Sunday 8 June 2014

మేడి చెట్టు - ఆయుర్వేదం / MEDI CHETTU / UDUMBARA / THE GULAR FIG - AYURVEDIC USES

మే డి చెట్టు పేర్లు

సంస్కృత ము - ఉదుంబర, క్షీర వృక్ష,హేమ దుగ్ధ, 
హిందీ - గూలర్ 
తెలుగు - మే డి చెట్టు, అత్తి చెట్టు, బొడ్డ చెట్టు 
ఇంగ్లీష్ - the gular fig
లాటిన్ - ficus racemosa, ficus glomerata

మేడి చెట్టు రూప గుణ ప్రభావం - ఇది ముఖ్యంగా వగరు రుచి కలిగి ఉంటుంది. స్త్రీల యోని రోగాలను, వ్రణా లను, సర్పిని,ఉబ్బు ను, అతిసారాన్ని ,ప్రమే హాన్ని, విరేచనాలను ,రక్త పైత్యాని, అతిమూత్ర సమస్య లను  హరించివేస్తుంది.

పైత్యం రోగాలు తగ్గడానికి 

మేడి చెట్టు లేత ఆకుల పొడి అరచెంచా నుండి ఒక చెంచా మోతాదుగా తేనెతో కలిపి రెండు పూటలా  సేవిస్తుంటే పైత్య రోగాలు  తగ్గిపోతాయి.

కంతులు గవదబిల్లలు తగ్గడానికి

 శరీరం పైన కంతులు ఏర్పడిన ,చెంపల పైన గవదబిళ్లలు బాధిస్తున్నా మే డి చెట్టుకు నమస్కరించి గాటుపెట్టి పాలను తీసి కంతుల పైన బిళ్ళ ల పైన  రుద్ది దూదిని అంటించాలి.

ఇలా చేస్తూ ఉంటే కంతులు కరిగిపోతాయి గవద బిళ్ళలు రెండు మూడుసార్లు కే తగ్గిపోతాయి.

స్త్రీల కుసుమ రోగాలు తగ్గడానికి.

మేడి పండ్లను మెత్తగా రుబ్బి బట్టలో వేసి రసం పిండాలి. ఆ రసం 20 గ్రాములు ,తేనె 10 గ్రాములు కలిపి రెండు పూటలా సేవిస్తూ, పాలు ,పంచదార కలిపిన భోజనం మాత్రమే చేస్తూ ఉంటే వారం రోజుల్లో కుసుమ రోగాలు హరించిపోతాయి.


అతి దాహం తగ్గడానికి 

మేడి పండ్ల రసం గాని,కషాయం గాని కండ చక్కెర కలిపి సేవిస్తూ ఉ0టే
 తీవ్రమైన దాహం కూడా తగ్గిపోతుంది.

నోటి పూత తగ్గడానికి 

మేడి చెక్కను దంచి రసం తీసి వడ పోసి దాన్ని నోట్లో పోసుకుని రెండు  పూటలా పుక్కిట బట్టి పదినిమిషాల తర్వాత ఊ సి వేస్తూ ఉంటే నోటిపూత తగ్గిపోతుంది.

స్త్రీలు సుఖంగా ప్రసవించడానికి

మేడి చెట్టు వేరును నీటిలో అరగదీసి ఆ గంధాన్ని అరికాళ్ళకు పట్టిస్తే ప్రసవించ లేని స్త్రీ సుఖంగా ప్రసవిస్తుంది.


ఔదుంబర -  మణి ధారణ

మేడి చెట్టుకు పూజ చేసి విధి ప్రకారం గా దాని వేరు చిన్న ముక్కను తెచ్చుకొని పసుపు కుంకుమ చల్లి గాలికి ఆరబెట్టి అది ఎండిన తరువాత దాన్ని  వెండి లేక రాగి తాయత్తు లో ఉంచి మెడలో గాని మొలలో గాని ధరించాలి. దీని వలన మానసిక బలహీనత తగ్గిపోయి క్రమంగా ధైర్యం కలుగుతుంది ధన నష్టం కలగడం వలన కలిగిన అశాంతి తగ్గిపోయి మానసిక శాంతి కలిగి తిరిగి ధనాన్ని సంపాదించగలరు . దీని ధారణతో తేజస్సు కూడా కలుగుతుందని మన వేదాలలో చెప్పబడింది.

స్త్రీల అతి రక్తస్రావం తగ్గడానికి

 మేడి పండ్లు ముక్కలుగా కోసి ఆరబెట్టి పొడి చేసి నవి 100 గ్రాములు ,పటిక బెల్లం పొడి 100 గ్రాములు ,తేనె 50 గ్రాములు కలిపి నిలువ ఉంచుకుని పూటకు పది గ్రాముల చొప్పున రెండు లేక మూడు పూటలా అవసరాన్ని బట్టి సేవిస్తూ ఉంటే ఈ సమస్య తగ్గిపోతుంది.

పెట్టుడు మందు కి విరుగుడు 

బ్రహ్మ మేడి చెక్క 30 గ్రాములు నలగ్గొట్టి అరలీటరు నీటిలో వేసి సగం మిగిలే వరకు మరగబెట్టి వడగట్టి గోరువెచ్చగా ఉదయం పరగడుపున తాగితే కొద్దిసేపట్లో వాంతి జరిగి ఆ  వాంతి లోనే పెట్టుడు మందు పడిపోతుంది. .తరువాత గోధుమ నూక తో చేసిన జావ ఆహారంగా ఇవ్వాలి.

స్త్రీల యోని బిగుతు కావడానికి 

మేడి కాయలు ,మోదుగ పువ్వు సమంగా కలిపి కొంచెం నువ్వులనూనెతో అతి మెత్తగా నూరి
 కొంచెం తేనె కలిపి రాత్రిపూట యోనికి లేపనం  చేసుకుంటూ ఉంటే క్రమంగా యోని బిగుతుగా మారి పోతుంది.

పురుషుల వీర్యం బలం సంతరించుకోవడానికి  

మేడి చెట్టు బెరడు పొడి , మర్రిచెట్టు చిగుర్ల పొడి సమంగా పటిక బెల్లం పొడిని కలిపి
 పూటకు పది గ్రాముల మోతాదుగా రెండు పూటలా తిని ఒక కప్పు వేడి పాలు తాగుతూ ఉంటే వీర్య నష్టం హరించి ,వీర్యం గట్టిపడి అంగస్తంభన కూడా చక్కగా కలుగుతుంది.

ముసలితనాని కి విరుగుడు గా

 మేడి పండ్లలోని గింజలు తీసి ఎండబెట్టి మెత్తగా పొడి లాగా చేయాలి. ఆ చూర్ణాన్ని పూటకు మూడు గ్రాముల మోతాదుగా నిమ్మకాయంత సైజులో ఆవు వెన్నలో కలుపుకొని రెండు పూటలా ఆహారానికి రెండు గంటల ముందుగా సేవిస్తుంటే ముసలితనపు లక్షణాలు తొలగిపోయి యవ్వనపు లక్షణాలు పెరుగుతాయి.

పాండు రోగం ఉబ్బు రోగం తగ్గడానికి 

బ్రహ్మ మేడి కాయలు 20 గ్రాములు ,మిరియాలు 10 గ్రాములు నలగగొట్టి అర లీటర్ నీటిలో వేసి పావు లీటర్  మిగిలే వరకు మరిగించి దించి వడపోసి అందులో ఒక స్పూన్ కండ చక్కెర కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే మల మూత్రాలు సాఫీగా జరిగి చెడు నీరంతా విసర్జింప బడి కాలేయానికి ప్లీ హాని కి బలం కలిగి రక్తవృద్ధి జరుగుతుంది.

గర్భస్రావం జరగకుండా ఉండడానికి

50 గ్రాముల మేడి చెక్కను నలగగొట్టి ఒక గ్లాసు నీటిలో వేసి ఒక కప్పు కషాయం మిగిలే వరకూ మరగించి  దించి వడపోసి అందులో ఒక చెంచా బార్లీ గింజల పొడి ఒక చెంచా పటికబెల్లం పొడి కలుపుకుని రెండు పూటలా తింటూ ఉంటే గర్భస్రావం జరగదు.

కుష్టు బొల్లి వ్యాధులు తగ్గడానికి

 బ్రహ్మ మేడి చెట్టు వేరు పై బెరడు 20 గ్రాములు తానికాయ చెట్టు పై బెరడు 20 గ్రాములు అర లీటర్ నీటిలో వేసి పావు లీటర్ మిగిలే వరకు మరగబెట్టాలి. దించి వడపోసి అందులో బా వంచాల పొడి ఐదు గ్రాములు, పాత బెల్లం 20 గ్రాములు కలిపి ఆరు నెలల పాటు రెండుపూటలా సేవిస్తుంటే వ్యాధులు తగ్గిపోతాయి.