గృహచికిత్సలు
• మిరియాలను మెత్తగా నూరి జుట్టు
రాలిన చోట రుద్దితే నిద్రాణస్థితిలోకి
వెళ్లిన వెంట్రుకల కుదుళ్లు తిరిగి ప్రేరే
పితమై చైతన్యవంతంగా మారుతాయి.
• పసుపును, మానుపసుపులను మెత్తగా
పొడిచేసి, వెన్నతో సహా ముద్దగా నూరి
తలకు పట్టించి గంట సేపుంచి
తలస్నానం చేస్తే వెంట్రుకలు నిలువుగా
చీలటం తగ్గుతుంది.
• మినుములు కిలో, ఉసిరిక వరుగు
అరకిలో, సీకాకాయలు పావుకిలో,
మెంతులు పావుకిలో చొప్పున తీసుకొని
విడివిడిగా నూరి కలిపి నిల్వచేసు
కోవాలి. దీనిని తడవకు రెండు టేబుల్
స్పూన్ల మోతాదులో తీసుకొని అరగ్లాసు
నీళ్లల్లో కలిపి పావుగంటపాటు నానబెట్టి
తలకు హెయిర్ ప్యాక్ చేసుకొని
అరగంట తరువాత తలస్నానం
చేయాలి.
• మర్రిచెట్టు వేళ్లను పావుకిలో సేకరించి
ఆరబెట్టాలి. తడిలేకుండా ఆరిపోయిన
తరువాత లీటర్ కొబ్బరినూనెకు కలిపి
15 రోజులపాటు నానబెట్టి వడపోసి,
శుభ్రమైన సీసాలో నిల్వ చేసుకోవాలి.
దీనిని ప్రతిరోజూ తలనూనెగా రాత్రి
నిద్రపోయేటప్పుడు వాడుకుంటే చక్కని
ఫలితం కనిపిస్తుంది.
* చేదుపొట్ల ఆకు రసాన్ని వెంట్రుకలు
ఊడిన చోట రుద్దుతుంటే ఐదారు
రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఉమ్మెత్త (దత్తూర) ఆకుల రసాన్నిగాని
లేదా బొప్పాయి పువ్వుల రసాన్నిగాని
లేదా మంగచెట్టు పువ్వుల రసాన్ని గాని
మాడు పైన రాసుకుంటే జుట్టు
పెరుగుతుంది.
ఉసిరి వలుపు, అతిమధురం వేరు
చూర్ణాలను మెత్తగా నూరి ముద్దగా
చేసి దానికి నాలుగు రెట్లు నువ్వుల
నూనెను, నూనెకు నాలుగు రెట్లు
ఆవుపాలను, నాలుగు రెట్లు నీళ్లనూ
చేర్చి కేవలం నూనె మాత్రమే
మిగిలేంత వరకూ చిన్న మంటమీద
మరిగించి వడపోసి శుభ్రమైన సీసాలో
నిల్వ చేసుకోవాలి. దీనిని ప్రతినిత్యం
రెండు ముక్కురంధ్రాల్లోనూ నస్యంగా
రెండేసి చుక్కల చొప్పున వేసుకుంటుంటే
జుట్టు పెరుగుతుంది.
• మందారపువ్వులతో జుట్టు ఊడిన
భాగాన్ని వేడిపుట్టేలాగా బాగా రుద్దాలి.
తరువాత గురివిందగింజల పొడినీ,
నల్లజీడి గింజల పొడినీ, నేలములక
పండ్లరసాన్నీ కలిపి మర్ధిస్తే మొండి
పేనుకొరుకుడు సమస్యల్లో కూడా గుణం
కనిపిస్తుంది.
పల్లేరు ఆకులు, నువ్వు చెట్టు పూలను
తేనె, నెయ్యిలతో కలిపి నూరి లేపనం
చేస్తే జుట్టు దట్టంగా పెరుగుతుంది.
- ఏనుగుదంతాన్ని కాల్చి మసిచేసి
పాలలో కలిపి నూరి జుట్టు ఊడిన
చోట ప్రయోగిస్తే ఆశ్చర్యకరమైన
ఫలితం కనిపిస్తుంది. హస్తిదంతమసిగా
ఈ ఔషధం ఆయుర్వేద వైద్యవర్గాల్లో
చాలా ప్రసిద్ధిగాంచింది. మరీ మొండి
కేసుల్లో ఏనుగు దంత మనిని
రసాంజనం (మానుపసుపు ఘనం)తో
కలిపి మేకపాలతో నూరి వెంట్రుకలు
ఊడినచోట పైపూతగా ప్రయోగిస్తే
తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.
- గురువింద గింజలనుగాని లేదా
గురివింద వేరునుగాని నీళ్లతో సహా
ముద్దగా నూరి వెంట్రుకలు ఊడిన
చోట లేపనం చేయాలి.
• ములక (వాకుడు) పండ్లనుగాని లేదా
వాకుడు వేరునుగాని ముద్దగా దంచి
రసం పిండి తేనె కలిపి జుట్టు ప్యాచ్
మాదిరిగా ఊడిన చోట రాస్తుంటే
చక్కని ఫలితం కనిపిస్తుంది.
• నల్లజీడిగింజల రసాన్ని పేనుకొరుకుడు
ప్యాచ్ మీద పూస్తే తిరిగి జుట్టు
పెరుగుతుంది. ఇది చాలా ఉగ్రపదార్థం
కనుక నిద్రాణ స్థితిలోకి వెళ్లిన
వెంట్రుకల కుదుళ్లను ప్రేరేపించి తిరిగి
చైతన్యవంతంగా మారుస్తుంది. అయితే
కొంతమందికి ఇది సరిపడదు. దీనితో
దురద, దద్దురు, రసికారడం వంటి
ఎలర్జీ లక్షణాలు ఉత్పన్నమవుతాయి.
అలాంటి సందర్భాల్లో దీనిని రాయటం
నిలిపివేసి కొబ్బరినూనెను బాహ్యంగా
ప్రయోగిస్తే సరిపోతుంది.
జాజి ఆకు, కానుగ ఆకు, ఉలిమిరి
పట్ట, గన్నేరు ఆకు, గన్నేరు వేరు,
చిత్రమూలం అనే మూలిక వేరును
సమపాళ్లలో తీసుకొని ముద్దగా
నూరాలి. ఈ ముద్దకు నాలుగింతలు
నల్ల నువ్వులనూనెను, నూనెకు
నాలుగింతలు నీళ్లనూ కలిపి నీరు
ఆవిరైపోయేంతవరకూ చిన్న మంటమీద
మరిగించి తైలాన్ని వడపోని
నిల్వచేసుకోవాలి. దీనిని జుట్టు
ఊడినచోట తలకు ప్రయోగిస్తుంటే
తప్పకుండా ఫలితం కనిపిస్తుంది,
* చుండ్రు వల్ల జుట్టు ఊడుతున్నప్పుడు
మామిడిటెంకలోని జీడిని, కరక్కాయల
వలుపునీ సమపాళ్లలో తీసుకొని
పాలతో సహా నూరి ప్రయోగిస్తే చుండ్రు
తగ్గిపోయి జుట్టు తిరిగి పెరగుతుంది.
జుట్టు వల్చబడుతున్నప్పుడు
మందారపువ్వులను ముద్దగా నూరి
నల్లనువ్వుల నూనెలో వేసి తైలపాక
విధానంలో కాచి తలనూనెగా
వాడుకుంటే గుణకారిగా ఉంటుంది.
ఉసిరిచెట్టు వేరును, మర్రి ఊడలను,
జటామాంసి వేరును కలిపి నూరి
బాహ్యంగా ప్రయోగిస్తే కేశాలు బాగా
పెరుగుతాయి.
• అతిమధురం, నల్లకలువ (నీలోత్పల),
ద్రాక్షలను కలిపి నువ్వులనూనె,
ఆవుపాలు, నెయ్యిలతో సహా నూరి
తలకు లేపనం చేసుకొని గంట
తరువాత తలస్నానం చేయాలి.
• జెముడుపాలు (స్నుహి), జిల్లేడు పాలు
(అర్క), పొత్తిదుంప (లాంగలి),
గురివిందగింజలు, చేదుపుచ్చ, తెల్ల-
ఆవాలు, వసకొమ్ము, మేకమూత్రం
వీటిని అన్నిటినీ కలిపి మెత్తని ముద్దగా
నూరి నువ్వులనూనెతో తైలపాక
విధానంలో తైలం కాచి తలకు
రాసుకుంటే మొండిగా ఇబ్బంది పెట్టే
పేనుకొరుకుడులో సైతం మంచి ఫలితం
కనిపిస్తుంది.
- మణిశిల,
కాసీసం, మైలతుద్ధం వీటిని
సంహితాకారులు ఖాలిత్య వ్యాధిలో
లేపన ద్రవ్యాలుగా వాడవచ్చునని
సూచించారు. వీటిని తల మీద
ప్రయోగిస్తే ఉగ్రస్వభావం వలన
వెంట్రుకల కుదుళ్ళు ప్రేరేపితమై నిద్రాణ
స్థితి నుండి చైతన్యపూరిత స్థితిలోనికి
మారతాయి. వలితంగా జుట్టు
పెరుగుతుంది.
గుర్రపు గిట్టలను కాల్చి మసిచేసి
వెన్నలో కలిపి పేనుకొరుకుడు
కనిపించిన చోట ప్రయోగిస్తే మంచి
ఫలితం కనిపిస్తుంది.
జానపద వైద్యం
మోదుగ గింజలను పలాశ) మెత్తగా
నూరి, నిమ్మరసం కలిపి తలకు పట్టించి
రుద్దుకుంటే జుట్టు రాలటం తగ్గుతుంది.
నల్లులను చంపి
ఆ రక్తాన్ని
పేనుకొరుకుడు కనిపించే చోట పూస్తే
జుట్టు తిరిగి వస్తుంది.
* గురివింద గింజలను నీటిలో సహా నూరి
ఎండబెట్టి కొబ్బరినూనెలో వేసి కాచి
తలనూనెగా వాడుకుంటే పేనుకొరుకుడు
వ్యాధి తగ్గుతుంది.
• ములగపండు, గురివింద వేరు,
గురివింద గింజను నూరి తేనె కలిపి
పేనుకొరుకుడు ఉన్నచోట పూయాలి.
• గన్నేరు వేరును అరకిలో మోతాదులో
తీసుకొని అరలీటరు గేదెపాలలో
మరిగించి తోడు పెట్టి పెరుగుగా
మార్చాలి. దీనిని చిలికి వెన్నతీసి నెయ్యి
తయారు చేసుకోవాలి. ఈ నెయ్యిని
చెంచాడు మోతాదుగా తమల
పాకురసంతో కలిపి తీసుకోవాలి.
పిల్లిపీచరగడ్డలను (శతావరిపేర్లు) మెత్తగా
దంచి ముద్దచేసి పాలతో కలిపి 3
నెలలపాటు తలకు ప్రయోగిస్తే జుట్టు
దట్టంగా పెరుగుతుంది.
• నీలి చెట్టును సమూలంగా తెచ్చి ఆరబెట్టి
మండించి బూడిద చేయాలి. ఈ
బూడిదను సోయాచిక్కుడు నూనెతో కలిపి
స్థానికంగా జుట్టు ఊడిన చోట
పెరుగుతుంది.
* దొండ ఆకులను దంచి రసం తీసి తలకు
పూస్తే జుట్టు రాలటం తగ్గుతుంది.
• రేగు ఆకులను, వేప ఆకులను ఒక్కోటి
ఒక్కోకిలో చొప్పున తీసుకొని 5 లీటర్లు
నీళ్లు కలిపి కేవలం లీటర్ నీళ్లు మాత్రమే
మిగిలేంత వరకూ మరిగించాలి.
తరువాత పిప్పిని కషాయంతో సహా
మెత్తగా పేస్టు మాదిరిగా మారేంత
వరకూ నూరి తలకు లేపనం చేస్తుంటే
జుట్టు వత్తుగా పెరుగుతుంది.
• పేనుకొరుకుడు ఉన్నచోట నల్ల ఉమ్మెత్త
(ధత్తూర) పువ్వులను, పండ్లను మెత్తగా
దంచి కొబ్బరినూనెతో కలిపి బాహ్యంగా
ప్రయోగించాలి.
No comments:
Post a Comment