27, ఫిబ్రవరి 2014, గురువారం

ఎసిడిటీ కి.. ఆయుర్వేద పరిష్కారాలు

కలబంద జ్యూసు తోఎసిడిటీకి చికిత్స..

కలబంద ముదురు ఆకును తుంపిఅడ్డంగా కోసి, ఒక గిన్నెలో నిలువుగాఆనించండి. గిన్నె అడుగుకు పసుపు
పచ్చని స్రావం కారుతుంది. దీనినిపారేయండి. ఇప్పుడు ఆకును పైనా, కిందాతోలును ఒక చాకుతో వీల్ చేసి
గుజ్జును గ్రైండలో వేసి జ్యూస్ తీయండి . తాజాగా తీసిన కలబందజ్యూస్ ని ప్రతిరోజూ ఉదయం ఖాళీకడుపుతో సేవించండి.

ఈ ఔషధం మోతాదు 20 నుంచి30 మి.లీ. (ఒకటి నుంచి రెండుటేబుల్ స్పూన్లు) ఇవి ఎసిడిటీరాకుండా అమోఘంగా నివారిస్తుంది.అంతే కాకుండా చికిత్సగా కూడాపనిచేస్తుంది.

ఉసిరికాయల రసంతో ఎసిడిటీకి చికిత్స..
 

త్రాజా ఉసిరి పండ్లను చాకుతో ముక్కలుగా కోసీ గింజలు తొలగించి, కండభాగాన్ని (గ్రైండర్‌లో వేసి జ్యూస్‌ తీయండి. (అవసరం అయితే నీళ్లు కలపవచ్చు) ఇలా తాజాగా తీసిన ఉసిరి రసాన్ని రెండు నుంచి నాలుగు టీ స్పూన్ల మోతాదుగా ఖాళీ కడుపుతో తీసుకోండి. 

 ఇలా రోజుకు రెండు సార్లు చొప్పున కనీసం 40 రోజులు తీసుకుంటే ఎసిడిటీ వ్యాధిని నిరోధిన్తుంది. అలానే ఎసిడిటీని పూర్తిగా తగ్గిస్తుంది. 

చందన కషాయంతో ఎసిడిటికి చికిత్స ..

ఒక పాత్రలో నాలుగు కప్పుల నీళ్లు. మరగటం మొదలెట్టిన తరువాత రెండు టీస్పూన్ల చందనం పేళ్లను వేసి ఒక కప్పు కషాయం మిగిలేంత వరకూ మరిగించండి. దీనిని వడపోసుకొని ఉదయం అర కప్పు కషాయాన్ని సాయంత్రం కొద్దిగా వేడి చేసి అరకప్పు కషాయాన్ని తాగండి. ఇలా పది, పదిహేను రోజులు క్రమం తప్పకుండా వాడితే ఎసిడిటీ రాకుండా నిరోధించుకోవచ్చు. అలాగే ఉన్న ఎసిడిటీని 
సమస్యను పూర్తిగా తగ్గించుకోవచ్చు. 

లేత కొబ్బరి నీళ్లతో  ఎసిడిటీకి చికిత్స ..

లేత కొబ్బరి బొండాంని కొట్టించుకుని కొబ్బరి నీళ్లను ఒంపుకొని వెంటనే తాగి, లోపల మిగిలి ఉన్న లేత కొబ్బరి గుజ్జును కూడా తినేయండి. 

. 

ఇలా క్రమం తప్పకుండా కొంత కాలం పాటు చేస్తే ఎసిడిటీని సమస్త ఇబ్బంది పెట్టదు .ఇది ఎసిడిటీ ని అమోఘంగా తగ్గించే నివారణ ఔషధం. 

పాలతో ఎసిడిటీకి చికిత్స ..

అప్పుడే పితికిన పాలను వేడి చేయకుండా ప్రతి 6 గంటలకూ ఒక కప్పు చొప్పున నిద్రకు ముందు కూడా చల్లని పాలను తాగాలి. దీంతో ఎసిడిటి సమస్యమిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. 

నివారణ ..అహారాన్ని తక్కువ మొత్తాల్లో తినాలి ; 

జీర్షకియకు సంబంధించి సమస్యలు చోటుచేనుకున్నవ్వుడు ఆహారాన్నితక్కువ మొత్తాల్లో, ఎక్కువసార్లు తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. అలాగే మసాలా, పులుపు, కొవ్వు ఇతర తీక్షణ పదార్థాలను మానేయాలి. 

ఆల్కహాల్‌ తీసుకునే అలవాటుంటే మానేయాలి : 

మద్యం వల్ల ఆమాశయం గోడలు కల్లోలమవటమే కాకుండా అంతర్గత రక్తస్రావం అయ్యే (ప్రమాదం కూడా ఉంటుంది. కనుక మద్యపానం నుంచి దూరంగా ఉండాలి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...