Tuesday 19 March 2013

సన్నగా మారడానికి ఆయుర్వేద సూచనలు

సన్నగా ,నాజూకుగా మారాలనే కోరిక కల్గిన వారు కొన్ని ముఖ్యమైన సూచనలను పాటిస్తే సరైన ఫలితం ఉంటుంది.

1 . అన్ని రుచులూ కలిగిన ఆహార పదార్థాలను తినడం,వేపుడు కూరలకు బదులు పులుసు కూరలు వాడడం,ఆహారాన్ని నెమ్మదిగా తినడం చేయాలి.

2 . సమయానికి తక్కువ మొత్తాల్లో తినాలి.

3 . వ్యాయామానికి ముందు కనీసం ఏడాది పాటు పాత తేనెను 2 చెంచాలు ,గ్లాసెడు గోరు వెచ్చని నీటికి కలిపి తాగాలి.

4 . ఆహారంగా పీచు కలిగిన ఓట్స్ ,బార్లీ వంటి శూక ధాన్యం / సిరియల్స్ తినాలి.బియ్యం తినే వాళ్ళు ఏడాది పాతబడిన  బియ్యం వాడాలి. 

5 . వేడి నీళ్ళు తాగుతుండడం,వేడి నీటి స్నానం చేయడం వంటివి చేయాలి.

6 . మజ్జిగ ఎంతో మేలు చేస్తుంది.

7 . శరీరానికి ,మనసుకు ఎప్పుడూ ఏదో వ్యాపకం కలిగించుకుంటుండాలి.క్రమం తప్పకుండా అర్ధ శక్తిగా వ్యాయామం చేయాలి.

8 . స్నానానికి ముందు అగరు,పెసర్లు,చిరుశనగలు మొదలైన పదార్థాలతో చేసిన సున్ని పిండితో వేడి పుట్టేలా నలుగు పెట్టుకోవాలి.

9 . మెత్తటి సోఫాలూ,పరుపూ వాడకూడదు.

10 . పగటి పూట నిద్ర మంచిది కాదు.

ఇంటివద్ద చేసుకునే చికిత్సలు - 

1 . ముల్లంగి రసం మోతాదుకు 3 చెంచాల చొప్పున రోజుకి 3 సార్లు తీసుకోవాలి.

2 . కరక్కాయ పెచ్చుల చూర్ణాన్ని మోతాదుకు అర చెంచా చొప్పున 2 పూటలా తేనెతో గాని లేదా వేడి నీటితో గాని తీసుకోవాలి.

3 . రేగు ఆకుల ముద్దను ఉలవచారు లేదా శనగలతో చేసిన చారుకి కలిపి తీసుకోవాలి.

4 . ప్రతి రోజూ ఉదయం ఒక తమలపాకులో 10 మిరియం గింజలను చుట్టి తిని వెంటనే ఒక గ్లాసు చన్నీళ్లు తాగాలి.

5 . ఆముదం ఆకులను కాల్చి బూడిద చేసి నిల్వ చేసుకోవాలి.దీనిని మోతాదుకు చిటికెడు చొప్పున చిటికెడు ఇంగువ పొడిని కలిపి రెండు పూటలా బియ్యం కడిగిన నీళ్లతో కలిపి తీసుకోవాలి.

6 . కటుక రోహిణి చూర్ణం 3 భాగాలు,చిత్రమూలం వేరు బెరడు చూర్ణం 3 భాగాలు ,శిలాజిత్ చూర్ణం 2 భాగాలు ,గలిజేరు / పునర్నవ పంచాంగ చూర్ణం 5 భాగాలు చొప్పున కలిపి మోతాదుకు అరచెంచాడు చొప్పున తేనెతో ఆహారం ముందు 2 పూటలా తీసుకోవాలి.

7 . తిప్పసత్తు / గుడూచి సత్వం ,తుంగముస్తల చూర్ణాన్ని 2 పూతలా తేనె అనుపానంగా మోతాదుకు 3 గ్రాముల చొప్పున తీసుకోవాలి.

8 . అర టీ స్పూన్ వాయు విడంగాల చూర్ణాన్ని తేనెతో కలిపి 2 పూటలా వాడాలి.

9 . శొంఠి ,వాయువిడంగాలు,యవక్షారం ,కాంత లోహ భస్మాల సమ మిశ్రమాన్ని 2 పూటలా పూటకు 1 గ్రాము మోతాదుగా తేనె అనుపానంగా తీసుకోవాలి.

10 . త్రికటు / శొంఠి,పిప్పళ్ళు,మిరియాలు ,త్రిఫలాలు / కరక్కాయ,తాని కాయ,ఉసిరి కాయ , వాయు విడంగాలు,చిత్రమూలం ,తుంగ ముస్తలను ఒక్కో దానిని రెండేసి భాగాలుగా తీసుకొని అందులో ఒక భాగం శుద్ధ గుగ్గిలాన్ని కలపాలి.ఈ మిశ్రమాన్ని మోతాదుకు 3 - 6 గ్రాముల చొప్పున తేనెతో కలిపి 2 పూటలా వాడాలి.

No comments:

Post a Comment