Saturday 7 June 2014

NELAVEMU / KALMEGH - AYURVEDIC USES

ఆయుర్వేద మిత్రులారా! మన పవిత్ర భారతభూమిపై పుట్టిన అపురూప ఔషధ మొక్కల్లో నేలవేము
మహా గొప్పది. ఇది చూడటానికి చిన్న మొక్కలా కనిపించినా కూడా దీని ఔషధ విలువలు మాత్రం అనంత
మైనవి. దీని అసలుపేరు నేలవేప. ప్రజల వాడుకలో క్రమంగా అది నేలవేముగా మారిపోయింది. దాదాపుగా
వేపచెట్టుకున్న అన్ని గుణాలు దీనిలో వుండటమే గాక, వేపచెట్టులో లేని అదనపు ప్రత్యేక ఔషధగుణాలుకూడా
ఈ నేలవేములో వున్నయ్. ఇది అన్ని మెట్టప్రాంతాలలో విశేషంగా లభిస్తుంది. ఆకు నల్లగా కోలగా వుంటుంది.
ఘాటైన చేదుతో అనేక విషరోగాలను తిరిగి తలెత్తకుండా తొక్కివేయడంలో దీనికి సాటి మరొకటి లేదు. మీ
ప్రాంతంలో పెరిగే ఇంత గొప్ప ఔషధ మొక్క గురించి మీకు తెలియకపోతే మీరెంతో సౌభాగ్యాన్ని కోల్పోయినట్లే.

నేలవేము - పేర్లు
సంస్కృతంలో భూనింబ, కిరాతతిక్త, జ్వరాంతక
అని, హిందీలో చిరాయత, కాలమేఘ అని, తెలుగులో
నేలవేము అని, లాటిన్లో Sucerits Chirats,
Gentiana Cheryta అంటారు.
నేలవేము - రూప గుణ ప్రభావాలు
ఇది భూమిమీద అరమీటరునుండి ఒకమీటరు
ఎత్తువరకు పెరుగుతుంది. ఆకులు మిరపాకులాగా
కోలగా వుంటయ్. తెల్లరంగుపూలు పూస్తయ్.
కాయలు చీలికకలిగి పేలుడుకాయల్లాగా వుంటయ్
లోపలిగింజ బద్దలాగా గట్టిగా వుంటుంది. ఇందులో
దేశవాళినేలవేము, సీమ నేలవేము అనే రెండు రకా
లున్నయ్.
ఇది చౌడునేలల్లో మెట్ట ప్రాంతాల్లో విస్తారంగా
మొలుస్తుంది. మనదేశవాళీ నేలవేము మొక్కంతా కారు
నలుపుగావుంటుంది. ఉపయోగాలు తెలుసుకుందాం.
తల్లిపాల శుద్ధికి - నేలవేము
ఏకారణం వల్లనైనా తల్లిపాలు రోగకారకమైతే
వెంటనే రెండుకప్పుల నీటిలో అయిదుగ్రాములు
నేలవేమువేసి ఒకకప్పుకషాయం మిగిలేవరకు
మరిగించి వడపోసి గోరువెచ్చగా అయిన తరువాత
ఒక చెంచా తేనెకలిపి రెండుపూటలా సేవిస్తుంటే
మాతృక్షీరదోషం హరించి స్తన్యశుద్ధి అవుతుంది.
రక్తంలో పైత్యంచేరితే - నేలవేము
శరీరంలో పైత్యం ప్రకోపించినప్పుడు అది బల
వంతంగా రక్తంలోకి చొచ్చుకుపోయి రక్తాన్ని ఉద్రేక
పరుస్తుంది. అప్పుడు శరీరమంతా మంటలు, కురు
పులు, పుండ్లు, మొదలైన అనేక ఉపద్రవాలు కలుగు
తయ్.
అలాంటివారికి నేలవేము సమూల చూర్ణం మూడు
గ్రాములు, మంచిగంధంచూర్ణు మూడుగ్రాములు ఒక
కప్పు నీటిలో కలిపి రెండుపూటలా తాగిస్తూవుంటే రక్త
పైత్య ఉపద్రవాలు తగ్గిపోతయ్.
అన్నిరకాల ఉబ్బురోగాలకు - నేలవేము
నేలవేము 10గ్రాII, శొంఠి 10గ్రా|| నలగొట్టి పావు
లీటరు మంచినీటిలో వేసి సగానికి మరిగించి వడపోసు
కోవాలి.
అందులో ఒక చెంచా కండచక్కెర కలిపి రెండు
పూటలా సేవిస్తూవుంటే క్రమంగా వాతదోషంవల్లగానీ,
పైత్యదోషంవల్లగానీ కఫదోషంవల్లగానీ శరీరంలో
చెడునీరు చేరిన ఉబ్బురోగం తప్పక హరించిపోతుంది.
విషజ్వరాలకు - నేలవేముమాత్రలు
నేలవేముఆకు తులసి ఆకురసం సమంగా కలిపి
'రోటిలో వేసి రెండు పదార్థాలు బాగా కలిసి ముద్దలాగా
అయ్యేవరకు మెత్తగా నూరి ఆ ముద్దను కందిగింజ
లంత గోలీలుగా తయారుచేసి నీడలో గాలి తగిలేచోట
పూర్తిగా ఎండించి నిలువచేసుకోవాలి.
ఈమాత్రలను రెండు గంటలకు ఒకసారి ఒక
మాత్రను ఒక చెంచా తమలపాకురసంతో రోజుకు
మూడునాలుగుసార్లు సేవిస్తూవుంటే విషజ్వరాలు
హరించిపోతయ్.

ముదిరిన చర్మరోగాలకు - నేలవేము
నేలవేము 10గ్రాII, మానుపసుపు 10గ్రా||, చండ్ర
చెక్క 10 గ్రా||, ఈ మూడింటిని నలగొట్టి పావులీటరు
నీటిలో వేసి సగంకషాయం మిగిలేవరకు చిన్నమంట
పైన మరగబెట్టి దించి వడపోసుకోవాలి.
ఈకషాయాన్ని సగంసగం మోతాదుగా రెండు
పూటలా సేవిస్తూవుంటే రక్తశుద్ధిజరిగి ముదిరిన చర్మ
రోగం హరించిపోతుంది.
నిండుబలానికి - నేలవేము
నేలవేము 20గ్రా|| తీసుకొని అరలీటరు మంచి
నీటిలో వేసి ఆరుగంటలపాటు మూతబెట్టి నానబెట్టాలి
ఆతరువాత వేరేపాత్రలోకి వడపోసి పూటకు 50గ్రా||
చొప్పున మూడుపూటలా ఒకచెంచా తేనె లేక కండ
చక్కెర కలిపి సేవించాలి.
ఇది తాగిన వెంటనే రెండు గ్రాముల దాల్చినచెక్క
నమిలిమింగాలి. ఇలా చేస్తుంటే క్రమంగా శరీరంలో
అజీర్ణం, అరుచి హరించిపోయి దేహానికి నిండుబలం,
దారుఢ్యం సంపూర్ణంగా కలుగుతయ్.
అన్నిరకాల జ్వరాలకు - నేలవేము
నేలవేము, వేపచెట్టుబెరడు, కటుకరోహిణి,
తిప్పతీగ, కరక్కాయలబెరడు, తుంగగడ్డలు,
ధని
యాలు, అడ్డసరపుఆకులు, కానుగబెరడు, వాకుడు
పండ్లు, కర్కాటకశృంగి, శాంతి, ప్పటకం, చేదు
పొట్ల, పిప్పళ్ళు, కచ్చూరాలు, వీటిని సమభాగాలుగా
సేకరించాలి. వీటిలో కరక్కాయలు, ధనియాలు,
శొంఠి, పిప్పళ్ళు వీటిని దోరగా వేయించి పొడిచేసి
మిగతా పొడులలో కలిపి పూటకు 3గ్రా॥ చొప్పున
మంచినీటితో రెండుపూటలా సేవిస్తూవుంటే సకల
జ్వరాలు సమసిపోతయ్. *


పిల్లలజ్వరానికి - నేలవేము
రెండుకప్పుల నీటిలో అయిదు గ్రాముల నేలవేము
అరకప్పు కషాయానికి మరిగించి అది గోరు
వెచ్చగా అయిన తరువాత అరచెంచా తేనె కలిపి బిడ్డల
తాగిస్తూవుంటే బాలజ్వరాలు హరించిపోతయ్.
దారుణ ఉదరశూలకు - నేలవేము పట్టు
నేలవేము, పప్పళ్ళు, కరక్కాయ, కటుకరోహిణి,
కలబంద గుజ్జు వీటిని సమంగా కలిపి తగినన్ని నీటితో
బాగా మెత్తగా నూరి ఆ ముద్దను కొంచెం వేడిచేసి పొట్ట
పైన చిక్కగా పట్టువేస్తే దీని ప్రభావానికి రెండు మూడు
విరేచనాలై దారుణమైన ఉదరశూల మాయమై
పోతుంది.
ప్రాణాంతక సన్నిపాతానికి - నేలవేము
నేలవేముఆకులు ఉలిమిడి చెక్క కొడిశపాల
గింజలు, తుంగగడ్డలు, దేవదారు చెక్క, శొంఠి, గజ
పిప్పళ్ళు, ధనియలు, దశమూలాలు వీటన్నింటిని
సమానభాగాలుగా తీసుకొని దంచి పలుచనిబట్టలో
వస్త్రఘాళితంబట్టి ఆఅతిమెత్తనిచూర్ణాన్ని ఒక గాజు
సీసాలో నిలువవుంచుకోవాలి.
ఈ మార్గాన్ని పూటకుమూడుగ్రాముల మోతాదుగా
రెండు లేదా మూడుపూటలా వేడినీటిలో కలిపి
తాగిస్తుంటే దారుణమైన దగ్గు ఆయాసంతో కూడు
కొనివచ్చే ప్రాణాంతక సన్నిపాత జ్వరం వారం లేక
పదిరోజులలో తగ్గిపోయి ప్రాణాలు కాపాడబడతయ్.



ఆమవాతజ్వరానికి - నేలవేము కషాయం
నేలవేము, తిప్పతీగ, తుంగగడ్డలు, శాంతి ఒక్కో
కృటి పదిగ్రాముల చొప్పున అరలీటరు నీటిలోవేసి
పావులీటరు కషాయం మిగిలేవరకు మరిగించి వడ
పోసి ఉదయం సాయంత్రం సగంసగం కషాయం
సేవిస్తూవుంటే ఆమవాత జ్వరం హరించిపోతుంది.
జ్వర నీరసానికి - నేలవేము
అరలీటరుమంచినీటిలో నేలవేము 20 ||కలిపి
పావులీటరు కషాయం మిగిలేవరకు మరిగించి, వడ
పోసి పూటకు అరకప్పు కషాయం మోతాదుగా మూడు
పూటలా ఒకచెంచా తేనెకలిపి తాగుతూవుంటే జ్వరం
వల్ల వచ్చిన నీరసం బలహీనత అజీర్ణం హరించి
పోతయ్.