గుమ్మపాలు
ఇంటికొచ్చి పాలు పోసి అబ్బాయి గుమ్మపాలు తెచ్చి పెడతానంటు
న్నాడు. వాటిని తాగవచ్చా?
* గుమ్మపాలకూ పచ్చి
పాలకూ తేడా తెలిస్తేనే మీ
ప్రశ్నకు సరైన సమాధానం
వస్తుంది. గుమ్మపాలను ధార
స్థాలు అంటారు. ఎందుతున్న
ప్పుడు గిన్నెలో ధారగా వస్తున్న
పాలు వేడిగా ఉంటాయి. పితు
కుతూ ఉండగా వచ్చే గోరు
వుని పాలధారను గుమ్మపాలం
వారు. గిన్నెలోకి చేరిన మరు నిమిషంలోనే అవి పచ్చిపాలుగా మారిపో
తాయి. గేదె/అవు సొంతదార్లకు తప్ప ఇతరులకు వేడి మీద తాగటం సాధ్యం
కాదు. వాటిని తాగకపోతే మనం కోల్పోయే అమృతం కూడా ఏమీ
లేదు. పాలు కాయకుండా తాగకూడదని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది.
టీబీ, టైఫాయిడ్, అమీబియాసిస్ లాంటి అంటువ్యాధులను తెచ్చే
సూక్ష్మజీవులు ఈ పచ్చిపాలలో ఉంటాయి. రెండు మూడు పొంగులు
వచ్చే వరకూ పాలు మరిగిస్తేగానీ ఈ బాక్టీరియా చావదు. పచ్చిపా
లను గుమ్మపాలుగా భ్రమించి కొత్త జబ్బులు తెచ్చుకోకూడదు.