుధ్ర శీ వాతం అంటారు. నాటి శాస్త్రజ్ఞులు శరీరాన్ని నడిపించే మూడు శక్తుల కారణంగా శరీరం,మనస్సు,ఆత్మ ఏ బాధ లేకుండా ప్రసన్నంగా ఉంటే ఆరోగ్యమనీ,అందులో ఏ శక్తిలో నైనా మార్పులోస్తే వ్యాధి అనీ అంటారు. అలాగే ఎక్కువగా ఎండిపోయిన నిలవ ఉన్న ఆహారం తినడం వల్ల, ఎక్కువగా ఇష్టం వచ్చినట్లు చరించడం వల్ల, మానసికంగా ఎప్పుడూ ఎక్కువగా చింతించడం వల్ల, దెబ్బలు తగలడం వల్ల ఈ గ్రుధ్ర శీ నరం పాడు అయ్యి , విపరీతమైన నొప్పి, తిమ్మిరి ఎక్కడం, గట్టిగా నొక్కి పట్టుకుంటే కాస్త తగ్గినట్లుండటం, వంటివి కనిపిస్తాయి. సాధారణంగా నొప్పి నడుం చివర భాగంలో ఆరంభమై తొడల లోపలి భాగంలో కి పాకి మోకాళ్ళ కిందికి జారి పిక్కలకు చేరి మొత్తం కాలుతో ఆరంభమై విపరీతంగా లాగినట్లు బాధ ఉంటుంది.. కాళ్లు కదపడం కష్టం అవుతుంది.. మొత్తానికి ఈ వ్యాధి తిమ్మిరితో సూదులు పొడిచినట్లు ఉండి ఒక్కొక్కప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి.. నిజానికి ఎటు వైపు ఉంచినా నొప్పి తగ్గినట్లు అనిపించదు. దీని నివారణ ఆయుర్వేదంలో రెండు రకాలుగా చెప్ప బడింది.


ఒకటి.. కారణాన్ని సరి చేయడం,రెండు.. వచ్చిన స్థితిని క్రమ పరచడం. మొదట శరీరమంతా నువ్వుల నూనె తో కానీ, ధన్వంతరి తైలంతో కానీ ముఖ్యంగా నడుం నుండి కిందికి బాగా రాసి సున్నితంగా మర్దన చేసిన తర్వాత చెమట పట్టేలా స్వేదన క్రియ చేసి లోపలి దోషాలను బయటకు పంపాలి. అలాగే వారానికి ఒక్కసారి ఎనిమా చేసుకోవడం, కూడా అవసరం. దీన్ని ఆయుర్వేద చికిత్సలలో " వస్తి" అంటారు. సాధారణంగా, మాంస రసం, ఉసిరిక రసం చాలా ఉపయుక్తంగా ఉంటాయి.వెల్లుల్లి, నిర్గుండి, త్రిఫలా చూర్ణం, రాస్నా వంటివి చాలా ఉప యుక్తంగా ఉంటాయి.
త్రయో దశాంగ గుగ్గులు, వాతగజాంకుశ రసం, బృహత్ వాత చింతామణి, రాస్నాది కషాయం, ఏరండ స్నేహం వంటివి చక్కటి మందులు.
నీరుల్లి పాయల రసం, ఆవ నూనె సమ భాగాలుగా తీసుకుని కలిపి పైన మర్దన చేసుకుంటే చాలా శాంతిగా ఉంటుంది.
నీరుల్లి పాయల రసం, అల్లపు రసం,తేనె .. సమ భాగాలుగా తీసుకుని పూటకు రెండు చెంచాల చొప్పున తీసుకుంటే నొప్పి తగ్గిపోతుంది. ఈ వాత వ్యాధులలో మనం ఆవాతాన్ని అంటే ఆ నరం లో మారిన శక్తిని సమ పరిచే ఆహారాన్ని తీసుకుంటే తొందరగా మందు పని చేసి నొప్పి తగ్గిపోతుంది. అలాగే ఆ వ్యాధిని పెంచే పదార్థాలు తినకుండా ఉంటే వ్యాధి తొందరగా తగ్గుతుంది.
వేడి నీళ్ల స్నానం మంచిది..
బూడిద గుమ్మడి కాయ,మినుములు, వంకాయ , ములగ కాయ, కాకర కాయ, చక్ర వర్తి కూర, నల్ల ఉలవలు,గోధుమలు, చేమ, పొట్ల, ముల్లంగి, జీలకర్ర, ఇంగువ, కంద వేడి నీటితో అభ్యంగ స్నానం పత్యం. అలాగే చల్లటి నీళ్ళు,దోసకాయ, ఆనప కాయ, సొర కాయ, పెసలు, అమం , ఆవాలు, వేప పండ్లు, కొత్త ధాన్యం, ఉప వాసం, బీరకాయ, చల్లటి ప్రదేశాలకు వెళ్లడం అపత్యం.
విష ఇష్ట తైలం, బలా తైలం, క్షార బలా తైలం, శృగంధ తైలం, ధన్వంతరి తైలం, కర్పూర తైలం.. వీటిలో దేనితో నైనా సాయంత్రం మర్దన చేసుకుని వేడి నీటితో స్నానం చేయడం హిత కరం. విడంగాసవం ఉదయం, సాయంత్రం మూడు చెంచాల మందు, మూడు చెంచాల నీరు కలిపి తీసుకుంటే కడుపులో ఉన్న క్రిములన్నీ వెళ్ళి పోతాయి.
అల్లం 50 గ్రాములు, పంచదార 50 గ్రాములు కలిపి నూరి రోజూ రెండు సార్లు గోరు వెచ్చని నీటి తో తీసుకుంటే చాలా హిత కరం. వేరు శనగ నూనె, తీపి పదార్థాలు, వేడి చేయని ఎండిన పదార్థాలు తిన కూడదు.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...