విజయవంతమైన
కొత్త వరి రకం సాగు
• వర్షాభావ పరిస్థితులను
తట్టుకుని మంచి దిగుబడులు
మధుమేహం వచ్చిన వారు కడుపునిండా అన్నం
తినడానికి ఇకపై ఆలోచించాల్సిన పనిలేదు. వీరి
కోసం తెలంగాణలోని జయశంకర్ వ్యవసాయ
విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఆర్.ఎన్.
ఆర్. 15048 రకం కొత్త వరి వంగడాన్ని గుంటూరు
జిల్లా రైతులు ప్రయోగాత్మకంగా సాగుచేశారు. వర్షా
భావ పరిస్థితుల్లోనూ మంచి దిగుబడులు సాధిం
చారు. కొల్లూరు మండలం అనంతవరం, వేమూరు
మండలం జంపని, బాపట్ల మండలం పూండ్ల
ప్రాంతాల్లో రైతులు ఈ సాగు చేపట్టారు.
ఎందుకు వరమంటే..
ఆహారంలో పిండి పదార్థాల శాతాన్ని శాస్త్రీయ
భాషలో జీఐ గైసిమిక్స్ సూచిక అని పిలుస్తారు.
55 శాతంలోపు పిండి పదార్థాలు ఉన్న ఆహారం
తీసుకుంటే మధుమేహ రోగులకు మేలనేది వైద్యుల
సలహా సాధారణంగా బియ్యంలో ఈజీ55
శాతం పైనే ఉంటుంది. ఎక్కువగా వినియోగించే
బీపీటీ (సాంబమసూరి)లో 56.5 శాతం వరకు జీవి
ఉంటుంది. డీఆర్ఆర్ హెచ్-3, వరాలు, తెల్లహంస,
స్వర(ఎంటీయు-7029).
కాటన్ దొర
సన్నాలు(ఎంటీయు-1010) వంటి వరి వంగడాల్లో
జీవిశాతం 77.48 నుంచి 8188 వరకు ఉంటుంది.
కొత్త వంగడం ఆర్.ఎన్.ఆర్. 15048లో మాత్రం
ప్రత్యేకంగా మధుమేహ రోగులకు సరిపడే రీతిలో
కేవలం 51 శాతం మాత్రమే పిండి పదార్థాలు
ఉంటాయి. ఇప్పటి వరకు ఉత్తరాది రాష్ట్రాల్లో
సాగయ్యే లలాట్' అనే వరి వంగడంలోనే జీవి
తక్కువగా ఉంది. వర్షాభావం, తెగుళ్ల దాడి వంటి
ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆర్.ఎన్.ఆర్.15018
రకం వరి వంగడం తట్టుకుని నిలబడుతుందని
హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇనిస్టిట్యూట్
సీనియర్ సైంటిస్టు బి. సుబ్బారాయుడు చెప్పారు.
కొల్లూరు మండలం అనంతవరంలో మండవ సాంబ
శివరావు అనే రైతు సాగుచేసిన ఈ వరి వంగడం
క్షేత్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు.
ఇవీ ప్రయోజనాలు
ప్రస్తుతం సాగుచేస్తున్న వంగడాల పంట కాల
వ్యవధి 10 రోజులు ఉంటే, ఇది కేవలం 120
నుంచి 15 రోజుల్లోనే అందుబాటులోకి
వస్తుంది.
బీపీటీల కన్నా ఇంకా సన్నగా బియ్యం ఉండ
టంతో తినేవారికి ఇష్టత కూడా పెరుగుతుంది.
మధుమేహం ఉన్నవారు రాత్రి వేళల్లోనూ ఈ
బియ్యంతో బోజనం తినొచ్చు.
ఎకరా బీపీటీ సాగు చేయడానికి రూ.20 వేల
నుంచి రూ. 21 వేల వరకు ఖర్చయితే దీనికి
రూ 18 వేలు మాత్రమే అయింది
మిగిలిన రకాల కంటే పొడవుగా పెరగనున్నం
దున ఎరువుల యాజమాన్యంలో తగిన జాగ్ర
త్తలు తీసుకోవాలి
No comments:
Post a Comment