5, సెప్టెంబర్ 2026, శనివారం

దేహ దుర్గంధ సమస్య - డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారం

 శరీర దుర్వాసన సమస్యకు.. ఆయుర్వేద పరిష్కారాలు..

ముందుగా శరీరంలోని అతి వేడి పూర్తిగా తగ్గితేనే దేహ దుర్గంధ సమస్య పరిష్కారమవుతుంది. వేడి పుట్టించే పదార్థాలు తినడం మాని చలువ చేసే పదార్థాలు తినడం మొదలు పెట్టాలి. ముఖ్యంగా బార్లీ పాయసం అతి వేడి ని త్వరగా తగ్గిస్తుంది. దానితో పాటు ధనియాల కషాయం కూడా చక్కెర కలిపి రెండు పూటలా సేవిస్తుండాలి. 

మాంసాహారం పూర్తిగా నిషేధించాలి. వాటితో పాటు కరక్కాయ పై బెరడు , వేపాకు, లొద్దుగ పట్ట, నాగ కేసరాలు, వట్టి వేళ్ళు, తామర పూలు, శ్రీ గంధం, మాచిపత్రి, మరువం, మామిడి పూలు, మొగిలి పూలు , చిన్న ఏలకులు , తుంగ గడ్డలు, జటా మాంసి, కర్పూరం , కచ్చోరాలు, ఆకు పత్రి.. వీటిలో దొరికినన్ని తెచ్చుకుని విడి విడిగా చూర్ణాలు చేసి అన్నీ కలిపి నిలువ చేసుకోవాలి. 

రోజూ స్నానానికి గంట ముందుగా తగినంత పొడిని మంచి నీటితో గుజ్జులాగా నూరి ఆ గుజ్జును శరీరమంతా రుద్ది ఎండిపోయిన తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తుంటే అతి త్వరగా శరీర దుర్వాసన హరించి పోతుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...