26, నవంబర్ 2015, గురువారం

గుమ్మ పాలు.. ఆయుర్వేదం..

గుమ్మపాలు



ఇంటికొచ్చి పాలు పోసి అబ్బాయి గుమ్మపాలు తెచ్చి పెడతానంటున్నాడు. వాటిని తాగవచ్చా?

గుమ్మపాలకూ పచ్చిపాలకూ తేడా తెలిస్తేనే మీప్రశ్నకుసరైన సమాధానంవస్తుంది. గుమ్మపాలను ధారస్థాలు అంటారు. పిండుతున్నప్పుడు గిన్నెలో ధారగా వస్తున్నపాలు వేడిగా ఉంటాయి.పితుకుతూఉండగావచ్చేగోరువెచ్చనిపాలధారను గుమ్మపాలంటారు.గిన్నెలోకి చేరిన మరు నిమిషంలోనే అవి పచ్చిపాలుగా మారిపోతాయి. గేదె/అవు సొంతదార్లకు తప్ప ఇతరులకు వేడి మీద తాగటం సాధ్యంకాదు. వాటిని తాగకపోతే మనం కోల్పోయే అమృతం కూడా ఏమీ
లేదు. పాలు కాయకుండా తాగకూడదని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది.టీబీ, టైఫాయిడ్, అమీబియాసిస్ లాంటి అంటువ్యాధులను తెచ్చేసూక్ష్మజీవులు ఈ పచ్చిపాలలో ఉంటాయి. రెండు మూడు పొంగులువచ్చే వరకూ పాలు మరిగిస్తేగానీ ఈ బాక్టీరియా చావదు. పచ్చిపాలను గుమ్మపాలుగా భ్రమించి కొత్త జబ్బులు తెచ్చుకోకూడదు.

రవ్వ గోధుములు .. ఆయుర్వేదం

రవ్వగోధుమలు

రవ్వ గోధుములు మంచివా?   ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది.

 బ్రిటికం తురుమ్ అనేది దీని వృక్షనామం దురుమ్ అంటే లాటిన్ భాషలో గట్టిగా ఉండటం అని అర్థం.గోధుముల కన్నా రవ్వగోధుమల్లో గుటెన్ పదార్థం తక్కువగాఉంటుంది. ఈ గ్లుటెన్ అనేది గోధుమ పిండిని మెత్తదనాన్నిచ్చే
ప్రొటీన్ పదార్థం. అది చాలా మందికి సరిపడక పోవచ్చు. అలాంటివాళ్లకు గోధుమ రవ్వ ఇబ్బంది పెట్టకపోవచ్చు. తిని చూసుకోవాలి.పిండి గోధుమల్లో కన్నా రవ్వ గోధుమల్లో కేలరీలుతక్కువ, రవ్వ గోధుమలు ఎండి పట్టించుకుని ఆ పిండితోరొట్టెలు, చపాతీలుచేసుకోవటంవలన,స్థూలకాయం షుగరువ్యాధులున్నవారికి మేలుఅట్లు, జంతికలు,మిఠాయి
తయారీకి రవ్వ గోధుమలపిండిని లేదా రవ్వనువాడుకుంటే మంచిది. రవ్వ గోధుమల పిండితో రాగి పిండి గానీ,జొన్న పిండి గానీ సమానంగాకలిపి కాల్చిన చపాతీలు,పుల్కాలూ రుచిగా ఉంటాయి.తక్కువ కేలరీలను కలిగిఉంటాయి. అన్నం మానేసిపుల్కాలను తిన్నా ఫలితం ఉంటుంది. గోధుమ రవ్వను కొద్దిగా నెయ్యి వేసి దోరగావేయించి చిక్కని జావ కాచి ఉప్పూ, మిరియాల పొడి కలిపి తయారుచేసిన పారిజ్ లేదా సూపు సురక్షితమైన ఆహార పదార్థం. గోధుమ రవ్వని అన్నంగానూ, ఉప్మాగానూ, మినప్పిండి కలిపి ఇడ్లీ, దోసెలుగా కూడా తినవచ్చు. వ్యాధులు వచ్చినప్పుడు పిండి గోధుమల కన్నా రవ్వగోధుమలకే ప్రాధాన్యత ఇవ్వండి. మొలకెత్తిన
రవ్వగోధుమ విత్తనాలు తినేవారు శనగలు, పెసలు, బొబ్బర్ల కన్నా గోధుమ మొలకలు తినే అలవాటు చేసుకోవటం మంచిది.

14, నవంబర్ 2015, శనివారం

పటిక పంచదార.. ఆయుర్వేద ఉపయోగాలు

పటికిపంచదార

బెల్లం మంచిదా? పటికబెల్లం మంచిదా?

 తెల్లగా అచ్చులాగా ఉండి లోపల పొరలుపొరలుగాఉండేది పటిక పంచదార.మన వైపున దారికేదిఅంతతెల్లగాఉండదు. దీన్ని పటికబెల్లం అంటారు. బెల్లం కన్నాపటిక బెల్లం, పటిక పంచదారశ్రేష్టంగాఉంటాయి.వేడి,వాతంతగ్గిస్తాయి.కడుపులోఎసిడిటీవలనకలిగేఉద్రేకంతగ్గుతుంది.వేడిచేసినందువలన వచ్చే పొడిదగ్గుని తగ్గిస్తుంది. ఉడుకు విరేచనాల్లో సగ్గుబియ్యం జావలో పటికి పంచదార కలిపితాగితే విరేచనాలు ఆగుతాయి. తీపిని అతిగా తింటే వాంతులు అవుతాయి.ఆకలిచచ్చిపోతుంది.మలబద్ధతఏర్పడుతుంది.

వేయించి వండితే.. ఆరోగ్య ప్రయోజనాలు..

వేయించి వండితే మేలు..

 ధాన్యాన్ని వేయించి వండితే లాభం ఏమిటి?

బియ్యం, రాగులు, పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, ఉలపలు, అలచందలు... వీటిని కొద్దిగా సెగ చూపించినట్టు వేయిస్తేవాటిలో దాగిఉన్న ఆరోమా(సుగంధం) బయటకు
వచ్చి అమిత రుచికరంగా ఉంటాయి.తేలికగా వేయించి
నందు వలన గింజలోపల ఉండే తేమఅవిరై పోయి, తేలికగా అరిగే గుణాన్ని పొందుతాయి. కందిపప్పు,
పెసరపప్పులను దోరగా వేయించి పప్పు వండుకుంటే ఉబ్బరంరాకుండా ఉంటుంది. బియ్యాన్ని కూడా ఇలా వేయించి వండితే చాలా తేలికగా అరుగుతాయి. రుచికరంగా ఉంటుంది. ఒక చెంచా నెయ్యి వేసి వేయిస్తే మరీ మంచిది.కందినున్ని పెసరసున్ని, ఉలవనున్ని ఇలాంటివి వేయించిన కారణంగా అరుగుదలను
పొందుతాయి. వేగిన మినపప్పుతో చేసిన సున్ని ఉండలకు ఆ రుచి వేపినందు వలనే కలుగుతోంది. శరీర శ్రమ బాగా ఉన్నవారికీ, జీర్ణశక్తి బలంగా ఉన్నవారికీ వేయించివండి పెడితే మేలు చేస్తాయి. అతి ఆకలి కారణంగా ఎప్పుడూ ఏదో ఒకటి తిననిదేఉండలేకపోవటం వీటి వలన తగ్గుతుంది. ప్రయాణాల్లో తినేందుకు వీలుగాఉంటాయి.

13, నవంబర్ 2015, శుక్రవారం

RNR 15048 రైస్.. షుగర్ రోగులకు..

విజయవంతమైనకొత్తవరిరకంసాగువర్షాభావపరిస్థితులనుతట్టుకుని మంచి దిగుబడులు..

మధుమేహం వచ్చిన వారు కడుపునిండా అన్నంతినడానికి ఇకపై ఆలోచించాల్సిన పనిలేదు. వీరికోసం తెలంగాణలోని జయశంకర్ వ్యవసాయవిశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఆర్.ఎన్.ఆర్. 15048 రకం కొత్త వరి వంగడాన్ని గుంటూరుజిల్లా రైతులు ప్రయోగాత్మకంగా సాగుచేశారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ మంచి దిగుబడులు సాధిం
చారు. కొల్లూరు మండలం అనంతవరం,వేమూరుమండలం జంపని, బాపట్ల మండలం పూండ్లప్రాంతాల్లో రైతులు ఈ సాగు చేపట్టారు.

ఎందుకు వరమంటే..

ఆహారంలో పిండి పదార్థాల శాతాన్ని శాస్త్రీయభాషలో జీఐ గైసిమిక్స్ సూచిక అని పిలుస్తారు.55 శాతంలోపు పిండి పదార్థాలు ఉన్న ఆహారంతీసుకుంటే మధుమేహ రోగులకు మేలనేది వైద్యులసలహా సాధారణంగా బియ్యంలో 55
శాతంపైనేఉంటుంది.ఎక్కువగావినియోగించేబీపీటీ(సాంబమసూరి)లో 56.5 శాతం వరకు ఉంటుంది. డీఆర్ఆర్ హెచ్-3, వరాలు,తెల్లహంస,స్వర(ఎంటీయు-7029).కాటన్‌ దొరసన్నాలు(ఎంటీయు-1010) వంటి వరి వంగడాల్లో
శాతం 77.48 నుంచి 8188 వరకు ఉంటుంది.

కొత్త వంగడం ఆర్.ఎన్.ఆర్. 15048లో మాత్రంప్రత్యేకంగా మధుమేహ రోగులకు సరిపడే రీతిలోకేవలం 51 శాతం మాత్రమే పిండి పదార్థాలుఉంటాయి.ఇప్పటివరకుఉత్తరాది రాష్ట్రాల్లోసాగయ్యే లలాట్' అనే వరి వంగడంలోనే జీఐ 
తక్కువగా ఉంది. వర్షాభావం, తెగుళ్ల దాడి వంటిప్రతికూల పరిస్థితుల్లోనూ ఆర్.ఎన్.ఆర్.15018రకం వరి వంగడం తట్టుకుని నిలబడుతుందనిహైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసేఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ఇనిస్టిట్యూట్సీనియర్సైంటిస్టుబి.సుబ్బారాయుడు చెప్పారు.కొల్లూరు మండలం అనంతవరంలో మండవ సాంబశివరావు అనే రైతు సాగుచేసిన ఈ వరి వంగడం
క్షేత్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు..

ఇవీ ప్రయోజనాలు..

ప్రస్తుతం సాగుచేస్తున్న వంగడాల పంట కాలవ్యవధి 10 రోజులు ఉంటే, ఇది కేవలం 120నుంచి 15 రోజుల్లోనే అందుబాటులోకివస్తుంది.
బీపీటీల కన్నా ఇంకా సన్నగా బియ్యం ఉండటంతో తినేవారికి ఇష్టత కూడా పెరుగుతుంది.మధుమేహం ఉన్నవారు రాత్రి వేళల్లోనూ ఈబియ్యంతో బోజనం తినొచ్చు.ఎకరా బీపీటీ సాగు చేయడానికి రూ.20 వేల
నుంచి రూ. 21 వేల వరకు ఖర్చయితే దీనికిరూ 18 వేలు మాత్రమే అయింది.మిగిలిన రకాల కంటే పొడవుగా పెరగనున్నందున ఎరువుల యాజమాన్యంలో తగిన జాగ్ర
త్తలు తీసుకోవాలి

5, నవంబర్ 2015, గురువారం

ఆయుర్వేదము మరియు జన్యువులు - CCMB రీసెర్చ్

• సీసీఎంబీ తాజా పరిశోధనలో వెల్లడి

 భారత్ లోని ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదానికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని సెంటర్ ఫర్ సెల్యూలార్
అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) తాజా పరిశోధనలో వెల్లమైంది. ఆయుర్వేదంలో వైద్యం కోసం చేసే వర్గీకరణకు మనిషి జన్యువులకు సంబంధం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇన్నాళ్లు ఆయుర్వేదవైద్యం అనుభవం ఆధారంగా చేస్తూ వస్తున్నారని.. శాస్త్రీయత ఏమిటనేప్రశ్నలకుతాజాఫలితాలతోఆధారంలభించినట్లయిందని సీసీఎంబీసంచాలకుడు మోహన్ రావు తెలిపారు. బుధవారమిక్కడ విలేకర్ల సమావేశంలో సీనియర్ శాస్త్రవేత్త తంగరాజ్ తో కలిసి ఆయన ప్రయోగ ఫలితాలను వెల్లడించారు. ఆయుర్వేదంలో వాత, పిత్త కఫ దోషాల ఆధా
కంగా వ్యక్తుల శరీర తత్వాన్ని వర్గీకరించి వైద్యులు మందులు సూచిస్తారు. ఈ మూడింటికీ పంచభూతాలే కారణమన్నది నమ్మకం.దీనికి శాస్త్రీయ ఆధారాలు ఏమైనా ఉన్నాయాఅని మనుషుల జన్యువులపై ఆరేళ్లుగా శాస్త్రవేత్త తంగరాజ్పరిశోధనచేశారు.

దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన 3400 మందిని ఎంపిక చేసి.. వీరు ఆయుర్వేదంలోఏతత్వానికి చెందిన వారు అనేది గుర్తించారు. ఇందుకోసం చాలామంది అనుభవంకల్గిన ఆయుర్వేద వైద్యులను సంప్రదించారు. వీరు చెప్పిన విషయాలే కాకుండాఆయుష్ రూపొందించిన సాఫ్ట్వేర్ ఆధారంగా కొందరిని ప్రశ్నించి ఏ తత్వం కలిగిన
వ్యక్తులో గుర్తించారు. కచ్చితత్వం కోసం ఈ రెండింటి ఫలితాల్లో సారూప్యత కలిగిన262 మందిలో వాత,
పిత్త కఫ దోషాల తత్వం వర్గీకరణ చేశారు. తర్వాత ఆ వ్యక్తులరక్తనమూనాలు సేకరించి డీఎన్ఏ సిద్ధంచేశారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నమైక్రో చిప్లో విశ్లేషించారు. ఊహించని విధంగా వీటిలో వచ్చిన మూడు గ్రూపులు..ఆయుర్వేద వైద్యులు వర్గీకరించిన గ్రూపులతో సరిపోలాయి. ఒకప్పుడు ఏ పరికరాలులేకుండా గుర్తించిన మనిషి శరీర తత్వాన్ని, ఇప్పుడు జన్యువుల ఆధారంగా తెలుసుకునేఅవకాశం ఉందని నిరూపితమైంది. ఈ రంగంలో భవిష్యత్తు పరిశోధనలకు ఇది ఒకభరోసా ఇచ్చింది. అంతేకాదు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒకేవిధంగాఉండేజన్యువులపైచేసినపరిశోధనభవిష్యత్తులో ఎప్పటికప్పుడు మారే ప్రొటీన్స్ప ప్రయోగాలకు ఉపయోగపడుతుంది" అని మోహన్‌రావు వివరించారు. ఆరేళ్ల పరిశోధనకువేర్వేరు సంస్థల నుంచి రూ.12 కోట్ల నిధులు అందాయని చెప్పారు.

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...