Wednesday, 4 November 2015

AYURVEDAM AND GENES - CCMB RESEARCH

• సీసీఎంబీ తాజా పరిశోధనలో వెల్లడి

 భారత్ లోని ప్రాచీన వైద్య విధానమైన ఆయు
ర్వేదానికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని సెంటర్ ఫర్ సెల్యూలార్
అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) తాజా పరిశోధనలో వెల్లమైంది. ఆయుర్వేదంలో వైద్యం కోసం చేసే వర్గీకరణకు మనిషి జన్యువు
లకు సంబంధం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇన్నాళ్లు ఆయుర్వేద
వైద్యం అనుభవం ఆధారంగా చేస్తూ వస్తున్నారని.. శాస్త్రీయత ఏమిటనే
ప్రశ్నలకు తాజా ఫలితాలతో ఆధారం లభించినట్లయిందని సీసీఎంబీ
సంచాలకుడు మోహన్ రావు తెలిపారు. బుధవారమిక్కడ విలేకర్ల సమా
వేశంలో సీనియర్ శాస్త్రవేత్త తంగరాజ్ తో కలిసి ఆయన ప్రయోగ ఫలి
తాలను వెల్లడించారు. ఆయుర్వేదంలో వాత, పిత్త కఫ దోషాల ఆధా
కంగా వ్యక్తుల శరీర తత్వాన్ని వర్గీకరించి వైద్యులు మందులు సూచి
స్తారు. ఈ మూడింటికీ పంచభూతాలే కారణమన్నది నమ్మకం.
దీనికి శాస్త్రీయ ఆధారాలు ఏమైనా ఉన్నాయా
అని మనుషుల జన్యువులపై ఆరే
ళ్లుగా శాస్త్రవేత్త తంగరాజ్
పరిశోధన
చేశారు.
దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన 3400 మందిని ఎంపిక చేసి.. వీరు ఆయుర్వేదంలో
ఏతత్వానికి చెందిన వారు అనేది గుర్తించారు. ఇందుకోసం చాలామంది అనుభవం
కల్గిన ఆయుర్వేద వైద్యులను సంప్రదించారు. వీరు చెప్పిన విషయాలే కాకుండా
ఆయుష్ రూపొందించిన సాఫ్ట్వేర్ ఆధారంగా కొందరిని ప్రశ్నించి ఏ తత్వం కలిగిన
వ్యక్తులో గుర్తించారు. కచ్చితత్వం కోసం ఈ రెండింటి ఫలితాల్లో సారూప్యత కలిగిన
262 మందిలో వాత,
పిత్త కఫ దోషాల తత్వం వర్గీకరణ చేశారు. తర్వాత ఆ వ్యక్తుల
రక్తనమూనాలు సేకరించి డీఎన్ఏ సిద్ధంచేశారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న
మైక్రో చిప్లో విశ్లేషించారు. ఊహించని విధంగా వీటిలో వచ్చిన మూడు గ్రూపులు..
ఆయుర్వేద వైద్యులు వర్గీకరించిన గ్రూపులతో సరిపోలాయి. ఒకప్పుడు ఏ పరికరాలు
లేకుండా గుర్తించిన మనిషి శరీర తత్వాన్ని, ఇప్పుడు జన్యువుల ఆధారంగా తెలుసుకునే
అవకాశం ఉందని నిరూపితమైంది. ఈ రంగంలో భవిష్యత్తు పరిశోధనలకు ఇది ఒక
భరోసా ఇచ్చింది. అంతేకాదు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒకే విధంగా ఉండే
జన్యువులపై చేసిన పరిశోధన భవిష్యత్తులో ఎప్పటికప్పుడు మారే ప్రొటీన్స్ప ప్రయో
గాలకు ఉపయోగపడుతుంది" అని మోహన్‌రావు వివరించారు. ఆరేళ్ల పరిశోధనకు
వేర్వేరు సంస్థల నుంచి రూ.12 కోట్ల నిధులు అందాయని చెప్పారు.




No comments:

Post a Comment