23, మార్చి 2013, శనివారం

ఫేస్ మాయిశ్చరైజర్లు

ముఖచర్మాన్ని మృదువుగా మార్చే మాయిశ్చరైజర్లు.


ఎక్కువ శక్తి కలిగిన పదార్థాలతో ముఖాన్ని రుద్దుకోవడం, శుభ్రపరచుకోవడం, మృతకణాలు రాలిపోయేలాగా వెలుపలి పొరలను ఎక్స్ ఫోలియేట్ చేయటం ఇలాంటి ప్రక్రియల తర్వాత చర్మన్ కొద్దిగా బలహీనపడుతుంది. పోషకతత్వాల అవసరం పెరుగుతుంది. నీరు లేని పైరు ఎలా వాడిపోతుందో , వడలిపోతుందో , అలా తేమ తగ్గిన చర్మం వడలిపోతుంది. ఈ లోటును భర్తీ చేయడానికి కొల్పోయిన స్నిగ్ధత్వం, తేమ వంటి వాటిని తిరిగి పొందడానికి మాయిశ్చరైజర్ లు లేదా ఫచెస్ ప్యాక్ వంటివి అవసరమౌతాయి. ఇవి మీ ముఖచర్మాన్ని తాజాగా ఉంచడంతోపాటు , చర్మానికి వెలుపలనుంచి పోషకతత్వాలను అందిస్తాయి. వీటిని మీరు కనీసం రోజుకి రెండుసార్లు ప్రయోగించాల్సి ఉంటుంది. 

1.)   పొడి ముఖచర్మానికి మాయిశ్చరైజర్ --- 

ముఖచర్మం ప్రొటీన్ లతో నిర్మితమౌతుంది.దీనికి పోషకతత్వాలను అందించాలంటే ప్రొటీన్ సంబంధ పదార్థాలు ప్రయోగించాల్సి ఉంటుంది. అలాగే ముఖచర్మాన్ని తేమగా ఉంచటం కోసం చర్మం విడుదల చేసే సహజ రైలం తో సమాన గుణధర్మాలున్న తైలాలను వాడవలసి ఉంటుంది. 

ఇలాంటి ఒక తైలం తయారీ, వడాల్సిన పద్ధతి - 

ఒక బౌల్ లో కోడిగుడ్డు పచ్చసొనని తీసుకుని దీనిలో ఒక పెద్ద చెంచాడు బాదం నూనెను , 5 బాదం గింజలను మెత్తగా పొడి చేసి కలపండి. చివరగా ఒక పెద్ద చెంచాడు తేనె కలిపి అన్నిటిని గిలక్కొట్టి ఒక చిక్కని పేస్ట్ లాగా తయారు చేయండి. దీనిని ముఖం మీద , మెడ మీద పూసుకుని , కళ్ల మీద మాత్రం వదిలేయండి. పావు గంట పాటు ఉంచితే చర్మం దీనిని విలీనం చేసుకుంటుంది. తర్వాత వేడి నీళ్లతో కడిగేసుకుని వెంటనే చన్నీళ్లతో చిలకరించుకోండి. వేడి నీళ్లవల్ల జిడ్డు వదిలిపోతుంది. చన్నీళ్ల వల్ల ముఖం మీద తేమ పరచుకొని ఒక రక్షక కవచంలాగా పనిచేస్తుంది. 

2.)    ముఖంలో కాంతిని కలిగించే ఫేస్ ప్యాక్...

ముఖచర్మం మీద స్వేద రంధ్రాలు పెద్దగా తయారైనపుదు ముఖంలో తాజాదనం కనిపించదు. అలాగే పోషక పదార్థాల కోపం వంటి కారణాల వల్ల పోషకతత్వాలు నిలిచిపోతాయి. దీనిలో ముఖచర్మం కాంతివిహీనంగా, నిస్తేజంగా , జీవరహితంగా కనిపిస్తుంది. ఈ సమస్యలను ఏకకాలం లో తగ్గించగలిగే ఒక శక్తివంతమైన ఔషధాన్ని గురించి తెలుసుకుందాం. 

తయారీ పద్ధతి , వాడాల్సిన విధానం... 

రెండు పెద్ద చెంచాల ముల్తాని మట్టిలో ఒక పెద్ద చెంచాడు తేనె,ఒక పెద్ద చెంచాడు పాలను కలిపి గిలక్కొట్టి ఒక పేస్ట్ లాగా తయారు చేయండి. దీనిని ముఖం మీద, మెడ మీద పూసుకుని , పావు గంట పాటు వదిలేసి, చన్నీళ్లతో కడిగేసుకోండి. ముల్తాని మట్టిలోని ఖనిజ సంబంధ పదార్థాలు చర్మానికి పోషణనిస్తాయి. అలాగే దీనిలోని ప్రత్యేకతత్వాలు ముఖచర్మం మీద ఉండే పెద్దవిగా కనిపించే రంధ్రాలను మూసివేస్తాయి. 
ఇక తేనె ,పాలు చర్మానికి వెలుపలనుంచి పోషణనిస్తాయి. దీనిలో చర్మం , అందంగా , సజీవంగా ఆరోగ్యంగా కనిపిస్తుంది.

3.)    ముఖంలో ముడతల్ని,ముసలితనాన్ని తగ్గించే ఫేస్ ప్యాక్...

చర్మం సాగిపోయి చిన్నతనంలోనే ముసలితనపు లక్షణాలు కనిపిస్తున్నపుడు చర్మాన్ని తిరిగి బిగుతుగా నునుపుగా , తేమగా మార్చే ఔషధం ఇది.

తయారీ పద్ధతి, వాడాల్సిన విధానం...

తాజా బంతిపువ్వుల రేకలను విడదీసి 2 కప్పులు ఒక బౌల్ నీళ్లలో వేసి రెండు, మూడు గంటల పాటు నాన పెట్టండి. తర్వాత వీటిని బాగా కలియతిప్పి , పిసికి పేస్ట్ లాగా తయారు చేసి , పెద్ద చెంచాడు గ్లిజరిన్ వేసి గిలక్కొట్టి కలపండి. తర్వాత దీనిని మీ ముఖం మీద, మెడ మీద పూసుకుని పావు గంట తర్వాత కడిగేసుకోండి. చాలా మందికి బంతిపువ్వులను ఫేస్ ప్యాక్ కోసం వాడవచ్చు అని తెలియదు. కానీ దీని పనితీరు అమోఘం . ఈది ముఖ చర్మానికి పోషక తత్వాలను అందిస్తుంది. స్కిన్ టానిక్ లాగా పనిచేస్తుంది. 

4.)    ఎండలతో కమిలిన ముఖచర్మానికి ఫేస్ ప్యాక్...

ఎండకు గురైన చర్మానికి మంటగా అందిస్తుంది,మచ్చలు కూడా తయారౌతాయి.వీటిని సరైన సమయంలో తగ్గించుకోకపోతే ఇవి దీర్ఘ కాల సమస్యగా మారుతాయి. ఎండలు చర్మం మీద దాడి చేయకుండా రక్షించడంతోపాటు మంటను తగ్గించే తేలికైన, సమర్థవంతమైన ఔషధం ఇది.

తయారీ పద్ధతి వాడాల్సిన విధానం...

తాజా పుచ్చకాయను స్లైసులుగా కోసి , ఎర్రటి గుజ్జు భాగం మీద నిమ్మ చెక్కను పిండి, దానిని నేరుగా ముఖం మీద ఒత్తిడి కలిగిస్తూ ప్రయోగించి , వలయాకారంగా రుద్దుకుంటూ ప్రయోగించుకోండి,మసాజ్ చేసుకోండి. దీనిని ప్రయోగించి అ తర్వాత, 20 నిమిషాలు ఆగి ముఖచర్మాన్ని చన్నీళ్లతో కడిగేసుకోండి. మీ ముఖం శుభ్రపడి, తాజాగా, కడిగిన ముత్యం లాగా , కొత్త కాంతితో మెరిసిపోతుంది. పుచ్చకాయ ఎండబేడిమినుంచి కాపాడటమే కాకుండా , చర్మానికి మెరుపును, తేమను, బిగువును , సౌకుమార్యాన్ని కలిగిస్తుంది. ఒక నిమ్మరసం సూర్య కిరణాలను అడ్డుకొని చర్మానికి రక్షణనిస్తుంది. 

5.)    ముఖం మీద జిడ్డును తగ్గించే ఫేస్ ప్యాక్...

ముఖచర్మం మీద జిడ్డు పేరుకుపోవడం వల్ల ఎంతబాగా కనిపించాలని ప్రయత్నించినా నిరాశే మిగులుగుతుంది. జిడ్డువల్ల సమస్యలు అన్నీ ఇన్నీ కావు. చర్మం కాంతివిహీనంగా కనిపిస్తుంది. మొటిమలకు ఆస్కారం ఏర్పడుతుంది. అన్నిటికి మించి ఫ్రెష్ నెస్ దూరమౌతుంది. పైగా వెలుపలి పొరమీద తైలం పేరుకుపోవడం వల్ల లోపలి పొరలను పోషక తత్వాలు అందవు. జిడ్డు చర్మానికి పోషక తత్వాలు అందిచటంతో పాటు అదనపు నూనె పదార్థాన్ని పీల్చుకొని చర్మాన్ని తాజాగా మార్చే మహత్తరమైన ఔషధ లేపనం ఇది.

తయారీ పద్ధతి వాడాల్సిన విధానం...

ఒక గుప్పెడు స్త్రాబెర్రీలను ముక్కలుగా తరిగి , గ్రైండర్లో వేసి పేస్ట్ గా మారేంతవరకు గ్రైండ్ చేసి దీనిలో ఒక నిమ్మ కాయను, పెరుగును కలిపి గిలక్కొట్టి ఒక పాత్రలోపోసి అరగంట పాటు ఫ్రిజ్లో ఉంచండి. తర్వాత తీసి ముఖం మీద మెడ మీద పూసుకుని పేస్ట్ గట్టిపడటం మొదలెట్టిన తర్వాత తిరిగి కొద్దిగా తీసుకుని మరొక పొరలాగా ప్రయోగించి 20 నిమిషాలపాటు వదిలేయండి. తర్వాత రుద్దుకొని నీళ్లతో కడిగేసుకోండి. దీనితో మీ ముఖం కోమలంగా కనిపిస్తుంది. 

మొటిమలను ఎప్పుడూ వేళ్లతో గిల్లవద్దు, అలా చేస్తే మొటిమలను తగ్గించుకోవడానికు బదులు, ఇన్ ఫెక్షన్ తగ్గించుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. 


19, మార్చి 2013, మంగళవారం

మొటిమలు - ఆయుర్వేద చికిత్స

చర్మ సౌందర్యాన్ని పెంచే ఔషధాలు.

1. మొటిమలను తగ్గించే ఔషదం

అర టీ స్పూన్ ఉడు కులాం ( మగవాళ్ళు వాడే జర్మన్  పర్ఫ్యూమ్ )
అర టీ స్పూన్ కాచి చల్లార్చిన నిమ్మరసం
ఒక బౌల్లో పైన చెప్పిన పదార్థాలను కలపండి. సొల్యూషన్ తయారవుతుంది .దీనిని దూది ఉండతో మొటిమల మీద రు ద్దు కోండి . ఆరి పోయిన తర్వాత మళ్లీ పూసుకోండి. ఆరిపోయిన తర్వాత కడిగేసుకోండి .ఇలా రోజూ ప్రతి రాత్రి  పడుకునే ముందుచేస్తూ ఉండండి. మొటిమలు త్వరగా తగ్గిపోతాయి. దీని లో ని ఆల్కహాల్ కొవ్వును కరిగిస్తుంది .నిమ్మరసం చర్మాన్ని మరమ్మతు చేస్తుంది.

2 . మొటిమలను తగ్గించే ఔషదం

రెండు టేబుల్ స్పూన్ల కమలాపండు తొక్కల చూర్ణం
నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు

ఒక బౌల్లో పైన తెలిపిన పదార్ధాలు చక్కగా కలపండి చిక్కని పేస్టు తయారవుతుంది. దీనిని చేతివేళ్ళతో కాని బ్రష్ తో కానీ ముఖం మీద మొటిమలు మీద పూసుకోండి. వలయాకారంలో లో రుద్దు కోండి. ఆరిపోయిన తర్వాత చన్నీళ్లతో కడిగేసుకోవాలి . దీంతో  చర్మం మీద  రంధ్రాల పూడిక తొలగిపోతుంది. కమలాపండు తొక్కల చూర్ణం చర్మం మీద  రక్తప్రసరణ పెంచుతుంది .సన్ ట్యా న్ ని తగ్గిస్తుంది. పెరుగు చర్మం మీద ఫంగస్  పెరగ నివ్వదు.

3 . కాంతి కోల్పోయిన చర్మాన్ని అందంగా మార్చే ఔషధం

ఒక టీ స్పూన్ కమలా పండు తొక్కలు చూర్ణం,ఒక టీస్పూన్ నిమ్మ పండు తొక్కలు చూర్ణం,ఒక టీ స్పూన్ ఓట్స్ పొడి ,ఒక టీ స్పూన్ బాదం గింజల పొడి,ఒక టీ స్పూన్ ఆలివ్ నూనె, తగినంత రోజ్ వాటర్ పేస్టులాగా చేయడానికి.

ఒక బౌల్లో పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పేస్టులాగా తయారుచేయండి. దీనిని చర్మం మీద పూసుకుని బాగా రుద్ది పావుగంట పాటు అలా వదిలేయండి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి. దీనితో మీ చర్మం కొత్త కాంతితో, తేజస్సుతో మెరిసిపోతుంది.

సన్నగా మారడానికి ఆయుర్వేద సూచనలు

సన్నగా ,నాజూకుగా మారాలనే కోరిక కల్గిన వారు కొన్ని ముఖ్యమైన సూచనలను పాటిస్తే సరైన ఫలితం ఉంటుంది.

1 . అన్ని రుచులూ కలిగిన ఆహార పదార్థాలను తినడం,వేపుడు కూరలకు బదులు పులుసు కూరలు వాడడం,ఆహారాన్ని నెమ్మదిగా తినడం చేయాలి.

2 . సమయానికి తక్కువ మొత్తాల్లో తినాలి.

3 . వ్యాయామానికి ముందు కనీసం ఏడాది పాటు పాత తేనెను 2 చెంచాలు ,గ్లాసెడు గోరు వెచ్చని నీటికి కలిపి తాగాలి.

4 . ఆహారంగా పీచు కలిగిన ఓట్స్ ,బార్లీ వంటి శూక ధాన్యం / సిరియల్స్ తినాలి.బియ్యం తినే వాళ్ళు ఏడాది పాతబడిన  బియ్యం వాడాలి. 

5 . వేడి నీళ్ళు తాగుతుండడం,వేడి నీటి స్నానం చేయడం వంటివి చేయాలి.

6 . మజ్జిగ ఎంతో మేలు చేస్తుంది.

7 . శరీరానికి ,మనసుకు ఎప్పుడూ ఏదో వ్యాపకం కలిగించుకుంటుండాలి.క్రమం తప్పకుండా అర్ధ శక్తిగా వ్యాయామం చేయాలి.

8 . స్నానానికి ముందు అగరు,పెసర్లు,చిరుశనగలు మొదలైన పదార్థాలతో చేసిన సున్ని పిండితో వేడి పుట్టేలా నలుగు పెట్టుకోవాలి.

9 . మెత్తటి సోఫాలూ,పరుపూ వాడకూడదు.

10 . పగటి పూట నిద్ర మంచిది కాదు.

ఇంటివద్ద చేసుకునే చికిత్సలు - 

1 . ముల్లంగి రసం మోతాదుకు 3 చెంచాల చొప్పున రోజుకి 3 సార్లు తీసుకోవాలి.

2 . కరక్కాయ పెచ్చుల చూర్ణాన్ని మోతాదుకు అర చెంచా చొప్పున 2 పూటలా తేనెతో గాని లేదా వేడి నీటితో గాని తీసుకోవాలి.

3 . రేగు ఆకుల ముద్దను ఉలవచారు లేదా శనగలతో చేసిన చారుకి కలిపి తీసుకోవాలి.

4 . ప్రతి రోజూ ఉదయం ఒక తమలపాకులో 10 మిరియం గింజలను చుట్టి తిని వెంటనే ఒక గ్లాసు చన్నీళ్లు తాగాలి.

5 . ఆముదం ఆకులను కాల్చి బూడిద చేసి నిల్వ చేసుకోవాలి.దీనిని మోతాదుకు చిటికెడు చొప్పున చిటికెడు ఇంగువ పొడిని కలిపి రెండు పూటలా బియ్యం కడిగిన నీళ్లతో కలిపి తీసుకోవాలి.

6 . కటుక రోహిణి చూర్ణం 3 భాగాలు,చిత్రమూలం వేరు బెరడు చూర్ణం 3 భాగాలు ,శిలాజిత్ చూర్ణం 2 భాగాలు ,గలిజేరు / పునర్నవ పంచాంగ చూర్ణం 5 భాగాలు చొప్పున కలిపి మోతాదుకు అరచెంచాడు చొప్పున తేనెతో ఆహారం ముందు 2 పూటలా తీసుకోవాలి.

7 . తిప్పసత్తు / గుడూచి సత్వం ,తుంగముస్తల చూర్ణాన్ని 2 పూతలా తేనె అనుపానంగా మోతాదుకు 3 గ్రాముల చొప్పున తీసుకోవాలి.

8 . అర టీ స్పూన్ వాయు విడంగాల చూర్ణాన్ని తేనెతో కలిపి 2 పూటలా వాడాలి.

9 . శొంఠి ,వాయువిడంగాలు,యవక్షారం ,కాంత లోహ భస్మాల సమ మిశ్రమాన్ని 2 పూటలా పూటకు 1 గ్రాము మోతాదుగా తేనె అనుపానంగా తీసుకోవాలి.

10 . త్రికటు / శొంఠి,పిప్పళ్ళు,మిరియాలు ,త్రిఫలాలు / కరక్కాయ,తాని కాయ,ఉసిరి కాయ , వాయు విడంగాలు,చిత్రమూలం ,తుంగ ముస్తలను ఒక్కో దానిని రెండేసి భాగాలుగా తీసుకొని అందులో ఒక భాగం శుద్ధ గుగ్గిలాన్ని కలపాలి.ఈ మిశ్రమాన్ని మోతాదుకు 3 - 6 గ్రాముల చొప్పున తేనెతో కలిపి 2 పూటలా వాడాలి.

18, మార్చి 2013, సోమవారం

కేశ సౌందర్యం / వెంట్రుకల సమస్యలు - ఆయుర్వేదం

గృహచికిత్సలు..

• మిరియాలను మెత్తగా నూరి జుట్టురాలిన చోట రుద్దితే నిద్రాణస్థితిలోకివెళ్లిన వెంట్రుకల కుదుళ్లు తిరిగి ప్రేరే
పితమై చైతన్యవంతంగా మారుతాయి.• పసుపును, మానుపసుపులను మెత్తగాపొడిచేసి, వెన్నతో సహా ముద్దగా నూరితలకు పట్టించి గంట సేపుంచితలస్నానం చేస్తే వెంట్రుకలు నిలువుగాచీలటం తగ్గుతుంది.

• మినుములు కిలో, ఉసిరిక వరుగుఅరకిలో, సీకాకాయలు పావుకిలో,మెంతులు పావుకిలో చొప్పున తీసుకొని
విడివిడిగా నూరి కలిపి నిల్వచేసుకోవాలి. దీనిని తడవకు రెండు టేబుల్స్పూన్ ల మోతాదులో తీసుకొని అరగ్లాసు
నీళ్లల్లో కలిపి పావుగంటపాటు నానబెట్టితలకు హెయిర్ ప్యాక్ చేసుకొనిఅరగంట తరువాత తలస్నానంచేయాలి.

• మర్రిచెట్టు వేళ్లను పావుకిలో సేకరించిఆరబెట్టాలి. తడిలేకుండా ఆరిపోయినతరువాత లీటర్ కొబ్బరినూనెకు కలిపి15 రోజులపాటు నానబెట్టి వడపోసి,శుభ్రమైన సీసాలో నిల్వ చేసుకోవాలి.దీనిని ప్రతిరోజూ తలనూనెగా రాత్రినిద్రపోయేటప్పుడు వాడుకుంటే చక్కని
ఫలితం కనిపిస్తుంది.

* చేదుపొట్ల ఆకు రసాన్ని వెంట్రుకలుఊడిన చోట రుద్దుతుంటే ఐదారురోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఉమ్మెత్త (దత్తూర) ఆకుల రసాన్నిగానిలేదా బొప్పాయి పువ్వుల రసాన్నిగానిలేదా మంగచెట్టు పువ్వుల రసాన్ని గానిమాడు పైన రాసుకుంటే జుట్టుపెరుగుతుంది.

ఉసిరి వలుపు, అతిమధురం వేరుచూర్ణాలను మెత్తగా నూరి ముద్దగాచేసి దానికి నాలుగు రెట్లు నువ్వుల
నూనెను, నూనెకు నాలుగు రెట్లుఆవుపాలను, నాలుగు రెట్లు నీళ్లనూచేర్చి కేవలం నూనె మాత్రమేమిగిలేంత వరకూ చిన్న మంటమీదమరిగించి వడపోసి శుభ్రమైన సీసాలో
నిల్వచేసుకోవాలి.దీనినిప్రతినిత్యంరెండుముక్కురంధ్రాల్లోనూ నస్యంగారెండేసి చుక్కల చొప్పున వేసుకుంటుంటే
జుట్టు పెరుగుతుంది.

• మందారపువ్వులతో జుట్టు ఊడినభాగాన్నివేడిపుట్టేలాగా బాగా రుద్దాలి.తరువాత గురివిందగింజల పొడినీ,
నల్లజీడి గింజల పొడినీ, నేలములకపండ్లరసాన్నీ కలిపి మర్ధిస్తే మొండిపేనుకొరుకుడు సమస్యల్లో కూడా గుణం
కనిపిస్తుంది.

పల్లేరు ఆకులు, నువ్వు చెట్టు పూలనుతేనె, నెయ్యిలతో కలిపి నూరి లేపనంచేస్తే జుట్టు దట్టంగా పెరుగుతుంది.

- ఏనుగుదంతాన్ని కాల్చి మసిచేసిపాలలో కలిపి నూరి జుట్టు ఊడినచోట ప్రయోగిస్తే ఆశ్చర్యకరమైన
ఫలితం కనిపిస్తుంది. హస్తిదంతమసిగాఈ ఔషధం ఆయుర్వేద వైద్యవర్గాల్లోచాలా ప్రసిద్ధిగాంచింది. మరీ మొండికేసుల్లో ఏనుగు దంత మసినిరసాంజనం (మానుపసుపు ఘనం)తోకలిపి మేకపాలతో నూరి వెంట్రుకలుఊడినచోట పైపూతగా ప్రయోగిస్తే
తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.

- గురువింద గింజలనుగాని లేదాగురివింద వేరునుగాని నీళ్లతో సహాముద్దగా నూరి వెంట్రుకలు ఊడిన
చోట లేపనం చేయాలి.

• ములక (వాకుడు) పండ్లనుగాని లేదావాకుడువేరునుగాని ముద్దగా దంచిరసం పిండి తేనె కలిపి జుట్టు ప్యాచ్
మాదిరిగా ఊడిన చోట రాస్తుంటేచక్కని ఫలితం కనిపిస్తుంది.

• నల్లజీడిగింజల రసాన్ని పేనుకొరుకుడుప్యాచ్ మీద పూస్తే తిరిగి జుట్టుపెరుగుతుంది. ఇది చాలా ఉగ్రపదార్థం
కనుక నిద్రాణ స్థితిలోకి వెళ్లినవెంట్రుకల కుదుళ్లను ప్రేరేపించి తిరిగిచైతన్యవంతంగా మారుస్తుంది. అయితే
కొంతమందికి ఇది సరిపడదు. దీనితోదురద, దద్దురు, రసికారడం వంటిఎలర్జీ లక్షణాలు ఉత్పన్నమవుతాయి.
అలాంటి సందర్భాల్లో దీనిని రాయటంనిలిపివేసి కొబ్బరినూనెను బాహ్యంగాప్రయోగిస్తే సరిపోతుంది.

జాజి ఆకు, కానుగ ఆకు, ఉలిమిరిపట్ట, గన్నేరు ఆకు, గన్నేరు వేరు,చిత్రమూలం అనే మూలిక వేరును
సమపాళ్లలో తీసుకొని ముద్దగానూరాలి. ఈ ముద్దకు నాలుగింతలునల్ల నువ్వులనూనెను, నూనెకు
నాలుగింతలు నీళ్లనూ కలిపి నీరుఆవిరైపోయేంతవరకూ చిన్నమంటమీదమరిగించితైలాన్నివడపోనినిల్వచేసుకోవాలి. దీనిని జుట్టుఊడినచోట తలకు ప్రయోగిస్తుంటే
తప్పకుండా ఫలితం కనిపిస్తుంది,

 చుండ్రు వల్ల జుట్టు ఊడుతున్నప్పుడుమామిడిటెంకలోని జీడిని, కరక్కాయలవలుపునీ సమపాళ్లలో తీసుకొని
పాలతో సహా నూరి ప్రయోగిస్తే చుండ్రుతగ్గిపోయి జుట్టు తిరిగి పెరగుతుంది.

జుట్టు వల్చబడుతున్నప్పుడుమందారపువ్వులను ముద్దగా నూరినల్లనువ్వుల నూనెలో వేసి తైలపాకవిధానంలో కాచి తలనూనెగావాడుకుంటే గుణకారిగా ఉంటుంది.
ఉసిరిచెట్టు వేరును, మర్రి ఊడలను,జటామాంసి వేరును కలిపి నూరిబాహ్యంగా ప్రయోగిస్తే కేశాలు బాగా
పెరుగుతాయి.

• అతిమధురం, నల్లకలువ (నీలోత్పల),ద్రాక్షలను కలిపి నువ్వులనూనె,ఆవుపాలు, నెయ్యిలతో సహా నూరి
తలకు లేపనం చేసుకొని గంటతరువాత తలస్నానం చేయాలి.

• జెముడుపాలు (స్నుహి), జిల్లేడుపాలు(అర్క),పొత్తిదుంప (లాంగలి),గురివిందగింజలు, చేదుపుచ్చ, తెల్ల-
ఆవాలు, వసకొమ్ము, మేకమూత్రంవీటిని అన్నిటినీ కలిపి మెత్తని ముద్దగానూరి నువ్వులనూనెతో తైలపాక
విధానంలో తైలం కాచి తలకురాసుకుంటే మొండిగా ఇబ్బంది పెట్టేపేనుకొరుకుడులో సైతం మంచి ఫలితం
కనిపిస్తుంది.
- మణిశిల,కాసీసం, మైలతుద్ధం వీటినిసంహితాకారులు ఖాలిత్య వ్యాధిలోలేపన ద్రవ్యాలుగా వాడవచ్చునని
సూచించారు. వీటిని తల మీదప్రయోగిస్తే ఉగ్రస్వభావం వలనవెంట్రుకల కుదుళ్ళు ప్రేరేపితమై నిద్రాణస్థితి నుండి చైతన్యపూరిత స్థితిలోనికిమారతాయి.ఫలితంగా జుట్టుపెరుగుతుంది.గుర్రపుగిట్టలనుకాల్చిమసిచేసివెన్నలోకలిపిపేనుకొరుకుడుకనిపించిన చోట ప్రయోగిస్తే మంచి
ఫలితం కనిపిస్తుంది.

జానపద వైద్యం..

మోదుగ గింజలను పలాశ) మెత్తగానూరి, నిమ్మరసం కలిపి తలకు పట్టించిరుద్దుకుంటే జుట్టు రాలటం తగ్గుతుంది.

నల్లులను చంపిఆ రక్తాన్నిపేనుకొరుకుడు కనిపించే చోట పూస్తేజుట్టు తిరిగి వస్తుంది.

 గురివిందగింజలనునీటిలోసహానూరిఎండబెట్టికొబ్బరినూనెలో వేసికాచితలనూనెగావాడుకుంటేపేనుకొరుకుడువ్యాధి తగ్గుతుంది.
• ములగపండు, గురివింద వేరు,గురివింద గింజను నూరి తేనె కలిపిపేనుకొరుకుడు ఉన్నచోట పూయాలి.
• గన్నేరు వేరును అరకిలో మోతాదులోతీసుకొని అరలీటరు గేదెపాలలోమరిగించి తోడు పెట్టి పెరుగుగామార్చాలి. దీనిని చిలికి వెన్నతీసి నెయ్యితయారు చేసుకోవాలి. ఈ నెయ్యిని
చెంచాడు మోతాదుగా తమలపాకురసంతో కలిపి
తీసుకోవాలి.
పిల్లిపీచరగడ్డలను (శతావరిపేర్లు) మెత్తగాదంచి ముద్దచేసి పాలతో కలిపి 3నెలలపాటు తలకు ప్రయోగిస్తే జుట్టు
దట్టంగా పెరుగుతుంది.
• నీలి చెట్టును సమూలంగా తెచ్చి ఆరబెట్టిమండించి బూడిద చేయాలి. ఈబూడిదను సోయాచిక్కుడు నూనెతో కలిపిస్థానికంగా జుట్టు ఊడిన చోట రాస్తేపెరుగుతుంది.
* దొండ ఆకులను దంచి రసం తీసి తలకుపూస్తే జుట్టు రాలటం తగ్గుతుంది.
• రేగు ఆకులను, వేప ఆకులను ఒక్కోటిఒక్కోకిలో చొప్పున తీసుకొని 5 లీటర్లునీళ్లు కలిపి కేవలం లీటర్ నీళ్లు మాత్రమే
మిగిలేంతవరకూమరిగించాలి.తరువాతపిప్పినికషాయంతో సహామెత్తగా పేస్టు మాదిరిగా మారేంతవరకూ నూరి తలకు లేపనం చేస్తుంటేజుట్టు వత్తుగా పెరుగుతుంది.

 పేనుకొరుకుడుఉన్నచోటనల్లఉమ్మెత్త(ధత్తూర)పువ్వులను, పండ్లను మెత్తగాదంచి కొబ్బరినూనెతో కలిపి బాహ్యంగా
ప్రయోగించాలి.

10, మార్చి 2013, ఆదివారం

గులాబీ పూలు - ఆయుర్వేదం


గులాబీ పువ్వులో రెక్కలన్నీరాలిపోయిన తరువాత
మిగిలిపోయిన బొండు భాగాన్నిరోజ్ హిప్స్ అంటారు. వీటిల్లోవిటమిన్సిఅత్యధికమొత్తాల్లోఉంటుంది.ఆసక్తికరమైనవిశేషమేమంటే, ప్రతి 100గ్రాముల రోజ్ హ్ లోనూ 150
మి.గ్రా. ఆస్కార్బిక్ యాసిడ్(విటమిన్-సి) వుంటుంది.
విటమిన్-సి నిల్వలుగాపేరుగాంచిన కమలాపండ్లరసంలో ప్రతి 100 మి.లీరసానికి విటమిన్-సి 50మిల్లీగ్రాములు మాత్రమే ఉండటంగమనార్హం. అలాగే టమాటాల్లో
20 మిల్లీ గ్రాములూ, యాపిల్స్ లో5 మిల్లీ గ్రాములూ మాత్రమేవుంటుంది.

తయారయ్యేవైద్యసంబంధ ఉత్పత్తులు..

రోజ్ పెటల్స్, గులాబీపువ్వుల ఆకర్షణ పత్రాలను మొగ్గ
దశలోనే వేరుపరిచి నీడలో - అతి కొద్దిసేపు50 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద - ఎండబెట్టినిల్వచేస్తారు. వీటిని 'పాన ఖురి' అంటారు.శీతలపానీయాల్లో సువాసనకోసం, చల్లదనం
కోసం వాడుతారు.

రోజ్ వాటర్..

తాజా గులాబీ పూరెక్కలను నీళ్లలో కలిపిఆవిరి వచ్చేంత వరకూ మరిగించి, నీటిఆవిరిని మరో పాత్రలో సేకరించి
చల్లబరుస్తారు. దీనినే రోజ్ వాటర్ అంటారు.ఈ ప్రక్రియను శాస్త్రీయపరిభాషలోడిస్టిలేషన్అంటారు.దీనినిబాహ్యాభ్యంతరంగా,మోతాదుకు రెండు పెద్ద చెంచాల చొప్పునవాడతారు. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది.కళ్లకలకవంటిపిత్తవికారాలను తగ్గిస్తుంది.

రోజ్ టింక్చర్..

ఒక గ్లాసు నీళ్లను మరిగించి అందులోరెండు టేబుల్ స్పూన్ల గులాబీ రెక్కలను(ఎండినవి), 10 చుక్కల ఆయిలా ఆఫ్
విట్రియాల్ ని, 4 టీస్పూన్ల పంచదారనుకలిపితే రోజ్ టింక్చర్ తయారవుతుంది.
దీనిని రోజుకు రెండు, మూడుసార్లు, పూటకు2-3 టీస్పూన్ల మోతాదులో వాడితే రక్త స్రావాలు,కడుపు నొప్పి వంటివి తగ్గుతాయి.



రోజ్ వెనిగర్..

వెనిగార్ లో గులాబీ పూరెక్కలను వేసినానబెట్టి వడపోస్తే రోజ్ వెనిగార్తయారవుతుంది. దీనిలో గుడ్డను తడిపి
నుదిటి మీద పట్టువేసుకుంటే తలనొప్పితగ్గుతుంది.


రోజ్ హనీ..

తాజా గులాబీ పూరెక్కలను నీళ్లలో వేసిచిక్కగా మారేంత వరకూ మరిగించి, వడపోసితేనె కలిపితే రోజ్ హనీ తయారైనట్లే. దీనినిగొంతునొప్పిలో లోపలకు వాడతారు.

గుల్కంద్..

గులాబీ పూరెక్కలను, తేనెను,పంచదారను పొరలుగా పరిచి పదిహేను.రోజులవరకూ మాగేస్తే గుల్కంద్
తయారవుతుంది. దీనిని ఎండాకాలంవడదెబ్బ నుంచి రక్షించుకోవడానికి పాలతోకలిపి వాడతారు. అలాగే మహిళల్లో అధికబహిష్టుస్రావాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.

గుల్లోగన్ తైలం..

నల్లనువ్వులను తడిపి, గులాబీ పూరెక్కలముద్దను పట్టించి నూనెగానుగలో వేసి తైలాన్నిపిండుతారు. దీనిని తలకు రాసుకుంటే జుట్టుసహజమైన సువాసనను వెదజల్లుతుంది.
తలనొప్పి, మాడుపోటు వంటివిదూరమవుతాయి.

రోజ్ మాయిశ్చరైజర్..

గులాబీ జలాన్ని (రోజ్ వాటర్), గ్లిజరిన్ నిఒక్కో భాగం తీసుకొని, ఒక సీసాలో వేసిబాగా గిలకొడితే చక్కని మాయిశ్చరైజర్తయారవుతుంది. దీనిని పొడి చర్మానికి
రాసుకుంటే చర్మం కుసుమకోమలంగాతయారవుతుంది. వ్యాపారదృక్పథంతోతయారుచేసే మార్కెట్ ఉత్పత్తులకన్నా ఇదిఎన్నో రెట్లు హితకరంగా పనిచేస్తుంది.

గృహచికిత్సలు..

రక్తహీనత..
ఆరు టీస్పూన్ల గులాబీ రేకులను, ఆరుటీస్పూన్ల సోపు గింజలను కలిపి నూరి రెండుకప్పుల నీళ్లలో వేసి మరిగించి వడపోసి,రోజుకు రెండుసార్లు తీసుకుంటుంటేక్రమంగా రక్తహీనతనుంచి బయటపడతారు.

గుండె నొప్పి..

ఒక టీస్పూన్ గులాబీ నూనెను, నాలుగుటీస్పూన్ల బాదం నూనెను కలిపి ఛాతి మీదఉదయ, సాయంకాలాలు ప్రయోగించిమర్దనా చేసుకుంటుంటే గుండెనొప్పిలో
హితకరంగా ఉంటుంది.

ఆందోళన, రక్తవికారాలు..

రెండు టేబుల్‌ స్పూన్ల గులాబీ పూరేకులనుఒక గ్లాసు నీళ్లలో కలిపి కషాయంతయారుచేసి తీసుకుంటే ఆందోళన,
నర్వసిస్ వంటివి తగ్గుతాయి.

కళ్లలో మంటలు..

రోజ్ వాటర్ ని, పాయలరసాన్నిఒక్కోటి ఒక్కో టీస్పూన్ చొప్పున కలిపి,పరిశుభ్రమైన దూది ప్యాడ్ ని తడిపి మూసినకనురెప్పలమీద పరుచుకుంటే కంటిమంటలు, ఎరుపుదనం, దురద వంటివితగ్గుతాయి.

కాలిన గాయాలు, దెబ్బలు..

రోజ్ వాటర్ని, ఉల్లిపాయల రసాన్నికలిపి గాయాలమీద ప్రయోగిస్తే త్వరితగతినమానతాయి.

క్యాటరాక్ట్..

రోజ్ వాటర్ ని, నిమ్మరసాన్ని 3:1నిష్పత్తిలో తీసుకొని రెండు కళ్లలోనూచుక్కలమందుగా వేసుకుంటే క్యాటరాక్ట్ లోఉపయోగముంటుంది.

కళ్లు తిరగటం, తలనొప్పి..

ఒకటేబుల్ స్పూన్ గులాబీ రెక్కలను ఒకకప్పు నీళ్లలో వేసి మరిగించి తీసుకుంటేతలతిరగటం, తలనొప్పి వంటివి తగ్గుతాయి.

కంటినుంచి నీళ్లు కారటం..

రెండు టీస్పూన్ల రోజ్ వాటర్లో చిటికెడుపటిక పొడిని (ఆలం) కలిపి దూది వుండనుముంచి కళ్లలో డ్రాప్స్ గా చేసుకుంటే
ఆ కళ్లనుంచి నీళ్లు కారటం, కన్నీటి గ్రంథికివచ్చిన ఇన్ఫెక్షన్ వంటివి తగ్గుతాయి.

జ్వరం..

 రోజ్ వాటర్ని, వెనిగారిని సమాననిష్పత్తిలో చల్లని నీళ్లలో కలిపి, నూలు గుడ్డనుతడిపి, మడతలు పెట్టి నుదిటిమీద పరిస్తే శరీరం చల్లబడి జ్వరం దిగుతుంది.

మలద్వారంలో దురదలు..

రోజ్ వాటర్ లో గుడ్డను తడిపి మలద్వారం మీద ఉంచితే దురద, మంటవంటివి తగ్గుతాయి.

తలనొప్పి..

రోజ్వాటర్లో తోకమిరియాల పొడి,శొంఠిపొడిని ఒక్కో టీస్పూన్ చొప్పున కలిపిఆ పేస్టు మాదిరిగా చేసి నొప్పి మీద ప్రయోగిస్తేతలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

శృంగారేచ్ఛ తగ్గటం..

గులాబీ మొగ్గలు, గులాబీ పూల బౌండ్లు(రోజ్ హిప్స్), టీ పొడి, మల్లెపూలు అన్నీసమానంగా తీసుకొని కలిపి రెండు టేబుల్స్పూన్ల పరిమాణంలో తీసుకొని, రెండుకప్పుల నీళ్లలో వేసి పదినిమిషాలు మరిగించి,ఒక టీస్పూన్ తేనె చేర్చి లోపలకు తీసుకుంటేసెక్స్సెంటర్లుప్రేరణపొందుతాయి. దీంతోలైంగికశక్తి పెరుగుతుంది.

గొంతునొప్పి..

ఎండిన గులాబీ రెక్కలను పొడి చేసితేనెలో కలిపి కొద్ది కొద్దిగా చప్పరిస్తుంటేగొంతునొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది.

గుండెదడ..

ఒకకప్పుగులాబీనీళ్లలోఒకటీస్పూన్సోపుగింజలు,అరటీస్పూన్ ధనియాలు, 10ఎండుద్రాక్షలను కలిపి రాత్రంతా నానబెట్టి,మర్నాడు ఉదయం వడపోసుకొని తీసుకుంటే
గుండెదడ, ఆందోళన వంటివి తగ్గుతాయి.

దీర్ఘకాలం నుంచి బాధించేతలనొప్పి..

గులాబీలు 100 గ్రా., ద్రాక్షపండ్లు 100గ్రా. నీళ్లలో వేసి కషాయం కాచి చిటికెడుఏలక్కాయ గింజల పొడికి కలిపి కొద్ది కొద్దిగాచప్పరిస్తుంటే దీర్ఘకాలం నుంచి బాధించే
తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

మంగుమచ్చలు, మొటిమలు,చీముగడ్డలు..

రోజ్ వాటర్లో కుంకుమపువ్వు, బాదంపలుకులను కలిపి మెత్తగా నూరి ముఖంమీద ఫేస్ ప్యాక్ మాదిరిగా ప్రయోగిస్తే ముఖచర్మం కుసుమకోమలంగా తయారవుతుంది.
మంగుమచ్చలు, మొటిమలు వంటివితగ్గుతాయి.

ఛాతిలో మంట, అజీర్ణం,పులితేన్పులు..

గులాబీలు వేసి నానబెట్టిన నీళ్లను,సున్నపుతేటలో కలిపి, కమలాపండ్ల రసానికిచేర్చి తీసుకుంటే ఎసిడిటి వల్ల వచ్చే
ఛాతినొప్పి, వికారం, అజీర్ణం, అమ్లపిత్తంవంటి సమస్యలు తగ్గుతాయి. 

8, ఫిబ్రవరి 2013, శుక్రవారం

స్త్రీలలో ఒవ్యులేషన్ - అవగాహన

ప్రతి స్త్రీ కీ తల్లి కావాలనే కల ఉంటుంది.తల్లి కాలేని ఆడవాళ్ళు అనుభవించే ఇబ్బందిని వర్ణించటం కష్టం.సమాజ పరంగా ,కుటుంబ పరంగా చాలా ఒత్తిడులు ఎదుర్కొంటారు.సాటి స్త్రీలే తిరస్కరిస్తారు.
తల్లి కావాలని ఉన్నా ,అయేందుకు ఏంచేయాలో తెలియని అమ్మాయిలు చాలా మంది ఉన్నారు.కీలకమైన ఆరోగ్యం,ఆనందం గురించి పట్టించుకోక మిగిలిన అర్థం లేని అంశాలగురించి ఆలోచిస్తారు.వారి నెలవారీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోవాలి.రుతుచక్రం సక్రమంగా ఉన్నవారికి సంతానం తప్పకుండా కలుగుతుంది.స్త్రీ తన శరీరంలో ప్రతి నెలా కలిగే మార్పులను అనుభవిస్తుందే కాని అర్థం చేసుకోదు.ప్రతి నెలా హార్మోన్ లు అల్లరి పెడతాయి,చిరాకు,తెలియని ఇబ్బంది,వాటన్నింటినీ తొలగించి ప్రశాంత పరిచే మగతోడు కోసం మనసూ ,శరీరం రెండూ ఎదురుచూస్తాయి.దీనినే వివాహం అన్నారు.ఆ వివాహం తెప్పిచే అంశాలు,అంతర్గతంగా స్త్రీ ప్రత్యుత్పత్తి అంగాలలో జరుగుతుంది.యుక్త వయసులో ఉన్న స్త్రీ శరీరంలో ప్రతి నెలా ఒక అండం విడుదలఔతుంది.ప్రతి అండం మరో జీవికి జన్మనివ్వాలనుకుంటుంది.అందుకే ఆ అండం విడుదల సమయం అమ్మాయిలలో అలజడి కలిగిస్తుంది.పురుషుడితో కలయికకు ప్రోత్సహిస్తుంది.దీనినే వైద్య పరిభాషలో ఒవ్యులేషన్ అంటారు.అంటే స్త్రీ శరీరంలో అండం విడుదలయ్యే సమయం.ప్రతి నెలా ఈ అండం విడుదలయ్యే సమయం స్త్రీకి సంతానం కలిగించే అవకాశం పెంచుతుంది.

బహిష్టుకి ముందు -

తల్లి కావాలని కోరుకునే అమ్మాయి తన అండం విడుదల సమయాన్ని తెలుసుకోవాలి.విడుదలైన అండం పరిమిత కాలం పాటూ పురుయ్షుడి శుక్రకణం కోసం ఎదురుచూస్తుంది.ఆ సమయంలో పురుషుడితో కలవగలిగిన స్త్రీ అద్రుష్టవంతురాలు.తన కడుపులో కొత్త జీవికి ప్రాణం పోస్తుంది.

స్త్రీ ప్రత్యుత్పత్తి అంగం అండాశయం.బాహ్యంగా కనిపించేది యోని ఐతే దాని లోపల ఉంటాయి గర్భాశయం,అండాశయం, అండాశయం నుంచి ఉండే అండనాళం.

ప్రతి నెలా అండాశయం నుంచి ఒక అండం విడుదలఔతుంది.అండాశయంలో అనేక అపరిపక్వ అండాలు ఉన్నప్పటికీ బహిష్టుకి ముందు రోజుల్లో ఒకే ఒక అండం మాత్రం వేగంగా అభివృద్ధి చెంది పరిపక్వ అండంగా మారుతుంది.ఈ అండం మిగతా వాటికంటే వేగంగా పెరిగి పెద్దదౌతుంది.దీనిచుట్టూ ద్రవపదార్థం పోషకపదార్థంగా చేరుతుంది.

హార్మోనుల ప్రభావాన జరిగే ఈ మార్పులతో అండం ఒక అండగుళికగా రూపు దిద్దుకుంటుంది.ఇందుకు 12 నుంచి 14 రోజులు పడుతుంది.పూర్తిగా అభివృద్ధి చెందిన గుళిక బద్ధలై అండం విడుదల చేస్తుంది.ఇది అండనాళికలోనికి ప్రవేశిస్తుంది.

పరిపక్వ అండవిడుదలనే ఒవ్యులేషన్ అంటారు.అండనాళంలో చేరిన అండం శుక్రకణంతో కలిసి పిండంగా మారటానికి సిద్ధంగా ఉంటుంది.

అండవిడుదల సమయం స్త్రీలలో కొన్ని స్పష్టమైన మార్పులు తెస్తుంది.వీటిని అర్థం చేసుకోవడం అంత కష్టం కాదు.గర్భాశయ ముఖద్వారం దగ్గర ద్రవ పదార్థాలు పెరగడం కనిపిస్తుంది.ఇది అంతర్గతంగా జరిగే మార్పు ఐనా దాని ప్రభావం బయటకు కనిపిస్తుంది.తమ బహిష్టుచక్రం మధ్యలో యోనిలో నుంచి ద్రవాలు అతిగా వస్తాయి.ఇది అండం విడుదలను సూచిస్తుంది.

అండం విడుదల సమయంలో - 

పొత్తి కడుపు భాగంలో నొప్పి వస్తుంది.బహిష్టుకి ముందు వచ్చే నొప్పి అండం విడుదలకు సంకేతం.అండం విడుదలకు కొంచెం ముందుయ్గా లేదా విడుదల సమయంలో బాధ ఏర్పడుతుంది.ఐతే ఇది అందరిలో కనిపించదు.ఇది కనిపించిందంటే అండం విడుదలైంది అనె సంకేతం అందుకున్నట్లే.
శరీర ఉష్ణోగ్రతలో కూడా మార్పు కనిపిస్తుంది.ఒళ్ళు వేడెక్కడం అనె మాట వినే ఉంటాం.అది పురుషుడితో కలవమని హార్మోనులు రెచ్చగొట్టడం. అండం వృధా కాకుండా 
పిండంగా మారాలన్న శారీరక తహతహ అలా చేయిస్తుంది.శ్రీర ఉష్ణోగ్రతలో కొంచెం తేడా చేస్తుంది.శరీరం కింది భాగంలో వేడిగా,పైభాగంలో చల్లగా ఉంటుంది.తర్వాత కింది నుచి పైకి క్రమంగా వేడి వ్యాప్తి చెందుతుంది.అంతా సలుపుతుంది అంటారు.ఇది కూడా అండం విడుదలను సూచించేదే.
ఈ మార్పు కొందరిలో ప్రస్ఫుటంగా ఉంటుంది.కొందరిలో అంత తేడా కనిపించదు.ఇలా అండం విడుదలను8 గుర్తించి ఆ రోజులలో తప్పకుండా సెక్ష్ లో పాల్గొంటే తల్లి అయ్యే అవకాశం బాగా పెరుగుతుంది.అండాశయం నుంచి విడుదలైన పరిపక్వ అండం అండ నాళం లోకి చేరుతుంది.అక్కడ దాదాపు 24 గంటలపాటు పురుషుడి నుంచి వచ్చే శుక్రకణం కోసం వేచి ఉంటుంది.

బహిష్టు తర్వాత - 

ఇది సాధారణంగా గత బహిష్టు తర్వాత 14 వ రోజున అయి ఉంటుంది.ఐతే ఇక్కడ కూడా అందరు స్త్రీలలో రుతుచక్రం ఒకేలా ఉండదు.కొందరిలో ఇది 28 రోజుల చక్రంగా ఉంటుంది.ఇది ఉండాల్సిన రీతిలో ఉన్న రుతుచక్రం.ఇటువంటి సక్రమ రుతుచక్రం ఉన్నవారిలో 14 వ రోజున కలయిక గర్భం వచ్చే అవకాశం పెంచుతుంది.కొందరిలో బహిష్టు చక్రం మరీ అంత స్పష్టంగా ఉండదు.అటువంటివారిలో అండం విడుదల తేదీని స్పష్టంగా చెప్పడం కష్టం.

ఎలా జరుగుతున్నా రుతుచక్రమనేది ఒక వయసులో మొదలై మెనోపాజ్ వరకు కొనసాగుతుంది.ప్రతినెలా ఒక అండం విడుదల ఉంటుంది.అప్పుడప్పుడు రుతుచక్రంలో హెచ్చుతగ్గులు ఏర్పడవచ్చు.

కొద్దిగా ముందే బహిష్టు రావడం లేదా ఆలస్యం అవటం వంటివి జరుగుతాయి.కొందరిలో 31 రోజుల రుతుచక్రం ఉంటుంది.వారికి అండం విడుదల 17 వ రోజున జరుగుతుంది.కాబట్టి 14 నుంచి 17 రోజుల మధ్యలో సెక్ష్ లో పాల్గొంటే గర్భం వచ్చే అవకాశం ఎక్కువ.కొంతమందిలో 26 రోజులకు ఒకసారి అండం విడుదల అవుతుంటుంది.అటువంటి వారు గత బహిష్టు తర్వాత 12 వ రోజు కలవటం ద్వారా గర్భం వస్తుంది.క్రమం తప్పక సెక్ష్ లో పాల్గొనే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గర్భం వస్తుంది.కాని కొంతమంది అంత త్వరగా గర్భం దాల్చరు.అలాంటివారు ఈ రోజులను లెక్కపెట్టుకుని సెక్ష్ లో పాల్గొనటం అవసరమే.

సెక్ష్ లో పాల్గొన్నప్పుడు శారీరకంగా ,మానసికంగా ఆనందం ,తృప్తి కలుగుతుంది.అదే సమయంలో సెక్ష్ తర్వాత స్త్రీ శరీరంలో సంభవించే మార్పుల మీద అవగాహన అవసరం.

ఫలదీకరణం -  

సెక్ష్ లో పాల్గొన్నప్పుడు పురుషుడు తన అంగం స్త్రీ యోని లోకి ప్రవేశపెట్టి స్ఖలిస్తాడు.అపుడు వృషణాలలో తయారైన శుక్ర కణాలు పురుషాంగానికి చేరి,ప్రొస్టేట్ గ్రంధి స్రావాలతో కలిసి యోనిలో వదలబడతాయి.ఒకసారి స్ఖలిస్తే పురుషుడు 60 నుంచి 500 మిలియన్ శుక్రకణాలు స్త్రీ యోనిలోకి వదులుతాడు.అటువంటి కణం కోసం అండం ఎదురుచూస్తుంటుంది.అన్నిచోట్లా శుక్రకణాలు యోనిలోకి వదలబడినా చివరికి అండం సమీపానికి చేరేవి కేవలం 200 కన్నా ఎక్కువ ఉండవు.వీటిలో ఏదో ఒక కణమే చివరికి అండాన్ని ఫలదీకరణం చేయగలుగుతుంది.శుక్రకణం కొరడా వంటి తోకను కలిగి ఈదుతుంది.వె ఈతతో వెతుక్కుని వెళ్లి అండాన్ని తాకి అండంతో కలుస్తుంది.  ఆండంతో కలిసే  ముందు తోకను వదిలేస్తుంది.అండం శుక్రకణం కోసం 24 గంటలు మాత్రమే వేచి ఉండగలదు.కాని శుక్రకణం యోనిలో వదలబడిన తర్వాత 48 గంటల వరకు చైతన్యవంతంగా ఉంటుంది.కలయిక తర్వత ఏర్పడిన సమ్యుక్తబీజం నుంచే కొత్త జీవి ఏర్పడటం మొదలవుతుంది.అందుకు తగిన ఏర్పాటు గర్భాశయంలో ప్రతినెలా చేయబడుతుంది.ఫలదీకరణ చెందిన అండం నెమ్మదిగా గర్భాశయం చేరి గర్భాశయ గోడలోకి చేరుతుంది.ఆ సమ్యుక్త బీజం వచ్చి స్థిరపడేందుకు అవసరమైన సౌకర్యం గర్భాశయంలో   జరుగుతుంది.  ఈవన్నీ హార్మోన్ ళా ప్రభావాన జరిగే మార్పులే. ఘర్భాశయ గోడలో చేరిన సమ్యుక్త బీజం తల్లి నుంచి ఆహారం తీసుకునేదుకు వీలైన పేగును ఏర్పరచుకుని గోడ నుంచి వెలుపలికి వచ్చి ఎదగటం మొదలుపెడుతుంది.9 నెలలు ఎదగటానికి అవసరమైన ద్రవతిత్తిని గర్భాశయం పిండంలో ఏర్పరచుకుంటుంది.

హార్మోన్ లు సక్రమంగా ఉండాలి.- 
ఆండ విడుదలకు ముందు  ఒక పుటికలో ఉంటుంది.ఆ పుటిక పగిలి అండం బయటకు వస్తుంది.పుటిక పగిలినపుడు ప్రొజెస్టిరోన్ కూడా విడుదల చేయబడుతుంది.ఇది గర్భంలో పిండం ఎదుగుదలకు సహకరిస్తుంది.

24 గంటలలోపు ఫలదీకరణకు నోచుకోలేకపోయిన అండం దానితోపాటే ఫలదీకరణం జరిగినపుడు దానిని అందుకోవడానికి గర్భాశయంలో జరిగిన ఏర్పాట్లు కలగలిపి బయటకు పంపబడతాయి.యోని ద్వారా అలా అవి బయటకు పంపబడినప్పుడు రక్తం,పలుచని కండరాలు బయటకు పడతాయి.వీటినే బహిష్టు రక్తం అంటారు.ఇలా ఒకసరి బహిష్టు అయిపోగానే తిరిగొచ్చే నెలలో ఫలదీకరణం అవకాశం కోసం స్త్రీ శరీరంలో  మార్పులు మొదలౌతాయి.

ప్రతి నెలలో అండం ఆశగా పిండం అవగలనని ఎదురుచూస్తుంది.ఆ ఆశ ఫలించనపుడు విచ్చిన్నమౌతుంది.అండం విడుదల తీరునుంచి పురుషుడి నుంచి శుక్రకణం అందుకునేంతవరకు ఎక్కడ ఏ లోపం ఏర్పడినా ఆమెకు గర్భం రాదు.హార్మోన్ ల లోపంతో అండాలు సక్రమంగా విడుదల కాకపోయినా ,విడుదలయిన అండం గర్భాశయం వైపు ప్రయాణం చేయడానికి వీలులేకుండా అనండనాళాలు మూసుకుపోయినా సమస్యే .ఫలదీకరణం చెందిన అండం గర్భాశయాన్ని చేరి స్థిరపడాలంటే హార్మోన్ ల పాత్ర సక్రమంగా ఉండాలి.అవి సక్రమంగా పని చేసినప్పుడు అండం పిండంగా మారుతుంది.అమ్మాయి అమ్మవుతుంది.

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...