కేశ సౌందర్యం / వెంట్రుకల సమస్యలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కేశ సౌందర్యం / వెంట్రుకల సమస్యలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, డిసెంబర్ 2020, సోమవారం

చుండ్రు,చిట్లిన జుట్టుకు /CHUNDRU SAMASYA,CHITLINA JUTTU -AYURVEDIC SOLUTIONS

 నాకు ఇరవై ఎనిమిదేళ్లు. కొంతకాలంగా చు

తెల్లటి పొట్టు రాలుతోంది. ఎంత తలస్నానం

చిన్న కురుపులు కూడా వస్తున్నాయి. ప్రతి

పరిష్కారం చెప్పండి.

ఫంగల్ ఇన్ ఫెక్షన్, తల్లోని నూనె ,chundru samasyaku

 పలురకాల కారణాలుంtayi.

గ్రంధులు స్రవించడం తగ్గిపోవడం, వాతావరణంలో

మార్పులు, నురగ ఎక్కువగా వచ్చే షాంపూలు తరచూ

వాడటం, కాలుష్యం... వంటివన్నీ ఈ సమస్యకు కార

డాలు, దానికి తోడు తీసుకునే ఆహారం కూడా ఈ

సమస్యను మరింత పెంచుతుంది. చుండ్రు సమస్య

పెరిగిన కొద్దీ.. మొటిమల వంటి సమస్యలూ ఎదు

రవుతాయి. అందుకే.. ఆహారంలో మార్పులతోపాటు,

మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆహారంలో పులుపు, కారం వంటివి తగ్గించి.. కొవ్వు

- శాతం తక్కువగా ఉన్న పదార్థాలను ఎంచుకోవాలి.

మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. అందుకోసం

పీచుశాతం ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలను ఎంచు

కోవాలి.

కొబ్బరి లేదా ఆలివ్ నూనెలో కలబంద గుజ్జు కలిపి,

మాడుకు మృదువుగా మర్దన చేస్తుండాలి. దీనివల్ల రక్త

ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. చుండ్రు సమస్య -

కూడా అదుపులో ఉంటుంది. చెంచా పారిజాతం

గింజల పొడి, రెండు చెంచాలు గుజ్జుగా చేసిన మందా

రాకుల ముద్ద కలిపి తలకు పూతలా వేయాలి. రెండు

గంటలయ్యాక కుంకుడు రసంతో తలస్నానం చేస్తే

సమస్య త్వరగా తగ్గిపోతుంది.

అరకప్పు మెంతిపొడి, అరచెంచా గసగసాలు, కొద్దిగా

వేపపొడి తీసుకొని కాసిని నీళ్లతో ముద్దగా చేసి తలకు

పట్టించి రెండు గంటలయ్యాక కడిగేసుకో

వాలి. వంద గ్రాముల కొబ్బరి నూనెకు

రెట్టింపు నీళ్లు కలిపి అందులో గుప్పెడు

ఉమ్మెత్త ఆకుల్ని వేసి బాగా మరిగించాలి.

కాసేటికి ఇది సగం అవుతుంది. ఈ

తైలాన్ని రాత్రిళ్లు రాసుకొని మర్నాడు తల

స్నానం చేయాలి. నూనె రాసిన వెంటనే

చేతులు కడుక్కోవాలి. కంటికి తగలకుండా

చూసుకోవాలి.


చిట్లిన జుట్టుకు

చిట్కాలు


జుట్టు చివర్లు చీలిపోతే వాటిఎదుగుదల సరిగా ఉండదు. తెగినశిరోజాలతో తలకట్టు కూడా సరిగాకుదరదు. మరి పట్టుకుచ్చులా ఉండేకురులు సొంతం చేసుకోవాలంటే ఏంచేయాలి? కొబ్బరి, ఆలివ్ నూనె సమపార్లలో తీసుకొని వేడి చేయాలి.

గోరువెచ్చగా అయ్యాక కుదుళ్ల నుంచిచివర్ల వరకూ తలకు రాయాలి.

దాంతోపాటు మాడుకూ చక్కగామర్దన చేసి మర్నాడు షాంపూతోతలస్నానం చేయాలి. అలాగే రెండు నెలలకోసారి చిట్టిన చివర్లను కత్తిరించేస్తుండాలి.

బాగా పండిన బొప్పాయిని తీసుకొని గింజలు తొలగించాలి. వాటిని మెత్తగాచేసి అందులో తగినంత పెరుగు కలిపి తలకు బాగా పట్టించాలి. అరగంటయ్యాక గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేయాలి. దీనివల్ల కురులు చిట్లే సమస్యనియంత్రణలో ఉంటుంది. జుట్టు రాలడం సమస్య కూడా నెమ్మదిగా అదుపులోకివస్తుంది.

నెలకోసారి కొబ్బరి పాలతో శిరోజాలను తడిపి గంటయ్యాక షాంపూతో తలస్నానం చేస్తే ఫలితం ఉంటుంది. ఆముదం, ఆవనూనె సమపాళ్లలో తీసుకొనిజుట్టు చివర్లకు రాయాలి. పొడి తువాలును చుట్టి అరగంటయ్యాక స్నానం చేస్తేసరిపోతుంది. కురులు ఒత్తుగా ఏర్పడతాయి.మెత్తగా దంచాలి. ఈ ముద్దకు వందగ్రాముల కొబ్బరినూనె, దానికి మూడు రెట్లు నీళ్లు కలిపిమరిగించాలి. వంద గ్రాముల తైలం మిగిలాకదించేయాలి. ఈ తైలం తరచూ తలకురాసుకోవాలి.

ఆలివ్ లేదా నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి తలకు మర్దన చేయాలి.మర్నాడు పెరుగు, మెంతులు, నిమ్మరసంకలిపి తలకు రాసి.. గంటయ్యాక తలస్నానం చేయాలి. వెనిగర్, నీళ్లను సమపాశలో తీసుకొని తలకు రాసి.. మర్నాడుబేబీషాంపూతో స్నానం చేసినా కూడామార్పు ఉంటుంది. అలానే సీకాకాయ,పెసరపిండి తీసుకొని అందులో కాసిని


4, ఏప్రిల్ 2013, గురువారం

జుట్టు రాలడం -JUTTU ( VENTRUKALU ) RALUTA ( HAIR FALL ) - AYURVEDAM

జుట్టు రాలడాన్ని నివారించే చికిత్సలు /  రెమెడీస్ -  remedies for hairfall


ప్రతిరోజూ ఉదయం పిడికెడు తెల్ల నువ్వులను తినాలి. నువ్వుల్లో జుట్టు పెరుగుదలకు అవసరమైన క్యాల్షియం మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి.

ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జును చిటికెడు జీలకర్ర పొడి తో కలిపి రోజుకు రెండుసార్లు చొప్పున కనీసం మూడు నెలల పాటు తీసుకుంటే శరీరంలో పిత్తం సమస్థితిలోకి వచ్చి వేడి తగ్గి, జుట్టు రాలటం ఆగుతుంది . కలబంద గుజ్జు కు బదులు కలబంద రసం కూడా పావుకప్పు మోతాదులో తీసుకోవచ్చు.

ఆహారంలో డ్రై ఫ్రూట్, పాలు ,పెరుగు, పనీర్, కొబ్బరి, యాపిల్స్, క్యాబేజీ వంటివి ఉండేలా చూసుకోవాలి. వీటి వల్ల జుట్టు ఆరోగ్యం పెంపొంది చక్కగా పెరుగుతుంది.

దశ మూలాల చూర్ణం ఐదు భాగాలు, గుంటగలగరాకు చూర్ణం నాలుగు భాగాల,
 జటామాంసి వేర్ల చూర్ణం మూడు భాగాలు కలిపి నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజూ రాత్రి నిద్రకు ముందు ఈ మిశ్రమాన్ని  అర చెంచా మోతాదుగా కప్పు పాలలో కలిపి  మరిగించి వడపోసుకుని తాగుతూ ఉంటే క్రమంగా జుట్టు రాలడం తగ్గుతుంది.

రాలే జుట్టును అరికట్టుట డానికి సుశ్రుత సంహిత త్రివిధ వ్యూహాలను పేర్కొంది. మొదట స్నేహనం అంటే ఔషధ సిద్ధ నూనెలను తలకు పట్టించడం, రెండవది స్వేదనం అంటే చెమట పట్టేలా చేయడం, తరవాత లేపనం ,అంటే ఔషధాలను మెత్తగా మర్దించి తలకు పూయడం. చేయాలని సుశ్రుత సంహిత సూచించింది.

స్నేహ న చికిత్సలో భాగంగా neelibhringadi తైలం, బ్రాహ్మీ తైలం ,బృంగరాజ తైలం, జపాకుసుమ తైలం వంటి ఔషధ సిద్ధ నూనెలను తలకు పట్టించాలి. తరువాత స్వేదన ప్రక్రియ లో భాగంగా త్రిఫల  కషాయంలో ఉంచిన మందపాటి గుడ్డను చుట్టి చెమట పుట్టించేలా చేయాలి.  చివరగా లేపన చికిత్సను ప్రయోగించాలి .అంటే గుంటగలగరాకు, త్రిఫలాలు ,శీకాయ, కుంకుడు కాయ, kachuralu ,అతిమధురం వంటి ఓషధులను మెత్తగా మర్దించి తలకు లేపనం చేయాలన్నమాట.

మెడ కండరాలను శక్తివంతం చేసే వ్యాయామాలు, శీర్షాసనం , భుజంగాసనం వంటి యోగాసనాల వలన తలకు రక్త ప్రసరణ పెరిగి తద్వారా జుట్టు కుదుళ్లు బలపడతాయి. అలాగే శిరోధార శిరోవస్తి శిరో భ్యంగనం వంటి ఆయుర్వేద చికిత్స ప్రక్రియల వల్ల కూడా అమితమైన ప్రయోజనం కనిపిస్తుంది.


రజోనివృత్తి ,థైరాయిడ్ గ్రంథి పనితీరులో లోపాలు, రక్తహీనత, పిట్యుటరీ గ్రంథిలో పెరుగుదలలు, ఏర్పడటం, ఆటోఇమ్యూన్ వ్యాధులు, సోరియాసిస్, లైకెన్ ప్లానస్ ,దీర్ఘకాలపు జ్వరాలు వంటి వాటి వల్ల జుట్టు రాలుతున్న అప్పుడు ప్రధాన కారణానికి చికిత్స తీసుకుంటే జుట్టు తిరిగి వచ్చేస్తుంది.


గృహ చికిత్సలు / హోమ్ రెమెడీస్


మిరియాలను మెత్తగా నూరి జుట్టు రాలిన చోట రుద్దితే నిద్రాణ స్థితిలో కి వెళ్ళిన వెంట్రుకల కుదుళ్ళు ప్రేరేపితమై తిరిగి చైతన్యవంతంగా మారుతాయి.

పసుపు, మాను పసుపు లను మెత్తగా పొడిచేసి వెన్న తో సహా ముద్దగా నూరి తలకు పట్టించి  గంట సేపు ఉంచి తలస్నానం చేస్తే వెంట్రుకలు నిలువుగా  చీలడంతగ్గుతుంది.

మినుములు ఒక కిలో, ఉసిరిక వరగు అరకిలో, సీకా కాయలు పావు కిలో, మెంతులు పావు కిలో చొప్పున తీసుకుని విడివిడిగా నూరి కలిపి నిల్వ చేసుకోవాలి. దీనిని తడవకు రెండు టేబుల్ స్పూన్ల చొప్పున అరగ్లాసు నీళ్లలో నానబెట్టి పావుగంట పాటు ఉంచి తలకు హెయిర్ ప్యాక్ చేసుకోవాలి .అరగంట తర్వాత తల స్నానం చేయాలి.


మర్రిచెట్టు వేళ్లను పావుకిలో సేకరించి ఆరబెట్టాలి. తడిలేకుండా ఆరిపోయిన తర్వాత లీటర్ కొబ్బరి నూనెకు కలిపి పదిహేను రోజుల పాటు నానబెట్టి వడపోసి శుభ్రమైన సీసాలో నిల్వ చేసుకోవాలి .దీనిని ప్రతిరోజు తల నూనెగా రాత్రి నిద్రపోయేటప్పుడు రాసుకుంటే చక్కని ఫలితం కనిపిస్తుంది.

చేదు పొట్ల ఆకుల రసాన్ని వెంట్రుకలు ఊడిన చోట రుద్దుతుంటే అయిదారు రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.

ఉమ్మెత్త ఆకుల రసాన్ని గాని లేదా బొప్పాయి పువ్వుల రసాన్ని గాని లేదా మంగ చెట్టు పువ్వుల రసాన్ని గాని మాడుపైన రాసుకుంటే జుట్టు పెరుగుతుంది.

ఉసిరి వలుపు, అతిమధురం వేరు చూర్ణాలను మెత్తగా నూరి ముద్దగా చేసి దానికి నాలుగు రెట్లు నువ్వుల నూనె ను ,నూనెకు నాలుగు రెట్లు ఆవుపాలను,నాలుగు రెట్లు నీళ్లను చేర్చి కేవలం నూనె మాత్రమే మిగిలేంత వరకు చిన్న మంట మీద మరిగించి వడపోసి శుభ్రమైన సీసాలో నిల్వ చేసుకోవాలి .దీనిని ప్రతి నిత్యం రెండు ముక్కు రంధ్రాల్లో ను నస్యంగా రెండేసి చుక్కల చొప్పున వేసుకుంటే జుట్టు పెరుగుతుంది అని సారంగధర సంహిత చెబుతోంది.

మందార పువ్వులతో జుట్టు ఊడిన భాగాన్ని వేడి పుట్టే లాగా బాగా రుద్దాలి, తరవాత గురివింద గింజల పొడిని ,నల్ల జీడి గింజల పొడిని, నేలములక పండ్ల రసాన్ని కలిపి మర్ద్ ఇస్తే మొండి పేనుకొరుకుడు రోగాల్లో కూడా మంచి గుణం కనిపిస్తుంది.

పల్లేరు ఆకులు ,నువ్వు చెట్టు పూలను ,తేనె ,నెయ్యి ల తో కలిపి నూరి లేపనం చేస్తే జుట్టు దట్టంగా పెరుగుతుంది .

ఏనుగు దంతం ని కాల్చి మసి చేసి  పాలలో కలిపి నూరి జుట్టు ఊడిన చోట ప్రయోగిస్తే  చక్కని ఫలితం కనిపిస్తుంది. హస్తి దంత మసి గా ఈ ఔషధం ఆయుర్వేద వైద్య వర్గాల్లో పేరుగాంచింది . మరీ మొండి కేసుల్లో ఏనుగుదంత మసి ని రసాంజనం (మాను పసుపు ఘనం ) తో కలిపి మేక పాలతో నూరి వెంట్రుకలు ఊడిన చోట ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

గురివింద గింజల ను గాని లేదా గురువింద వేరును గాని మంచినీళ్లతో ముద్దగా నూరి వెంట్రుకలు ఊడిన చోట ప్రయోగిస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది.

 ములక / వాకుడు పండ్లను గానీ లేదా వాకుడు వేరును గానీ ముద్దగా దంచి రసం పిండి తేనె కలిపి జుట్టు ప్యా చ్ లుగా ఊడిన చోట రుద్దుతుంటే మంచి ఫలితం లభిస్తుంది.

 నల్ల జీడి గింజల రసాన్ని పేను కొరుకుడు ప్యా చ్ మీద రాస్తే తిరిగి జుట్టు పెరుగుతుంది. ఇది చాలా ఉగ్ర పదార్థం కనుక నిద్రాణ స్థితిలో కి వెళ్ళిన వెంట్రుకల కుదుళ్లను ప్రేరేపించి తిరిగి చైతన్యపరుస్తుంది. అయితే కొంతమందికి సరిపడదు దీనితో  దురద ,రసి కారడం, దద్దుర్లు వంటి ఎలర్జీ లక్షణాలు కనిపిస్తాయి అప్పుడు దీనిని రాయడం ఆపేసి కొబ్బరి నూనెను బాహ్యంగా ప్రయోగిస్తే సరిపోతుంది.

 జాజి ఆకు,గన్నేరు ఆకు ,గన్నేరు వేరు, చిత్రమూలం అనే మూలిక వేరును, కానుగా కు ,ఉలిమిరి పట్ట సమపాళ్లలో తీసుకొని ముద్దగా నూరాలి ఈ ముద్దకు నాలుగింతలు నల్ల నువ్వుల నూనెను , ఆ నూనెకు నాలుగింతలు నీళ్ళను కలిపి చిన్న మంట మీద వేడిచేసి నీరు ఆవిరి అయిపోయి అంతవరకు ఉంచి
 వడపోసి నిల్వచేసుకోవాలి. దీనిని జుట్టు ఊడిన చోట తలపై రాసుకుంటే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.

చుండ్రు వల్ల జుట్టు ఊడుతు న్నప్పుడు  మామిడి టెంక లోని జీడిని, కరక్కాయల వలుపుని సమపాళ్లలో తీసుకుని పాలతో సహా నూరి ప్రయోగిస్తే చుండ్రు తగ్గిపోతుంది .జుట్టు తిరిగి పెరుగుతుంది.

జుట్టు పల్చబడుతున్నప్పుడు మందార పువ్వులను మెత్తగా నూరి నల్ల నువ్వుల నూనె లో తైలపాక విధానంలో కాచి తల నూనెగా వాడుతుంటే మంచి గుణం కనిపిస్తుంది..

ఉసిరి చెట్టు వేరును మర్రి ఊడలను జటామాంసి వేరును కలిపి నూరి తల మీద బాహ్యంగా ప్రయోగిస్తే జుట్టు బాగా పెరుగుతుంది.

 అతిమధురం, నల్ల కలువ (నీలోత్పల ) ,ద్రాక్షలను కలిపి నువ్వుల నూనె ,ఆవుపాలు ,నెయ్యి ల తో సహా నూరి తలకు లేపనం చేసుకుని గంట తర్వాత తలస్నానం చేయాలి.

 జెముడు పాలు ( స్నూహి ),  జిల్లేడు పాలు (అర్క), పొత్తి దుంప (లాంగ లి), గురివింద గింజలు, చేదు పుచ్చ తెల్ల ఆవాలు వసకొమ్ము మేక మూత్రం వీటన్నింటిని కలిపి మెత్తని ముద్దగా నూరి నువ్వుల నూనెలో విధానంలో కాచి తైలం తీసి తలకు రాసుకుంటే మొండిగా ఇబ్బంది పెట్టే పేను కొరుకుడులో సైతం మంచి ఫలితం కనిపిస్తుంది.

 మణి శిల, కాసీసం, మైలుతుత్తం వీటిని సంహితా కారులు అంటారు. ఖా లిత్య వ్యాధిలో లేపన ద్రవ్యాలుగా వాడవచ్చునని సూచించారు. వీటి ఉగ్ర స్వభావం వలన తలమీద బాహ్యంగా ప్రయోగించినప్పుడు నిద్ర స్థితిలోకి వెళ్లిన వెంట్రుకల కుదుళ్ళు తిరిగి ప్రేరేపితమై చైతన్య స్థితిలోకి వచ్చి వెంట్రుకలు బాగా పెరుగుతాయి.

 గుర్రపు గిట్టలను కాల్చి మసి చేసి
 వెన్నె లో కలిపి పేనుకొరుకుడు మీద ప్రయోగించినప్పుడు మంచి ఫలితం కనిపిస్తుంది.


జానపద వైద్యం గిరిజన వైద్యం 

మోదుగ గింజలను మెత్తగా నూరి నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.

 నల్లుల ను చంపి ఆ రక్తాన్న
 పేనుకొరుకుడు మీద ప్రయోగిస్తే ఫలితం లభిస్తుంది.

 గురివింద గింజలు నీటితో సహా నూరి ఎండబెట్టి కొబ్బరి నూనెలో కాచి తలనూనె గా వాడుకుంటే పేను కొరుకుడు వ్యాధి తగ్గుతుంది.

ములగ పండు ,గురివింద వేరు ,గింజలు నూరి తేనె కలిపి పేనుకొరుకుడు ఉన్నచోట పూయాలి.

గన్నేరు వేరును అర కిలో మోతాదులో తీసుకుని అరలీటరు నీటిలో వేసి గేదె పాలలో మరిగించి తోడు పెట్టి పెరుగు తయారు చేసుకోవాలి. దీన్ని చిలికి వెన్న తీసి నెయ్యి తయారు చేయాలి. చెంచాడు మోతాదుగా తమలపాకు రసంతో కలిపి తీసుకోవాలి.

 పిల్లిపీచర గడ్డలను అనగా శతావరి వేర్లు మెత్తగా దంచి ముద్ద చేసి పాలతో కలిపి మూడు నెలల పాటు  తలకు ప్రయోగిస్తే జుట్టు దట్టంగా పెరుగుతుంది.

ఆయుర్వేద ఔషధాలు /ayurvedic medicines for hair fall.

జుట్టు రాలడం అనే సమస్యకు ఆయుర్వేదంలో అనేక ఔషధాలు ఉన్నాయి. సమస్య తీవ్రత ,వ్యక్తిగత ప్రకృతి, ఇతర వ్యాధుల ప్రభావం వంటి వి దృష్టిలో ఉంచుకొని ఔషధాలను సూచించాల్సి ఉంటుంది .ఉదాహరణకు గంధక రసాయనం, సప్త అమృతా లోహం ,arogyavardhini vati ,మంజిష్యాద్యారిష్ట, శివ గుటిక ,వసంత మాలతీ రసం ,ముక్తా పిష్టి పొడి , పునర్నవ మండూరం , శంఖ భస్మం ,చంద్రప్రభావటి ,చ్యవన్ ప్రాశ అవలేహ్యం ,ద్రాక్షరిష్టం తదితర ఔషధాలు ఈ సమస్య లో అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి. వీటిని అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి సూచించడం జరుగుతుంది. బాహ్యంగా మరిచ్యాది తైలం ,మహా బృంగరాజ తైలం ,జాత్యాది తైలం,  త్రిఫలాది తైలం వంటివి కూడా సమాంతరంగా వాడాల్సి ఉంటుంది.

 నీలి చెట్టును సమూలంగా తెచ్చి ఆరబెట్టి మండించి బూడిద చేయాలి. ఈ బూడిద ను సోయాచిక్కుడు నూనె తో కలిపి స్థానికంగా జుట్టు ఊడిన చోట ప్రయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

 దొండ ఆకులను దంచి రసం తీసి తలకు పూస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.

రేగు ఆకులను ,వేపాకులను ఒక్కోటి ఒక్కో కిలో చొప్పున తీసుకొని ,ఐదు లీటర్ల నీళ్లు కలిపి కేవలం 1  లీటర్ నీళ్ళు మాత్రమే మిగిలే వరకు మరిగించి తరువాత పిప్పి ని కషాయం తో సహా మెత్తగా నూరి పేస్టులాగా చేసి తలకు లేపనం చేస్తుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

పేనుకొరుకుడు ఉన్నచోట నల్ల ఉమ్మెత్త / దతుర పువ్వులను, పండ్లను మెత్తగా దంచి కొబ్బరి నూనెతో కలిపి బాహ్యంగా ప్రయోగించాలి.

3, ఏప్రిల్ 2013, బుధవారం

తెల్ల వెంట్రుకల సమస్య /THELLA VENTRUKALU ( WHITE HAIR ) - AYURVEDAM

తెల్ల జుట్టు అనారోగ్యానికి సూచన కాకపోయినప్పటికీ ఆందోళనను మాత్రం కలిగిస్తుంది. ముఖ్యంగా యవ్వనంలో తెల్లజుట్టు వస్తుంటే అనేకమంది డీలా పడిపోతారు. అయితే సరైన అవగాహన కలిగి ఉంటే ఈ సమస్యను తేలికగా ఎదుర్కోవచ్చు. మన తల మీద పెరిగే ప్రతి వెంట్రుక కు నల్లని రూపంలో ఉన్న కాండం ఉంటుందిి. అలాగే వెంట్రుకలను స్థిరంగా ఉంచడం కోసం  అడుగున ఒక మూలం ఉంటుంది .ఈ మూలం లో ఉండే గ్రంధులు నల్ల రంగు కు కారణమైన  మెలనిన్ అనే ఒక వర్ణ విశేషాన్ని విడుదల చేస్తుంటాయి. ఎక్కువ మంది భారతీయులు జుట్టు రంగు నలుపు లో ఉంటే కొంతమందికి రాగి రంగులో ఉంటుంది. వెంట్రుకల్లో ని వర్ణ వశేషాల సాంద్రతల్లో తేడాల వలన రంగులో మార్పులు కనిపిస్తుంటాయి.
 వెంట్రుకల అడుగు భాగంలో ఉండే సెబేసియస్ అనే గ్రంధులు  సెబం అనే ఒక నూనె లాంటి పదార్థాన్ని వెంట్రుకల కుదుళ్ల లోనికి విడుదల చేస్తూ ఉంటాయి. దీనివల్ల వెంట్రుకలు మృదువుగా ,స్నిగ్ధంగ మెరుస్తూ ఉంటాయి.
 ఈ గ్రంథుల పనితీరు లోపం ఏర్పడితే వెంట్రుకలు బిరుసుగా పొడిగా మారుతాయి. వయసు మీదపడుతున్న కొద్దీ వెంట్రుకలు తెల్లబడటం సహజ0. దీనికి కారణం వెంట్రుకల కణజాలాలు లోనికి గాలి చేరడమే. అలాగే వెంట్రుకల రంగుకు కారణమైన మెలనోసైట్స్ కణజాలాలు క్రమంగా అంతరించిపతున్న డం వలన మెలనిన్ సరిగా విడుదల కాకపోవడం జరిగి జుట్టు తెల్లబడుతుంది. అయితే యుక్త వయస్సులోనే జుట్టు తెల్లబడుతుంటే మాత్రం దాని గురించి ఆలోచించ వలసి ఉంటుంది. ఆయుర్వేదం అకాల వార్థక్యం చిహ్నాలను  వలీ ఫలితాల పేరుతో వర్ణించింది .యుక్త వయసులో జుట్టు తెల్లబడటానికి ప్రధాన కారణం జన్యుపరమైన మార్పులు అయినప్పటికీ ఇతర శారీరక రుగ్మతలను ఆహారపరమైన సమస్యలను విస్మరించకూడదు. బి విటమిన్ లోపం, థైరాయిడ్ సమస్యలు, రక్తాల్పత, ధూమపానం ఇలాంటివన్నీ జుట్టును త్వరగా నిలబడలా చేస్తాయి కాబట్టి
 తెల్లజుట్టు సమస్యను కాస్మొటిక్ సమస్యగా కాకుండా వైద్యపరంగా కూడా చూడవలసి ఉంటుంది.

నెరిసే జుట్టుకు కొన్ని నివారణ ఉపాయాలు

తిప్పతీగ ,ఉసిరి ,పల్లేరు కాయ ,వీటి చూర్ణాలను సమాన భాగాలుగా తీసుకుని తేనెతో కలిపి మూడు పూటలా పూటకు ఒక చెంచా చొప్పున తీసుకోవాలి.

 లేదా 

ఎండిన గుంటగలగరాకు రెండు భాగాలు, నల్ల నువ్వులు ఒక భాగం ,ఉసిరి ఒక భాగం కలిపి వీటి చూర్ణాన్ని చెంచాడు మోతాదుగా చక్కెర కలిపిన పాలతో తీసుకోవాలి. అలాగే స్వర్ణ మోక్ష భస్మం అని ఆయుర్వేద మందుల షాపుల్లో దొరుకుతుంది దీనిని 240  మిల్లీగ్రాముల చొప్పున  తేనెతో కలిపి తీసుకోవాలి.

వెంట్రుకల నలుపుదనాన్ని కాపాడే కొన్ని ఆయుర్వేద బాహ్యప్రయోగాలు.


ఒక రాత్రి అంతా కొన్ని ఉసిరికాయలను నీళ్లలో నానేసి నీళ్లను సిద్ధం చేసుకోవాలి .అలాగే మండూరి భస్మం, ఉసిరికాయ, మందార పువ్వు వీటిని సమాన భాగాలుగా తీసుకుని మెత్తగా రుబ్బిి పేస్టులాగా చేయాలి .దీనిని తలకు పట్టించి గాలికి ఆరనివ్వాలి.
జుట్టు బాగా ఆరిన తర్వాత ఉసిరి నీళ్ళతో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయవలసి ఉంటుంది. దీనికి మరో పద్ధతి -  ఉసిరికాయ రెండు భాగాలు ,తానికాయ ఒక భాగం ,కరక్కాయ  రెండు భాగాలు,  కా వి రాయి ఐదు భాగాలు, మండూర ము అనగా  భూమిలో పాతి ఏసిన ఇనుమును  చూర్నించగ వచ్చేది ,వీటిని మెత్తని పొడిగా దంచాలి. ఉసిరికాయలను నానేసిన నీళ్లలో ఈ పొడిని కలిపి ఒక ఇనుప పాత్రలో ఒక రాత్రంతా ఉంచాలి. దీనిని ఉదయాన్నే తలకు పట్టించాలి .కొంతసేపయిన తర్వాత శుభ్రంగా కడిగి వేయాలి. ప్రతిరోజు  నీలి భృంగా ది తైలమును తలకు రాసుకోవాలి. అలాగే ఏలాది తైలం అనే మందు నూనెతో తలకు మర్దన చేయించుకోవాలి.


 
ఊడుుుగ పువ్వు, గుంటగలగరాకు, కలువ దుంపలు సమాాాన భాగాలుగా తీసుకుుుని మెత్తగాముద్దగా నూరాలి. ఈ ముద్దకుుుు నాలుగు భాగాలు నువ్వుల నూనెనుు కలిపి నూనెకు 16 రెట్లు మంచి నీళ్లను చేర్చి, నీరంతా ఇంకిపోోయి అంతవరకు చిన్నమంటమీద కాచి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. దీనినిి తలకు మర్దన చేసుకుంటే తెల్ల వెంట్రుకలుు నల్లబడతాయి.

 కామంచి గింజలు నల్ల నువ్వులు సమానంగా తీసుకుని గానుగ లో వేసి తైలాన్ని తీయాల.
 దీనిని రోజువారిగా తలకు రాసుకుంటే తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి. అంతే కాకుండా అన్ని రకాల తలనొప్పులు తగ్గిపోతాయి.

1,2 గ్రాముల కరక్కాయ చూర్ణం లో తేనెను కలిపి ప్రతిరోజూ తింటుంటే తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి. 

 కరక్కాయ, తానికాయ ,ఉసిరికాయలను గింజలు తీసి వేసి ఒక్కొక్కటి పది గ్రాముల చొప్పున తీసుకుని, మామిడి జీడి కూడా కలిపి చూర్ణం లాగా దంచాలి. దీనికి పావు కిలో నువ్వుల నూనెను కలిపి ఒక ఇనుప మూకుడు లో ఉంచి మూత పెట్టి వారం రోజుల పాటు నిల్వ ఉంచాలి .దీనిని వడపోసుకుని తల నూనెగా వాడుకోవాలి.

ఆహారంలో తాజా పండ్లు ,కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి .మరీ వెచ్చగా కాకుండా ,గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. మానసిక ప్రశాంతతను అలవర్చుకోవాలి. అలాగే రక్తాల్పత ,థైరాయిడ్ వంటి సమస్యలుంటే వైద్య చికిత్స చేయించుకోవాలి.

17, మార్చి 2013, ఆదివారం

కేశ సౌందర్యం / వెంట్రుకల సమస్యలు - HAIR CARE - AYURVEDAM


గృహచికిత్సలు
• మిరియాలను మెత్తగా నూరి జుట్టు
రాలిన చోట రుద్దితే నిద్రాణస్థితిలోకి
వెళ్లిన వెంట్రుకల కుదుళ్లు తిరిగి ప్రేరే
పితమై చైతన్యవంతంగా మారుతాయి.
• పసుపును, మానుపసుపులను మెత్తగా
పొడిచేసి, వెన్నతో సహా ముద్దగా నూరి
తలకు పట్టించి గంట సేపుంచి
తలస్నానం చేస్తే వెంట్రుకలు నిలువుగా
చీలటం తగ్గుతుంది.
• మినుములు కిలో, ఉసిరిక వరుగు
అరకిలో, సీకాకాయలు పావుకిలో,
మెంతులు పావుకిలో చొప్పున తీసుకొని
విడివిడిగా నూరి కలిపి నిల్వచేసు
కోవాలి. దీనిని తడవకు రెండు టేబుల్
స్పూన్ల మోతాదులో తీసుకొని అరగ్లాసు
నీళ్లల్లో కలిపి పావుగంటపాటు నానబెట్టి
తలకు హెయిర్ ప్యాక్ చేసుకొని
అరగంట తరువాత తలస్నానం
చేయాలి.
• మర్రిచెట్టు వేళ్లను పావుకిలో సేకరించి
ఆరబెట్టాలి. తడిలేకుండా ఆరిపోయిన
తరువాత లీటర్ కొబ్బరినూనెకు కలిపి
15 రోజులపాటు నానబెట్టి వడపోసి,
శుభ్రమైన సీసాలో నిల్వ చేసుకోవాలి.
దీనిని ప్రతిరోజూ తలనూనెగా రాత్రి
నిద్రపోయేటప్పుడు వాడుకుంటే చక్కని
ఫలితం కనిపిస్తుంది.
* చేదుపొట్ల ఆకు రసాన్ని వెంట్రుకలు
ఊడిన చోట రుద్దుతుంటే ఐదారు
రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఉమ్మెత్త (దత్తూర) ఆకుల రసాన్నిగాని
లేదా బొప్పాయి పువ్వుల రసాన్నిగాని
లేదా మంగచెట్టు పువ్వుల రసాన్ని గాని
మాడు పైన రాసుకుంటే జుట్టు
పెరుగుతుంది.
ఉసిరి వలుపు, అతిమధురం వేరు
చూర్ణాలను మెత్తగా నూరి ముద్దగా
చేసి దానికి నాలుగు రెట్లు నువ్వుల
నూనెను, నూనెకు నాలుగు రెట్లు
ఆవుపాలను, నాలుగు రెట్లు నీళ్లనూ
చేర్చి కేవలం నూనె మాత్రమే
మిగిలేంత వరకూ చిన్న మంటమీద
మరిగించి వడపోసి శుభ్రమైన సీసాలో
నిల్వ చేసుకోవాలి. దీనిని ప్రతినిత్యం
రెండు ముక్కురంధ్రాల్లోనూ నస్యంగా
రెండేసి చుక్కల చొప్పున వేసుకుంటుంటే
జుట్టు పెరుగుతుంది.
• మందారపువ్వులతో జుట్టు ఊడిన
భాగాన్ని వేడిపుట్టేలాగా బాగా రుద్దాలి.
తరువాత గురివిందగింజల పొడినీ,
నల్లజీడి గింజల పొడినీ, నేలములక
పండ్లరసాన్నీ కలిపి మర్ధిస్తే మొండి
పేనుకొరుకుడు సమస్యల్లో కూడా గుణం
కనిపిస్తుంది.
పల్లేరు ఆకులు, నువ్వు చెట్టు పూలను
తేనె, నెయ్యిలతో కలిపి నూరి లేపనం
చేస్తే జుట్టు దట్టంగా పెరుగుతుంది.
- ఏనుగుదంతాన్ని కాల్చి మసిచేసి
పాలలో కలిపి నూరి జుట్టు ఊడిన
చోట ప్రయోగిస్తే ఆశ్చర్యకరమైన
ఫలితం కనిపిస్తుంది. హస్తిదంతమసిగా
ఈ ఔషధం ఆయుర్వేద వైద్యవర్గాల్లో
చాలా ప్రసిద్ధిగాంచింది. మరీ మొండి
కేసుల్లో ఏనుగు దంత మనిని
రసాంజనం (మానుపసుపు ఘనం)తో
కలిపి మేకపాలతో నూరి వెంట్రుకలు
ఊడినచోట పైపూతగా ప్రయోగిస్తే
తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.
- గురువింద గింజలనుగాని లేదా
గురివింద వేరునుగాని నీళ్లతో సహా
ముద్దగా నూరి వెంట్రుకలు ఊడిన
చోట లేపనం చేయాలి.
• ములక (వాకుడు) పండ్లనుగాని లేదా
వాకుడు వేరునుగాని ముద్దగా దంచి
రసం పిండి తేనె కలిపి జుట్టు ప్యాచ్
మాదిరిగా ఊడిన చోట రాస్తుంటే
చక్కని ఫలితం కనిపిస్తుంది.
• నల్లజీడిగింజల రసాన్ని పేనుకొరుకుడు
ప్యాచ్ మీద పూస్తే తిరిగి జుట్టు
పెరుగుతుంది. ఇది చాలా ఉగ్రపదార్థం
కనుక నిద్రాణ స్థితిలోకి వెళ్లిన
వెంట్రుకల కుదుళ్లను ప్రేరేపించి తిరిగి
చైతన్యవంతంగా మారుస్తుంది. అయితే
కొంతమందికి ఇది సరిపడదు. దీనితో
దురద, దద్దురు, రసికారడం వంటి
ఎలర్జీ లక్షణాలు ఉత్పన్నమవుతాయి.
అలాంటి సందర్భాల్లో దీనిని రాయటం
నిలిపివేసి కొబ్బరినూనెను బాహ్యంగా
ప్రయోగిస్తే సరిపోతుంది.

జాజి ఆకు, కానుగ ఆకు, ఉలిమిరి


పట్ట, గన్నేరు ఆకు, గన్నేరు వేరు,
చిత్రమూలం అనే మూలిక వేరును
సమపాళ్లలో తీసుకొని ముద్దగా
నూరాలి. ఈ ముద్దకు నాలుగింతలు
నల్ల నువ్వులనూనెను, నూనెకు
నాలుగింతలు నీళ్లనూ కలిపి నీరు
ఆవిరైపోయేంతవరకూ చిన్న మంటమీద
మరిగించి తైలాన్ని వడపోని
నిల్వచేసుకోవాలి. దీనిని జుట్టు
ఊడినచోట తలకు ప్రయోగిస్తుంటే
తప్పకుండా ఫలితం కనిపిస్తుంది,
* చుండ్రు వల్ల జుట్టు ఊడుతున్నప్పుడు
మామిడిటెంకలోని జీడిని, కరక్కాయల
వలుపునీ సమపాళ్లలో తీసుకొని
పాలతో సహా నూరి ప్రయోగిస్తే చుండ్రు
తగ్గిపోయి జుట్టు తిరిగి పెరగుతుంది.
జుట్టు వల్చబడుతున్నప్పుడు
మందారపువ్వులను ముద్దగా నూరి
నల్లనువ్వుల నూనెలో వేసి తైలపాక
విధానంలో కాచి తలనూనెగా
వాడుకుంటే గుణకారిగా ఉంటుంది.
ఉసిరిచెట్టు వేరును, మర్రి ఊడలను,
జటామాంసి వేరును కలిపి నూరి
బాహ్యంగా ప్రయోగిస్తే కేశాలు బాగా
పెరుగుతాయి.
• అతిమధురం, నల్లకలువ (నీలోత్పల),
ద్రాక్షలను కలిపి నువ్వులనూనె,
ఆవుపాలు, నెయ్యిలతో సహా నూరి
తలకు లేపనం చేసుకొని గంట
తరువాత తలస్నానం చేయాలి.
• జెముడుపాలు (స్నుహి), జిల్లేడు పాలు
(అర్క), పొత్తిదుంప (లాంగలి),
గురివిందగింజలు, చేదుపుచ్చ, తెల్ల-
ఆవాలు, వసకొమ్ము, మేకమూత్రం
వీటిని అన్నిటినీ కలిపి మెత్తని ముద్దగా
నూరి నువ్వులనూనెతో తైలపాక
విధానంలో తైలం కాచి తలకు
రాసుకుంటే మొండిగా ఇబ్బంది పెట్టే
పేనుకొరుకుడులో సైతం మంచి ఫలితం
కనిపిస్తుంది.
- మణిశిల,
కాసీసం, మైలతుద్ధం వీటిని
సంహితాకారులు ఖాలిత్య వ్యాధిలో
లేపన ద్రవ్యాలుగా వాడవచ్చునని
సూచించారు. వీటిని తల మీద
ప్రయోగిస్తే ఉగ్రస్వభావం వలన
వెంట్రుకల కుదుళ్ళు ప్రేరేపితమై నిద్రాణ
స్థితి నుండి చైతన్యపూరిత స్థితిలోనికి
మారతాయి. వలితంగా జుట్టు
పెరుగుతుంది.
గుర్రపు గిట్టలను కాల్చి మసిచేసి
వెన్నలో కలిపి పేనుకొరుకుడు
కనిపించిన చోట ప్రయోగిస్తే మంచి
ఫలితం కనిపిస్తుంది.
జానపద వైద్యం
మోదుగ గింజలను పలాశ) మెత్తగా
నూరి, నిమ్మరసం కలిపి తలకు పట్టించి
రుద్దుకుంటే జుట్టు రాలటం తగ్గుతుంది.
నల్లులను చంపి
ఆ రక్తాన్ని
పేనుకొరుకుడు కనిపించే చోట పూస్తే
జుట్టు తిరిగి వస్తుంది.
* గురివింద గింజలను నీటిలో సహా నూరి
ఎండబెట్టి కొబ్బరినూనెలో వేసి కాచి
తలనూనెగా వాడుకుంటే పేనుకొరుకుడు
వ్యాధి తగ్గుతుంది.
• ములగపండు, గురివింద వేరు,
గురివింద గింజను నూరి తేనె కలిపి
పేనుకొరుకుడు ఉన్నచోట పూయాలి.
• గన్నేరు వేరును అరకిలో మోతాదులో
తీసుకొని అరలీటరు గేదెపాలలో
మరిగించి తోడు పెట్టి పెరుగుగా
మార్చాలి. దీనిని చిలికి వెన్నతీసి నెయ్యి
తయారు చేసుకోవాలి. ఈ నెయ్యిని
చెంచాడు మోతాదుగా తమల
పాకురసంతో కలిపి తీసుకోవాలి.
పిల్లిపీచరగడ్డలను (శతావరిపేర్లు) మెత్తగా
దంచి ముద్దచేసి పాలతో కలిపి 3
నెలలపాటు తలకు ప్రయోగిస్తే జుట్టు
దట్టంగా పెరుగుతుంది.
• నీలి చెట్టును సమూలంగా తెచ్చి ఆరబెట్టి
మండించి బూడిద చేయాలి. ఈ
బూడిదను సోయాచిక్కుడు నూనెతో కలిపి
స్థానికంగా జుట్టు ఊడిన చోట
పెరుగుతుంది.
* దొండ ఆకులను దంచి రసం తీసి తలకు
పూస్తే జుట్టు రాలటం తగ్గుతుంది.
• రేగు ఆకులను, వేప ఆకులను ఒక్కోటి
ఒక్కోకిలో చొప్పున తీసుకొని 5 లీటర్లు
నీళ్లు కలిపి కేవలం లీటర్ నీళ్లు మాత్రమే
మిగిలేంత వరకూ మరిగించాలి.
తరువాత పిప్పిని కషాయంతో సహా
మెత్తగా పేస్టు మాదిరిగా మారేంత
వరకూ నూరి తలకు లేపనం చేస్తుంటే
జుట్టు వత్తుగా పెరుగుతుంది.
• పేనుకొరుకుడు ఉన్నచోట నల్ల ఉమ్మెత్త
(ధత్తూర) పువ్వులను, పండ్లను మెత్తగా
దంచి కొబ్బరినూనెతో కలిపి బాహ్యంగా
ప్రయోగించాలి.



Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...