ముఖచర్మాన్ని మృదువుగా మార్చే మాయిశ్చరైజర్లు.
ఎక్కువ శక్తి కలిగిన పదార్థాలతో ముఖాన్ని రుద్దుకోవడం, శుభ్రపరచుకోవడం, మృతకణాలు రాలిపోయేలాగా వెలుపలి పొరలను ఎక్స్ ఫోలియేట్ చేయటం ఇలాంటి ప్రక్రియల తర్వాత చర్మన్ కొద్దిగా బలహీనపడుతుంది. పోషకతత్వాల అవసరం పెరుగుతుంది. నీరు లేని పైరు ఎలా వాడిపోతుందో , వడలిపోతుందో , అలా తేమ తగ్గిన చర్మం వడలిపోతుంది. ఈ లోటును భర్తీ చేయడానికి కొల్పోయిన స్నిగ్ధత్వం, తేమ వంటి వాటిని తిరిగి పొందడానికి మాయిశ్చరైజర్ లు లేదా ఫచెస్ ప్యాక్ వంటివి అవసరమౌతాయి. ఇవి మీ ముఖచర్మాన్ని తాజాగా ఉంచడంతోపాటు , చర్మానికి వెలుపలనుంచి పోషకతత్వాలను అందిస్తాయి. వీటిని మీరు కనీసం రోజుకి రెండుసార్లు ప్రయోగించాల్సి ఉంటుంది.
1.) పొడి ముఖచర్మానికి మాయిశ్చరైజర్ ---
ముఖచర్మం ప్రొటీన్ లతో నిర్మితమౌతుంది.దీనికి పోషకతత్వాలను అందించాలంటే ప్రొటీన్ సంబంధ పదార్థాలు ప్రయోగించాల్సి ఉంటుంది. అలాగే ముఖచర్మాన్ని తేమగా ఉంచటం కోసం చర్మం విడుదల చేసే సహజ రైలం తో సమాన గుణధర్మాలున్న తైలాలను వాడవలసి ఉంటుంది.
ఇలాంటి ఒక తైలం తయారీ, వడాల్సిన పద్ధతి -
ఒక బౌల్ లో కోడిగుడ్డు పచ్చసొనని తీసుకుని దీనిలో ఒక పెద్ద చెంచాడు బాదం నూనెను , 5 బాదం గింజలను మెత్తగా పొడి చేసి కలపండి. చివరగా ఒక పెద్ద చెంచాడు తేనె కలిపి అన్నిటిని గిలక్కొట్టి ఒక చిక్కని పేస్ట్ లాగా తయారు చేయండి. దీనిని ముఖం మీద , మెడ మీద పూసుకుని , కళ్ల మీద మాత్రం వదిలేయండి. పావు గంట పాటు ఉంచితే చర్మం దీనిని విలీనం చేసుకుంటుంది. తర్వాత వేడి నీళ్లతో కడిగేసుకుని వెంటనే చన్నీళ్లతో చిలకరించుకోండి. వేడి నీళ్లవల్ల జిడ్డు వదిలిపోతుంది. చన్నీళ్ల వల్ల ముఖం మీద తేమ పరచుకొని ఒక రక్షక కవచంలాగా పనిచేస్తుంది.
2.) ముఖంలో కాంతిని కలిగించే ఫేస్ ప్యాక్...
ముఖచర్మం మీద స్వేద రంధ్రాలు పెద్దగా తయారైనపుదు ముఖంలో తాజాదనం కనిపించదు. అలాగే పోషక పదార్థాల కోపం వంటి కారణాల వల్ల పోషకతత్వాలు నిలిచిపోతాయి. దీనిలో ముఖచర్మం కాంతివిహీనంగా, నిస్తేజంగా , జీవరహితంగా కనిపిస్తుంది. ఈ సమస్యలను ఏకకాలం లో తగ్గించగలిగే ఒక శక్తివంతమైన ఔషధాన్ని గురించి తెలుసుకుందాం.
తయారీ పద్ధతి , వాడాల్సిన విధానం...
రెండు పెద్ద చెంచాల ముల్తాని మట్టిలో ఒక పెద్ద చెంచాడు తేనె,ఒక పెద్ద చెంచాడు పాలను కలిపి గిలక్కొట్టి ఒక పేస్ట్ లాగా తయారు చేయండి. దీనిని ముఖం మీద, మెడ మీద పూసుకుని , పావు గంట పాటు వదిలేసి, చన్నీళ్లతో కడిగేసుకోండి. ముల్తాని మట్టిలోని ఖనిజ సంబంధ పదార్థాలు చర్మానికి పోషణనిస్తాయి. అలాగే దీనిలోని ప్రత్యేకతత్వాలు ముఖచర్మం మీద ఉండే పెద్దవిగా కనిపించే రంధ్రాలను మూసివేస్తాయి.
ఇక తేనె ,పాలు చర్మానికి వెలుపలనుంచి పోషణనిస్తాయి. దీనిలో చర్మం , అందంగా , సజీవంగా ఆరోగ్యంగా కనిపిస్తుంది.
3.) ముఖంలో ముడతల్ని,ముసలితనాన్ని తగ్గించే ఫేస్ ప్యాక్...
చర్మం సాగిపోయి చిన్నతనంలోనే ముసలితనపు లక్షణాలు కనిపిస్తున్నపుడు చర్మాన్ని తిరిగి బిగుతుగా నునుపుగా , తేమగా మార్చే ఔషధం ఇది.
తయారీ పద్ధతి, వాడాల్సిన విధానం...
తాజా బంతిపువ్వుల రేకలను విడదీసి 2 కప్పులు ఒక బౌల్ నీళ్లలో వేసి రెండు, మూడు గంటల పాటు నాన పెట్టండి. తర్వాత వీటిని బాగా కలియతిప్పి , పిసికి పేస్ట్ లాగా తయారు చేసి , పెద్ద చెంచాడు గ్లిజరిన్ వేసి గిలక్కొట్టి కలపండి. తర్వాత దీనిని మీ ముఖం మీద, మెడ మీద పూసుకుని పావు గంట తర్వాత కడిగేసుకోండి. చాలా మందికి బంతిపువ్వులను ఫేస్ ప్యాక్ కోసం వాడవచ్చు అని తెలియదు. కానీ దీని పనితీరు అమోఘం . ఈది ముఖ చర్మానికి పోషక తత్వాలను అందిస్తుంది. స్కిన్ టానిక్ లాగా పనిచేస్తుంది.
4.) ఎండలతో కమిలిన ముఖచర్మానికి ఫేస్ ప్యాక్...
ఎండకు గురైన చర్మానికి మంటగా అందిస్తుంది,మచ్చలు కూడా తయారౌతాయి.వీటిని సరైన సమయంలో తగ్గించుకోకపోతే ఇవి దీర్ఘ కాల సమస్యగా మారుతాయి. ఎండలు చర్మం మీద దాడి చేయకుండా రక్షించడంతోపాటు మంటను తగ్గించే తేలికైన, సమర్థవంతమైన ఔషధం ఇది.
తయారీ పద్ధతి వాడాల్సిన విధానం...
తాజా పుచ్చకాయను స్లైసులుగా కోసి , ఎర్రటి గుజ్జు భాగం మీద నిమ్మ చెక్కను పిండి, దానిని నేరుగా ముఖం మీద ఒత్తిడి కలిగిస్తూ ప్రయోగించి , వలయాకారంగా రుద్దుకుంటూ ప్రయోగించుకోండి,మసాజ్ చేసుకోండి. దీనిని ప్రయోగించి అ తర్వాత, 20 నిమిషాలు ఆగి ముఖచర్మాన్ని చన్నీళ్లతో కడిగేసుకోండి. మీ ముఖం శుభ్రపడి, తాజాగా, కడిగిన ముత్యం లాగా , కొత్త కాంతితో మెరిసిపోతుంది. పుచ్చకాయ ఎండబేడిమినుంచి కాపాడటమే కాకుండా , చర్మానికి మెరుపును, తేమను, బిగువును , సౌకుమార్యాన్ని కలిగిస్తుంది. ఒక నిమ్మరసం సూర్య కిరణాలను అడ్డుకొని చర్మానికి రక్షణనిస్తుంది.
5.) ముఖం మీద జిడ్డును తగ్గించే ఫేస్ ప్యాక్...
ముఖచర్మం మీద జిడ్డు పేరుకుపోవడం వల్ల ఎంతబాగా కనిపించాలని ప్రయత్నించినా నిరాశే మిగులుగుతుంది. జిడ్డువల్ల సమస్యలు అన్నీ ఇన్నీ కావు. చర్మం కాంతివిహీనంగా కనిపిస్తుంది. మొటిమలకు ఆస్కారం ఏర్పడుతుంది. అన్నిటికి మించి ఫ్రెష్ నెస్ దూరమౌతుంది. పైగా వెలుపలి పొరమీద తైలం పేరుకుపోవడం వల్ల లోపలి పొరలను పోషక తత్వాలు అందవు. జిడ్డు చర్మానికి పోషక తత్వాలు అందిచటంతో పాటు అదనపు నూనె పదార్థాన్ని పీల్చుకొని చర్మాన్ని తాజాగా మార్చే మహత్తరమైన ఔషధ లేపనం ఇది.
తయారీ పద్ధతి వాడాల్సిన విధానం...
ఒక గుప్పెడు స్త్రాబెర్రీలను ముక్కలుగా తరిగి , గ్రైండర్లో వేసి పేస్ట్ గా మారేంతవరకు గ్రైండ్ చేసి దీనిలో ఒక నిమ్మ కాయను, పెరుగును కలిపి గిలక్కొట్టి ఒక పాత్రలోపోసి అరగంట పాటు ఫ్రిజ్లో ఉంచండి. తర్వాత తీసి ముఖం మీద మెడ మీద పూసుకుని పేస్ట్ గట్టిపడటం మొదలెట్టిన తర్వాత తిరిగి కొద్దిగా తీసుకుని మరొక పొరలాగా ప్రయోగించి 20 నిమిషాలపాటు వదిలేయండి. తర్వాత రుద్దుకొని నీళ్లతో కడిగేసుకోండి. దీనితో మీ ముఖం కోమలంగా కనిపిస్తుంది.
మొటిమలను ఎప్పుడూ వేళ్లతో గిల్లవద్దు, అలా చేస్తే మొటిమలను తగ్గించుకోవడానికు బదులు, ఇన్ ఫెక్షన్ తగ్గించుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది.
No comments:
Post a Comment