'సూప్ ప్లీజ్...' అని అడగగానే ఇప్పటికీ చాలామంది అయిష్టంగానే మొహం పెడుతుంటారు.గంజిలా ఉంటుందనీ రుచిగా ఉండదనీ రకరకాలకారణాలు చెబుతుంటారు.కానీ ఆరోగ్య స్పృహఉన్నవాళ్లూ బరువు తగ్గాలనుకునేవాళ్లూ మాత్రం రోజూదీన్ని తాగుతున్నారు. 'సూప్ కి చాలా సీనుంది....' అన్నపోషకాహార నిపుణుల సలహానే ఇందుకు కారణం.
ఆధునిక జీవనశైలి పుణ్యమాఅని... పిల్లల నుంచి పెద్దల
వరకూ ఆహారాన్ని కొలుచుకునితినాల్సిన పరిస్థితి. ఇష్టమైనవన్నీతినేస్తేఅంతేవేగంగాభారీకాయాన్నిఅనారోగ్యాన్నివెనకేసుకోవాలి.అందుకేసలాడ్లరూపంలోపచ్చికూరగాయల్నితీసుకోవడంఅయిష్టంగానైనాఅలవాటుచేసుకుంటున్నాం.ఎంత ఆరోగ్యం కోసమైనాఎప్పుడూ వాటినే తినలేం కదా.
అది చలికాలం... సలాడుబదులు సూప్ బౌల్ను ఆశ్రయి
స్తున్నాం. చల్లని వాతావరణంలోవేడి సూప్ మెల్లగా గొంతు దిగుతుంటే వెచ్చగానూ ఉంటుంది,సలాడ కన్నా రుచిగానూ
ఉంటుంది. పోషకాలు ఎక్కువ,క్యాలరీలు తక్కువ ఉండే ఆరోగ్యకరమైన ఆహారమే సూప్.రకరకాలుసూప్ అనగానే టొమాటో,కార్న్, మిక్స్డ్ వెజిటబుల్, చికెన్,మటన్ సూప్లు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ ఏ ఆహారాన్నయినా సూప్ రూపంలో తీసుకోవచ్చు. నిజానికి బియ్యం లేదానూకల్ని జావలా కాచినది లేదాఅన్నం వార్చినదీ మన దగ్గరా
ఒకప్పుడు బాగానే తాగేవారు.దీన్నే మనం గంజి అంటే, పశ్చిమదేశాల్లో సూప్అనిపిలుస్తున్నారు.ఏపదార్థాన్నయినా అందులోఉండే పోషకాలన్నీ ఆ నీళ్లలోకివచ్చేలా మరిగించి లేదాఉడికించి ద్రవరూపంలో తీసుకుంటే అదే సూప్. కాబట్టి మనగంజి కూడా ఒక రకం సూపేక్రీ.పూ. 20 వేల సంవత్సరాలనుంచీ సూప్ తాగడం వాడుకలో
ఉంది. అప్పట్లో దీన్ని కుండల్లోనేకాచేవారు. సంప్రదాయ పద్ధతిలోచేసే కూరగాయల సూప్లోచిక్కదనం కోసం కొద్దిపాళ్లలోపిండిపదార్థాలనూ కలుపుతుంటారు.
మరింత చిక్కదనం కోసం వెన్న,మీగడ, ఉడికించిన బీన్స్న కూడాకలుపుతున్నారిప్పుడు. కేనింగ్ ప్రక్రియ కనుగొన్న తరవాత కండెన్స్డ్ సూప్స్ తయారీమొదలైంది. వీటిని నేరుగా వేడిచేసుకుని తాగేయవచ్చు. ఎండబెట్టి
పొడిచేసిన ఇన్స్టెంట్ సూప్స్ కూడా వచ్చాయి. వీటికయితే
నీళ్లు జోడించి మరిగించాలి.ఈ రెండు రకాల్లో కూడా కూర
గాయల ముక్కల్లాంటివి జోడించికావలసిన రుచుల్లో తాగొచ్చు.
ఎందుకు తాగాలి?
భోజనానికి ముందు తక్కువక్యాలరీలు ఉండే సూప్ తీసుకో
వడంవల్ల కనీసం 20 శాతంతక్కువ తింటాం. అదేసమ
యంలో కూరగాయలన్నీ కలిపినసూప్ ని తీసుకోవడంవల్ల
నీళ్లలోనే కరిగే బి, సి, కె...వంటి విటమిన్లు, ఖనిజాలు
శరీరానికి నేరుగా అందుతాయి.ముఖ్యంగా ఉల్లి, సెలెరీ, లీక్...వంటి సూప్ లలో పొటాషియంఎక్కువగా ఉంటుంది. ఇదిశరీరంలోని అధిక సోడియంనితొలగించేందుకు సాయపడుతుంది. కాబట్టి రోజూ రాత్రిభోజనాన్ని తగ్గించి బదులుగాకూరగాయల సూప్ తీసుకోవడంవల్ల క్రమపద్ధతిలో బరువుతగ్గుతారు. ఇంకా వెంటనే
బరువు తగ్గాలనుకునేవాళ్లురెండుపూటలా భోజనం మానేసివారం రోజులపాటు సూప్ తాగడంవల్ల ఆరోగ్యంమీదఎలాంటి దుష్పరిణామాలుఉండవన్నది నిపుణుల సలహా.
అయితే ఇన్ స్టెంట్ సూప్ వల్లపెద్దగా ఫలితం ఉండదు.
వీటిల్లో ప్రొటీన్లు తక్కువ, పిండిపదార్థాలు ఎక్కువ. సోడియంశాతమూ ఎక్కువే. తాజాగాచేసుకున్నదే మంచిదన్నది పోషకనిపుణుల ఉవాచ.మరో విషయాన్ని దృష్టిలోపెట్టుకోవాలి. రైస్, నూడుల్స్,బీన్స్, పాస్టా లాంటి ఆహారాన్నిసూప్ రూపంలో ఆగ్నేయాసియాదేశాల్లో ఎక్కువగా తీసుకుంటుంటారు. బరువు తగ్గేందుకు వీటిని
ఆశ్రయిస్తే పెద్దగా ఫలితంఉండదు. అక్కడ వీటిని వాళ్లు
భోజనానికి బదులుగా తాగుతూతింటుంటారు. పండ్లని కూడాగోరువెచ్చని సూప్ రూపంలోతీసుకుంటుంటారు. సో....ఏ సూప్ తాగాలన్నది మీబరువును బట్టి మీరే నిర్ణయించుకోండి. అలాగని సూప్ ఏదోఊబకాయులకి మాత్రమే అనుకునేరు... ఆరోగ్యంగా సన్నగాఉన్నవాళ్లు కూడా నిస్సందేహంగాఅన్నిరకాల సూప్ లు తీసుకోవచ్చు..
జీర్ణశక్తిని పెంచే వేడి వేడి సూప్అందరికీ ఆరోగ్యకరమే.
మిసా సూపర్! సూప్ లోకెల్లా గొప్పది ఏది? అనగానే అంతా చెప్పే పేరు ఒక్కటే... అదే
'మిసా సూప్", అటు ఆరోగ్యాన్ని కాపాడుతూ ఇటు వృద్ధాప్యాన్ని హరించేఈ సూపు చైనా, జపాన్లలో శతాబ్దాల ముందునుంచీ తాగుతున్నారు.ఇందులో ఉన్న పోషకాలనూ వయసు మీద పడనీయని లక్షణాలనూ
గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దీన్ని చప్పరిస్తున్నారు. కొజి అనే ఈస్ట్ సాయంతో ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల పాటు పులియబెట్టినసోయాబీన్ల ముద్దతో మిసా సూప్ ను తయారు చేస్తారు. ఇందులో బియ్యం, ముడిబియ్యం, బార్లీ లేదా గోధుములు కలుపుతుంటారు. దీన్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువే. దాంతో రోగనిరో
ధక శక్తి పెరిగి రొమ్ము, ప్రొస్టేట్, పేగు క్యాన్సర్లను నివారిస్తుందనీ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుందనీ పరిశోధనలు
చెబుతున్నాయి. ఇందులో , బి2, కె విటమిన్, కోలిన్, లినోలిక్ ఆమ్లాలూ: పీచూ, ప్రొటీన్లూపుష్కలంగా ఉంటాయి. లినోలిక్ ఆమ్లం చర్మ సౌందర్యాన్ని రక్షిస్తుంది. మెనోపాజ్ సమయంలో మహిళలు
ఈ సూప్ ను రోజూ ఓ కప్పు తీసుకోవడంవల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ శాతం తగ్గదు. జపనీయుల దీర్ఘ ఆయుష్షు కు,
వాళ్లకి క్యాన్సర్లు రాకపోవడానికి ఒక కారణం దీన్ని ఆహారంలో భాగంగా చేసుకోవడమే.
కావాల్సిన పదార్థాలు : ఒక పెద్ద టొమేటో, ఒక క్యారెట్, 300 గ్రాములు కీరా,ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టీ స్పూన్ వెన్న, అరలీటరు నీరు, తులసి ఆకులు,తగినంత ఉప్పు, మిరియాలపొడి.తయారుచేసే పద్ధతి : ఉల్లిపాయలు తరిగి, ప్యాన్ లో వెన్న వేసి వేయించాలి.క్యారెట్, కీరా, టమాటా ముక్కలు వేయాలి.అరలీటరు నీరు పోసి ఐదు నిమిషాలు మరిగించాలి. చల్లారిన తర్వాతమిక్సర్ లో వేసి బ్లెండ్ చేయాలి. వడకట్టాలి. చిటికెడు ఉప్పు, మిరియాలపొడి,
అర టీస్పూన్ వెన్నకలిపి తిరిగి మరిగించి కొద్దిగా తులసి ఆకులు కలపాలి.
(సర్వ్ చేసేముందు కొన్ని కీరాముక్కలు తరిగి కలుపుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు: ఒక స్వీట్‌కార్న్, ఒక బంగాళా దుంప, ఒక టీస్పూన్ వెన్న, 50 ఎమ్.ఎల్.పాలు, మిరియాలపొడి, తగినంత ఉప్పు,
తయారు చేసే పద్ధతి: మొక్కజొన్న గింజలుఒలుచుకోవాలి. బంగాళాదుంపలుచెక్కు తీసి కట్ చేయాలి. అరలీటరు నీరు పోసి ఐదు లేదా ఏడు నిమిషాలుమరగనివ్వాలి. చల్లారిన తర్వాత బ్లెండ్ చేయాలి.వడకట్టి ఉప్పు, మిరియాల పొడి, వెన్నకలిపి మరిగించాలి. పాలుపోసి నిరంతరంకలుపుతూ కొద్ది సేపుంచాలి. కొన్ని గింజలు వెన్నలో వేయించి కలపాలి.
వెజిటబుల్ సూప్..
కావాల్సిన పదార్థాలు : రెండు టేబుల్‌స్పూన్లు పెసరపప్పు, ఒక క్యారెట్, ఒకకట్ట పాలకూర, ఒక కప్పు క్యాబేజీ ముక్కలు.మూడు టొమేటోలు, అరగ్లాసు పాలు, రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి,రెండు టేబుల్‌స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు,
తయారుచేసే పద్ధతి : కూరగాయ ముక్కలన్నింటినీ రెండు విజిల్స్ వచ్చేదాకాకుక్కర్ లో ఉడికించాలి. చల్లారాక మెత్తగా బ్లెండ్ చేయాలి.అందులోఅరగ్లాసు పాలు కలపాలి (దీనికి ప్రత్యామ్నాయంగా నీరుకూడా
వాడుకోవచ్చు). రెండు టేబుల్‌స్పూన్ల నెయ్యిలో ఉల్లిపాయ ముక్కలు వేసివేయించి సూప్లోకలిపిఉప్పువేసిమరిగించాలి.
క్యాలీఫ్లవర్, పొటాటో సూప్..
కావాల్సిన పదార్థాలు : మూడు కప్పులు క్యాలీఫ్లవర్ ముక్కలు, ఒక కప్పుబంగాళాదుంప ముక్కలు, అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, రెండు టేబుల్‌స్పూన్లు
నెయ్యి, ఒక గ్లాసు పాలు, మిరియాల పొడి, తగినంత ఉప్పు,
తయారుచేసే పద్ధతి : బంగాళాదుంపలు, ఉల్లిపాయలు కట్‌చేసి నేతిలో వేయించాలి. సన్నని సెగపై ఉంచి, అడుగు అంటుకునేంతవరకు వేయించాలి. క్యాలిఫ్లవర్ ముక్కలు కలపాలి. మరో ఐదారు నిమిషాలు వేయించాలి. పచ్చివాసనపోవాలి. కుక్కర్ లో రెండు విజిల్స్ వచ్చేదాకా కాని, లేదా నీరుపోసి మూత పెట్టికాని ఉడికించాలి. చల్లారాక అరగ్లాసుపాలు పోయాలి. ఉప్పు, మిరియాలపొడి
కలపాలి. ఇష్టపడేవారు పాలకూర ఆకులు కూడా వేసుకోవచ్చు.