'సూప్ ప్లీజ్...' అని అడగగానే ఇప్పటికీ చాలామంది
అయిష్టంగానే మొహం పెడుతుంటారు.
గంజిలా ఉంటుందనీ రుచిగా ఉండదనీ రకరకాల
కారణాలు చెబుతుంటారు.
కానీ ఆరోగ్య స్పృహ
ఉన్నవాళ్లూ బరువు తగ్గాలనుకునేవాళ్లూ మాత్రం రోజూ
దీన్ని తాగుతున్నారు. 'సూప్ కి చాలా సీనుంది....
' అన్న
పోషకాహార నిపుణుల సలహానే ఇందుకు కారణం.
ఆధునిక జీవనశైలి పుణ్యమా
అని... పిల్లల నుంచి పెద్దల
వరకూ ఆహారాన్ని కొలుచుకుని
తినాల్సిన పరిస్థితి. ఇష్టమైనవన్నీ
తినేస్తే అంతే వేగంగా భారీ
కాయాన్ని అనారోగ్యాన్ని వెనకేసు
కోవాలి. అందుకే సలాడ్ల
రూపంలో పచ్చికూరగాయల్ని
తీసుకోవడం అయిష్టంగానైనా
అలవాటు చేసుకుంటున్నాం.
ఎంత ఆరోగ్యం కోసమైనా
ఎప్పుడూ వాటినే తినలేం కదా.
అది చలికాలం... సలాడు
బదులు సూప్ బౌల్ను ఆశ్రయి
స్తున్నాం. చల్లని వాతావరణంలో
వేడి సూప్ మెల్లగా గొంతు దిగు
తుంటే వెచ్చగానూ ఉంటుంది,
సలాడ కన్నా రుచిగానూ
ఉంటుంది. పోషకాలు ఎక్కువ,
క్యాలరీలు తక్కువ ఉండే ఆరోగ్య
కరమైన ఆహారమే సూప్.
రకరకాలు
సూప్ అనగానే టొమాటో,
కార్న్, మిక్స్డ్ వెజిటబుల్, చికెన్,
మటన్ సూప్లు మాత్రమే గుర్తు
కొస్తాయి. కానీ ఏ ఆహారాన్న
యినా సూప్ రూపంలో తీసుకో
వచ్చు. నిజానికి బియ్యం లేదా
నూకల్ని జావలా కాచినది లేదా
అన్నం వార్చినదీ మన దగ్గరా
ఒకప్పుడు బాగానే తాగేవారు.
దీన్నే మనం గంజి అంటే, పశ్చిమ
దేశాల్లో సూప్ అని పిలుస్తున్నారు.
ఏ పదార్థాన్నయినా అందులో
ఉండే పోషకాలన్నీ ఆ నీళ్లలోకి
వచ్చేలా మరిగించి లేదా
ఉడికించి ద్రవరూపంలో తీసు
కుంటే అదే సూప్. కాబట్టి మన
గంజి కూడా ఒక రకం సూపే
క్రీ.పూ. 20 వేల సంవత్సరాల
నుంచీ సూప్ తాగడం వాడుకలో
ఉంది. అప్పట్లో దీన్ని కుండల్లోనే
కాచేవారు. సంప్రదాయ పద్ధతిలో
చేసే కూరగాయల సూప్లో
చిక్కదనం కోసం కొద్దిపాళ్లలో
పిండిపదార్థాలనూ కలుపుతుంటారు.
మరింత చిక్కదనం కోసం వెన్న,
మీగడ, ఉడికించిన బీన్స్న కూడా
కలుపుతున్నారిప్పుడు. కేనింగ్
ప్రకియ కనుగొన్న తరవాత
కండెnsed' సూప్స్ తయారీ
మొదలైంది. వీటిని నేరుగా వేడి
చేసుకుని తాగేయవచ్చు. ఎండబెట్టి
పొడిచేసిన ఇన్ స్టెంట్ సూప్స్
కూడా వచ్చాయి. వీటికయితే
నీళ్లు జోడించి మరిగించాలి.
ఈ రెండు రకాల్లో కూడా కూర
గాయల ముక్కల్లాంటివి జోడించి
కావలసిన రుచుల్లో తాగొచ్చు.
ఎందుకు తాగాలి?
భోజనానికి ముందు తక్కువ
క్యాలరీలు ఉండే సూపన్ను తీసుకో
వడంవల్ల కనీసం 20 శాతం
తక్కువ తింటాం. అదేసమ
యంలో కూరగాయలన్నీ కలిపిన
సూప్ ని తీసుకోవడంవల్ల
నీళ్లలోనే కరిగే బి, సి, కె...
వంటి విటమిన్లు, ఖనిజాలు
శరీరానికి నేరుగా అందుతాయి.
ముఖ్యంగా ఉల్లి, సెలెరీ, లీక్...
వంటి సూట్లలో పొటాషియం
ఎక్కువగా ఉంటుంది. ఇది
శరీరంలోని అధిక సోడియంని
తొలగించేందుకు సాయపడు-
తుంది. కాబట్టి రోజూ రాత్రి
భోజనాన్ని తగ్గించి బదులుగా
కూరగాయల సూప్ తీసుకోవడం
వల్ల క్రమపద్ధతిలో బరువు
తగ్గుతారు. ఇంకా వెంటనే
బరువు తగ్గాలనుకునేవాళ్లు
రెండుపూటలా భోజనం మానేసి
వారం రోజులపాటు సూప్
తాగడంవల్ల ఆరోగ్యంమీద
ఎలాంటి దుష్పరిణామాలు
ఉండవన్నది నిపుణుల సలహా,
అయితే ఇన్ స్టెంట్ సూఫీ వల్ల
పెద్దగా ఫలితం ఉండదు.
వీటిల్లో ప్రొటీన్లు తక్కువ, పిండి
పదార్థాలు ఎక్కువ. సోడియం
శాతమూ ఎక్కువే. తాజాగా
చేసుకున్నదే మంచిదన్నది పోషక
నిపుణుల ఉవాచ.
మరో విషయాన్ని దృష్టిలో
పెట్టుకోవాలి. రైస్, నూడుల్స్,
బీన్స్, పాస్టా లాంటి ఆహారాన్ని
సూప్ రూపంలో ఆగ్నేయాసియా
దేశాల్లో ఎక్కువగా తీసుకుంటుం
టారు. బరువు తగ్గేందుకు వీటిని
ఆశ్రయిస్తే పెద్దగా ఫలితం
ఉండదు. అక్కడ వీటిని వాళ్లు
భోజనానికి బదులుగా తాగుతూ
తింటుంటారు. పండ్లని కూడా
గోరువెచ్చని సూప్ రూపంలో
తీసుకుంటుంటారు. సో....
ఏ సూప్ తాగాలన్నది మీ
బరువును బట్టి మీరే నిర్ణయించు
కోండి. అలాగని సూప్ ఏదో
ఊబకాయులకి మాత్రమే అను
కునేరు... ఆరోగ్యంగా సన్నగా
ఉన్నవాళ్లు కూడా నిస్సందేహంగా
అన్నిరకాల సూట్లనూ తీసుకోవచ్చు..
జీర్ణశక్తిని పెంచే వేడి వేడి సూప్
అందరికీ ఆరోగ్యకరమే!
*
మిసా సూపర్! సూప్ లోకెల్లా గొప్పది ఏది? అనగానే అంతా చెప్పే పేరు ఒక్కటే... అదే
'మిసా సూప్", అటు ఆరోగ్యాన్ని కాపాడుతూ ఇటు వృద్ధాప్యాన్ని హరించే
ఈ సూపు చైనా, జపాన్లలో శతాబ్దాల ముందునుంచీ తాగుతున్నారు.
ఇందులో ఉన్న పోషకాలనూ వయసు మీద పడనీయని లక్షణాలనూ
గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దీన్ని చప్పరిస్తున్నారు. కొజి అనే ఈస్ట్
సాయంతో ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల పాటు పులియబెట్టిన
సోయాబీన్ల ముద్దతో మిసా సూపిని తయారు చేస్తారు. ఇందులో బియ్యం, ముడిబి
య్యం, బార్లీ లేదా గోధుములు కలుపుతుంటారు. దీన్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువే. దాంతో రోగనిరో
ధక శక్తి పెరిగి రొమ్ము, ప్రొస్టేట్, పేగు క్యాన్సర్లను నివారిస్తుందనీ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుందనీ పరిశోధనలు
చెబుతున్నాయి. ఇందులో 22, బి2, 2 కె విటమిన్యూ కోలిన్, లినోలిక్ ఆమ్లాలూ: పీచూ, ప్రొటీన్లూ
పుష్కలంగా ఉంటాయి. లినోలిక్ ఆమ్లం చర్మ సౌందర్యాన్ని రక్షిస్తుంది. మెనోపాజ్ సమయంలో మహిళలు
ఈ సూపను రోజూ ఓ కప్పు తీసుకోవడంవల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ శాతం తగ్గదు. జపనీయుల దీర్ఘాయు
సతీ వాళ్లకి క్యాన్సర్లు రాకపోవడానికి ఒక కారణం దీన్ని ఆహారంలో భాగంగా చేసుకోవడమే.
కావాల్సిన పదార్థాలు : ఒక పెద్ద టొమేటో, ఒక క్యారెట్, 300 గ్రాములు కీరా,
ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టీ స్పూన్ వెన్న, అరలీటరు నీరు, తులసి ఆకులు,
తగినంత ఉప్పు, మిరియాలపొడి.
తయారుచేసే పద్ధతి : ఉల్లిపాయలు తరిగి, ప్యాచ్లో వెన్న వేసి వేయించాలి.
క్యారెట్, కీరా, టిమేట్ ముక్కలు వేయాలి.
అరలీటరు నీరు పోసి ఐదు నిమిషాలు మరిగించాలి. చల్లారిన తర్వాత
మిక్సర్ లో వేసి బ్లెండ్ చేయాలి. పడకట్టాలి. చిటికెడు ఉప్పు, మిరియాలపొడి,
అర టీస్పూన్ వెన్నకలిపి తిరిగి మరిగించి కొద్దిగా తులసి ఆకులు కలపాలి.
(సర్వ్ చేసేముందు కొన్ని కీరాముక్కలు తరిగి కలుపుకోవచ్చు.
కార్న్ సూప్
కావాల్సిన పదార్థాలు: ఒక స్వీట్‌కార్న్, ఒక బంగాళా దుంప, ఒక టీస్పూన్
| వెన్న, 50 ఎమ్.ఎల్.పాలు, మిరియాలపొడి, తగినంత ఉప్పు,
తయారు చేసే పద్ధతి: మొక్కజొన్న గింజలు ఒలుచుకోవాలి. బంగాళాదుంపలు
చెక్కు తీసి కట్చయాలి. అరలీటరు నీరు పోసి ఐదు లేదా ఏడు నిమిషాలు
మరగనివ్వాలి. చల్లారిన తర్వాత బ్లెండ్ చేయాలి.
వడకట్టి ఉప్పు, మిరియాల పొడి, వెన్నకలిపి మరిగించాలి. పాలుపోసి నిరంతరం
కలుపుతూ కొద్ది సేపుంచాలి. కొన్ని గింజలు వెన్నలో వేయించి కలపాలి.
వెజిటబుల్ సూప్
కావాల్సిన పదార్థాలు : రెండు టేబుల్‌స్పూన్లు పెసరపప్పు, ఒక క్యారెట్, ఒక
కట్ట పాలకూర, ఒక కప్పు క్యాబేజీ ముక్కలు.
మూడు టొమేటోలు, అరగ్లాసు పాలు, రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి,
రెండు టేబుల్‌స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు,
తయారుచేసే పద్ధతి : కూరగాయ ముక్కలన్నింటినీ రెండు విజిల్స్ వచ్చేదాకా
కుక్కర్ లో ఉడికించాలి. చల్లారాక మెత్తగా బ్లెండ్ చేయాలి.
అందులో
అరగ్లాసు పాలు కలపాలి (దీనికి ప్రత్యామ్నాయంగా నీరుకూడా
వాడుకోవచ్చు). రెండు టేబుల్‌స్పూన్ల నెయ్యిలో ఉల్లిపాయ ముక్కలు వేసి
వేయించి సూప్లో కలిపి ఉప్పు వేసి మరిగించాలి.
క్యాలీఫ్లవర్, పొటాటో సూప్
కావాల్సిన పదార్థాలు : మూడు కప్పులు క్యాలీఫ్లవర్ ముక్కలు, ఒక కప్పు
బంగాళాదుంప ముక్కలు, అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, రెండు టేబుల్‌స్పూన్లు
నెయ్యి, ఒక గ్లాసు పాలు, మిరియాల పొడి, తగినంత ఉప్పు,
తయారుచేసే పద్ధతి : బంగాళాదుంపలు, ఉల్లిపాయలు కట్‌చేసి నేతిలో వేయిం
చాలి. సన్నని సెగపై ఉంచి, అడుగు అంటుకునేంతవరకు వేయించాలి. క్యాలి
ఫ్లవర్ ముక్కలు కలపాలి. మరో ఐదారు నిమిషాలు వేయించాలి. పచ్చివాసన
పోవాలి. కుక్కర్ లో రెండు విజిల్స్ వచ్చేదాకా కాని, లేదా నీరుపోసి మూత పెట్టి
కాని ఉడికించాలి. చల్లారాక అరగ్లాసుపాలు పోయాలి. ఉప్పు, మిరియాలపొడి
కలపాలి. ఇష్టపడేవారు పాలకూర కులు కూడా వేసుకోవచ్చు.
No comments:
Post a Comment