Saturday 9 March 2013

ROSE FLOWERS ( GULABI POOLU ) - AYURVEDAM


గులాబీ పువ్వులో రెక్కలన్నీ
రాలిపోయిన తరువాత
మిగిలిపోయిన బొండు భాగాన్ని
రోజ్ హిప్స్ అంటారు. వీటిల్లో
విటమిన్-సి అత్యధిక మొత్తాల్లో
ఉంటుంది. ఆసక్తికరమైన
విశేషమేమంటే, ప్రతి 100
గ్రాముల రోజ్ హ్ లోనూ 150
మి.గ్రా. ఆస్కార్బిక్ యాసిడ్
(విటమిన్-సి) వుంటుంది.
విటమిన్-సి నిల్వలుగా
పేరుగాంచిన కమలాపండ్ల
రసంలో ప్రతి 100 మి.లీ
రసానికి విటమిన్-సి 50
మిల్లీగ్రాములు మాత్రమే ఉండటం
గమనార్హం. అలాగే టమాటాల్లో
20 మిల్లీ గ్రాములూ, యాపిల్స్ లో
5 మిల్లీ గ్రాములూ మాత్రమే
వుంటుంది.

తయారయ్యే
వైద్యసంబంధ ఉత్పత్తులు
రోజ్ పెటల్స్
గులాబీపువ్వుల ఆకర్షణ పత్రాలను మొగ్గ
దశలోనే వేరుపరిచి నీడలో - అతి కొద్దిసేపు
50 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద - ఎండబెట్టి
నిల్వచేస్తారు. వీటిని 'పాన ఖురి' అంటారు.
శీతలపానీయాల్లో సువాసనకోసం, చల్లదనం
కోసం వాడుతారు.
రోజ్ వాటర్
తాజా గులాబీ పూరెక్కలను నీళ్లలో కలిపి
ఆవిరి వచ్చేంత వరకూ మరిగించి, నీటి
ఆవిరిని మరో పాత్రలో సేకరించి
చల్లబరుస్తారు. దీనినే రోజ్ వాటర్ అంటారు.
ఈ ప్రక్రియను శాస్త్రీయ పరిభాషలో డిస్టిలేషన్
అంటారు. దీనిని బాహ్యాభ్యంతరంగా
మోతాదుకు రెండు పెద్ద చెంచాల చొప్పున
వాడతారు. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది.
కళ్లకలక వంటి పిత్తవికారాలను తగ్గిస్తుంది.
రోజ్ టింక్చర్
ఒక గ్లాసు నీళ్లను మరిగించి అందులో
రెండు టేబుల్ స్పూన్ల గులాబీ రెక్కలను
(ఎండినవి), 10 చుక్కల ఆయిలా ఆఫ్
విట్రియాల్ ని, 4 టీస్పూన్ల పంచదారను
కలిపితే రోజ్ టింక్చర్ తయారవుతుంది.
దీనిని రోజుకు రెండు, మూడుసార్లు, పూటకు
2-3 టీస్పూన్ల మోతాదులో వాడితే రక్తsravalu,kadupu noppi vantivi thagguthayi.



Rose venigor 

వెనిగార్ లో గులాబీ పూరెక్కలను వేసి
నానబెట్టి వడపోస్తే రోజ్ వెనిగార్
తయారవుతుంది. దీనిలో గుడ్డను తడిపి
నుదిటి మీద పట్టువేసుకుంటే తలనొప్పి
తగ్గుతుంది.


రోజ్వానీ
తాజా గులాబీ పూరెక్కలను నీళ్లలో వేసి
చిక్కగా మారేంత వరకూ మరిగించి, వడపోసి
తేనె కలిపితే రోజ్ హనీ తయారైనట్లే. దీనిని
గొంతునొప్పిలో లోపలకు వాడతారు.
గుల్కంద్
గులాబీ పూరెక్కలను, తేనెను,
పంచదారను పొరలుగా పరిచి పదిహేను.
రోజులవరకూ మాగేస్తే గుల్కంద్
తయారవుతుంది. దీనిని ఎండాకాలం
వడదెబ్బ నుంచి రక్షించుకోవడానికి పాలతో
కలిపి వాడతారు. అలాగే మహిళల్లో అధిక
బహిష్టుస్రావాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.
గుల్లోగన్ తైలం
నల్లనువ్వులను తడిపి, గులాబీ పూరెక్కల
ముద్దను పట్టించి నూనెగానుగలో వేసి తైలాన్ని
పిండుతారు. దీనిని తలకు రాసుకుంటే జుట్టు
సహజమైన సువాసనను వెదజల్లుతుంది.
తలనొప్పి, మాడుపోటు వంటివి
దూరమవుతాయి.
రోజ్ మాయిశ్చరైజర్
గులాబీ జలాన్ని (రోజ్ వాటర్), గ్లిజరిన్ ని
ఒక్కో భాగం తీసుకొని, ఒక సీసాలో వేసి
బాగా గిలకొడితే చక్కని మాయిశ్చరైజర్
3 తయారవుతుంది. దీనిని పొడి చర్మానికి
రాసుకుంటే చర్మం కుసుమకోమలంగా
S తయారవుతుంది. వ్యాపారదృక్పథంతో
- తయారుచేసే మార్కెట్ ఉత్పత్తులకన్నా ఇది
ఎన్నో రెట్లు హితకరంగా పనిచేస్తుంది.
గృహచికిత్సలు
రక్తహీనత
ఆరు టీస్పూన్ల గులాబీ రేకులను, ఆరు
టీస్పూన్ల సోపు గింజలను కలిపి నూరి రెండు
కప్పుల నీళ్లలో వేసి మరిగించి వడపోసి,
రోజుకు రెండుసార్లు తీసుకుంటుంటే
క్రమంగా రక్తహీనతనుంచి బయటపడతారు.
గుండె నొప్పి
ఒక టీస్పూన్ గులాబీ నూనెను, నాలుగు
టీస్పూన్ల బాదం నూనెను కలిపి ఛాతి మీద
ఉదయ, సాయంకాలాలు ప్రయోగించి
మర్దనా చేసుకుంటుంటే గుండెనొప్పిలో
హితకరంగా ఉంటుంది.
ఆందోళన, రక్తవికారాలు
రెండు టేబుల్‌ స్పూన్ల గులాబీ పూరేకులను
ఒక గ్లాసు నీళ్లలో కలిపి కషాయం
తయారుచేసి తీసుకుంటే ఆందోళన,
నర్వసిస్ వంటివి తగ్గుతాయి.
కళ్లలో మంటలు
రోజ్ వాటర్ ని, పాయలరసాన్ని
ఒక్కోటి ఒక్కో టీస్పూన్ చొప్పున కలిపి,
పరిశుభ్రమైన దూది ప్యాడ్ ని తడిపి మూసిన
కనురెప్పలమీద పరుచుకుంటే కంటి
మంటలు, ఎరుపుదనం, దురద వంటివి
తగ్గుతాయి.
కాలిన గాయాలు, దెబ్బలు
రోజ్ వాటర్ని, ఉల్లిపాయల రసాన్ని
కలిపి గాయాలమీద ప్రయోగిస్తే త్వరితగతిన
మానతాయి.
క్యాటరాక్ట్
రోజ్ వాటర్ ని, నిమ్మరసాన్ని 3:1
నిష్పత్తిలో తీసుకొని రెండు కళ్లలోనూ
చుక్కలమందుగా వేసుకుంటే క్యాటరాక్ట్ లో
ఉపయోగముంటుంది.
కళ్లు తిరగటం, తలనొప్పి
ఒకటేబుల్ స్పూన్ గులాబీ రెక్కలను ఒక
కప్పు నీళ్లలో వేసి మరిగించి తీసుకుంటే
తలతిరగటం, తలనొప్పి వంటివి తగ్గుతాయి.
కంటినుంచి నీళ్లు కారటం
రెండు టీస్పూన్ల రోజ్ వాటర్లో చిటికెడు

పటిక పొడిని (ఆలం) కలిపి దూది వుండను
ముంచి కళ్లలో డ్రాప్స్ గా చేసుకుంటే
ఆ కళ్లనుంచి నీళ్లు కారటం, కన్నీటి గ్రంథికి
వచ్చిన ఇన్ఫెక్షన్ వంటివి తగ్గుతాయి.
జ్వరం
5 రోజ్ వాటర్ని, వెనిగారిని సమాన
నిష్పత్తిలో చల్లని నీళ్లలో కలిపి, నూలు గుడ్డను
తడిపి, మడతలు పెట్టి నుదిటిమీద పరిస్తే
- శరీరం చల్లబడి జ్వరం దిగుతుంది.
మలద్వారంలో దురదలు
రోజ్ వాటర్ లో గుడ్డను తడివి
- మలద్వారం మీద ఉంచితే దురద, మంట
- వంటివి తగ్గుతాయి.
తలనొప్పి
రోజ్వాటర్లో తోకమిరియాల పొడి,
శొంఠిపొడిని ఒక్కో టీస్పూన్ చొప్పున కలిపి
ఆ పేస్టు మాదిరిగా చేసి నొప్పి మీద ప్రయోగిస్తే
తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
5
శృంగారేచ్ఛ తగ్గటం
గులాబీ మొగ్గలు, గులాబీ పూల బౌండ్లు
(రోజ్ హిప్స్), టీ పొడి, మల్లెపూలు అన్నీ
సమానంగా తీసుకొని కలిపి రెండు టేబుల్
స్పూన్ల పరిమాణంలో తీసుకొని, రెండు
కప్పుల నీళ్లలో వేసి పదినిమిషాలు మరిగించి,
ఒక టీస్పూన్ తేనె చేర్చి లోపలకు తీసుకుంటే
సెక్స్ సెంటర్లు ప్రేరణ పొందుతాయి. దీంతో
లైంగికశక్తి పెరుగుతుంది.
గొంతునొప్పి
ఎండిన గులాబీ రెక్కలను పొడి చేసి
తేనెలో కలిపి కొద్ది కొద్దిగా చప్పరిస్తుంటే
గొంతునొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది,
గుండెదడ
ఒకకప్పు గులాబీ నీళ్లలో ఒక టీస్పూన్
సోపుగింజలు, అరటీస్పూన్ ధనియాలు, 10
ఎండుద్రాక్షలను కలిపి రాత్రంతా నానబెట్టి,
మర్నాడు ఉదయం వడపోసుకొని తీసుకుంటే
గుండెదడ, ఆందోళ వంటివి తగ్గుతాయి.
దీర్ఘకాలం నుంచి బాధించే
తలనొప్పి
గులాబీలు 100 గ్రా., ద్రాక్షపండ్లు 100
గ్రా. నీళ్లలో వేసి కషాయం కాచి చిటికెడు
ఏలక్కాయ గింజల పొడికి కలిపి కొద్ది కొద్దిగా
చప్పరిస్తుంటే దీర్ఘకాలం నుంచి బాధించే
తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
మంగుమచ్చలు, మొటిమలు,
చీముగడ్డలు
రోజ్ వాటర్లో కుంకుమపువ్వు, బాదం
పలుకులను కలిపి మెత్తగా నూరి ముఖం
మీద ఫేస్ ప్యాక్ మాదిరిగా ప్రయోగిస్తే ముఖ
చర్మం కుసుమకోమలంగా తయారవుతుంది.
మంగుమచ్చలు, మొటిమలు వంటివి
తగ్గుతాయి.
ఛాతిలో మంట, అజీర్ణం,
పులితేన్పులు
గులాబీలు వేసి నానబెట్టిన నీళ్లను,
సున్నపుతేటలో కలిపి, కమలాపండ్ల రసానికి
చేర్చి తీసుకుంటే ఎసిడిటి వల్ల వచ్చే
ఛాతినొప్పి, వికారం, అజీర్ణం, అమ్లపిత్తం
వంటి సమస్యలు తగ్గుతాయి. *
-

No comments:

Post a Comment