26, నవంబర్ 2015, గురువారం

రవ్వ గోధుములు .. ఆయుర్వేదం

రవ్వగోధుమలు

రవ్వ గోధుములు మంచివా?   ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది.

 బ్రిటికం తురుమ్ అనేది దీని వృక్షనామం దురుమ్ అంటే లాటిన్ భాషలో గట్టిగా ఉండటం అని అర్థం.గోధుముల కన్నా రవ్వగోధుమల్లో గుటెన్ పదార్థం తక్కువగాఉంటుంది. ఈ గ్లుటెన్ అనేది గోధుమ పిండిని మెత్తదనాన్నిచ్చే
ప్రొటీన్ పదార్థం. అది చాలా మందికి సరిపడక పోవచ్చు. అలాంటివాళ్లకు గోధుమ రవ్వ ఇబ్బంది పెట్టకపోవచ్చు. తిని చూసుకోవాలి.పిండి గోధుమల్లో కన్నా రవ్వ గోధుమల్లో కేలరీలుతక్కువ, రవ్వ గోధుమలు ఎండి పట్టించుకుని ఆ పిండితోరొట్టెలు, చపాతీలుచేసుకోవటంవలన,స్థూలకాయం షుగరువ్యాధులున్నవారికి మేలుఅట్లు, జంతికలు,మిఠాయి
తయారీకి రవ్వ గోధుమలపిండిని లేదా రవ్వనువాడుకుంటే మంచిది. రవ్వ గోధుమల పిండితో రాగి పిండి గానీ,జొన్న పిండి గానీ సమానంగాకలిపి కాల్చిన చపాతీలు,పుల్కాలూ రుచిగా ఉంటాయి.తక్కువ కేలరీలను కలిగిఉంటాయి. అన్నం మానేసిపుల్కాలను తిన్నా ఫలితం ఉంటుంది. గోధుమ రవ్వను కొద్దిగా నెయ్యి వేసి దోరగావేయించి చిక్కని జావ కాచి ఉప్పూ, మిరియాల పొడి కలిపి తయారుచేసిన పారిజ్ లేదా సూపు సురక్షితమైన ఆహార పదార్థం. గోధుమ రవ్వని అన్నంగానూ, ఉప్మాగానూ, మినప్పిండి కలిపి ఇడ్లీ, దోసెలుగా కూడా తినవచ్చు. వ్యాధులు వచ్చినప్పుడు పిండి గోధుమల కన్నా రవ్వగోధుమలకే ప్రాధాన్యత ఇవ్వండి. మొలకెత్తిన
రవ్వగోధుమ విత్తనాలు తినేవారు శనగలు, పెసలు, బొబ్బర్ల కన్నా గోధుమ మొలకలు తినే అలవాటు చేసుకోవటం మంచిది.

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...