3, మార్చి 2014, సోమవారం

గచ్చ కాయ / NICKERNUTS / CAESALPINIA BONDUC / LATHA KARANJ / KAT KARANJ - ఆయుర్వేద ఉపయోగాలు / AYURVEDA UPAYOGALU


గచ్చకాయ చెట్టు భారతదేశమంతటా వ్యాపించి ఉంది.దీని గురించి ప్రత్యేకంగా ఒక పుస్తకమే రాయవచ్చు.చిన్నప్పుడు పిల్లలు గచ్చకాయలతో ఆడుకునే వారు.రాయి మీద ఇలా రాసి పెడితే చుర్రుమని మంటపెడుతుంది.అదే గచ్చకాయ ఆకు ప్రారంభ దశలో ఉన్న వరి బీజానికి అమోఘంగా పని చేస్తుంది.ఆకును ఆముదంలో వేయించి వృషణాలకు కడితే చాలు మూడు పూటల్లో వ్యాధి తగ్గుతుంది.

బంజరు భూములు ,తీరప్రాంతాలు,ఆకులు రాలే చెట్లున్న అడవులలో కూడా ఏదో ఒక చెట్టును పట్టుకుని గచ్చమొక్క పాకుతుంది.ఇది పైకి పాకుడు మొక్క.గట్టి ముళ్ళు,కొక్కేలు కలిగి ఏదొ ఒక చెట్టును ,ఆధారాన్ని ఆలంబనగా చేసుకుని విస్తరిస్తుంది.సిసాల్పినేసి కుటుంబానికి చెందిన దీని శాస్త్రీయనామం సిసాల్పినియా బొండక్, సన్స్కృతంలో లతా కరంజ్ ,కంటకి కరంజ్, హిందిలో కట్ కరంజ్ అని అంటారు.

గచ్చకాయగింజల్లోపసుపుపచ్చనిచిక్కనిద్రవంఉంటుంది.ఇది కాకుండా ,సిసాల్పిన్,అయోడిన్సాపోవిన్,నాన్గ్లూకోసైడల్ పదార్థాలు ఉంటాయి.

గచ్చకాయ కఫాన్ని,వాతాన్ని అణచివేస్తుంది.పిత్తాన్ని పెంచుతుంది.రక్తదోషాలను,వాపులనుతొలగిస్తుంది.జీర్ణశక్తిని పెంచుతుంది.గింజలు ఉష్ణతత్వం గలవి.చేదుగా ఉంటాయి.రక్త వృద్ధికి తోడ్పడతాయి.మెదడుకు , కళ్ళకు,చర్మకాంతికి గచ్చకాయ వినియోగం మంచిది.దీని గింజల తైలం వాడడం వల్ల గౌట్,కంటి,చర్మ వ్యాధులు తగ్గుతాయి.దగ్గు,పైల్స్,వాతం,కడుపులోపురుగులు,వాపులుపోవడానికిగచ్చఆకులువాడటంమంచిది.కాయలకు,పైల్స్ ను ,మూత్రసమస్యలను నయం చేసే శక్తి ఉంది.

1. బట్టతలపై జుట్టు రావడానికి - 

గచ్చకాయ తైలాన్ని తల మాడుకు రాసుకోవాలి.లేదా గచ్చమొక్క పూలు 6 నుంచి 12 గ్రాములు మెత్తగా నూరి దాన్ని తలకు పట్టించాలి.ఇలా కొంతకాలం చేస్తే బట్టతలపై జుట్టూ రాబట్టవచ్చు.

2. మైగ్రేన్ , తలనొప్పి తగ్గడానికి - 

ఎ.) 1, 2 గచ్చకాయ గింజలు , దానికి సమంగా ములక్కాయ గింజలు,దాల్చిని,చక్కెర కలిపి మెత్తగా పొడి చేసి నస్యం మాదిరిగా ముక్కుతో పీల్చాలి.దీనివల్ల ఎక్కువగా తుమ్ములు వచ్చి లోపలి నుంచి శ్లేష్మం వచ్చి తలనొప్పి తగ్గిపోతుంది.

బి.) గచ్చకాయ గింజలను నీటితో తడిపి మెత్తగా నూరి దానికి కాస్త బెల్లం కలపాలి.దీన్ని కాస్త వెచ్చచేసి ముక్కురంధ్రంలో వేయాలి.తలనొప్పి కుడివైపున ఉంటే ఎడమ రంధ్రం లో, ఎడమవైపు ఉంటే కుడి రంధ్రం లో వేయాలి.ఒక రంధ్రంలో మందు వేస్తే రెండు గంటల తర్వాత ఇంకో రంధ్రంలో వేయాలి.ఇలా కొన్ని రోజులు చేస్తే తలనొప్పి, మైగ్రేన్ అన్నీ నయమౌతాయి.

3. మూర్చ వ్యాధి తగ్గడానికి - 

గచ్చ ఆకుల రసం 10 - 12 గ్రాములు రోజూ మూడు పూటలా కొంతకాలం తాగాలి.

4. కంటి జబ్బులు తగ్గడానికి -

 కళ్ళు ఎర్రబడటం,కళ్ళ చివర వెంట్రుకలు లేకపోవడం జరిగితే గచ్చకాయల గింజలు 1,2 గ్రాములు,తులసి ,మల్లెమొగ్గలు సమంగా తీసుకుని  వాటిని కలిపి మెత్తగా నూరి దానికి 8 రెట్లు నీరు కలిపి మరిగించాలి.నీరు మూడు వంతులుఆవిరికాగానేదాన్నివడగట్టిమళ్ళీమరిగించాలి.ద్రవం చిక్కబడగానే కాటుకలా తయారవుతుంది.దాన్ని కళ్ళకు రాస్తుండాలి.

5. దంత రోగాలు తగ్గడానికి -

 పయోరియాఉంటేగచ్చమొక్కపుల్లతోపళ్ళుతోముకోవాలి.పళ్ళ చిగుళ్ళనుంచి రక్తం కారుతుంటే 7 గ్రాముల గచ్చ గింజల పప్పుకు 7 గ్రాముల చక్కెర కలిపి తినాలి.దీనివల్ల రక్తం కారడం ఆగిపోతుంది.

6 . దగ్గు తగ్గడానికి - 

ఎ.) 15 మి.గ్రా - 750 మి.గ్రా గచ్చకాయల పొడి ,125 మి.గ్రా వేయించిన బోరాక్స్ పొడి తేనెతో కలిపి తినాలి.ఇలా రోజుకు మూడు,నాలుగు సార్లు తీసుకోవాలి.చిన్నపిల్లలకు గచ్చకాయలను దండగా గుచ్చి మెడలో వేయాలి.ఇలా చేస్తే దగ్గు నాలుగైదు రోజులలో నయమౌతుంది. 

బి. ) 10 - 12 గ్రాముల గచ్చ ఆకుల రసం ,250 - 500 మి.గ్రా . మిరియాల పొడి కలిపి రోజూ మూడు పూటలా తాగాలి.ఇలా నాలుగు రోజులు చేస్తే దగ్గు నుంచి విముక్తి లభిస్తుంది.

7 . కోరింత దగ్గు తగ్గడానికి - 

మెడలో గచ్చకాయ మొక్క పూల దండను వేయాలి.లేదా గచ్చకాయ గింజలను 1 - 2 గ్రాములు మెత్తగా నూరి నీటిలో వేసి మరిగించాలి.తయారైన కషాయాన్ని తాగితే దగ్గు తగ్గుతుంది.

8.. ఆకలి లేమి తగ్గడానికి - 

10 - 12 గ్రాముల గచ్చ ఆకుల రసం ,అంతే పరిమాణంలో చిత్రమూలం ఆకుల రసం కలిపి దానికి కాస్త మిరియాల పొడి,ఉప్పుకలిపితాగాలి.ఆకలిలేమి,పొట్టలోగ్యాస్,డయేరియా తగ్గిపోతాయి.అజీర్ణం సమస్య తగ్గుతుంది.

9. పొట్టలో నులి పురుగులు పోవడానికి - 

కడుపులో పేగులలో పురుగులు నశించడానికి గచ్చ కాయల తైలం 10 - 15 గ్రాముల వరకు 3 రోజులు తాగాలి.

10 - 12 గ్రాముల గచ్చమొక్క ఆకుల రసానికి 125 మి.గ్రా వాయువిడంగాల చూర్ణాన్ని ,కొద్దిగా మిరియాల పొడిని కలిపి రోజూ 2 పూటలా భోజనం తర్వాతతీసుకోవాలి.ఇలా వారం రోజులు తీసుకుంటే ప్రేవులలో పురుగులు నశిస్తాయి.

10. గ్యాస్ వల్ల వచ్చే కడుపునొప్పి తగ్గడానికి -

 గచ్చ ఆకులను ఏదైనా యవాగులో మరిగించిఅవసరమైన మోతాదులో సేవించాలి.నొప్పి తగ్గి జీర్ణ శక్తి పెరుగుతుంది.

11. ఉదరవ్యాధులు తగ్గడానికి -

 అధికంగా మలబద్ధకం ఉంటే 1 - 3 గ్రాముల గచ్చఆకులను  నేతిలో లేదా నువ్వుల నూనెలో వేయించి దాన్ని సత్తుపిండి / బార్లీ తో కలిపి సేవించాలి.దీనివల్ల పొట్ట ఉబ్బరం కూడా తగ్గుతుంది.

12. పైల్స్ తగ్గడానికి - 

గచ్చ ఆకులను మెత్తగా నూరి పైల్స్ గడ్డలపైపూయాలి.గచ్చ ఆకులు 1 - 3 గ్రాములు మెత్తగా నూరి పైల్స్ తగ్గే వరకు నీటితో కలిపి సేవించాలి.

గచ్చకాయ మొక్క వేరు పొడి 500 మి.గ్రా నుంచి 2 గ్రాముల వరకు తీసుకుని,దానికి సమంగా చిత్రమూలం పొడి ,సైంధవ లవణం ,కొడిశపాల బెరడు పొడి కలిపి ఈ మిశ్రమం 1 - 3 గ్రాములు రోజూ 2 పూటలా తగ్గేవరకు సేవించాలి.

13. మధుమేహం తగ్గడానికి -

 గచ్చకాయ మొక్క పూలరసంచూర్ణంసేవించవచ్చు.దీనివల్ల మూత్ర సమస్యలు కూడా నయమౌతాయి.

14. వాంతులు తగ్గడానికి -

 వాంతులు , దగ్గు వస్తుంటే గచ్చకాయల గింజల చూర్ణం 2 - 3 గ్రాములు,చక్కెర , తేనెకలిపిరోజూ2పూటలాతీసుకోవాలి.

వాంతులు ఆగిపోవడానికి.. గచ్చకాయల గింజలను వేయించి వాటికి కాస్త చక్కెర కలిపి మెత్తగా నూరి చిన్న మాత్రలుగా చేయాలి.ప్రతీ 10 నిమిషాలకు ఒక మాత్రను మింగాలి.వాంతులు ఆగిపోతాయి.ఆ గింజలను చిన్న చిన్న ముక్కలుగా చేసి 1 - 2 ముక్కలను ప్రతి పావుగంటకు తినాలి.

15. సిఫిలిస్ / సుఖవ్యాధి తగ్గడానికి - 

గచ్చకాయ మొక్క వేరు రసం 1 - 3 గ్రాములు తీసి దానికి కొబ్బరినీరు,నిమ్మరసంకలిపిరోజూ2పూటలాతాగాలి.మూత్రంలో మంట , చీము కారడం తగ్గుతుంది.

16. కిడ్నీలలో రాళ్ళు తగ్గడానికి - 

గచ్చకాయల గింజల పొడి 1 గ్రాము,3 గ్రాముల తేనె కలిపి మొదటి రోజు తాగాలి.మరునాడు 2 గ్రాముల గచ్చకాయల గింజల పొడి ,తేనె తీసుకోవాలి.ఇలా రోజూ 1 గ్రాము పొడి పరిమాణం పెంచుకుని తినాలి.తర్వాత రోజు 1 గ్రాము పొడితగ్గించితినాలి.దీనినేవర్ధమానయోగంఅంటారు.చివరగా 3 గ్రాముల పొడి,తేనె తీసుకోవాలి.దీనితో కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి.

17.రక్తం కారే పైల్స్ తగ్గడానికి -

 గచ్చకాయ మొక్క వేరు బెరడు 2 గ్రాములు , గోమూత్రంతో కలిపి మెత్తగా నూరి తీసుకోవాలి.3 రోజులపాటు కేవలం మజ్జిగ మాత్రం తాగాలి.ఇంకే ఆహారం తీసుకోరాదు.రక్త పైల్స్ తగ్గిపోతాయి.

18. ఫిస్టులా తగ్గడానికి -

 500 మి.గ్రా నుంచి 2 గ్రాముల వరకు గచ్చకాయ మొక్క వేరు రసానికి ఆకు జెముడు రసం కలిపి దాన్ని ఫిస్టులా ఉన్న చోట ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాలి.ఇలా తగ్గే దాకా చేయాలి.

19. ఫిస్టులా అల్సర్లలో ఇంఫెక్షన్ వచ్చి ఉంటే గచ్చ ఆకులను నీటిలో ఉడికించి వాటిని ఫిస్టులా ఉన్నచోట ఉంచి కట్టు కట్టాలి.లేదా గచ్చాకుల రసం,వేపాకుల రసం కలిపి దానిలో దూది ముంచి ఫిస్టులా పై రాస్తుందాలి.

గచ్చ మొక్క ఆకులను , నిర్గుండి లేదా వేప ఆకులతో కలిపి మెత్తగా నూరి దాన్ని ఫిస్టులా వచ్చిన చోట ఉంచి కట్టు కట్టాలి.లేదా ఈ ఆకులకు గంజి కలిపి మెత్తగా చిక్కగా నూరి ఫిస్టులా పై రాయాలి.

20 . చర్మ వ్యాధులు తగ్గడానికి -

 10 - 12 గ్రాముల చిత్రమూలం,మిరియాలు,సైంధవ లవణం కలిపి చూర్ణం చేసి దానికి రెట్టింపు పెరుగు కలిపి దాన్ని రోజూ 3 , 4 సార్లు తాగాలి.ఇలా 3,4 నెలల వరకు చికిత్స జరగాలి.దీని వల్ల అన్ని రకాల చర్మ వ్యాధులు,ఇన్ ఫెక్షన్స్ తగ్గిపోతాయి.

1 - 2 గ్రాముల గచ్చ కాయల ఫలాలను లేదా వాటి గింజలను తీసుకుని 1 - 2 గ్రాముల కొడిశపాల గింజలతో కలిపి మెత్తగా నూరి దాని చర్మవ్యాధి ఉన్నచోట రాయాలి.

గచ్చ కాయ మొక్క ఆకులు,వేపాకులు,ఖదిర ఆకులు కలిపి మెత్తగా నూరి చర్మ వ్యాధిపై రాయాలి.ఈ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ కషాయం తో స్నానం చేయాలి.ఇలా కొంత కాలం చేస్తే చర్మవ్యాధులు నయమౌతాయి.

1 - 2 గ్రాముల గచ్చకాయ గింజలు ,కాస్త పసుపు,కరక్కాయ,ఆవాలు,కలిపి మెత్తగా నూరి వంటికి రాసుకోవాలి.ఇలా 10 రోజులపాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

గచ్చకాయల గింజలను తెల్ల గన్నేరు వేరుతో కలిపి మెత్తగా నూరి వంటికి పూసుకోవాలి.

10 - 20 మి.లీ గచ్చ ఆకుల రసం ,వాటి కషాయంతో చర్మవ్యాధి ఉన్నచోట పూసి కడగాలి.గచ్చకాయల తైలంలో నిమ్మ రసం ,గంధకం కలిపి చర్మవ్యాధి ఉన్నచోట పూయాలి.దీనివల్ల గడ్డలు,కురుపులు,ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులు నయమౌతాయి.

గచ్చకాయల తైలంలో నిమ్మ రసం కలిపి ,అది పసుపు రంగులోకి మారగానే చర్మంపై పూయాలి.

4 గ్రాముల యషధ భస్మం,25 గ్రాముల గచ్చగింజల తైలంలో కలిపి చర్మంపైరాయాలి.దీనినిపుండ్లపై,అల్సర్లపైనా రాయవచ్చు.

కాకనాక అనే చర్మవ్యాధి నయం కావడానికి చిత్రమూలం చూర్ణం,సైంధవ లవణం,గచ్చకాయల గింజల తైలంలో కలిపి చర్మంపై రాయాలి.

గచ్చకాయల ఫలాలను మెత్తగా నూరి 1 - 2 గ్రాముల మేర తినడం కూడా మంచిది.దీనివల్ల కూడా చర్మ వ్యాధులు నయమౌతాయి.

21 .గాయాలు తగ్గడానికి -

 గాయాలను గచ్చకాయల మొక్క వేరు రసంతో కడగాలి.

సమపాళ్ళలో కానుగ ఆకులు , కాడ జెముడు ,రేల ఆకులు ,మల్లెను తీసుకుని గోమూత్రంతో కలిపి మెత్తగా నూరి అల్సర్లు,పుండ్లు,పైల్స్ గడ్డలపైనా పూయాలి.త్వరగా నయమౌతాయి.

 22 . అల్సర్ల వల్ల వాపులు వస్తే గచ్చకాయ మొక్క ఆకులు 1 - 3 గ్రాములు ,అంతే పరిమాణంలో వావిలి ఆకులు కలిపి మెత్తగా నూరి అల్సర్లపై ఉంచి కట్టు కట్టాలి.

23 . బొబ్బలు తగ్గడానికి..

 గచ్చకాయల గింజలు,నువ్వులు ,ఆవాలు కలిపి మెత్తగా నూరి వాటిపై పూయాలి.

24 . కీళ్ళనొప్పులు తగ్గడానికి - 

సమపాళ్ళలో గచ్చ కాయ గింజలు ,ఉప్పు,అల్లం,ఇంగువ కలిపి మెత్తగా చూర్ణం చేయాలి.దానిని 500 మి.గ్రా నుంచి 1 గ్రాము వరకు చల్లని నీటితో కలిపి తాగాలి.

గచ్చకాయ గింజలను 125 మి.గ్రా తామ్రభస్మంతో కలిపి నూరి ఆవగింజలవలె చిన్న మాత్రలు చేసి వాటిని రోజుకి ఒక మాత్ర చొప్పున మింగాలి.లేదా 10 - 20 గ్రాముల గచ్చకాయ మొక్క ఆకులను నువ్వుల నూనెలో వేయించి తినాలి.

25 . జ్వరం తగ్గడానికి - 

గచ్చ కాయ గింజలను నీటితో కలిపి నూరి ఆ నీటిని పొట్టపై చుక్కలు చుక్కలుగా వేసి  పూయాలి.లేదా ఈ మొక్క మొగ్గలు 3 , 2 మిరియాలు కలిపి మెత్తగా నూరి పొట్టపై పూయాలి.జ్వరం తగ్గుతుంది.

గచ్చకాయ గింజలు అన్న చోట గింజలోపలి పప్పును తీసుకోవాలి.





27, ఫిబ్రవరి 2014, గురువారం

ఎసిడిటీ కి.. ఆయుర్వేద పరిష్కారాలు

కలబంద జ్యూసు తోఎసిడిటీకి చికిత్స..

కలబంద ముదురు ఆకును తుంపిఅడ్డంగా కోసి, ఒక గిన్నెలో నిలువుగాఆనించండి. గిన్నె అడుగుకు పసుపు
పచ్చని స్రావం కారుతుంది. దీనినిపారేయండి. ఇప్పుడు ఆకును పైనా, కిందాతోలును ఒక చాకుతో వీల్ చేసి
గుజ్జును గ్రైండలో వేసి జ్యూస్ తీయండి . తాజాగా తీసిన కలబందజ్యూస్ ని ప్రతిరోజూ ఉదయం ఖాళీకడుపుతో సేవించండి.

ఈ ఔషధం మోతాదు 20 నుంచి30 మి.లీ. (ఒకటి నుంచి రెండుటేబుల్ స్పూన్లు) ఇవి ఎసిడిటీరాకుండా అమోఘంగా నివారిస్తుంది.అంతే కాకుండా చికిత్సగా కూడాపనిచేస్తుంది.

ఉసిరికాయల రసంతో ఎసిడిటీకి చికిత్స..
 

త్రాజా ఉసిరి పండ్లను చాకుతో ముక్కలుగా కోసీ గింజలు తొలగించి, కండభాగాన్ని (గ్రైండర్‌లో వేసి జ్యూస్‌ తీయండి. (అవసరం అయితే నీళ్లు కలపవచ్చు) ఇలా తాజాగా తీసిన ఉసిరి రసాన్ని రెండు నుంచి నాలుగు టీ స్పూన్ల మోతాదుగా ఖాళీ కడుపుతో తీసుకోండి. 

 ఇలా రోజుకు రెండు సార్లు చొప్పున కనీసం 40 రోజులు తీసుకుంటే ఎసిడిటీ వ్యాధిని నిరోధిన్తుంది. అలానే ఎసిడిటీని పూర్తిగా తగ్గిస్తుంది. 

చందన కషాయంతో ఎసిడిటికి చికిత్స ..

ఒక పాత్రలో నాలుగు కప్పుల నీళ్లు. మరగటం మొదలెట్టిన తరువాత రెండు టీస్పూన్ల చందనం పేళ్లను వేసి ఒక కప్పు కషాయం మిగిలేంత వరకూ మరిగించండి. దీనిని వడపోసుకొని ఉదయం అర కప్పు కషాయాన్ని సాయంత్రం కొద్దిగా వేడి చేసి అరకప్పు కషాయాన్ని తాగండి. ఇలా పది, పదిహేను రోజులు క్రమం తప్పకుండా వాడితే ఎసిడిటీ రాకుండా నిరోధించుకోవచ్చు. అలాగే ఉన్న ఎసిడిటీని 
సమస్యను పూర్తిగా తగ్గించుకోవచ్చు. 

లేత కొబ్బరి నీళ్లతో  ఎసిడిటీకి చికిత్స ..

లేత కొబ్బరి బొండాంని కొట్టించుకుని కొబ్బరి నీళ్లను ఒంపుకొని వెంటనే తాగి, లోపల మిగిలి ఉన్న లేత కొబ్బరి గుజ్జును కూడా తినేయండి. 

. 

ఇలా క్రమం తప్పకుండా కొంత కాలం పాటు చేస్తే ఎసిడిటీని సమస్త ఇబ్బంది పెట్టదు .ఇది ఎసిడిటీ ని అమోఘంగా తగ్గించే నివారణ ఔషధం. 

పాలతో ఎసిడిటీకి చికిత్స ..

అప్పుడే పితికిన పాలను వేడి చేయకుండా ప్రతి 6 గంటలకూ ఒక కప్పు చొప్పున నిద్రకు ముందు కూడా చల్లని పాలను తాగాలి. దీంతో ఎసిడిటి సమస్యమిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. 

నివారణ ..అహారాన్ని తక్కువ మొత్తాల్లో తినాలి ; 

జీర్షకియకు సంబంధించి సమస్యలు చోటుచేనుకున్నవ్వుడు ఆహారాన్నితక్కువ మొత్తాల్లో, ఎక్కువసార్లు తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. అలాగే మసాలా, పులుపు, కొవ్వు ఇతర తీక్షణ పదార్థాలను మానేయాలి. 

ఆల్కహాల్‌ తీసుకునే అలవాటుంటే మానేయాలి : 

మద్యం వల్ల ఆమాశయం గోడలు కల్లోలమవటమే కాకుండా అంతర్గత రక్తస్రావం అయ్యే (ప్రమాదం కూడా ఉంటుంది. కనుక మద్యపానం నుంచి దూరంగా ఉండాలి. 

ఆరోగ్యానికి.. సూపర్ ఫుడ్స్

తిండి కలిగితే కండ కలదోయ్ కండ గలవాడేను  మనిషోయ్' అన్నాడో మహాకవి. మరి అలాంటి తిండి బలవర్ధకం కాకుండావుంటేమనిషిఅనారోగ్యంపాలవుతాడు. నిత్యం మనదేశంలో పోషకాహారలేమితో అనేకమంది
ఉల్లాసంగా లేకపోవటం మనం చూస్తూనే వున్నాం. ఐతే ఉన్న వాటిల్లోనే మన ఆదాయ పరిమితికిలోబడే మనకు అందుబాటులో ఎన్నో సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. మన కళ్ళముందే,వాటి సంగతులు తెలుసుకుంటేనే ఆశ్చర్యపోతాము. అలాంటి ఆహారపదార్థాలలో కేటగిరీలు
బోల్డన్ని వుంటాయి. వాటిలో కొన్ని సూపర్ఫుడ్స్జాబితాలోకి వస్తాయి. అవి యాంటీ ఆక్సిడెంట్స్ కు ఈఅత్యవసర పోషకాలకు అద్భుతమైన ఆధారం. అటువంటి కొన్ని ఆహారపదార్థాలు.


నిమ్మ :

 చాలామంది అనుకున్నట్లు నిమ్మ, నిమ్మజాతిపండ్లుఎసిడిక్ కాదు. నిజానికిఇవి శరీరంలో ఎసిడిటీని,బ్లోటింగ్ ను తగ్గిస్తాయి. తాజానిమ్మపండు రసంతోప్రతిరోజూఉదయాన్నే ఆహారాన్ని ప్రారంభిస్తే చాలా ప్రయోజనాలు దక్కుతాయి. శరీరంలోని విషతుల్యాలనుతొలగించి, అంతర్గత ఎసిడిటీని తగ్గిస్తాయి.విటమిన్ సి కి నిమ్మ అద్భుత ఆధారం.
ఆరోగ్యవంతమైన చర్మం, జుట్టు శిరోజాలు, ఎము
కలు,జాయింట్స్, పళ్ళకు అవసరం.నిమ్మరసానికి ఆస్టియో ఆర్థరైటిస్, డయాబెటిస్ లు రాకుండా అడ్డుకోవడమే కాకుండా లివర్ ఫంక్షన్ సక్రమంగా సాగేందుకు సహకరిస్తుంది.

అరటిపండ్లు : 

సగటుమానవుడి ఆహారంగా పేరొందింది. ఆరోగ్యానికి అవసరంమయిన ప్రతిపోషకంఇంచుమించుఅరటిపండులో లభిస్తుంది. పొటాషియంకు మంచిఆధారం. రక్తపోటును తగ్గించడంలో ఇది సహకరిస్తుంది. స్టోక్స్ అవకాశాలను తగ్గిస్తుంది.కండరాల కాంట్రాక్షన్ సామర్థ్యాన్ని, రిలాక్సేషన్ను
మెరుగుపరుస్తుంది. పొటాషియం ఎముకపుష్టిని కూడా
మెరుగుపరుస్తుంది. అరటి పండ్లు ఏకాగ్రతను మెరుగు
పరుస్తాయి. తక్షణ శక్తిని ఇవ్వడంలో వాటికవే సాటి.
విటమిన్ 'బి' ఎక్కువగా వుండి ఎనర్జీ మెటాబాలిజమ్,
ప్రోటీన్ ఉపయోగం, జీర్ణక్రియకు సహకరిస్తుంది.
బ్లోటింగ్, నీరుపట్టడంలాంటి ఋతుసంబంధిత
సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మలబద్దకం
చికిత్సకు బాగా ఉపయోగపడుతుంది..

పిస్తాపప్పులు..

నట్స్ గా పేరొందిన పిస్తాపప్పులు మిగతా నట్స్ తో పోల్చితే అత్యంత తక్కువక్యాలరీలు కలిగివుంటాయి.ఒక్క పిస్తాపప్పులో కేవలంమూడు క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి,బరువు, క్యాలరీల భయం ఏమాత్రం లేకుండా నిరఅభ్యంతరంగా 30 పప్పులు ఒకేసారి తినేయవచ్చు.కాపర్, ఫాస్పరస్, ప్రోటీన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి6 వంటి పోషకాలు కూడా అధికంగాలభిస్తాయి. మెదడు పనితీరుకు అవసరమయ్యే ఆరోగ్యవంతమైన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఆరోగ్యవంతమైన దోన్లో లభిస్తాయి.
పిస్తాపప్పుల్లో పీచు బాగా వుంటుంది. భోజనం
నడుమ వీటినితింటే బరువు తగ్గాలనుకునే వారికి ఫలి
తం ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా వుం
టాయి. క్యాన్సర్, గుండె జబ్బులకి దారితీసే ప్రీ-ర్యాడి
కల్ హానినుంచి కాపాడడంలో సహకరిస్తాయి.

అల్లం: 

ఏరకమైన గొంతునొప్పికయినా ఉత్తమ చికిత్సకొద్దిగా అల్లం చప్పరించడం.ఇలా చేయడంవలన తలనొప్పులు లేదా వికారం కూడాతగ్గుతాయి. శ్వాసవ్యవస్థలోఆ పేరుకున్న కఫాన్ని అల్లం తొలగించడంవల్లే ఇటువంటిది కలుగుతుంది. అల్లం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఇన్ ఫ్లమేషన్లను కూడా తగ్గిస్తుంది.

వెల్లుల్లి..

 వెల్లుల్లిలో సల్ఫర్ఉంటుంది. చల్లని వాతావరణంలో ఇది శరీరానికి చాలాఅవసరం. వెల్లుల్లిలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు వుంటాయి. యాంటీ బ్యాక్టీరియల్,
యాంటీ వైరల్ లక్షణాలు కూడా వుంటాయి. శీతాకాలా
నికి వెల్లుల్లి వాడకం చాలా నుంచిది.

ప్రూన్స్: 

మలబద్దకం నివారించడంలో ప్రూన్స్ బాగా పనిచేస్తాయి. దీన్లో పీచుపదార్థంఎక్కువగా ఉండడమేఇందుకు కారణం. సహజ స్టూల్సాప్టైనర్ గా వుండేసార్బిటాల్అనేపీచుపదార్థం వీటిలో ఉంటుంది.
రోజుకు కొద్దిగా ప్రూన్స్ తినడం వల్ల జీర్ణవ్యవస్థ పరి
శుభ్రంగా వుంటుంది. రక్తపోటు, రక్తహీనతల్ని అరికట్ట
కడంలో సహకరించే పొటాషియం, ఐరన్ కూడా వీటిలో
- ఎక్కువగా ఉంటాయి. ప్రూన్స్ వార్ధక్య ప్రక్రియను
నెమ్మదింపజేయడంలోనూ సహకరిస్తాయి. రక్తసర
ఫరాను మెరుగుపరుస్తాయి.
సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టిశక్తిని ఇనుమడింపజేయగలవు. గొంతులో మంటనుతగ్గిస్తాయి. క్యాన్సర్ నివారిణిగా పేర్కొనవచ్చు.రక్తంలో కొలెస్ట్రాల్ ఆక్సిడేషనన్ను అరికట్టడంలోసాయపడతాయి. దీనివల్ల ఆర్టరీల్లో పాచి పేరుకోకుండారక్షించుకోవచ్చు. వీటిలో క్యాలరీలు బాగా తక్కువగాఉంటాయి. ఒక్కో ప్రూన్ లో 20 క్యాలరీలు లభిస్తాయి.కాబట్టి ఎక్కడైనా, ఎప్పుడైనా తింటూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు లేదా స్వీట్ ట్రీట్ ఇచ్చుకోవచ్చు.

నెయ్యి:

 శతాబ్దాలుగాభారతీయవంటకాల్లోవాడేనెయ్యినిసంప్రదాయమైన భారతీయమందుగా పేర్కొంటారు.నెయ్యిలో నయంచేయగలబహుళ గుణాలున్నాయి. కొద్ది
మోతాదులో తీసుకున్నా శరీరానికి, మనస్సుకు అత్య
ధిక ప్రయోజనాలనిస్తుంది. ఇది శాచ్యురేటెడ్ ఫ్యాట్
అయినప్పటికీ సులువుగా జీర్ణం అవుతుంది.

మనం తిన్న ఆహారం సులువుగా జీర్ణం కావడానికి
అవసరమైన ఆమ్లాల విడుదల కోసం ఉదరాన్ని ఉద్దీపం
చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా వుంటాయి.

కాబట్టి ఆహారం నుంచి వివిధ పోషకాల్ని గ్రహించడానికి
నెయ్యిసాయపడుతుంది.ముఖ్యంగా ఎ, డి, ఇ, కె విటమిన్లు గ్రహించడానికిఉపకరిస్తుంది. అల్సర్లు, మలబద్దకం, కంటి సంబంధితసమస్యల పరిష్కారం కోసం వాడుతున్నారు.
చర్మాన్నిమృదువుగా,కోమలంగావుంచడంలోసహకరిస్తుంది. బ్లిస్టర్లు, కాలినగాయాలపై రాస్తే ఉపశమనం ఉంటుంది. క్యాలరీలు ఎక్కువ కాబట్టి క్యాన్సర్లను అరికట్టడంలో, రోగనిరోధకవ్యవస్థనుబలోపేతంచేయడంలోఉపయోగపడుతుందని గుర్తించారు.

పూర్తిస్థాయి ధాన్యాలు:

పూర్తిస్థాయి ధాన్యాలతోతయారయ్యే పదార్థాలు శక్తికి,
పీచుకు మంచి ఆధారం.తెల్లని మైదా, తెల్లని బియ్యం
వంటి రిఫైన్డ్ ధాన్యాలకంటేపూర్తిస్థాయి ధాన్యాల్లో పీచుపదార్థం, పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. రిఫైన్డ్ గ్రెన్స్ పొట్టు, జెర్మ్పూర్తిగా తొలగిస్తారు. కాబట్టి వీటిలో పీచు, హోల్ గ్రెయిన్ మాదిరి పోషకాలు ఉండవు.కొన్నిసార్లు రిఫైన్డ్ ధాన్యాల్లో 'బి' విటమిన్లు, ఐరన్ వంటివి ప్రాసెసింగ్ తర్వాత తిరిగి కలుపుతుంటారు.
 
లో హోల్వేట్ బ్రెడ్ వంటి హోల్ గ్రెయిన్ ఆహారపదారాలను మొక్కల నుంచి పూర్తిగింజలతో పొట్టు, జెర్మ్ఎండో స్పెర్మతో సహా వాడి తయారుచేస్తారు.దీనివల్ల అనేక విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్,ఆరోగ్యవంతమయిన ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి.

సూప్/రసం/చారు.. ఆరోగ్య ప్రయోజనాలు

'సూప్ ప్లీజ్...' అని అడగగానే ఇప్పటికీ చాలామంది అయిష్టంగానే మొహం పెడుతుంటారు.గంజిలా ఉంటుందనీ రుచిగా ఉండదనీ రకరకాలకారణాలు చెబుతుంటారు.కానీ ఆరోగ్య స్పృహఉన్నవాళ్లూ బరువు తగ్గాలనుకునేవాళ్లూ మాత్రం రోజూదీన్ని తాగుతున్నారు. 'సూప్ కి చాలా సీనుంది....' అన్నపోషకాహార నిపుణుల సలహానే ఇందుకు కారణం.

ఆధునిక జీవనశైలి పుణ్యమాఅని... పిల్లల నుంచి పెద్దల
వరకూ ఆహారాన్ని కొలుచుకునితినాల్సిన పరిస్థితి. ఇష్టమైనవన్నీతినేస్తేఅంతేవేగంగాభారీకాయాన్నిఅనారోగ్యాన్నివెనకేసుకోవాలి.అందుకేసలాడ్లరూపంలోపచ్చికూరగాయల్నితీసుకోవడంఅయిష్టంగానైనాఅలవాటుచేసుకుంటున్నాం.ఎంత ఆరోగ్యం కోసమైనాఎప్పుడూ వాటినే తినలేం కదా.
అది చలికాలం... సలాడుబదులు సూప్ బౌల్ను ఆశ్రయి
స్తున్నాం. చల్లని వాతావరణంలోవేడి సూప్ మెల్లగా గొంతు దిగుతుంటే వెచ్చగానూ ఉంటుంది,సలాడ కన్నా రుచిగానూ
ఉంటుంది. పోషకాలు ఎక్కువ,క్యాలరీలు తక్కువ ఉండే ఆరోగ్యకరమైన ఆహారమే సూప్.రకరకాలుసూప్ అనగానే టొమాటో,కార్న్, మిక్స్డ్ వెజిటబుల్, చికెన్,మటన్ సూప్లు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ ఏ ఆహారాన్నయినా సూప్ రూపంలో తీసుకోవచ్చు. నిజానికి బియ్యం లేదానూకల్ని జావలా కాచినది లేదాఅన్నం వార్చినదీ మన దగ్గరా
ఒకప్పుడు బాగానే తాగేవారు.దీన్నే మనం గంజి అంటే, పశ్చిమదేశాల్లో సూప్అనిపిలుస్తున్నారు.ఏపదార్థాన్నయినా అందులోఉండే పోషకాలన్నీ ఆ నీళ్లలోకివచ్చేలా మరిగించి లేదాఉడికించి ద్రవరూపంలో తీసుకుంటే అదే సూప్. కాబట్టి మనగంజి కూడా ఒక రకం సూపేక్రీ.పూ. 20 వేల సంవత్సరాలనుంచీ సూప్ తాగడం వాడుకలో
ఉంది. అప్పట్లో దీన్ని కుండల్లోనేకాచేవారు. సంప్రదాయ పద్ధతిలోచేసే కూరగాయల సూప్లోచిక్కదనం కోసం కొద్దిపాళ్లలోపిండిపదార్థాలనూ కలుపుతుంటారు.
మరింత చిక్కదనం కోసం వెన్న,మీగడ, ఉడికించిన బీన్స్న కూడాకలుపుతున్నారిప్పుడు. కేనింగ్ ప్రక్రియ కనుగొన్న తరవాత  కండెన్స్డ్ సూప్స్ తయారీమొదలైంది. వీటిని నేరుగా వేడిచేసుకుని తాగేయవచ్చు. ఎండబెట్టి
పొడిచేసిన ఇన్స్టెంట్ సూప్స్ కూడా వచ్చాయి. వీటికయితే
నీళ్లు జోడించి మరిగించాలి.ఈ రెండు రకాల్లో కూడా కూర
గాయల ముక్కల్లాంటివి జోడించికావలసిన రుచుల్లో తాగొచ్చు.

ఎందుకు తాగాలి?

భోజనానికి ముందు తక్కువక్యాలరీలు ఉండే సూప్ తీసుకో
వడంవల్ల కనీసం 20 శాతంతక్కువ తింటాం. అదేసమ
యంలో కూరగాయలన్నీ కలిపినసూప్ ని తీసుకోవడంవల్ల
నీళ్లలోనే కరిగే బి, సి, కె...వంటి విటమిన్లు, ఖనిజాలు
శరీరానికి నేరుగా అందుతాయి.ముఖ్యంగా ఉల్లి, సెలెరీ, లీక్...వంటి సూప్ లలో పొటాషియంఎక్కువగా ఉంటుంది. ఇదిశరీరంలోని అధిక సోడియంనితొలగించేందుకు సాయపడుతుంది. కాబట్టి రోజూ రాత్రిభోజనాన్ని తగ్గించి బదులుగాకూరగాయల సూప్ తీసుకోవడంవల్ల క్రమపద్ధతిలో బరువుతగ్గుతారు. ఇంకా వెంటనే
బరువు తగ్గాలనుకునేవాళ్లురెండుపూటలా భోజనం మానేసివారం రోజులపాటు సూప్ తాగడంవల్ల ఆరోగ్యంమీదఎలాంటి దుష్పరిణామాలుఉండవన్నది నిపుణుల సలహా.
అయితే ఇన్ స్టెంట్ సూప్ వల్లపెద్దగా ఫలితం ఉండదు.
వీటిల్లో ప్రొటీన్లు తక్కువ, పిండిపదార్థాలు ఎక్కువ. సోడియంశాతమూ ఎక్కువే. తాజాగాచేసుకున్నదే మంచిదన్నది పోషకనిపుణుల ఉవాచ.మరో విషయాన్ని దృష్టిలోపెట్టుకోవాలి. రైస్, నూడుల్స్,బీన్స్, పాస్టా లాంటి ఆహారాన్నిసూప్ రూపంలో ఆగ్నేయాసియాదేశాల్లో ఎక్కువగా తీసుకుంటుంటారు. బరువు తగ్గేందుకు వీటిని
ఆశ్రయిస్తే పెద్దగా ఫలితంఉండదు. అక్కడ వీటిని వాళ్లు
భోజనానికి బదులుగా తాగుతూతింటుంటారు. పండ్లని కూడాగోరువెచ్చని సూప్ రూపంలోతీసుకుంటుంటారు. సో....ఏ సూప్ తాగాలన్నది మీబరువును బట్టి మీరే నిర్ణయించుకోండి. అలాగని సూప్ ఏదోఊబకాయులకి మాత్రమే అనుకునేరు... ఆరోగ్యంగా సన్నగాఉన్నవాళ్లు కూడా నిస్సందేహంగాఅన్నిరకాల సూప్ లు తీసుకోవచ్చు..
జీర్ణశక్తిని పెంచే వేడి వేడి సూప్అందరికీ ఆరోగ్యకరమే.

మిసా సూపర్! సూప్ లోకెల్లా గొప్పది ఏది? అనగానే అంతా చెప్పే పేరు ఒక్కటే... అదే
'మిసా సూప్", అటు ఆరోగ్యాన్ని కాపాడుతూ ఇటు వృద్ధాప్యాన్ని హరించేఈ సూపు చైనా, జపాన్లలో శతాబ్దాల ముందునుంచీ తాగుతున్నారు.ఇందులో ఉన్న పోషకాలనూ వయసు మీద పడనీయని లక్షణాలనూ
గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దీన్ని చప్పరిస్తున్నారు. కొజి అనే ఈస్ట్ సాయంతో ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల పాటు పులియబెట్టినసోయాబీన్ల ముద్దతో మిసా సూప్ ను తయారు చేస్తారు. ఇందులో బియ్యం, ముడిబియ్యం, బార్లీ లేదా గోధుములు కలుపుతుంటారు. దీన్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువే. దాంతో రోగనిరో
ధక శక్తి పెరిగి రొమ్ము, ప్రొస్టేట్, పేగు క్యాన్సర్లను నివారిస్తుందనీ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుందనీ పరిశోధనలు
చెబుతున్నాయి. ఇందులో , బి2,  కె విటమిన్, కోలిన్, లినోలిక్ ఆమ్లాలూ: పీచూ, ప్రొటీన్లూపుష్కలంగా ఉంటాయి. లినోలిక్ ఆమ్లం చర్మ సౌందర్యాన్ని రక్షిస్తుంది. మెనోపాజ్ సమయంలో మహిళలు
ఈ సూప్ ను రోజూ ఓ కప్పు తీసుకోవడంవల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ శాతం తగ్గదు. జపనీయుల దీర్ఘ ఆయుష్షు కు,
 వాళ్లకి క్యాన్సర్లు రాకపోవడానికి ఒక కారణం దీన్ని ఆహారంలో భాగంగా చేసుకోవడమే.

టొమేటో, కీరా సూప్..

కావాల్సిన పదార్థాలు : ఒక పెద్ద టొమేటో, ఒక క్యారెట్, 300 గ్రాములు కీరా,ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టీ స్పూన్ వెన్న, అరలీటరు నీరు, తులసి ఆకులు,తగినంత ఉప్పు, మిరియాలపొడి.తయారుచేసే పద్ధతి : ఉల్లిపాయలు తరిగి, ప్యాన్ లో  వెన్న వేసి వేయించాలి.క్యారెట్, కీరా, టమాటా ముక్కలు వేయాలి.అరలీటరు నీరు పోసి ఐదు నిమిషాలు మరిగించాలి. చల్లారిన తర్వాతమిక్సర్ లో వేసి బ్లెండ్ చేయాలి. వడకట్టాలి. చిటికెడు ఉప్పు, మిరియాలపొడి,
అర టీస్పూన్ వెన్నకలిపి తిరిగి మరిగించి కొద్దిగా తులసి ఆకులు కలపాలి.
(సర్వ్ చేసేముందు కొన్ని కీరాముక్కలు తరిగి కలుపుకోవచ్చు.

కార్న్ సూప్..

కావాల్సిన పదార్థాలు: ఒక స్వీట్‌కార్న్, ఒక బంగాళా దుంప, ఒక టీస్పూన్ వెన్న, 50 ఎమ్.ఎల్.పాలు, మిరియాలపొడి, తగినంత ఉప్పు,
తయారు చేసే పద్ధతి: మొక్కజొన్న గింజలుఒలుచుకోవాలి. బంగాళాదుంపలుచెక్కు తీసి కట్ చేయాలి. అరలీటరు నీరు పోసి ఐదు లేదా ఏడు నిమిషాలుమరగనివ్వాలి. చల్లారిన తర్వాత బ్లెండ్ చేయాలి.వడకట్టి ఉప్పు, మిరియాల పొడి, వెన్నకలిపి మరిగించాలి. పాలుపోసి నిరంతరంకలుపుతూ కొద్ది సేపుంచాలి. కొన్ని గింజలు వెన్నలో వేయించి కలపాలి.

వెజిటబుల్ సూప్..

కావాల్సిన పదార్థాలు : రెండు టేబుల్‌స్పూన్లు పెసరపప్పు, ఒక క్యారెట్, ఒకకట్ట పాలకూర, ఒక కప్పు క్యాబేజీ ముక్కలు.మూడు టొమేటోలు, అరగ్లాసు పాలు, రెండు టేబుల్‌ స్పూన్లు నెయ్యి,రెండు టేబుల్‌స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు,
తయారుచేసే పద్ధతి : కూరగాయ ముక్కలన్నింటినీ రెండు విజిల్స్ వచ్చేదాకాకుక్కర్ లో ఉడికించాలి. చల్లారాక మెత్తగా బ్లెండ్ చేయాలి.అందులోఅరగ్లాసు పాలు కలపాలి (దీనికి ప్రత్యామ్నాయంగా నీరుకూడా
వాడుకోవచ్చు). రెండు టేబుల్‌స్పూన్ల నెయ్యిలో ఉల్లిపాయ ముక్కలు వేసివేయించి సూప్లోకలిపిఉప్పువేసిమరిగించాలి.

క్యాలీఫ్లవర్, పొటాటో సూప్..

కావాల్సిన పదార్థాలు : మూడు కప్పులు క్యాలీఫ్లవర్ ముక్కలు, ఒక కప్పుబంగాళాదుంప ముక్కలు, అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, రెండు టేబుల్‌స్పూన్లు
నెయ్యి, ఒక గ్లాసు పాలు, మిరియాల పొడి, తగినంత ఉప్పు,
తయారుచేసే పద్ధతి : బంగాళాదుంపలు, ఉల్లిపాయలు కట్‌చేసి నేతిలో వేయించాలి. సన్నని సెగపై ఉంచి, అడుగు అంటుకునేంతవరకు వేయించాలి. క్యాలిఫ్లవర్ ముక్కలు కలపాలి. మరో ఐదారు నిమిషాలు వేయించాలి. పచ్చివాసనపోవాలి. కుక్కర్ లో రెండు విజిల్స్ వచ్చేదాకా కాని, లేదా నీరుపోసి మూత పెట్టికాని ఉడికించాలి. చల్లారాక అరగ్లాసుపాలు పోయాలి. ఉప్పు, మిరియాలపొడి
కలపాలి. ఇష్టపడేవారు పాలకూర ఆకులు కూడా వేసుకోవచ్చు.

డా ఆనియన్.. ఆయుర్వేదం

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఆ సంగతెలా ఉన్నా ఉల్లిపాయ లేకుండా వంటచేయనివాళ్లు కొందరయితే, ఉల్లిపాయ కొరకందే ముద్ద దిగనివాళ్లు మరికొందరు. రుచికోసం అయితేనెం,ఆరోగ్యం కోసం అయితేనేం... ఉల్లిపాయ మోస్ట్ పవర్ ఫుల్.
కోసేవాళ్లనే కాదు, ప్రభుత్వాలని,నేతలనూ కన్నీళ్లు పెట్టించగల శక్తిమంతమైన కూరగాయ... ఉల్లిపాయ!

ఉలిఘాటు తగలని కూర కూరే కాదంటారుభారతీయులు. ఎందుకంటే మసాలా పెట్టిచేసే ఏ కూరకయినాఉల్లిపాయలు తరగాల్సిందే.దమ్ బిర్యానీ, ఆలూ సఖీ, గుత్తి వంకాయ, కోడిగుడ్లుపులుసు... ఏదయినా సరే ఉల్లి ఉంటేనే అదుర్స్
పకోడీలూ చాట్లకయితే సరేసరి. ఉల్లిపాయలేని బేలూరీని చోట తూరానీ ఊహించగలమా.చాలా రకాల వంటకాల్లో ఉల్లిపాయలు నేరుగాకనిపించవు. తెరవెనక పాత్రధారుల్లా రుచి ద్వారాతమ ఉనికిని చాటుతుంటాయి. అందుకే దాని
ధరల ఘాటు కళ్ల వెంట నీళ్లు పెట్టిస్తున్నా ఒక్కఉల్లిపాయ అయినా కూరలో వేయందే రుచించదు.మనవాళ్లకి ఏటా సుమారు 40 లక్షల టన్నులఉల్లిపాయల్ని తినేస్తున్నాం. వీటిలో మూడువేలటన్నుల్ని ఢిల్లీవాసులు ఒక్క రోజులోనే వాడేస్తున్నారట. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్,
బీహార్‌లోఉల్లిఎక్కువగాపండిస్తున్నప్పటికీఉల్లిమార్కెట్లన్నింటినీ శాసించేది నాసిక్. దేశంలోకెల్లా అతి పెద్ద ఉల్లిమార్కెట్ అదే.

రంగురంగులు..

ఉల్లిపాయరంగుఅంటూమనంవంకాయరంగుతోకలిసినట్లున్న గులాబీరంగుని చెబుతాము గానీ తెలుపు, పసుపు, ఎరుపు, పాట్నా రెడ్,నాసిక్ రెడ్, బళ్లారి రెడ్, అంటూ మనదేశంలోనేభిన్నరంగుల్లో వీటిని పండిస్తున్నారు. వైట్
పోర్చుగల్, సిల్వర్ స్కిన్, ఆస్ట్రేలియన్ బ్రౌన్, స్వీట్
స్పానిష్, రెడ్ ఇటాలియన్, కాలిఫోర్నియా రెడ్,ఎల్లో బెర్ముడా... ఇలా విదేశీ రకాలూ మనమార్కెట్ కి తరలి వస్తున్నాయి. ఎరుపు ఉల్లిపాయకన్నా తెలుపురంగులో ఉండేవి కాస్త ఘాటుతక్కువగా మంచి వాసనతో ఉంటాయి. ఎర్రఉల్లిపాయల తొక్కలో కెటెచోల్, ప్రొటోకెటెచిక్తు
ఆమాలు ఉండటంతో అవి మరింత ఘాటుగాఉంటాయి. అలాగే తీపి ఉల్లిపాయలూ ఉన్నాయి.వీటిలో నీరూ కార్బొహైడ్రేట్లు ఎక్కువఉంటాయి. ఇవి ఎక్కువకాలం నిల్వ ఉండవు.

ఎవరెక్కువ?

ఉల్లిపాయ వాడకంలో రారాజులం మనమేఅనుకుంటాం. కానీ వీటిని ఎక్కువగా వాడేదిలిబియాలోనట. అక్కడ తలకి ఏటా సుమారు32 కిలోల ఉల్లిపాయలు తినేస్తున్నారట. తరవాతస్థానం మనదే. అయితే మనదేశంలో ఉల్లిపాయల్ని కొందరు దూరంగా పెట్టేస్తారు. ఉల్లిపాయలోతామస,రజోగుణాలనుపెంచేలక్షణాలున్నాయని ఆయుర్వేదం పేర్కొనడమేఇందుకు కారణం. వీటిలో శృంగార ప్రేరితగుణమూ ఎక్కువేనట. అందుకే సన్యసించిన
వారు ఉల్లివాసనని దరిదాపుల్లోకి కూడారానీయరు. ప్రస్తుతం ఉల్లిపాయలుతాజాగానే కాదు. ఎండబెట్టిన పొడి, పచ్చడి రూపంలోనూవీటి వాడకం ఎక్కువే. వాసనకోసం ఉల్లికాడల్నిసూపులు ,సలాడ్లో వాడటం తెలిసిందే. పొడిని
మసాలా మాదిరిగా అనేక వంటకాల్లో చల్లుతారు.

ఉల్లిపూజ..

ఉల్లిపాయల్ని ప్రాచీనకాలం నుంచీ వాడుతున్నారు. ఈజిప్షియన్లయితే ఉల్లిపాయల్ని పూజించేవారట. ఇది రక్తాన్ని పలుచబారేలా చేస్తుందన్నకారణంతో ఒకప్పుడు గ్రీకు అథ్లెట్లు వీటిని చాలాఎక్కువగా తినేవారు. అలాగే రోమన్లు వీటినికండరాలకు రుద్దుకునే వారట. మధ్యయుగంలోఉల్లిపాయల్నికానుకలుగాఇచ్చిపుచ్చుకునేవారు.తలనొప్పి, దగ్గు, పాముకాటు, జుట్టు ఊడి
పోవడం, సంతానలేమి... వంటి సమస్యలకువైద్యులు ప్రిస్క్రిప్షన్ లో ఉల్లిపాయను రాసేవారు.

ఉల్లి తోడుంటే..

జీర్ణక్రియకీ గుండెకీ కీళ్లకీ కళ్లకీ కూడాఉల్లిపాయలు ఎంతో మంచివి. వీటిల్లోని సల్ఫర్,క్రోమియం, విటమిన్-సిలు అనేక రోగాల్నితగ్గిస్తాయి. జలుబు, షుగర్, హృద్రోగాలు,
ఆస్టియోపొరోసిన్లు తగ్గుతాయి.ఉల్లిపాయల్లోని డై సలైట్లు, ట్రైసల్సైలు,సెపానె, వినైల్ డైథీన్లు యాంటీ కొలెస్ట్రాల్,
యాంటీ క్యాన్సర్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల్నికలిగి ఉంటాయి. హృద్రోగాల్ని తగ్గించడంలోఉల్లిదే పైచేయి. వీటిల్లో పుష్కలంగా ఉండేక్యుయర్ సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్కణజాలాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.
విటమిన్-ఇ పునరుత్పత్తికి తోడ్పడుతుంది. నేత్ర,హృదయ, రొమ్ము, ఊపిరితిత్తుల వ్యాధుల మీదపోరాడుతుంది.
 ఎండిన ఉల్లిపాయను రోజూ గ్రాముచొప్పున నాలుగు వారాలపాటు తీసుకోవడం వల్లఎముకల్లో ఖనిజాల సాంద్రత పెరుగుతుంది.ఉల్లిపాయలు జ్ఞాపకశక్తిని పెంచి జలుబునితగ్గిస్తాయనీ కఫాన్ని నివారిస్తాయనీ వీటిని
తిన్నా రసం తాగినా చివరకు మెడలోవేసుకున్నా కూడా పులిపిర్లూ, కండరాలనొప్పులు తగ్గుతాయని ఆయుర్వేదం
చెబుతోంది..

చిన్నపిల్లలకు బాగా జలుబుచేస్తే ఉల్లి ముక్కలను పలుచని ఉల్లిబట్టలో చుట్టిగానీ ప్లేటులో పెట్టిగానీ మధ్య-తలగడ పక్కనే రాత్రంతా ఉంచితేమంచి ఫలితం ఉంటుందట.

ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఉల్లిముద్దను ఉడికించి బట్టలో కట్టిగాయాలమీద పెడుతుంటారు. తేనెటీగలు కుట్టినచోట పచ్చి ఉల్లిపాయముక్కను పెడితే వాపు తగ్గుతుందట.
గొంతు మంటగా ఉన్నప్పుడుఉల్లిపాయలో బెల్లం కలిపి తింటేతగ్గుతుందట. చూశారుగా... వాసనఅని కొందరూ ఘాటు అనికొందరూఉల్లిపాయనుపక్కనపెట్టేస్తుంటారుగానీ
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనిఆందుకే అంటారు. సో.. ఉల్లి తోడుంటేఅనారోగ్యం దూరమన్నట్లేగా!


ఉల్లికన్నీళ్లు..

ఉల్లిపాయల్ని కోసినాకొరికినా కన్నీరుమున్నీరవుతుంటారు. ఎందుకంటే ఉల్లిపాయల్నికోసినప్పుడు వాటి నుంచిఘాటైన ఒకవాయువు వెలువడుతుంది. దీన్నే లాక్రిమేటరీఫ్యాక్టర్ అంటారు.ఇదిగాల్లోకలిసిచాలాత్వరగాకళ్లకుచేరిసున్నితమైన మార్యాన్లనుప్రేరేపించి గుచ్చినట్లుగా చేస్తుంది. దాంతో కళ్లు ఒకలాంటి మంటకి గురవుతాయి.అందుకే ఆ మంటని నొప్పిని తగ్గించడంతోపాటు వాటిని కోస్తుంటే వెలువడే వాయువుకంటిని చేరకుండా ఉండేందుకే వెంటనే కన్నీటి గ్రంథులు స్పందించి నీటిని స్రవిస్తాయి. అయితేఈ బాధంతా లేకుండా ఉండాలంటే ముందుగా ఉల్లిపాయల్ని నీళ్లలో నానబెట్టడం,కోసేముందుకాసేపు ఫ్రిజ్ లో పెట్టడం, వేరుదగ్గర ముందే కోయకుండా ఉండటం చేయాలి. ఎందుకంటేవేరుదగ్గరే ఘాటైన ఎంజైములు ఎక్కువగా ఉంటాయి. లేదంటే గాగుల్స్ ధరించినా మంచిదే.
ఇటీవల వీటికోసం ప్రత్యేక గాగుల్స్ కూడా రూపొందించారు మరి,

ఉల్లి రింగులు..

ఆలూ చిప్స్ లాగానే ఆనియన్ రింగ్ కూడా విదేశీ మార్కెట్లో బాగా పాపులర్. వీటిని ఎలా చేస్తారంటే... నాలుగు ఉల్లిపాయలు, 2 కప్పులు మైదా, ఆరు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, అరటీస్పూను మిరియాల పొడి, అరటీస్పూను బేకింగ్ పౌడర్.వేయించడానికి కలపడానికి సరిపడా నూనె, తగినంత ఉప్పు తీసుకోవాలి.ఉల్లిపాయల్ని కాస్త మందపాటి చక్రాల్లా తరగాలి. పై చక్రాన్ని మాత్రం ఉంచి
మధ్యలో ఉండేవాటిని తీసేయాలి. మైదాపిండిలో బేకింగ్ పౌడర్, ఉప్పు, కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి వేసి కలపాలి.
తరవాత అరకప్పు నూనె, తగినన్ని నీరు పోసి బజ్జీలపిండిలా కలుపుకోవాలి. పిండిని చేత్తోనే బాగా గిలకొట్టాలి.
ఇప్పుడు రంగులను పిండిలో ముంచి కాగిన నూనెలో వేయించి తీసి, టిష్యూ పేపర్ తో అదేస్తే సరి. కావాలంటే
పిండిలో ముంచాక ఒడిపొడిలో కూడా దొర్లించి వేయిస్తే కరకరలాడుతూ బాగుంటాయి.

నడిచే ఉల్లిపాయలు..

సాధారణంగా ఉల్లిపాయలన్నీ వేరుభాగాలేనని తెలిసిందే. అయితే మొక్కలకాండాల చివర బల్బుల్లా వచ్చేవి ఉన్నాయి. వీటినే ఈజిప్షియన్ వాకింగ్ ఆనియన్స్
అనీ ట్రీ ఆనియన్స్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ చెట్లు బాగా పెరిగిన తరవాతకొమ్మలు ముందుకి వంగుతాయి... వాటి చివరనున్న పాయలు భూమిలోకిపాతుకుని అక్కడ మళ్లీ కొత్త మొక్కలు వస్తాయి. వీటిని వదిలేస్తే ఇలా తోట మొత్తంఅల్లుకుపోతాయి. అందుకే ఈ చెట్టుల్లిని వాకింగ్ ఆనియన్స్ అని పిలుస్తారు.

ఉల్లిముత్యాలు..

పెరల్ ఆనియన్ అంటూ మరో రకం ఉంది. దీన్నే కాక్
టెయిల్ ఉల్లి అని కూడా అంటారు. ఇవి కూడా మొక్కలకు
పైభాగంలోనే కాస్తాయి. ఘాటు తక్కువగా ఉండి
తియ్యగా ఉండే వీటిని నేరుగానే తినేయవచ్చు.

ఉల్లికాడలు..

...వీటినే స్ప్రింగ్, గ్రీన్, వెల్త్ ఆనియన్స్అంటారు. అయితే పాయలుగా మారనిదశలో లేతగా ఉన్నవన్నీ ఉల్లికాడలే
అనుకుంటారు. కానీ నిజానికి గ్రీన్ఆనియన్స్న మాత్రమే ఉల్లికాడలు అనాలి.ఎందుకంటే వీటికి పాయలు ఉండవు. పైగా ఆకులమధ్యలో ఖాళీ ఉంటుంది. వీటిని అలంకారం
కోసం కూడా పెంచుతుంటారు.

21, జనవరి 2014, మంగళవారం

బీర కాయ, కాకర కాయ.. ఆయుర్వేదం..

1. జ్వరంలో నీరసం తగ్గడానికి..

ఒక స్టీలు గిన్నెలో 100 గ్రాముల బీరకాయ ముక్కలను, 50 గ్రాముల పెసరపప్పు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించిన తరువాత నెయ్యి తాలింపు పెట్టి కూర తయారు చేయండి. దీనిని జ్వరం తర్వాత ఆహారంగా వాడితే జీర్ణశక్తి పెరుగుతుంది. ఆహారం తేలికగా జీర్ణమౌతుంది.

రుచి లేకపోవడం ..

ఒక బాణలిలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసి తాలింపు దినుసులు, 100 గ్రాముల బీరకాయ తొక్క ముద్దను వేసి వేడి చేయండి. దీనిని వేడి అన్నంతో కలిపి తింటే నోటికి రుచి తెలుస్తుంది. జీర్ణశక్తిని పెంచి మలబద్ధకం లేకుండా చేస్తుంది.

చర్మవ్యాధులు ,అవాంచిత రోమాల సమస్య
 తగ్గడానికి.. 

చేదు బీర గింజలను ముద్దగా నూరండి లేదా దీనిని పిండి తైలాన్ని తీయండి .దీనిని నేరుగా చర్మంమీదప్రయోగించండి .అవాంఛిత రోమాలు ఉంటే ఈ తైలాన్ని లేదా పేస్ట్ ను కేశాలను తొలగించిన తరువాత పూసుకుని రుద్దుకొండిఇలా కొంతకాలంపాటు చేస్తుంటె చక్కని ఫలితం కనిపిస్తుంది.
 దీంతో  మొండి  చర్మ వ్యాధులు తగ్గుతాయి.

పెద్ద బీరకాయ వృశ్యకరం, ఒళ్ళు పెరిగేలా చేస్తుందిి. పైత్యాన్ని తగ్గిస్తుంది .బాగా చలవ చేస్తుంది . బలాన్ని కలిగిస్తుంది.చిన్న బీరకాయ  కొవ్వు ను అంతగా పెంచదు. వాతాన్ని , నెమ్ముని కలిగి ఇస్తుంది .చలవ చేస్తూ ఆకలిని పెంచుతుంది.

కుష్టు, క్షయ, సుఖ వ్యాధులు మూత్ర వ్యాధులు అన్నింటికీ పథ్యము. పురుషులకి నరాలపటుత్వం కలిగిస్తుంది.
వాత తత్వం  ఉన్నవారికి అతిగా తింటే జలుబు చేస్తుంది..
ఉబ్బసం ఉన్న వాళ్లకు సహాయపడదు. కడుపులో మంట, పైత్యము, కాళ్లు చేతులు పీకడం వంటి లక్షణాలకు  ఇది మేలు చేస్తుంది. అన్ని వ్యాధులకు ఇది పథ్యం. బీరకాయలు పత్యం కూరని జబ్బు పడ్డ వారికి మాత్రమే ఇవ్వాలని జనంలో ఒక దురభిప్రాయం ఉంది. కానీ బీరకాయ తరచుగా ఏదో ఒక రూపంలో తీసుకుంటే దాంపత్య శక్తిని తృప్తిని పెంచుతాయని తెలుసుకోవాలి. మామూలు బీర కన్నా నేతిబీరలో సుగుణాలు ఎక్కువ రుచి కూడా ఎక్కువే పైత్యాన్ని తగ్గిస్తుంది .ఎక్కిళ్ళను తగ్గిస్తుంది .విషజ్వరాలు సుఖవ్యాధులను నివారించేందుకు సహాయపడుతుంది.
శరీర ధాతువులు అన్నింటినీ సమస్థితిలో ఉంచుతుంది .బాగా చలువ చేస్తుంది. కానీ ఎక్కువగా దొరకదు.

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...