వేయించి వండితే మేలు
ధాన్యాన్ని వేయించి వండితే లాభం ఏమిటి?
బియ్యం, రాగులు, పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, ఉల
పలు, అలచందలు... వీటిని కొద్దిగా సెగ చూపించినట్టు వేయిస్తే
వాటిలో దాగి
ఉన్న ఆరోమా
(సుగంధం) బయటకు
వచ్చి అమిత రుచిక
రంగా ఉంటాయి.
తేలికగా వేయించి
నందు వలన గింజ
లోపల ఉండే తేమ
అవిరై పోయి, తేలికగా అరిగే గుణాన్ని పొందుతాయి. కందిపప్పు,
పెసరపప్పులను దోరగా వేయించి పప్పు వండుకుంటే ఉబ్బరం
రాకుండా ఉంటుంది. బియ్యాన్ని కూడా ఇలా వేయించి వండితే చాలా తేలికగా అరు
గుతాయి. రుచికరంగా ఉంటుంది. ఒక చెంచా నెయ్యి వేసి వేయిస్తే మరీ మంచిది.
కందినున్ని పెసరసున్ని, ఉలవనున్ని ఇలాంటివి వేయించిన కారణంగా అరుగుదలను
పొందుతాయి. వేగిన మినపప్పుతో చేసిన సున్ని ఉండలకు ఆ రుచి వేపినందు వలనే
కలుగుతోంది. శరీర శ్రమ బాగా ఉన్నవారికీ, జీర్ణశక్తి బలంగా ఉన్నవారికీ వేయించి
వండి పెడితే మేలు చేస్తాయి. అతి ఆకలి కారణంగా ఎప్పుడూ ఏదో ఒకటి తిననిదే
ఉండలేకపోవటం వీటి వలన తగ్గుతుంది. ప్రయాణాల్లో తినేందుకు వీలుగా
ఉంటాయి.
No comments:
Post a Comment