8, జూన్ 2014, ఆదివారం

మోదుగ చెట్టు - ఆయుర్వేద ఉపయోగాలు.


దీనిని సంస్కృతంలో ఫలాశ , యాజ్ఞిక,కింశుక అనీ, హిందీలో ఫలాశ్ అనీ,తెలుగులో మోదుగ చెట్టు అని , లాటిన్ లో  బ్యూటియా ఫ్రొండోసా అని అంటారు.

రూప గుణ ప్రభావాలు - దీని చెక్క రసం లేదా కషాయం కారం,చేదు , వగరు రుచులతో కూడి ఉంటుంది.క్రిములను,ప్లీహరోగాలను ,మూల రోగాలను,వాత శ్లేష్మాలను ,యోని వ్యాధులను హరించి వేస్తుంది.

1.మోదుగాకు విస్తరిలో భోజనం - మన తెలుగునాట మోదుగ విస్తర్లు ఉపయోగించడం ఎప్పటినుండో వాడుకలో ఉంది.ఈ విస్తరిలో భోజనం చేస్తే వాత రోగాలు,కఫ రోగాలు హరించిపోతాయి.కడుపులో గడ్డలు , రక్తంలో వేడి పైత్యం అణగిపోతాయ్.జఠరాగ్ని పెరిగి సుఖవిరేచనం అవుతుంది.

2. అండ వృద్ధి అణగిపోవుటకు - మోదుగ పూలను బట్టలో వేసి  అవి వృషణాలకు తగిలేటట్లుగా గోచిగుడ్డ కట్టుకుంటుంటే అండవృద్ధి అద్భుతంగా తగ్గిపోతుంది.

3. మృత్యువును జయించాలంటే - తెల్ల మోదుగ చెట్టు ఆకులు , పూలు ,పై బెరడు , వేరు పై బెరడు ,కాయలు వీటిని సమాన భాగాలుగా చూర్ణాలు చేసుకొని కలిపి ఉంచుకోవాలి.ముందుగా ఉదరాన్ని వృద్ధి చేసుకొని ఈ చూర్ణాన్ని ఒక చెంచా మోతాదుగా ఒక చెంచా మంచి తేనెతో కలిపి పరగడుపున సేవిస్తుంటే సర్వ వ్యాధులు సం హారమై మృత్యుంజయత్వం కలుగుతుంది.

4. మంచి సంతానం కొరకు - సంతానం కావలసిన స్త్రీలు బహిష్టు స్నానం చేసిన రోజున లేత మోదుగాకు ఒకటి తెచ్చి దాన్ని మెత్తగా దంచి ఒక కప్పు నాటు ఆవు పాలలో కలుపుకొని పరగడుపున సేవించి ఆ తర్వాత భర్తతో సంభోగం జరుపుతూ ఉంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది.

5. స్త్రీలకు మూత్రం బంధించబడితే -
లోపలకి - మోదుగ పూల పొడి - 3 గ్రా,కండ చక్కెర - 10 గ్రా .కలిపి పావు లీటర్ నీటిలో వేసి పూటకు ఒక మోతాదుగా 3 సార్లు తాగుతుంటే బిగించిన మూత్రం విడివడి ధారాళంగా బయటకు వస్తుంది.

పైకి - మోదుగ పూలను మంచినీటితో మెత్తగా ముద్దలాగా నూరి ఆ ముద్దను బొడ్డు చుట్టూ పొట్టపైన పట్టించాలి.5,6 నిమిషాలలోనే మూత్రం ధారాళంగా బయటకు వస్తుంది.

6 . ముట్టు నొప్పి తగ్గుటకు - మోదుగ గింజలను దంచి జల్లించి  నిలువ ఉంచుకోవాలి.ఈ చూర్ణం 1 గ్రా మాత్రమే తీసుకొని 5 గ్రా బెల్లం తో కలిపి నూరి పరగడుపున తింటూ ఉంటే ముట్టు నొప్పి తగ్గిపోతుంది.

7. వీర్య వృద్ధికి,వీర్య స్థంభనకు - మోదుగ గింజలను నానబెట్టి,పొట్టు తీసి ,ఆరబెట్టి,దంచి పొడిచెయ్యాలి.అదేవిధంగా చింత గింజలను,తుమ్మ గింజలను కూడా నీటిలో నానబెట్టి పై పొట్టు తీసివేయాలి.ఈ మూడు గింజల పప్పులను సమభాగాలుగా ఎండించి,దంచి,పొడి చేసి దానికి సమంగా కండచక్కెర పొడిని కలిపి నిలువచేసుకోవాలి.

రోజూ రెండు పూటలా పూటకు 6 గ్రాముల మోతాదుగా మంచి నీటితో సేవిస్తుంటే అపారమైన వీర్యవృద్ధి,అంతులేని వీర్య స్థంభన కలుగుతాయి.

8. శీఘ్ర స్ఖలన నివారణకు -

మోదుగ చిగుర్లు - 70 గ్రాములు
పాత బెల్లం - 10 గ్రాములు

పై రెండింటిని కలిపి రోటిలో వేసి మెత్తగా దంచి కుంకుడు గింజలంత మాత్రలు చేసి నీడలో బాగా ఎండబెట్టి నిలువ చేసుకోవాలి.

రోజూ రెండు పూటలా ఒక గోళి మంచి నీటితో వేసుకొని ఒక కప్పు పాలు తాగుతుంటే శీఘ్ర స్ఖలనం హరించి,చక్కటి వీర్య స్థంభన కలుగుతుంది.

9. మూల వ్యాధి తగ్గుటకు - గింజలను మంచి నీటితో మెత్తగా నూరి కుంకుడు గింజలంత మాత్రలు చేసి ,నీడలో గాలికి ఆరబెట్టి నిలువచేసుకొని రెండు పూటలా మంచినీటితో ఒక్కొక్క మాత్ర వేసుకొంటే మూల వ్యాధి తగ్గుతుంది.

10. మూర్చ తగ్గుటకు - మోదుగ చెట్టు వేరును సానరాయిపై మంచినీటితో అరగదీసి ఆ గంధాన్ని నాలుగు చుక్కలు ముక్కులో వేస్తుంటే వెంటనే మూర్చ నుండి తేరుకుంటారు.

11. ప్రేగులలో క్రిములకు మోదుగ గింజలు -

మోదుగ గింజలు - 10 గ్రా,
కొడిశపాల చెక్క పొడి - 10 గ్రా,
వాయు విడంగాల పొడి - 20 గ్రా,

పై వాటిని కలిపి నిలువ ఉంచుకోవాలి.

రోజూ రెండు పూటలా పూటకు 5 గ్రా . చొప్పున ఒక కప్పు వేడినీటిలో కలిపి తాగుతుంటే విరేచనం ద్వారా ప్రేగులలోని ఏలిక పాములు ,నులి పురుగులు మొదలైన క్రిములు పడిపోతాయి.

12. గజ్జి తామర తగ్గుటకు - మోదుగ గింజలను , నిమ్మ పండు రసంతో మెత్తగా నూరి పైన పూస్తే ఒక్క రోజులోనే తామర రోగం హరించుకు పోతుంది.

13. గర్భ నిరోధం కొరకు - మోదుగ గింజలను నీటిలో నానబెట్టి పై తోలుతీసేసి ,పప్పును నీటితో మెత్తగా నూరి ,కుంకుడు గింజలంత మాత్రలు చేసి ,గాలికి ఆరబెట్టి నిలువ ఉంచుకోవాలి.

స్త్రీలు బహిష్టు స్నానం చేసిన రోజు నుండి వరుసగా 3 రోజుల పాటు ఉదయం పరగడుపున 2 మాత్రలు మంచినీటితో వేసుకుంటే గర్భ నిరోధం కలుగుతుంది.

14. తేలు విషం దిగుటకు - మోదుగ గింజలను ,జిల్లేడు పాలతో గంధం తీసి తేలు కుట్టిన చోట పైన పట్టు వేస్తే ఆ పట్టు ఆరేటప్పటికి విషం దిగిపోతుంది.

15. చలి జ్వరం తగ్గుటకు - మోదుగ గింజలు,కానుగ గింజల పప్పును సమభాగాలుగా తీసుకుని కొంచెం నీరు కలిపి మెత్తగా నూరి శనగ గింజలంత మాత్రలు చేసి నీడలో గాలికి ఆరబెట్టి ,బాగా ఎండిన తర్వాత నిలువచేసుకోవాలి.చలిజ్వరం వచ్చిన వారు పూటకు రెండు గోళీల చొప్పున గోరువెచ్చని నీటితో రెండు పూటలా సేవిస్తుంటే చలి జ్వరం తగ్గిపోతుంది.

16. నీల్ల విరేచనాలు తగ్గుటకు -

మోదుగ బంక పొడి - 10 గ్రాములు ,
దాల్చిన చెక్క పొడి - 10 గ్రాములు,
 పై వాటిని కలిపి ఈ మిశ్రమాన్ని మూడు భాగాలు చేసి పూటకు ఒక భాగం,ఒక చెంచా ఆవు నేతితో కలిపి మూడు పూటలా సేవిస్తే రెండు ,మూడు రోజులలో నీళ్ల విరేచనాలు కట్టుకుంటాయి.

మేడి చెట్టు - ఆయుర్వేదం

మే డి చెట్టు పేర్లు

సంస్కృత ము - ఉదుంబర, క్షీర వృక్ష,హేమ దుగ్ధ, 
హిందీ - గూలర్ 
తెలుగు - మే డి చెట్టు, అత్తి చెట్టు, బొడ్డ చెట్టు 
ఇంగ్లీష్ - the gular fig
లాటిన్ - ficus racemosa, ficus glomerata

మేడి చెట్టు రూప గుణ ప్రభావం - ఇది ముఖ్యంగా వగరు రుచి కలిగి ఉంటుంది. స్త్రీల యోని రోగాలను, వ్రణా లను, సర్పిని,ఉబ్బు ను, అతిసారాన్ని ,ప్రమే హాన్ని, విరేచనాలను ,రక్త పైత్యాని, అతిమూత్ర సమస్య లను  హరించివేస్తుంది.

పైత్యం రోగాలు తగ్గడానికి 

మేడి చెట్టు లేత ఆకుల పొడి అరచెంచా నుండి ఒక చెంచా మోతాదుగా తేనెతో కలిపి రెండు పూటలా  సేవిస్తుంటే పైత్య రోగాలు  తగ్గిపోతాయి.

కంతులు గవదబిల్లలు తగ్గడానికి

 శరీరం పైన కంతులు ఏర్పడిన ,చెంపల పైన గవదబిళ్లలు బాధిస్తున్నా మే డి చెట్టుకు నమస్కరించి గాటుపెట్టి పాలను తీసి కంతుల పైన బిళ్ళ ల పైన  రుద్ది దూదిని అంటించాలి.

ఇలా చేస్తూ ఉంటే కంతులు కరిగిపోతాయి గవద బిళ్ళలు రెండు మూడుసార్లు కే తగ్గిపోతాయి.

స్త్రీల కుసుమ రోగాలు తగ్గడానికి.

మేడి పండ్లను మెత్తగా రుబ్బి బట్టలో వేసి రసం పిండాలి. ఆ రసం 20 గ్రాములు ,తేనె 10 గ్రాములు కలిపి రెండు పూటలా సేవిస్తూ, పాలు ,పంచదార కలిపిన భోజనం మాత్రమే చేస్తూ ఉంటే వారం రోజుల్లో కుసుమ రోగాలు హరించిపోతాయి.


అతి దాహం తగ్గడానికి 

మేడి పండ్ల రసం గాని,కషాయం గాని కండ చక్కెర కలిపి సేవిస్తూ ఉ0టే
 తీవ్రమైన దాహం కూడా తగ్గిపోతుంది.

నోటి పూత తగ్గడానికి 

మేడి చెక్కను దంచి రసం తీసి వడ పోసి దాన్ని నోట్లో పోసుకుని రెండు  పూటలా పుక్కిట బట్టి పదినిమిషాల తర్వాత ఊ సి వేస్తూ ఉంటే నోటిపూత తగ్గిపోతుంది.

స్త్రీలు సుఖంగా ప్రసవించడానికి

మేడి చెట్టు వేరును నీటిలో అరగదీసి ఆ గంధాన్ని అరికాళ్ళకు పట్టిస్తే ప్రసవించ లేని స్త్రీ సుఖంగా ప్రసవిస్తుంది.


ఔదుంబర -  మణి ధారణ

మేడి చెట్టుకు పూజ చేసి విధి ప్రకారం గా దాని వేరు చిన్న ముక్కను తెచ్చుకొని పసుపు కుంకుమ చల్లి గాలికి ఆరబెట్టి అది ఎండిన తరువాత దాన్ని  వెండి లేక రాగి తాయత్తు లో ఉంచి మెడలో గాని మొలలో గాని ధరించాలి. దీని వలన మానసిక బలహీనత తగ్గిపోయి క్రమంగా ధైర్యం కలుగుతుంది ధన నష్టం కలగడం వలన కలిగిన అశాంతి తగ్గిపోయి మానసిక శాంతి కలిగి తిరిగి ధనాన్ని సంపాదించగలరు . దీని ధారణతో తేజస్సు కూడా కలుగుతుందని మన వేదాలలో చెప్పబడింది.

స్త్రీల అతి రక్తస్రావం తగ్గడానికి

 మేడి పండ్లు ముక్కలుగా కోసి ఆరబెట్టి పొడి చేసి నవి 100 గ్రాములు ,పటిక బెల్లం పొడి 100 గ్రాములు ,తేనె 50 గ్రాములు కలిపి నిలువ ఉంచుకుని పూటకు పది గ్రాముల చొప్పున రెండు లేక మూడు పూటలా అవసరాన్ని బట్టి సేవిస్తూ ఉంటే ఈ సమస్య తగ్గిపోతుంది.

పెట్టుడు మందు కి విరుగుడు 

బ్రహ్మ మేడి చెక్క 30 గ్రాములు నలగ్గొట్టి అరలీటరు నీటిలో వేసి సగం మిగిలే వరకు మరగబెట్టి వడగట్టి గోరువెచ్చగా ఉదయం పరగడుపున తాగితే కొద్దిసేపట్లో వాంతి జరిగి ఆ  వాంతి లోనే పెట్టుడు మందు పడిపోతుంది. .తరువాత గోధుమ నూక తో చేసిన జావ ఆహారంగా ఇవ్వాలి.

స్త్రీల యోని బిగుతు కావడానికి 

మేడి కాయలు ,మోదుగ పువ్వు సమంగా కలిపి కొంచెం నువ్వులనూనెతో అతి మెత్తగా నూరి
 కొంచెం తేనె కలిపి రాత్రిపూట యోనికి లేపనం  చేసుకుంటూ ఉంటే క్రమంగా యోని బిగుతుగా మారి పోతుంది.

పురుషుల వీర్యం బలం సంతరించుకోవడానికి  

మేడి చెట్టు బెరడు పొడి , మర్రిచెట్టు చిగుర్ల పొడి సమంగా పటిక బెల్లం పొడిని కలిపి
 పూటకు పది గ్రాముల మోతాదుగా రెండు పూటలా తిని ఒక కప్పు వేడి పాలు తాగుతూ ఉంటే వీర్య నష్టం హరించి ,వీర్యం గట్టిపడి అంగస్తంభన కూడా చక్కగా కలుగుతుంది.

ముసలితనాని కి విరుగుడు గా

 మేడి పండ్లలోని గింజలు తీసి ఎండబెట్టి మెత్తగా పొడి లాగా చేయాలి. ఆ చూర్ణాన్ని పూటకు మూడు గ్రాముల మోతాదుగా నిమ్మకాయంత సైజులో ఆవు వెన్నలో కలుపుకొని రెండు పూటలా ఆహారానికి రెండు గంటల ముందుగా సేవిస్తుంటే ముసలితనపు లక్షణాలు తొలగిపోయి యవ్వనపు లక్షణాలు పెరుగుతాయి.

పాండు రోగం ఉబ్బు రోగం తగ్గడానికి 

బ్రహ్మ మేడి కాయలు 20 గ్రాములు ,మిరియాలు 10 గ్రాములు నలగగొట్టి అర లీటర్ నీటిలో వేసి పావు లీటర్  మిగిలే వరకు మరిగించి దించి వడపోసి అందులో ఒక స్పూన్ కండ చక్కెర కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే మల మూత్రాలు సాఫీగా జరిగి చెడు నీరంతా విసర్జింప బడి కాలేయానికి ప్లీ హాని కి బలం కలిగి రక్తవృద్ధి జరుగుతుంది.

గర్భస్రావం జరగకుండా ఉండడానికి

50 గ్రాముల మేడి చెక్కను నలగగొట్టి ఒక గ్లాసు నీటిలో వేసి ఒక కప్పు కషాయం మిగిలే వరకూ మరగించి  దించి వడపోసి అందులో ఒక చెంచా బార్లీ గింజల పొడి ఒక చెంచా పటికబెల్లం పొడి కలుపుకుని రెండు పూటలా తింటూ ఉంటే గర్భస్రావం జరగదు.

కుష్టు బొల్లి వ్యాధులు తగ్గడానికి

 బ్రహ్మ మేడి చెట్టు వేరు పై బెరడు 20 గ్రాములు తానికాయ చెట్టు పై బెరడు 20 గ్రాములు అర లీటర్ నీటిలో వేసి పావు లీటర్ మిగిలే వరకు మరగబెట్టాలి. దించి వడపోసి అందులో బా వంచాల పొడి ఐదు గ్రాములు, పాత బెల్లం 20 గ్రాములు కలిపి ఆరు నెలల పాటు రెండుపూటలా సేవిస్తుంటే వ్యాధులు తగ్గిపోతాయి.

7, జూన్ 2014, శనివారం

నేలవేము / కాల మేఘ్- ఆయుర్వేద ఉపయోగాలు

ఆయుర్వేద మిత్రులారా! మన పవిత్ర భారతభూమిపై పుట్టిన అపురూప ఔషధ మొక్కల్లో నేలవేము
మహా గొప్పది. ఇది చూడటానికి చిన్న మొక్కలా కనిపించినా కూడా దీని ఔషధ విలువలు మాత్రం అనంత
మైనవి. దీని అసలుపేరు నేలవేప. ప్రజల వాడుకలో క్రమంగా అది నేలవేముగా మారిపోయింది. దాదాపుగా
వేపచెట్టుకున్న అన్ని గుణాలు దీనిలో వుండటమే గాక, వేపచెట్టులో లేని అదనపు ప్రత్యేక ఔషధగుణాలుకూడా
ఈ నేలవేములో వున్నయ్. ఇది అన్ని మెట్టప్రాంతాలలో విశేషంగా లభిస్తుంది. ఆకు నల్లగా కోలగా వుంటుంది.
ఘాటైన చేదుతో అనేక విషరోగాలను తిరిగి తలెత్తకుండా తొక్కివేయడంలో దీనికి సాటి మరొకటి లేదు. మీ
ప్రాంతంలో పెరిగే ఇంత గొప్ప ఔషధ మొక్క గురించి మీకు తెలియకపోతే మీరెంతో సౌభాగ్యాన్ని కోల్పోయినట్లే.

నేలవేము - పేర్లు..

సంస్కృతంలోభూనింబ,కిరాతతిక్త,జ్వరాంతకఅని,హిందీలో చిరాయత, కాలమేఘ అని, తెలుగులోనేలవేము అని, లాటిన్లో Sucerits Chirats,Gentiana Cheryta అంటారు.

నేలవేము - రూప గుణ ప్రభావాలు..

ఇది భూమిమీద అరమీటరునుండి ఒకమీటరుఎత్తువరకు పెరుగుతుంది. ఆకులు మిరపాకులాగాకోలగా వుంటయ్. తెల్లరంగుపూలుపూస్తయ్.కాయలుచీలికకలిగిపేలుడుకాయల్లాగా వుంటయ్లోపలిగింజ బద్దలాగా గట్టిగా వుంటుంది. ఇందులోదేశవాళినేలవేము, సీమ నేలవేము అనే రెండు రకాలున్నయ్.
ఇది చౌడునేలల్లో మెట్ట ప్రాంతాల్లో విస్తారంగా మొలుస్తుంది. మనదేశవాళీనేలవేముమొక్కంతాకారునలుపుగావుంటుంది. ఉపయోగాలు తెలుసుకుందాం.

తల్లిపాల శుద్ధికి - నేలవేము..

ఏకారణం వల్లనైనా తల్లిపాలు రోగకారకమైతేవెంటనే రెండుకప్పుల నీటిలో అయిదుగ్రాములునేలవేమువేసి ఒకకప్పుకషాయం మిగిలేవరకుమరిగించి వడపోసి గోరువెచ్చగా అయిన తరువాతఒక చెంచా తేనెకలిపి రెండుపూటలా సేవిస్తుంటేమాతృక్షీరదోషం హరించి స్తన్యశుద్ధి అవుతుంది.

రక్తంలో పైత్యంచేరితే - నేలవేము..

శరీరంలో పైత్యం ప్రకోపించినప్పుడు అది బలవంతంగా రక్తంలోకి చొచ్చుకుపోయి రక్తాన్ని ఉద్రేకపరుస్తుంది. అప్పుడు శరీరమంతా మంటలు, కురుపులు, పుండ్లు, మొదలైన అనేక ఉపద్రవాలు కలుగుతయ్.

అలాంటివారికి నేలవేము సమూలచూర్ణంమూడుగ్రాములు, మంచిగంధంచూర్ణు మూడుగ్రాములు ఒకకప్పు నీటిలో కలిపి రెండుపూటలా తాగిస్తూవుంటే రక్తపైత్య ఉపద్రవాలు తగ్గిపోతయ్.

అన్నిరకాల ఉబ్బురోగాలకు - నేలవేము..

నేలవేము 10గ్రా, శొంఠి 10గ్రా, నలగొట్టి పావులీటరు మంచినీటిలో వేసి సగానికి మరిగించి వడపోసు
కోవాలి.అందులో ఒక చెంచా కండచక్కెర కలిపి రెండు
పూటలా సేవిస్తూవుంటే క్రమంగా వాతదోషంవల్లగానీ,
పైత్యదోషంవల్లగానీ కఫదోషంవల్లగానీ శరీరంలో
చెడునీరు చేరిన ఉబ్బురోగం తప్పక హరించిపోతుంది.

విషజ్వరాలకు - నేలవేముమాత్రలు..

నేలవేముఆకు తులసి ఆకురసం సమంగా కలిపి'రోటిలో వేసి రెండు పదార్థాలు బాగా కలిసి ముద్దలాగాఅయ్యేవరకు మెత్తగా నూరి ఆ ముద్దను కందిగింజలంత గోలీలుగా తయారుచేసి నీడలో గాలి తగిలేచోటపూర్తిగా ఎండించి నిలువచేసుకోవాలి.

ఈమాత్రలను రెండు గంటలకు ఒకసారి ఒకమాత్రను ఒక చెంచా తమలపాకురసంతో రోజుకుమూడునాలుగుసార్లు సేవిస్తూవుంటే విషజ్వరాలుహరించిపోతయ్.

ముదిరిన చర్మరోగాలకు - నేలవేము..

నేలవేము 10గ్రా, మానుపసుపు 10గ్రా, చండ్రచెక్క 10 గ్రా, ఈమూడింటినినలగొట్టిపావులీటరునీటిలోవేసిసగంకషాయం మిగిలేవరకు చిన్నమంటపైన మరగబెట్టి దించి వడపోసుకోవాలి.

ఈకషాయాన్ని సగంసగం మోతాదుగా రెండుపూటలా సేవిస్తూవుంటే రక్తశుద్ధిజరిగి ముదిరిన చర్మరోగం హరించిపోతుంది.

నిండుబలానికి - నేలవేము..

నేలవేము 20గ్రా తీసుకొని అరలీటరు మంచినీటిలో వేసి ఆరుగంటలపాటు మూతబెట్టి నానబెట్టాలిఆతరువాత వేరేపాత్రలోకివడపోసిపూటకు50గ్రాచొప్పునమూడుపూటలా ఒకచెంచా తేనె లేక కండచక్కెర కలిపి సేవించాలి.

ఇదితాగినవెంటనేరెండుగ్రాములదాల్చినచెక్కనమిలిమింగాలి. ఇలా చేస్తుంటే క్రమంగా శరీరంలోఅజీర్ణం, అరుచి హరించిపోయి దేహానికి నిండుబలం,దారుఢ్యంసంపూర్ణంగా కలుగుతయ్.

అన్నిరకాల జ్వరాలకు - నేలవేము..

నేలవేము, వేపచెట్టుబెరడు, కటుకరోహిణి,తిప్పతీగ, కరక్కాయలబెరడు, తుంగగడ్డలు,ధనియాలు, అడ్డసరపుఆకులు, కానుగబెరడు, వాకుడుపండ్లు, కర్కాటకశృంగి, శాంతి, ప్పటకం, చేదుపొట్ల, పిప్పళ్ళు, కచ్చూరాలు, వీటిని సమభాగాలుగాసేకరించాలి. వీటిలో కరక్కాయలు, ధనియాలు,శొంఠి, పిప్పళ్ళు వీటిని దోరగా వేయించి పొడిచేసిమిగతా పొడులలో కలిపి పూటకు 3గ్రా చొప్పునమంచినీటితో రెండుపూటలా సేవిస్తూవుంటే సకల
జ్వరాలు సమసిపోతయ్. 


పిల్లలజ్వరానికి - నేలవేము..

రెండుకప్పుల నీటిలో అయిదు గ్రాముల నేలవేముఅరకప్పు కషాయానికి మరిగించి అది గోరువెచ్చగా అయిన తరువాత అరచెంచా తేనె కలిపి బిడ్డలతాగిస్తూవుంటే బాలజ్వరాలు హరించిపోతయ్.

దారుణ ఉదరశూలకు - నేలవేము పట్టు..

నేలవేము, పప్పళ్ళు, కరక్కాయ, కటుకరోహిణి,కలబంద గుజ్జు వీటిని సమంగా కలిపి తగినన్ని నీటితోబాగా మెత్తగా నూరి ఆ ముద్దను కొంచెం వేడిచేసి పొట్టపైన చిక్కగా పట్టువేస్తే దీని ప్రభావానికి రెండు మూడువిరేచనాలై దారుణమైన ఉదరశూల మాయమైపోతుంది.

ప్రాణాంతక సన్నిపాతానికి - నేలవేము..

నేలవేముఆకులు ,ఉలిమిడి చెక్క, కొడిశపాలగింజలు, తుంగగడ్డలు, దేవదారు చెక్క, శొంఠి, గజపిప్పళ్ళు, ధనియలు, దశమూలాలు వీటన్నింటినిసమానభాగాలుగా తీసుకొని దంచి పలుచనిబట్టలోవస్త్రఘాళితంబట్టి ఆ అతిమెత్తనిచూర్ణాన్ని ఒకగాజుసీసాలోనిలువవుంచుకోవాలి.
ఈ మార్గాన్ని పూటకుమూడుగ్రాముల మోతాదుగా
రెండు లేదా మూడుపూటలా వేడినీటిలో కలిపితాగిస్తుంటే దారుణమైన దగ్గు ఆయాసంతో కూడుకొనివచ్చే ప్రాణాంతక సన్నిపాత జ్వరం వారం లేకపదిరోజులలో తగ్గిపోయి ప్రాణాలు కాపాడబడతయ్.


ఆమవాతజ్వరానికి - నేలవేము కషాయం..

నేలవేము, తిప్పతీగ, తుంగగడ్డలు, శాంతి ఒక్కొక్కటి పదిగ్రాముల చొప్పున అరలీటరు నీటిలోవేసిపావులీటరు కషాయం మిగిలేవరకు మరిగించి వడపోసి ఉదయం సాయంత్రం సగంసగం కషాయంసేవిస్తూవుంటే ఆమవాత జ్వరం హరించిపోతుంది.

జ్వర నీరసానికి - నేలవేము..

అరలీటరుమంచినీటిలో నేలవేము 20 గ్రాకలిపిపావులీటరు కషాయం మిగిలేవరకు మరిగించి, వడపోసి పూటకు అరకప్పు కషాయం మోతాదుగా మూడుపూటలా ఒకచెంచా తేనెకలిపి తాగుతూవుంటే జ్వరంవల్ల వచ్చిన నీరసం బలహీనత అజీర్ణం హరించిపోతయ్.

29, ఏప్రిల్ 2014, మంగళవారం

దొండ చెట్టుతో.. డా.ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

telugu - దొండ తీగ చెట్టు
hindi - కుందురు , కందారి 
latin - coccinia indica ,momordica monodelpha , cephalandra indica ,

 

ఇది కంచెలపైన , పందిర్ల పైన ,తోటలలోను , చెరువు కట్టల పైన ,విరివిగా పుట్టి పక్కనే వున్న పెద్ద చెట్లకు అల్లుకుని పూలు , కాయలు కాస్తుంది.పూలు తెల్లగ వుంటాయి.కాయలు పొడవుగా పైన చారలు కలిగి ,పచ్చిగా వున్నప్పుడు ఆకు పచ్చగాను ,పండిన తర్వాత యెర్రగాను అవుతాయి.వీటిలో చేదు గా వుండే కాయలను చేదు దొండ కాయలు అంటారు.

 

మొలలు తగ్గడానికి - చేదు దొండ ఆకు రసం 1, 2 చెంచాలు మోతదుగా రెండు పూటలా సేవిస్తుంటే అర్శ మొలలు ,పైత్య రోగం , వుబ్బు రోగం , పాండు రోగం , క్షయ రోగం హరించి పోతాయి.



 కామెర్లు / పసిరికల రోగం తగ్గడానికి -
 

దొండ ఆకు పసరు - 30 గ్రా

మగ దూడల గేదె పెరుగు - 50 గ్రా

పై వాటిని కలిపి పర గడుపున వరుసగా 7 రోజులపాటు సేవించాలి.కారం,వుప్పు,పులుపు లేని చప్పిడి ఆహారాన్ని పథ్యంగా పాటించాలి. ఈ నియమం అనుసరిస్తుంటే పసిరికల రోగం 7 రోజుల్లోనే అదుపులోకి వస్తుంది.


విష జంతువుల కాటు మానకుంటే -

 చేదు దొండాకులను మెత్తగ నూరి ఆ ముద్దను పైన వెసి కట్టు కడుతుంతే పాములు , తేళ్ళు ,కుక్క , నక్క,కోతి మొదలైన జంతువుల కాట్లు పడి మానకుండా మొండి పడిన పుండ్లు దీనివల్ల మాడి మానిపోతాయి.


తలలో కురుపులు తగ్గడానికి -

 దొండాకును దంచి బట్టలో వేసి పిండి రసం తీయాలి. ఆ రసం లో పసుపు రంగు గవ్వలను 3 రోజులపాటు నాన బెట్టాలి. ఆ తరువాత వాటిని యెండలో పూర్తిగా యెండిపోయే వరకు వుంచాలి.

బాగా యెండిన తర్వాత ఆ గవ్వలను యెర్రని నిప్పులపైన వేసి నల్లగా మాడే వరకు కాల్చాలి.తర్వాత ,వాటిని మెత్తగా నూరి జల్లించి ఆ భస్మంలొ తగినంత ఆవు నెయ్యి కలిపి మర్దించి తలకు పట్టాలి.యే ఇతర మందుల వల్ల తగ్గని తల లోని మొండి కురుపులు ,పుండ్లు దీనితో పూర్తిగా తగ్గిపోతాయి.


సాధారణ దొండ కూర గుణాలు -

రుచి గా వుండి చలువ చేస్తుంది.యెక్కువగా తింటే పొట్టలో బరువుగ వుండి అజీర్ణం పుట్టించి ,బుద్ధిని మందగింప చేస్తుంది.ఐతే అతి వేడిని ,ఆ వేడి వల్ల కలిగే ఇతర సమస్యలను ,రక్త స్రావాలను ,వాపులను ,వాత రోగాన్ని , క్రిమి రోగాన్ని పోగొడుతుంది.ఈ కూరను పరిమితంగా వాడుకోవాలి.


తీపి దొండ కూర గుణాలు -

రుచిగా వుండి శరీరంలోని విష పదర్థాలను బహిష్కరింప చేస్తుంది.ముఖ్యంగా కండ్ల రోగాలకు చాలా హితంగా వుంటుంది.వాత ,పిత్త సంబంధ చర్మ రోగాలను ,వాంతులను పోగొట్టి , జటరాగ్నిని వ్రుద్ధి చేస్తుంది.ముఖ్యంగా ఈ కూర రక్త హీనులకు ,పసిరికల రోగం వచ్చిన వారికి ,నేత్ర రోగులకు చాలా ఇంపుగా వుంటుంది.ఐతే దీనిని కూడా పరిమితంగా వాడుకోవాలి.
.


స్త్రీల యోని శూల తగ్గడానికి -

దొండ ఆకు పసరు - 30 గ్రా

మగ దూడ వున్న గేదె పెరుగు - 50 గ్రా

పై వాటిని కలిపి రెండు పూటలా ఆహారానికి గంట ముందు 3 రోజుల పాటు విడువకుండా తాగుతూ చప్పిడి పథ్యం పాటిస్తుంటే యోని శూల తగ్గి పోతుంది.


లింగ బలహీనతకు లేపనం -
 

దొండ ఆకులు - 2

తెల్ల గురిగింజల పొడి - 2 గ్రా

పొంగించిన వెలిగారం పొడి - 2 గ్రా

పై వటిని కలిపి కొంచెం నిమ్మ రసం తో నూరి నిద్రించే ముందు లింగానికి లేపనం చేసుకోవాలి.20 రోజుల పాటు చేస్తే లింగం ద్రుఢంగా మారుతుంది.


.బహిష్టు నొప్పి తగ్గడానికి -


దొండ ఆకు

ఆవాలు

వెల్లుల్లిపాయ

పై వాటిని సమాన భాగాలలో తీసుకుని నూరి , పూటకు 10 గ్రా ,రోజు రెండు లేదా మూడు పూటలా నొప్పి తీవ్రతను బట్టి సేవిస్తుంటే ముట్టు నొప్పి తగ్గుతుంది.

ఆదొండ కూర - గుణాలు - 

కండ్ల రోగులకు హితంగా ఉంటుంది.వాత రోగాలు , కఫ రోగాలు ,గొంతు రోగాలు కలవారికి కూడా ఇది మేలు చేస్తుంది.ఐతే దీనిలో నెయ్యి గానీ ,పులుపు గానీ , కలిపి వండి తినాలి,లేకుంటే మలబద్ధకం, అగ్ని మాంద్యం కలుగుతాయి.ఇది ఉదర క్రిములను నశింప చేసి గుండెకు మంచి బలం కలిగిస్తుంది.

మధుమేహానికి దొండ పసరు -

దొండాకు రసం 20 gm మోతాదుగా ఉదయం ఆహారానికి అర గంట ముందు పరగడుపున సేవిస్తుంటే 40 నుండి 80 రోజులలో మధుమేహం పూర్తిగా అదుపులోకి వచ్చి ఆరోగ్యం కలుగుతుంది.

అరి కాళ్ల మంటలు తగ్గడానికి - 

పచ్చి దొండ ఆకు, పచ్చి చిక్కుడు ఆకు , పచ్చి నల్ల ఉమ్మెత్త ఆకు సమంగా కలిపి దంచి ఆ ముద్దను బట్టలో పిండి రసం తీయాలి. ఆ రసాన్ని రెండు పూటలా అరి కాళ్లకు ఇంకా శరీరం పైన మంటలున్న చోట మర్దన చేస్తుంటే అరి కాళ్ల మంటలు తగ్గిపోతాయి.

తెల్ల గుడ్ల సర్పి తగ్గడానికి - 

పచ్చి దొండ ఆకు రసం సాన రాయి పైన వేసి ఎర్ర కాచుతో అరగదీసి గంధం తీయాలి.ఆ గంధాన్ని పైన పట్టిస్తుంటే తెల్ల గుడ్ల సర్పి రోగం తగ్గిపోతుంది.

ద్రాక్ష పండ్ల తో డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

telugu - ద్రాక్ష పండ్లు
hindi - అంగూర్ 
english - grapes
latin - vitis vinnifere
sanskrit - ద్రాక్ష , మధు ఫల 

ఇవి చలువ చేసే స్వభావంతో తీపి , పులుపు రుచులతో కూడి మేహ శాంతి కలిగిస్తాయి.రక్త పైత్యం,శ్వాస రోగం, దాహ రోగం, మొదలైన అనేక రోగాలను పోగొట్టి అతి మూత్రాన్ని హరించి వేస్తాయి.రక్త శుద్ధి , వృద్ధి కలిగిస్తాయి.

అల్ప రక్త పోటు , రక్త హీనత తగ్గడానికి - 

1/2 గ్లాస్ మంచి నీటిలో శుభ్రంగా కడిగిన ఎండు కిస్మిస్ పండ్లు 32 వేసి రాత్రి నుండి ఉదయం వరకు నాన బెట్టి ,పరగడుపున ఆ పండ్లు నిదానంగా ఒక్కొక్కటి బాగా నమిలి తిని ఆ నీరు కూడా వడపోసుకుని త్రాగాలి.మరలా ఉదయం నానబెట్టి సాయంత్రం తినాలి.

ఇలా 60 నుండి 90 రోజులు చేస్తే రక్త హీనత, దీని వల్ల కలిగే కంటి కింద గుంటలు , నల్లటి మచ్చలు రావడం , జుట్టు ఉండడం, ముఖము, కళ్ళు, గోళ్లు ,అరచేతులు , తెల్లగా పడిపోవడం , శక్తి హీనత, అలసట లాంటి సమస్యలు , అల్ప రక్తపోటు తగ్గిపోతాయి

జ్వరం లో కలిగే శోష తగ్గడానికి - 

 ఎండు ద్రాక్ష పండ్లను మితంగా, హితంగా తీసుకొని మంచినీటిలో వేసి పిసికి వడపోసుకుని ఆ నీటిని తాగుతుంటే  జ్వరాలలో కలిగే అలసట, దాహం, శోష తగ్గిపోతాయి.

జ్వరం లో నోరు ఎండి పోతుంటే - 

 ద్రాక్ష పండ్లు, పటిక బెల్లం 20 గ్రాముల మోతాదుగా మెత్తగా దంచి రసం తీసి ఆ రసాన్ని ఒక కప్పు మోతాదుగా తీపి దానిమ్మ పండ్ల రసంలో కలిపి నోట్లో పోసుకొని ఐదు నుండి పది నిమిషాల సేపు పుక్కిలి పట్టి తర్వాత  ఊసి వేస్తుంటే తీవ్ర జ్వరాలలో నోరు ఎండుకు పోవడం ,నాలుకకు రుచి తెలియకపోవడం వంటి సమస్యలు తొలగిపోతాయి.

తీయని గొంతు ,వాక్ శుద్ధి , జ్ఞాన సిద్ధి కి - 

గింజలు తీసిన ద్రాక్ష పండ్లు - 10 gm
దోరగా వేయించిన పిప్పళ్ల పొడి - 3 gm
దోరగా వేయించిన చలువ మిరియాల పొడి - 3 gm
అతి మధురము పొడి - 10 gm

 పై అన్ని కలిపి రెండు పూటలా ఆహారానికి గంట ముందు సేవిస్తుంటే గొంతు బొంగురు వంటి ఇతర గొంతు రోగాలు హరించి కోకిల లాంటి కంఠస్వరం కలుగుతుంది.మాటలు తడబడడం పోయి, మంచి స్వరం వస్తుంది.మెదడుకు బలం కలిగి జ్ఞానం కూడా సిద్ధిస్తుంది.

* పిల్లలకు వయసును బట్టి మోతాదు తగ్గించి ఇవ్వాలి.*

మూర్ఛ రోగాలు తగ్గడానికి - 

ద్రాక్ష పండ్లు - 5 gm
తామర తూడు- 5 gm
పిప్పలి కట్టె - 5 gm
శొంఠి - 5 gm
తిప్ప తీగ - 5 gm

పై అన్నింటిని పావు లీటర్ మంచినీటిలో వేసి సగం కషాయం మిగిలే వరకు మరిగించి దించి వడపోసి అందులో 1 గ్రామ్ పిప్పళ్ళ పొడి కలిపి రోజు పరగడుపున సేవిస్తుంటే క్రమంగా మూర్ఛ రోగం తగ్గిపోతుంది.

ప్రేగులలో క్రిములు  హరించడానికి - 

ఎండు ద్రాక్ష పండ్లు, వాయు విడంగాలు సమాన భాగాలుగా తీసుకోవాలి.రెండింటిని రోటిలో వేసి మెత్తగా ముద్దలాగా దంచి మూడు పూటలా పూటకు కుంకుడు గింజంత ముద్ద చప్పరించి తింటుంటే ప్రేగులలో ఉండే అన్ని రకాల క్రిములు మలం ద్వారా పడిపోతాయి.

మూత్ర పిండాల నొప్పి తగ్గుటకు

ఒక ద్రాక్ష పండును తీసుకొని లోపలి గింజలను తీసివేసి అందులో కంది గింజంత మూసంబరం పెట్టి ఆ పండును వేళ్లతో గోలి లాగా మడిచి మింగి  నీరు త్రాగాలి.5 నిమిషాలలో మూత్ర పిండాల నొప్పి తగ్గిపోతుంది.

మూత్రం లో రక్తం పోతుంటే - 

ద్రాక్ష పండ్లు - 100 gm
అతి మధురము పొడి - 2 gm
చందనం పొడి - 1 gm

 రాత్రిపూట ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీరు పోసి ద్రాక్ష పండ్లు నానబెట్టాలి. ఉదయం పూట చేతితో పిసికి గింజలను ,తోలును తీసివేసి అందులో అతి మధురం పొడి,చందనం పొడి పైన తెలిపిన మోతాదులో కలిపి పరగడుపున తాగుతుంటే  మూత్రంలో రక్తం పడడం ఆగుతుంది.

ఉబ్బస రోగాలు తగ్గడానికి - 

ఎండు ద్రాక్ష పండ్లు
పసుపు
నువ్వుల పప్పు
సన్న రాష్ట్రం
దోరగా వేయించిన పిప్పళ్లు
దోరగా వేయించిన మిరియాలు


 పై అన్నింటినీ సమభాగాలుగా తీసుకొని మొత్తం మెత్తగా దంచి కుంకుడు గింజలంతా గోలీలు చేసి నిలువ ఉంచుకోవాలి.


 రెండు పూటలా ఆహారానికి అరగంట ముందు ఒక మాత్ర సేవించి ఒక కప్పు గోరువెచ్చని నీరు తాగుతుంటే ఉబ్బస రోగాలు హరించి పోతాయి.

క్షయ దగ్గు తగ్గడానికి - 

 ఎండు ద్రాక్ష పండ్లు, విప్ప పువ్వు ,ఎండు అంజూర్ పండ్లను సమంగా కలిపి మెత్తగా దంచి నలువ ఉంచుకోవాలి.

 రెండు పూటలా 20 గ్రాముల మోతాదుగా ఈ ముద్దను తింటుంటే క్షయ దగ్గు తగ్గుతుంది.

రక్త పైత్యం , రక్త ప్రవాహం కట్టుటకు - 

 ఎండు ద్రాక్ష పండ్లు మంచి గంధం పొడి, లోద్దుగా చెక్క పొడి సమానంగా తీసుకొని తగినంత తేనే కలిపి ముద్దలాగా దంచి నిలువ ఉంచుకోవాలి .

రెండు పూటలా పూటకు ఉసిరికాయ అంత ముద్ద తింటుంటే భయంకరమైన ఉష్ణ రోగాలు, నవరంద్రాల గుండా రక్తం పోవడం వంటి రక్త పిత్త సమస్యలు హరించిపోతాయి.

డా ఏల్చూరి ఆయుర్వేద..దూసరి తీగ / చిరుహట

telugu - దూసరి తీగ చెట్టు ,  దూసరి తీగ , శిబ్బి తీగ
hindi - చిరుహట 
latin - coceulus villosus,marsilea quadrfolia
sanskrit - పాతాళ గరుడ

ఈ తీగ తో ఆవు దూడల మూతికి చిక్కాలు , అలాగే బుట్టలు , తట్టలు కూడా తయారు చేస్తారు .

ఇది చలువ చేసే స్వభావంతో మూత్ర రోగాలను , సెగ రోగాలను , మేహ రోగాలను , మానసిక రోగాలను హరించి వేస్తుంది.

మానసిక రోగాలకు -

దూసరి ఆకుల రసం- 10 gm
ఆవు నెయ్యి - 10 gm

పై వాటిని కలిపి రెండు పూటలా ఆహారానికి గంట ముందు తాగిస్తుంటే మానసిక రుగ్మతలు తగ్గిపోతాయి.

మధుమేహం తగ్గడానికి - ఒక గ్లాస్ నీటిలో 10 gm దూసరి ఆకులు వేసి 1/2 కప్ కషాయానికి మరిగించి వడపోసి అందులో 1/2 కప్ గోరు వెచ్చని ఆవు పాలు కలిపి రెండు పూటలా సేవిస్తుంటే క్రమక్రమంగా మధుమేహం తగ్గిపోతుంది.

సంతాన యోగం కలగడానికి - 

ఏ లోపం లేకపోయినా సంతానం కలగని స్త్రీలు నిద్రించే ముందు దూసరి ఆకులను పొత్తి కడుపు పైన పరచి బట్ట కట్టుకొని ఉదయం తీసివేయాలి. ఇలా 7 రోజులు చేస్తే గర్భాశయం లోని గొడ్డు పురుగులు నాశనమై గర్భ ధారణ కలుగుతుంది.

సెగ రోగాలు తగ్గడానికి -

దూసరి ఆకుల రసం - 30 gm
పటిక బెల్లం పొడి - 30 gm


తెల్ల సెగ , ఎర్ర సెగ , పచ్చ సెగ లతో బాధ పడేవారు పై వాటిని కలిపి సేవిస్తుంటే అన్ని రకాల సెగ రోగాలు అతి త్వరగా తగ్గిపోతాయి.

రక్త శుభ్రతకు -

దూసరి వేర్లు - 20 gm
దోరగా వేయించిన మిరియాలు - 7

పై వాటిని కలిపి నలగ గొట్టి ముప్పావు లీటర్ నీటిలో వేసి పావు లీటర్ కషాయానికి మరిగించి వడపోసి గోరువెచ్చగా ఉదయం పూట తాగుతుంటే అతి త్వరగా రక్త శుద్ధి జరుగుతుంది.

అతి మూత్రం తగ్గుటకు -

దూసరి ఆకులను ఆరబెట్టి పొడి చేసి పూటకు 5 gm పొడి ని ,1/2 కప్పు వేడి నీటితో రెండు పూటలా సేవిస్తుంటే అతి మూత్రం తగ్గిపోతుంది.

స్వప్న స్ఖలనము తగ్గుటకు - 

దూసరి ఆకుల పొడి - 100 gm
నెయ్యిలో వేయించిన కరక్కాయల పొడి - 25 gm
పటిక బెల్లం పొడి - 120 gm

పై వాటిని కలిపి ఉంచి రెండు పూటలా 1 చెంచా మోతాదుగా ఆవు పాలతో సేవిస్తుంటే స్వప్న స్ఖలనము తగ్గిపోతుంది.

పాములకు విరుగుడు - 

మంచి రోజున పూజ చేసి దూసరి వేర్లు తెచ్చి ఇంటి గుమ్మానికి వేలాడతీస్తే పాములు ఆ ప్రాంతానికి రావు.

దూసరి దుంప ను నీటి తో నూరి 50 gm మోతాదు గా తాగిస్తే విషం విరుగుతుంది.

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...